అక్కడ స్నాక్‌గా స్నేక్‌లు..! | Indian Vloggers Discovery In Indonesia; Snake As A Snack? | Sakshi
Sakshi News home page

అక్కడ చిరుతిండిగా కోబ్రాలు..అదే ఫేమస్‌ వంటకమట..

Published Wed, Jan 1 2025 11:46 AM | Last Updated on Wed, Jan 1 2025 12:13 PM

Indian Vloggers Discovery In Indonesia; Snake As A Snack?

మాములుగా మన దేశంలో చిరుతిండిగా వీధి స్టాల్స్‌లో సమోసాలు, బజ్జీలు, పకోడిలు నోరూరించేలా కనువిందు చేస్తుంటాయి. కానీ ఈ దేశంలో స్నాక్‌గా ఏం ఉంటాయో తెలిస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. మనిషికి అత్యంత హానికరమైన దాంతోనే వంటకం, అదే అక్కడ ఫేమస్‌ కూడా. ఇంతకీ ఏంటా రెసిపీ అంటే..

ఫుడ్‌‍ వ్లాగర్లు(Food vloggers) ఇతర దేశాల్లో ఉండే వైవిధ్యభరితమైన వంటకాల విశేషాల గురించి చెప్పడమే గాక ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. అలానే ఒక భారతీయ వ్లాగర్‌ తన ఇండోనేషియా(Indonesia) పర్యటనలో వీధి దుకాణల్లో అమ్మే ఫేమస్‌ వంటకాన్ని గురించి తెలసుకుని కంగుతిన్నాడు. చిరుతిండిగా క్రోబ్రా(cobra)తో చేసిని వంటకాన్నే తింటారట. 

ఆ వంటకం అంటే అక్కడ పడిచస్తారట. అందుకు తగ్గట్టుగానే వరుస దుకాణాల్లో బోనుల్లో అప్పటికప్పుడు తాజాపాముతో ఈ వంటకాన్ని రెడీ చేయడం తదితరాలను చూసి నోటి మాట రాలేందుంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ముఖ్యంగా ఆ వంటకం కోసం క్యూలో నిలబడటం చూసి మతిపోయిందని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు ఫుడ్‌ వ్లాగర్‌. అంతేకాదండోయ్‌ ఇండోనేషియ వాసులు కోబ్రాతో చేసిన వంటక తినడం వల్ల చర్మఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తినికి మంచిదని బలంగా నమ్ముతారట. 

ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవ్వడమే గాక దాదాపు 4 మిలియన్లు వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ పప్పు, బియ్యంతో వంటలు ఎలా వండాలో నేర్పిస్తానని ఒకరూ, మనిషి కంటే ప్రమాదకరమైన జంతువు ఇంకొకటి లేదని మరొకరు రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: న్యూ ఇయర్‌ పార్టీ జోష్‌: ఫస్ట్‌ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్‌ చేయండిలా..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement