
69 పిల్ల సర్పాల పట్టివేత
కర్ణాటక: ఒక్క పామును చూస్తేనే హడలిపోతారు. ఇంకా ఎక్కువ పాములను చూస్తే ఎవరికైనా వణుకు పుట్టడం ఖాయం. ఇలాంటి ఘటనే శివమొగ్గ నగరంలో జరిగింది. కువెంపు లేఔట్‌లో ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంటిలో ఉన్న నీటి తొట్టిలో ఓ పాము గుడ్లను పెట్టి పొదిగింది.
ఆదివారం తొట్టి బయట ఒక పాముపిల్లను చూసిన కుటుంబ సభ్యులు తొట్టెలో లైటు వేసి చూడగా పుట్టల కొద్దీ పాము పిల్లలు కనిపించడంతో భయపడిపోయారు. వెంటనే స్నేక్ కిరణ్‌కు(snake kiran) సమాచారం ఇచ్చారు. స్నేక్ కిరణ్ అప్పటినుంచి పాము పిల్లలను సేకరించసాగారు. సోమవారం నాటికి 69 పిల్ల పాములను పట్టి బకెట్లో నిల్వ చేశారు. వాటిని తీసుకెళ్లి దూరంగా ఓ చెరువులో వేశారు. కాగా ఈ వీడియోలు వైరల్ అయ్యాయి