సంగమం ఘాట్‌లో పాము
సంగమం ఘాట్‌లో పాము
Published Thu, Aug 18 2016 9:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
ఇబ్రహీంపట్నం :
పవిత్రసంగమం స్నానఘాట్‌లో ఓ పాము కలకలం సృష్టించింది. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎగువప్రాంతం నుంచి అధికంగా నీరు వచ్చిచేరటంతో భారీగా గుర్రపుడెక్క తీగ ఆకులు కొట్టుకొస్తున్నాయి. వీటిపై ప్రయాణిస్తున్న పాములు పవిత్రసంగమం పుష్కరఘాట్ వద్దకు చేరుతున్నాయి. నీటిలో తేలుతున్న పామును చూసిన భక్తులు పరుగులు పెట్టారు. దీంతో అక్కడి సిబ్బంది పామును పట్టుకుని పక్కన వదిలేశారు. రెండురోజుల క్రితం రక్తపింజరి పాము ఘాట్‌లో భక్తులను భయపెట్టింది. తరచూ సర్పాలు వస్తుండడంతో యాత్రికులు స్నానం చేయాలంటేనే భయపడుతున్నారు.
Advertisement
Advertisement