సంచార ఏటీఎంలు | mobile atms | Sakshi
Sakshi News home page

సంచార ఏటీఎంలు

Published Fri, Aug 12 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

సంచార ఏటీఎంలు

సంచార ఏటీఎంలు

గుణదల(క్రిష్ణా):
ధనంమూలం ఇదం జగత్‌ అన్నారు, డబ్బు లేకుంటే ఏ పనీ జరగదు. పుష్కరాల యాత్రికులకైతే మరీ కష్టం. అందుకే పుష్కరాలకు లక్షలాది మంది యాత్రికులు తరలివస్తున్న నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ బ్యాంకు ఖాతాదారుల సౌకర్యార్థం సంచార ఏటీఎంలను ఘాట్ల వద్దకు, రద్దీ ప్రాంతాల్లోనూ తెస్తున్నాయి. జాతీయ బ్యాంకులతోపాటు ప్రాంతీయ బ్యాంకులు కూడా ఈ సేవలకు సిద్ధమయ్యాయి.

మొబైల్‌ ఏటీఎం వద్ద తమ బ్యాంకు చేస్తున్న సేవలు, బ్యాంకులు అందించే వివిధ పథకాలు ప్రచారం చేసుకుంటున్నాయి. మొబైల్‌ ఏటీఎంలకు రక్షణగా తాత్కాలిక భద్రతా సిబ్బందిని నియమించుకుని రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం పుష్కరాల తొలి రోజు కావటతో బస్టాండ్‌ పరిసర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నందున లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ పద్మావతి ఘాట్‌ సమీపంలో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌కు ఎదురుగా ఏర్పాటు చేసింది. రోజుకు రూ.10 లక్షల వరకు నగదు డ్రా చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement