బాబోయ్ దొంగలు..
నిరంతర నిఘా కెమెరాల సాక్షిగా పద్మావతి ఘాట్‌లో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మాయమాటలు చెప్పి వారి వస్తువులు, నగలు, నగదు తీసుకుని ఉడాయిస్తున్నారు. శనివారం ఒక్కరోజే ఆరుగురు భక్తులు దొంగల బారిన పడ్డారు.
విజయవాడ (గుణదల) :
నిరంతర నిఘా కెమెరాల సాక్షిగా పద్మావతి ఘాట్‌లో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మాయమాటలు చెప్పి వారి వస్తువులు, నగలు, నగదు తీసుకుని ఉడాయిస్తున్నారు. శనివారం ఒక్కరోజే ఆరుగురు భక్తులు దొంగల బారిన పడ్డారు. బందరుకు చెందిన దివ్య తన చెవికమ్మెలు, ముక్కుపుడక బంగారు బిళ్లలను బ్యాగులో ఉంచి స్నానానికి వెళ్లి వచ్చేసరికి కనిపించలేదని కృష్ణలంక పీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తూర్పుగోదావరికి తునికి చెందిన వెలగబాబ్జి తన బ్యాగులో పద్రపరచుకున్న మూడు తులాల బంగారు చైను, పర్సులో ఉన్న రూ.5000 కనిపించలేదని ఫిర్యాదు చేశారు. హైదాబాదుకు చెందిన గోపాలరావు ఘాట్ వద్ద పర్సు పోగొట్టుకున్నారు. అందులో రూ.5600 ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు డీజీ ఎన్‌వీ సురేంద్రబాబు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే ఘాట్ పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.