దసరాకు ఘాట్లను తీర్చిదిద్దండి
మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్
విజయవాడ సెంట్రల్ : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఘాట్లు, నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ అధికారులకు సూచించారు. ఆయన బుధవారం పద్మావతి ఘాట్, పండిట్ నెహ్రూ బస్ టర్మినల్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు నగరానికి వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రజారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బహిరంగప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని శానిటరీ ఇనిస్పెక్టర్లకు చెప్పారు. గ్రీనరీని అభివృద్ధి చేయాలన్నారు. బస్ టెర్మినల్ వద్ద నమ్మా టాయ్‌లెట్ పనులను రెండు రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రోడ్లపై