Puskara ghat
-
సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇదే..!
సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు? ఈ సందేహాలకు సమాధానమిస్తుంది పుష్కర్ పుణ్యక్షేత్రం, ఆ క్షేత్ర స్థలపురాణం. రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్‌కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న సరస్సు పుష్కర్. క్రమంగా ఆ ప్రాంతం ఈ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సు చెంతనే ఉంది సృష్టికర్త బ్రహ్మ ఆలయం. ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక ఆలయం ఇది. మన దేశంలోని అతి ముఖ్యమైన తీర్ధాల్లో ఒకటైన పుష్కర్‌ను దర్శించుకోకుంటే పుణ్యక్షేత్ర సందర్శన పూర్తి కానట్టేనని పెద్ద లంటారు. అందుకే దీన్ని తీర్థరాజ్ అంటారు. పౌరాణికంగా ఎంతో ప్రాశస్త్యం చెందిన మహాభారత, రామాయణాల్లోనూ ఆదితీర్థంగా ప్రస్తావించబడింది ఈ తీర్థం. కార్తీక పౌర్ణమి రోజున ఇందులో ఓసారి మునిగితే వందల సంవత్సరాల పాటు యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుందట. స్థలపురాణంపద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోనే తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడు బ్రహ్మదేవుడు. ఆ సమయంలో ఆ తామరపూపు నుంచి రేకులు మూడు చోట్ల రాలి, మూడు సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ట పుష్కర్, మధ్యపుష్కర్, కనిష్టపుష్కర్ అని పిలుస్తున్నారు. పైగా సృష్టికర్త తాను భూలోకంలో అడుగిడినప్పుడు తన చేతి (కరం)నుంచి పుష్పం రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అని పేరు పెట్టినట్లు మరో కథనం కూడా వినిపిస్తుంది.సరస్వతీదేవి శాపం.. ఏకైక ఆలయంవజ్రనాభ సంహారం అనంతరం లోకకల్యాణం కోసం ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించాడట సృష్టికర్త. సుముహూర్తం ఆసన్నమవుతుండటంతో సరస్వతీదేవిని తీసుకుని రమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ. కానీ నారదుడి కలహప్రియత్వం కారణంగా బయలుదేరేందుకు తాత్సారం చేస్తుంది సావిత్రీ దేవి. (ఈమెనే సరస్వతీ దేవి అని కూడా పిలుస్తారు) ఇవతల ముహూర్తం మించిపోతుండటంతో, అనుకున్న సమయానికే యజ్ఞం పూర్తి కావాలన్న తలంపుతో ఇంద్రుడి సహకారంతో గాయత్రిని పెళ్లాడి నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని ప్రారంభిస్తారు.యజ్ఞం సమాప్తం అవుతుండగా అక్కడికి చేరుకున్న సరస్వతీదేవి బ్రహ్మ దేవుడి పక్కన మరో స్త్రీని చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న దేవతలందరినీ శపిస్తుంది. భర్తను వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అనంతరం బ్రహ్మదేవుడి అభ్యర్థనను మన్నించి శాప తీవ్రతను తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి కారణం ఇదేనట. పుష్కర్‌లో సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్య సుమంగళి వరాన్నిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఈ ఆలయాన్ని కూడా దర్శిస్తారు.ఇతర విశేషాలుపుష్కర్లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుమారు 400 పురాతన ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆప్తేశ్వర్, రంగ్జీ, ఏకలింగజీ దేవాలయాలు. వీటిలో రంగ్జీ ఆలయం దక్షిణాది శైలిలో కట్టబడి ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్‌జీగా పూజలందుకుంటున్నాడు. రాజస్తాన్‌లోని సుప్రసిద్ధ శివక్షేత్రం ఏకలింగజీ దేవాలయం. ఇక్కడ శివలింగం కేవలం లింగాకారంగా కాక నలుపక్కలా నాలుగు ముఖాలను కలిగి ఉండటం విశేషం. ఇవి కాక గోవిందాజీ ఆలయం, నక్షత్రశాల, హవామహల్, చట్రిస్, గాలోటా, ఖవాసాహిబ్ దర్గా, అధాన్ దిన్ కా జూన్ ప్రా, అనాసాగర్, జగ్‌నివాస్ భవనం, జగదీష్ ఆలయం, అహర్, నక్కి సరస్సు, జోథ్‌పూర్ పట్టణం, అజ్మీరు, ఉదయ్‌పూర్, అబూశిఖరం, పింక్‌సిటీగా పేరుగాంచిన జైపూర్లు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు.ఎలా వెళ్లాలంటే..?పుష్కర్‌కు వెళ్లడానికి దగ్గరలోని అజ్మీర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఢిల్లీ, జోద్పూర్, జైపూర్, ఆగ్రా, ముంబాయ్. అహ్మదాబాద్‌ల నుంచి రైళ్లున్నాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బెస్ట్. అజ్మీర్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలోని పుష్కర్‌కు చేరుకోవాలంటే లోకల్ బస్సులు, ఆటోలు ఉన్నాయి. విమాన మార్గం సంగనీర్ ఏర్పోర్ట్. అయితే అక్కడినుంచి పుష్కర్ వెళ్లాలంటే 127 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అన్ని ప్రధాన నగరాలనుంచి పుష్కర్‌కు నేరుగా బస్సు సౌకర్యం ఉంది. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఘాట్లవద్ద అప్రమత్తంగా ఉండాలి : జేసీ
విజయవాడ (కృష్ణలంక) : కృష్ణానదిలో పెరిగిన వరద ఉధృతి దృష్ట్యా ఘాట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు రెవెన్యూ సిబ్బందికి సూచించారు. కృష్ణలంకలోని పలు ఘాట్లతో పాటు కరకట్ట ప్రాంతాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఘాట్లలో స్నానాలు చేసేందుకు ఎవరిని దిగనీయొద్దని సూచించారు. ముంపునకు గురయ్యే నదిపరివాహ ప్రాంతాల్లో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
దసరాకు ఘాట్లను తీర్చిదిద్దండి
మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ విజయవాడ సెంట్రల్ : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఘాట్లు, నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ అధికారులకు సూచించారు. ఆయన బుధవారం పద్మావతి ఘాట్, పండిట్ నెహ్రూ బస్ టర్మినల్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు నగరానికి వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రజారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బహిరంగప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని శానిటరీ ఇనిస్పెక్టర్లకు చెప్పారు. గ్రీనరీని అభివృద్ధి చేయాలన్నారు. బస్ టెర్మినల్ వద్ద నమ్మా టాయ్‌లెట్ పనులను రెండు రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రోడ్లపై -
‘దొంగల’నగరం పేరు మార్చేశారు..!
* ఒక్క చోరీ సంఘటన కూడా జరగకుండా చర్యలు * ఫలించిన పోలీసు వ్యూహం * గుంటూరు కృష్ణా జిల్లాలలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా సీతానరగం పేరు చెబితే పోలీసుల వెన్నులో వణుకుపుడుతుంది. అందుకు కారణం ఎక్కడ ఏ బహిరంగ సభ జరిగినా, ఉత్సవాలు, ఊరేగింపులూ జరిగినా అక్కడ జరిగే దొంగతనాలలో సీతానగరం వాసుల హస్తం ఉంటుందని నమ్మకం, అది నిజం కూడా. * తమిళనాడు రాష్ట్రంలో ఐపీఎస్‌లు, ఐఎఎస్‌లు వ్యాయామం కోసం వెళ్ళే జిమ్ములో ఒకే సారి రూ.కోటి విలువ చేసే సెల్ఫోన్లు, బంగారపు వస్తువులు దొంగిలించింది కూడా సీతానగరం వాసులు కావడం విశేషం. మూడు నెలల అనంతరం ఎవరు దొంగిలించారో గుర్తించడం కూడా జరిగింది. సీతానగరం(తాడేపల్లిరూరల్): అలాంటి సీతానగరంలో కృష్ణా పుష్కరాలు నిర్వహించాలని తెలియగానే మొదట పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, సీఐ హరికృష్ణ, ఎస్ఐ వినోద్‌కుమార్, ప్రతాప్‌కుమార్ గత పుష్కరాలలో జరిగిన అసాంఘిక కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని మూడు నెలల ముందు నుండే నిఘా పెంచారు. దానిలో భాగంగానే తాడేపల్లిలో పోలీసు విధులు నిర్వహించిన ఎస్ఐలను, ఐడీ పార్టీ సిబ్బంది సలహాలు సూచనలు తీసుకుని దాదాపు 150 మంది నేరగాళ్ళకు రౌడీషీటర్లకు విడతల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించారు. అంతటితో వదిలిపెట్టకుండా నేరచరిత్ర ఉన్న ప్రతి ఒక్కరి ఇంటిపైనా నిఘా ఏర్పాటు చేసి వారి ఇంటికి వచ్చిన నేరగాళ్ళను సైతం అదుపులోకి తీసుకుని పుష్కరాలు అయ్యేంత వరకూ ఈ ప్రాంతానికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ మర్యాద పూర్వకంగా హెచ్చరించి మరీ ఈ ప్రాంతం నుంచి పంపించారు. సీసీ కెమెరాల నిఘా.. ఇదంతా ఒక ఎత్తుగడ అయితే తాడేపల్లి ముఖ్యకూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ పుటేజీలను పరిశీలిస్తూ ఎప్పటికప్పడు నిఘా పెంచారు. దీని ఫలితంగా పుష్కరాలలో ఒక్క చోరీ కూడా జరగలేదు. పుష్కరస్నానాలకు సీతానగరం ఘాట్‌కు వచ్చిన భక్తులు పోగొట్టుకున్న వస్తువులను పోలీసులు వెతికి బాధితులకు అందజేయడం విశేషం, ప్రశంసనీయం. దీంతో పాటు పుష్కర స్నానాలకు వచ్చే వృద్ధులు, వికలాంగుల కొరకు పోలీసు వాహనాలలో పుష్కరఘాట్ల వరకూ తీసుకువచ్చి స్నానం ఆచరించేలా చూడటం, తిరిగి తీసుకెళ్ళడంతో భక్తుల నుంచి శభాష్ పోలీసు అనిపించుకున్నారు. -
ఘాట్లు పర్యాటక క్షేత్రాలవ్వాలి
అప్పుడే వెచ్చించిన వ్యయానికి సార్థకత ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ చింతపల్లి (అచ్చంపేట): కోట్లాది రూపాయలతో నిర్మించిన పుష్కర ఘాట్లు, పుష్కరాలు అయిపోగానే అంతరించకూడదని, నవ్యాంధ్రలో పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని, అప్పుడే ప్రభుత్వం వెచ్చించిన వ్యయానికి సార్థకత వస్తుందని సుప్రసిద్ధ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన చింతపల్లి పుష్కర ఘాట్‌ను, ఘాట్ ఒడ్డునే నిర్మాణంలో ఉన్న శ్రీ విష్ణు పంచాయతన దివ్యమహాక్షేత్రాన్ని సందర్శించారు. దేవాలయాలను కుల్చివేస్తున్న ఈ తరుణంలో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాల పునరుద్ధరణకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గోమాత, గోపురం, దేవాలయం, గంగ (నదీజలం) ఎక్కడ పూజింపబడతాయో అక్కడ సంపదలు, మంచి ఆరోగ్యం, శాంతి ఉంటాయని ఆయన చెప్పారు. గుండె బాగుంటేనే దేహం బాగుంటుందని, గుడి బాగుంటేనే దేశాలు బాగుంటాయని అన్నారు. కృష్ణానది ఒడ్డున మంగళగిరి, కోటప్పకొండ, అమరావతి వంటి పుణ్య క్షేత్రాలు ఉండబట్టే వాటికి అంత ప్రాముఖ్యత వచ్చిందన్నారు. రానున్న కాలంలో చింతపల్లి ఒక మహాపుణ్య క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా రుపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. గొప్పగొప్ప రుషులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసి దేవాలయాలను నిర్మించారని, వాటిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నదీ పరివాహక ప్రాంతాలలోని దేవాలయాలలో దేవతలు సంచరిస్తూ ఉంటారని, సంగీతం ఆలపిస్తుంటారని సనాతన ధర్మం చెబుతోందన్నారు. సీనీ గాయకుడు నాగూర్బాబుతో కలసి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన్మందిరంలో ప్రోగ్రాం ఇచ్చానని, అందులో వచ్చిన ఆదాయాన్ని ఈ ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నానన్నారు. ఆలయ నిర్మాణానికి తనతో పాటు సహకరించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి పక్కాల సూరిబాబు మిట్టుపల్లి రమేష్, గుంటూరు మాస్టర్‌మైండ్స్, తాడిశెట్టి మురళి, యర్రంశెట్టి వేణుగోపాల్ తదితరులను ఆయన ఘనంగా సత్కరించారు. -
రెడీ.. వన్.. టూ.. త్రీ.. క్లిక్!
-
ఉత్తరవాహిని.. జనతరంగిణి
-
రామయ్యా.. అదుగోనయ్యా.. పుష్కర వేణీ!
-
సంగమం ఘాట్‌లో పాము
ఇబ్రహీంపట్నం : పవిత్రసంగమం స్నానఘాట్‌లో ఓ పాము కలకలం సృష్టించింది. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎగువప్రాంతం నుంచి అధికంగా నీరు వచ్చిచేరటంతో భారీగా గుర్రపుడెక్క తీగ ఆకులు కొట్టుకొస్తున్నాయి. వీటిపై ప్రయాణిస్తున్న పాములు పవిత్రసంగమం పుష్కరఘాట్ వద్దకు చేరుతున్నాయి. నీటిలో తేలుతున్న పామును చూసిన భక్తులు పరుగులు పెట్టారు. దీంతో అక్కడి సిబ్బంది పామును పట్టుకుని పక్కన వదిలేశారు. రెండురోజుల క్రితం రక్తపింజరి పాము ఘాట్‌లో భక్తులను భయపెట్టింది. తరచూ సర్పాలు వస్తుండడంతో యాత్రికులు స్నానం చేయాలంటేనే భయపడుతున్నారు. -
కళ్లలో దుమ్ము
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఘాట్ల సమీపంలోని రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి పుష్కర యాత్రికుల కళ్లల్లో పడి ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారులపై వేసిన బ్లీచింగ్‌తో పాటు యాత్రికులు, స్థానికులు పడేసిన వర్ధా్యలు గాలలకు పైకిలేచి ముఖాలపై పడుతున్నాయి. ఘాట్ల వద్ద ఇసుక రేణువులు ఎక్కువుగా కళ్లల్లో పడుతుండడంతో యాత్రికులు అసౌకర్యానికి గురవుతున్నారు. భవానీ, పున్నమి ఘాట్ల వద్ద ఈ పరిస్థితి అధికంగా ఉంది. -
కష్టాలు పుష్కలం
వారం రోజులైనా అందని వేతనాలు నిధులు రాలేదని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు సాక్షి, అమరావతి : వారంతా దినసరి కూలీలు. పుష్కరాల్లో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు 20వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఈనెల 9న వచ్చారు. వారం రోజులైనా ఒక్క రూపాయి అందలేదు. చేతి ఖర్చులకని తీసుకువచ్చిన డబ్బులు అయిపోయాయి. టీ తాగేందుకు కూడా చిల్లర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 150 పుష్కరఘాట్లలో విధులు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 150 పుష్కర ఘాట్లలో సుమారు 20 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది దినసరి వేతనంపై పనిచేస్తున్నారు. రోజుకు 8 గంటలపాటు మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. చెత్త ఊడ్చడం, ఎత్తివేయడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన చోట దుస్తులు మార్చుకునే గదుల్లో, పిండ ప్రదానం షెడ్లలో వేసిన చెత్తను తొలగిస్తున్నారు. అలాగే రహదారులు శుభ్రం చేయడంతోపాటు రాత్రి వేళల్లో దోమల ఫాగింగ్ చేస్తున్నారు. ఇన్ని విధాలా కష్టపడుతున్నా కనీస వేతనం వారికి ఇవ్వడం లేదు. వేతనాల్లోనూ కక్కుర్తి ! ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.400 వంతున రోజువారి వేతనంతో పాటు వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఐదురోజులకు ఒకసారి వేతనాలు చెల్లించాల్సిఉన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. రూ. 400కు బదులుగా రూ.250 నుంచి రూ.300 వంతున వేతనం ఇస్తామని ముందే ఒప్పించారు. ప్రభుత్వం ఇచ్చే వేతనంలో కూడా కాంట్రాక్టర్లు కోత పెడుతూ వారి పొట్ట కొడుతున్నారు. నిధులు ఇవ్వని ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఖజానా ఖాళీగా వుంది. పుష్కరాల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం ప్రభుత్వం రూ.184 కోట్లు మంజూరు చేసింది. కానీ నిధులు మంజూరు జీవో కాపీ ఇచ్చారు కానీ నిధులు మంజూరు చేయలేదు. దీంతో మున్సిపల్ శాఖ ఖజానాలో నిధులు లేవు. 14 వ ఆర్థిక సంఘం నిధులైనా ఖర్చు చేసుకోవాలని ఆదేశాలిచ్చినా ఆ నిధులు ఇప్పటికీ ఖజానాలో జమ కాలేదు. దీంతో కాంట్రాక్టర్లకు నిధులు అందించలేక చతికిలపడింది. -
ఒక్కరు కూడా స్నానం చేయడని ఘాట్
పాతబొమ్మువానిపాలెం (తెనాలి రూరల్): కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల ఏర్పాటుపై పాలకులు, అధికారులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కొట్లాది రూపాయలు వెచ్చించి ఘాట్లను నిర్మించారు. అవసరం ఉన్నా, లేకపోయినా నిర్మించారు. చిన్న గ్రామాలకు సైతం రెండేసి ఘాట్లను ఏర్పాటు చేశారంటే ప్రజాధనం ఎంత దుర్వినియోగమయియందో తెలుసుకోవచ్చు. పుష్కరాలు ప్రారంభమయి నాలుగు రోజులు పూర్తయినా, ఇప్పటికీ కనీసం ఒక్క భక్తుడు/భక్తురాలైనా స్నానం చేయని ఘాట్ ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. కొల్లిపర మండలంలోని కరకట్టకు తూర్పువైపున ఉన్న పాతబొమ్మువానిపాలెంలో రెండు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. ఇందులో దక్షిణ ఘాట్ ఊరికి అందుబాటులో ఉంది. ఉత్తరం వైపున రూ. 15 లక్షల ఖర్చు(కేవలం ఘాట్ ఏర్పాటు కోసమే)తో మరో ఘాట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఘాట్‌కు కనుచూపుమేరలో ఎక్కడా నదీ జలాలు కనబడవు. సుమారు కిలోమీటరు మేర నడచి నది పాయలోకి వెళ్లా్సందే. అనవసరమైనా, ఇక్కడ ఘాట్‌ను నిర్మించారు. అంతవరకు బాగానే ఉన్నా, ఈ ఘాట్‌లో కనీసం జల్లు స్నానాలు చేసేందుకైనా ఏర్పాట్లు చేయలేదు. పైపులైను అసంపూర్తిగా వదిలేశారు. -
పెరిగిన నిఘా..
విజయవాడ(గుణదల): పద్మావతి ఘాట్‌లో సోమవారం పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఘాట్‌లో చోటుచేసుకుంటున్న నేరాలను నిర్మూలించటానికి పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అక్టోపస్, సీఆర్పీఎఫ్ విభాగాలు రంగంలోకి దిగాయి. ఘాట్ల వద్ద పహార కాస్తున్నారు. పిండ ప్రధానం, స్నానాలు ఆచరించే ప్రాంతంలో కలియ తిరుగుతూ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆకతాయిలకు చెక్.. నదిలో స్నానమాచరిస్తున్న మహిళలు, యువతుల వెంటపడుతున్న, స్నానమాచరిస్తున్న సమయం లో వారితోపాటు నదిలో దిగి వేధిస్తున్న పలువురు యువకులను ఘాట్ పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు పుణ్యస్నానాలకు వస్తున్న వారిని మోసం చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. నకిలీ గుర్తింపుకార్డు దారులు గుర్తింపు .. స్నానఘాట్ల వద్ద కొంత మంది నకిలీ గుర్తింపు కార్డులు వేసుకుని భక్తులను మోసం చేసి వారివద్ద నగలు, నగదు అపహరించుకుపోతున్న వారిపై పోలీసులు నిఘాను పెంచారు. సోమవారం పలువురు పోలీసులు మఫ్టీలో తిరుగుతూ గుర్తింపు కార్డులు లేని అర్చకులను అక్కడి నుంచి పంపేశారు. గుర్తింపుకార్డుల్లో అధికారుల సంతకం లేకుండా, కలర్ జిరాక్స్ కాపీలతో గుర్తింపు కార్డులను రూపొందించుకుని వచ్చే వారిపై నిఘా పెంచారు. ఘాట్లలో విధులు నిర్వరిస్తున్న ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పోలీసులు, పోలీసు వాలంటీర్లు తనిఖీ చేసి అధికారుల సంతకం లేని వారిని విచారిస్తున్నారు. మాయమాటలు నమ్మోద్దు.. ఘాట్‌లో మోసకారులు, దొంగలు తిరుగుతున్నారని, ఎవరైనా మోసం చేస్తున్నట్లు అనుమానం వచ్చినా, దొంగతనానికి పాల్పడినా వెంటనే తమ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఘాట్‌లో విధులు నిర్వర్తించే వివిధ విభాగాల ప్రతినిధులు తప్పని సరిగా గుర్తింపు కార్డుపై అధికారి సంతకం ఉండాలని, అలా లేకుంటే కేసు నమెదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
కృష్ణా నదిలో గుర్రెపు డెక్కతో అవస్థలు
విజయవాడ(వన్‌టౌన్) : కృష్ణానది ఎగువ నుంచి భారీగా గుర్రపుడెక్కా దుర్గాఘాట్ వైపు తోసుకొచ్చింది. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. బుడమేరు నీటిని నదిలోకి వదలటంతో గుర్రపు డెక్కా భారీగా వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అదంతా దుర్గాఘాట్ వైపుకు రావటంతో అధికారులు దానిని తొలగించాలని ఆదేశించారు. మత్స్యశాఖ, నీటిపారదుల శాఖ, నగరపాలకసంస్థ సిబ్బంది తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు దానిని పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. గజ ఈతగాళ్లునుlరప్పించి గుర్రపు డెక్కాను ఘాట్లలోకి వెళ్లకుండా ఒడ్డుకు చేర్చారు. అనంతరం దానిని లారీలలో బయటకు తరలించారు. సుమారు 15 టన్నుల గుర్రపుడెక్కాను ప్రవాహం నుంచి తీసి బయటకు పంపినట్లు అధికారులు చెప్పారు. -
ఘాట్లలో క్లోరిన్ శాతం తగ్గకుండా చూడండి
అధికారులకు మంత్రి ఉమా ఆదేశం విజయవాడ(మొగల్రాజపురం) : పుష్కరఘాట్ల నీటిలో క్లోరిన్ శాతం తగ్గకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జలవనరులశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. కృష్ణవేణి ఘాట్‌ను సోమవారం ఆయన పరిశీలించి భక్తులతో మాట్లాడారు. నదిలో నీరు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో నీటిని అదనంగా విడుదల చేశామన్నారు. కృష్ణవేణి ఘాట్ తనిఖీ పుష్కరాలు జరిగే సమయంలో శానిటేషన్ పనుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని నగర మేయర్ కోనేరు శ్రీధర్ హెచ్చరించా. కృష్ణవేణి ఘాట్‌ను శనివారం పరిశీలించారు. ఘాట్‌ల్లో పేరుకున్న చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట కార్పొరేటర్లు కోసూరి శైలజ, సుకాసి సరిత, కె.వెంకటేశ్వరరావు, కొండపల్లి అనసూయ, కొటిబోయిన దుర్గాభవాని, బుగతా ఉమామహేశ్వరి ఉన్నారు. -
అమరావతికి సీఎం
సాక్షి, అమరావతి : అమరావతిలో ఘాట్ల పరిశీలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విజయవాడ వెళ్లే రోడ్డు పక్కన హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా సీఎం ఘాట్ల ఏర్పాట్లలను సమీక్షించనున్నట్లు సమాచారం. అయితే ఆదివారం సీఎం పర్యటించాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దు అయినట్లు సమాచారం. -
బాబోయ్ దొంగలు..
విజయవాడ (గుణదల) : నిరంతర నిఘా కెమెరాల సాక్షిగా పద్మావతి ఘాట్‌లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మాయమాటలు చెప్పి వారి వస్తువులు, నగలు, నగదు తీసుకుని ఉడాయిస్తున్నారు. శనివారం ఒక్కరోజే ఆరుగురు భక్తులు దొంగల బారిన పడ్డారు. బందరుకు చెందిన దివ్య తన చెవికమ్మెలు, ముక్కుపుడక బంగారు బిళ్లలను బ్యాగులో ఉంచి స్నానానికి వెళ్లి వచ్చేసరికి కనిపించలేదని కృష్ణలంక పీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తూర్పుగోదావరికి తునికి చెందిన వెలగబాబ్జి తన బ్యాగులో పద్రపరచుకున్న మూడు తులాల బంగారు చైను, పర్సులో ఉన్న రూ.5000 కనిపించలేదని ఫిర్యాదు చేశారు. హైదాబాదుకు చెందిన గోపాలరావు ఘాట్ వద్ద పర్సు పోగొట్టుకున్నారు. అందులో రూ.5600 ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు డీజీ ఎన్వీ సురేంద్రబాబు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే ఘాట్ పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఘాట్ల వరకూ బస్సులు
ఐజీ సంజయ్ వెల్లడి సీతానగరం (తాడేపల్లి రూరల్) : కృష్ణా పుష్కరాలకు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యార్థం బస్సు సర్వీసులను ఘాట్ల వరకు నడుపుతామని గుంటూరు ఐజీ సంజయ్ తెలిపారు. సీతానగరం పుష్కర ఘాట్ వద్దకు శనివారం వచ్చిన ఆయన వాహనాల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్‌కు అసౌకర్యం లేకుండా గుంటూరు నుంచి విజయవాడ వచ్చే బస్సులను నేరుగా సీతానగరం పుష్కర ఘాట్‌కు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గుంటూరు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు అక్కడ నుంచి దుర్గ ఘాట్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉండవల్లి సెంటర్ నుంచి దుర్గ ఘాట్ వరకు, అలాగే సీతానగరం ఘాట్ వరకు ఐజీ బస్సులో ప్రయాణించారు. -
ఘాట్లలో నాని పర్యటన
భవానీపురం : నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చెప్పారు. శనివారం పున్నమిఘాట్ను సందర్శించిన ఆయన భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విలేకరులతో మాట్లాడుతూ రానున్న మూడేళ్ల కాలంలో విజయవాడ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్ది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేస్తామని అన్నారు. నగరంలో త్వరలోనే 5 కోట్ల మొక్కలను నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. 15 కిలోమీటర్ల పొడవునా ఆధునీకరించిన స్నానఘాట్లను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. -
కమిషనర్‌కు నో ఎంట్రీ
► డ్యూటీలో పోలీసుల అతి ► వీరపాండియన్ అసహనం ► అధికారులు, భక్తులకు తప్పని ఇక్కట్లు విజయవాడ సెంట్రల్ : పోలీసుల ఓవర్‌యాక్షన్‌తో పుష్కర భక్తులతో పాటు వివిధ శాఖల అధికారులకు ఇక్కట్లు తప్పలేదు. పోలీస్ బాస్‌లే మితిమీరిన ఆంక్షలు పెట్టడంతో కిందిస్థాయి అధికారులు రెచ్చిపోయారు. పలు రహదారులను బారికేడ్లతో మూసేశారు. వెహికిల్ పాస్‌లు ఉన్న వాహనాలను నిలుపుదల చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్‌ను ఫ్లైఓవర్ ఎక్కడానికి వీల్లేదంటూ లీలామహల్ సెంటర్ వద్ద అడ్డుకున్నారు. సార్ కమిషనర్ అంటూ కారులో ఉన్న ఉద్యోగులు చెప్పినప్పటికీ పోలీస్‌లు లెక్కచేయలేదు. దీంతో కమిషనర్‌కు చిర్రెత్తుకొచ్చింది. పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్‌కు ఫోన్ చేసి మీ (పోలీసుల) పద్ధతి బాగోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పలేక చెప్పుకున్నట్లు సమాచారం. సీపీ ఫోన్లో ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు దారి వదిలారు. ఆ తరువాత చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్ వాహనాన్ని అడ్డుకున్నారు. తాను అత్యవసరంగా కార్పొరేషన్‌కు వెళ్లాలని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే కానీ ఆయనకూ దారి ఇవ్వలేదు. నగరపాలక సంస్థ ఉద్యోగులు పాస్‌లు చూపించినా నిలిపివేశారు. దీంతో ఉద్యోగులు వర్సెస్ పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీలానే మేం డ్యూటీలు చేయాలా వద్దా అంటూ పలువురు ఉద్యోగులు పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ఫ్లైఓవర్‌ను వీవీఐపీల సేవకు మాత్రమే పోలీసులు వినియోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లెనిన్‌సెంటర్, పాత ప్రభుత్వాస్పత్రి, ఫ్లైఓవర్ రహదారుల్ని దిగ్బంధనం చేయడంతో బంగ్లా సెంటర్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. తొలిరోజు పుష్కరాలకు భక్తుల హాజరుశాతం తక్కువగానే ఉంది. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో అత్యధిక రహదారులు మూసుకుపోవడంతో భక్తులు, వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
సంచార ఏటీఎంలు
గుణదల(క్రిష్ణా): ధనంమూలం ఇదం జగత్ అన్నారు, డబ్బు లేకుంటే ఏ పనీ జరగదు. పుష్కరాల యాత్రికులకైతే మరీ కష్టం. అందుకే పుష్కరాలకు లక్షలాది మంది యాత్రికులు తరలివస్తున్న నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ బ్యాంకు ఖాతాదారుల సౌకర్యార్థం సంచార ఏటీఎంలను ఘాట్ల వద్దకు, రద్దీ ప్రాంతాల్లోనూ తెస్తున్నాయి. జాతీయ బ్యాంకులతోపాటు ప్రాంతీయ బ్యాంకులు కూడా ఈ సేవలకు సిద్ధమయ్యాయి. మొబైల్ ఏటీఎం వద్ద తమ బ్యాంకు చేస్తున్న సేవలు, బ్యాంకులు అందించే వివిధ పథకాలు ప్రచారం చేసుకుంటున్నాయి. మొబైల్ ఏటీఎంలకు రక్షణగా తాత్కాలిక భద్రతా సిబ్బందిని నియమించుకుని రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం పుష్కరాల తొలి రోజు కావటతో బస్టాండ్ పరిసర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నందున లక్ష్మీవిలాస్ బ్యాంక్ పద్మావతి ఘాట్ సమీపంలో పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు ఎదురుగా ఏర్పాటు చేసింది. రోజుకు రూ.10 లక్షల వరకు నగదు డ్రా చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. -
పుష్కరఘాట్ల పరిశీలన
విజయపురి సౌత్: విజయపురిసౌత్‌లో కృష్ణవేణి, దేశాలమ్మగుడి, అనుపు పుష్కర ఘాట్లకు ప్రత్యేక అధికారిగా నియమితులైనlడీఎస్పీ మురళీకృష్ణ సోమవారం ఆ ఘాట్లను పరిశీలించారు. ఘాట్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలిచ్చారు. ఆయన వెంట మాచర్ల రూరల్ సీఐ శివశంకర్, విజయపురి సౌత్ ఎస్.ఐ వై కోటేశ్వరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
బాబోయ్.. లీడింగ్ చానల్
విజయవాడ వైపు పూర్తిగా కాంక్రీట్‌తో నిర్మాణం సీతానగరంలో ఇసుక బస్తాలతో మమ.. జారిపడితే అంతే సంగతులు! సీతానగరం (తాడేపల్లి రూరల్) : సీతానగరం పుష్కర ఘాట్లపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోంది. రాజధాని ప్రాంతమైన సీతానగరం పుష్కరఘాట్ల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పనుల్లో బెజవాడకు, తాడేపల్లికి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ అలా.. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీళ్లు వస్తాయా? లేదా? అనే అనుమానంతో విజయవాడ పుష్కర ఘాట్లలో ప్రకాశం బ్యారేజీ నుంచి రెండున్నర కిలోమీటర్ల మేర రూ.5 కోట్లతో లీడింగ్ చానల్ ఏర్పాటుచేశారు. ఈ చానల్ అడుగు భాగం కాంక్రీట్ ఫ్లాట్‌ఫాం నిర్మించి, ఘాట్ల నుంచి లీడింగ్ చానల్ వరకూ మరో ప్లాట్‌ఫాం ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి స్నానాలు ఆచరించేందుకు, కాలువలోకి దిగేందుకు ప్రత్యేక మెట్లు సిద్ధం చేశారు. కృష్ణానది వైపు ఇసుక బస్తాలు ఏర్పాటుచేసి కట్టలు నిర్మించారు. ఇక్కడ ఇలా.. సీతానగరంలో.. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఘాట్ల వద్ద ఏర్పాటుచేసే లీడింగ్ చానల్ పరిస్థితి దారుణంగా మారింది. ఘాట్లలో విధులు నిర్వహించే ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేసి పంపినప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం భక్తులు పుణ్యస్నానం చేసేందుకు గానూ ఘాట్ల వద్దకు నీరు ఎలా తెప్పిస్తారని అధికారులను ప్రశ్నించారు. విజయవాడలో మాదిరిగానే లీడింగ్ చానల్ ఏర్పాటుచేయాలని సూచించారు. అయినా ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. దీంతో స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్ సిబ్బంది కాంట్రాక్టర్‌కు నచ్చజెప్పి లీడింగ్ చానల్ ఏర్పాటు చేయనున్నారు. ఇసుక బస్తాలతో చానల్..! సీతానగరంలోని లీడింగ్ చానల్‌ను పూర్తిగా ఇసుక బస్తాలతో నిర్మిస్తున్నారు. పుష్కర ఘాట్లకు, కృష్ణానదిలో ఉన్న నీటి మట్టానికి 14 అడుగుల వ్యత్యాసం ఉండడంతో.. ఆంజనేయస్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న ఘాట్ వద్ద చానల్ కలుపుతూ కాంక్రీట్‌తో పది అడుగుల తొట్టి ఏర్పాటుచేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి అర కిలోమీటరు పొడవున పైపులైను వేసి, లీడింగ్ చానల్లోకి నీరు పంపనున్నారు. రైల్వే బ్రిడ్జి దాటిన తరువాత 8 అడుగుల ఎత్తులో మరో తొట్టి ఏర్పాటుచేసి దానిపై నుంచి నీరు బయటకు వెళ్లేలా ప్లాన్ చేశారు. -
చంద్రబాబు అప్పుడు అక్కడే!
-
చంద్రబాబు అప్పుడు అక్కడే!
* తొక్కిసలాట సమయంలో పుష్కర ఘాట్‌లోనే ఏపీ సీఎం! * ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించినట్టు మీడియా కథనం * తొలుత నలుగురు, తరువాత 11 మంది చనిపోయినట్టు సీఎంకు తెలిపానన్న అధికారి * పోలీసు, రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తొక్కిసలాట జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు పుష్కరఘాట్ లోపలే ఉన్నారని తాజాగా వెల్లడైన అంశం పోలీసు, రెవెన్యూ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తొక్కిసలాట జరిగినట్టు, అప్పటికి 11 మంది భక్తులు మృతిచెందినట్టు ఘాట్ లోపలే ఉన్న సీఎంకు తెలియజేసినట్టు పుష్కర విధుల్లో ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారిని ఉటంకిస్తూ తాజాగా మీడియాలో వచ్చిన కథనం సంచలనం రేపింది. పుష్కరాల ప్రారంభ ముహూర్త సమయంలో సీఎం ప్రచార డాక్యుమెంటరీలో నిమగ్నమవడం, ఆ సమయంలో భక్తులను మూడు గంటలపాటు కట్టడి చేసి, అనంతరం ఒకేసారి ఘాట్ లోపలకు పంపించడం.. తొక్కిసలాటకు, 29 మంది మరణాలకు దారితీయడం తెలిసిందే. అయితే తొక్కిసలాట జరిగినప్పుడు సీఎం ఎక్కడున్నారనేది ఇప్పటివరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ సమయంలో సీఎం ఘాట్లోపలే ఉన్నట్టు తాజాగా వెలువడిన కథనం వెల్లడించింది. ఇది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది? గత మంగళవారం ఉదయం 6.26 గంటలకు పుష్కరాల ముహూర్త సమయం. సీఎం కుటుంబ సమేతంగా 5.45 గంటలకు పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి పుష్కర స్నానమాచరించారు. అనంతరం పితృదేవతలకు పిండప్రదానం, గోదానం వంటివి ఘాట్‌లో పూర్తి చేశారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి సమయం దాదాపు 7.30 గంటలైంది. పుష్కరస్నానం అనంతరం ఘాట్‌లో ఉన్న ప్రత్యేక బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు రిఫ్రెష్ అయ్యి, సుమారు 8.30 గంటల సమయంలో ఆర్అండ్బీ అతిథిగృహానికి బయలుదేరారంటున్నారు. అయితే ఆ మధ్యలోనే తొక్కిసలాట జరిగిందనే ప్రచారం ఇప్పటికే ఉండగా.. తాజాగా వెల్లడైన మీడియా కథనం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. తొక్కిసలాటప్పుడు సీఎం ఘాట్లోపలే ఉన్నారని, మొదట నలుగురు, తదుపరి 11 మంది చనిపోయిన విషయాన్ని సీఎంకు వివరించినట్టు, ఆ సమయంలో అన్ని చర్యలూ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు ఒక పోలీసు అధికారిని ఉటంకిస్తూ మీడియా కథనం వెల్లడించింది. దీంతో పుష్కర విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు ఆదివారం ఇదేఅంశంపై చర్చించుకోవడం కనిపించింది. ఘాట్‌వద్ద ఎక్కువ సమయం భక్తులను నిలువరించడం, ముఖ్యమంత్రి వెళ్లే సమయానికి ఒకేసారి అనుమతించడమే తొక్కిసలాటకు కారణమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇటీవల నివేదికివ్వడం తెలిసిందే. తాజాగా పోలీసు అధికారి చెప్పిన విషయం చూస్తే ఈ దుర్ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యులనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. పోలీసు అధికారి చెప్పినట్టు వచ్చిన కథనం వాస్తవమైతే ఆ సమయంలో ముఖ్యమంత్రి ఆ ఘటనను తేలికగా తీసుకున్నారనే భావనను అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పుష్కర ఘాట్ దుర్ఘటనతో పడిన మచ్చను చెరిపేసుకునేందుకు ఆ తరువాత అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా బస్టాండ్లు, ఫుష్కర ఘాట్లు, రైల్వే స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు సంఘటన జరిగినప్పుడు సత్వరం స్పందించలేదనేందుకు ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నాయి. అలా స్పందించివుంటే.. మృతులసంఖ్య అంత ఉండేది కాదని భావిస్తున్నాయి.