mobile atm
-
మొబైల్ ఏటీఎం ప్రారంభం
బీబీనగర్ : మండలంలోని బీబీనగర్, కొండమడుగు, గూడురు గ్రామాల్లో సోమవారం నాబార్డు వారి సౌజన్యంతో, పీఏసీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంను పీఏసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంక్ సేవలు, నగదు అందుబాటులో ఉండే విధంగా మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ బ్రాంచ్ మేనేజర్ ఇందిరాప్రియదర్శిని, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కార్మికులందరికీ బ్యాంక్ ఖాతాలు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ బ్యాంక్ ఖాతాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. నల్లధనం, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకే ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. కార్మికుల జీతాల విడుదలకు, అన్ని రంగాల్లోని వారికి బ్యాంక్ ఖాతాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని 4.61 లక్షల మంది కార్మికులకు బ్యాంక్ ఖాతాలు కల్పించినమన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 15 వేల మంది బీడీ కార్మికులకు ఖాతాలు కల్పించినట్టు తెలిపారు. ఎక్కడైతే పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తున్నారో అక్కడ మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశానన్నారు. కాఫీ పొడి వర్కర్స్కు బ్యాంకు ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. -
ఎనీ టైం మనీ..
అమరావతి (పట్నంబజారు) : పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆయా బ్యాంకుల అధికారులు మొబైల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. బస్సుల్లో జనరేటర్ సహాయంతో వీటిని నడిపిస్తున్నారు. పుష్కర ఘాట్లకు అతి సమీపంలోనే మొబైల్ ఏటీఎంలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. 12 రోజుల పాటు సేవలందిస్తామని అధికారులు తెలిపారు. -
సంచార ఏటీఎంలు
గుణదల(క్రిష్ణా): ధనంమూలం ఇదం జగత్ అన్నారు, డబ్బు లేకుంటే ఏ పనీ జరగదు. పుష్కరాల యాత్రికులకైతే మరీ కష్టం. అందుకే పుష్కరాలకు లక్షలాది మంది యాత్రికులు తరలివస్తున్న నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ బ్యాంకు ఖాతాదారుల సౌకర్యార్థం సంచార ఏటీఎంలను ఘాట్ల వద్దకు, రద్దీ ప్రాంతాల్లోనూ తెస్తున్నాయి. జాతీయ బ్యాంకులతోపాటు ప్రాంతీయ బ్యాంకులు కూడా ఈ సేవలకు సిద్ధమయ్యాయి. మొబైల్ ఏటీఎం వద్ద తమ బ్యాంకు చేస్తున్న సేవలు, బ్యాంకులు అందించే వివిధ పథకాలు ప్రచారం చేసుకుంటున్నాయి. మొబైల్ ఏటీఎంలకు రక్షణగా తాత్కాలిక భద్రతా సిబ్బందిని నియమించుకుని రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం పుష్కరాల తొలి రోజు కావటతో బస్టాండ్ పరిసర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నందున లక్ష్మీవిలాస్ బ్యాంక్ పద్మావతి ఘాట్ సమీపంలో పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు ఎదురుగా ఏర్పాటు చేసింది. రోజుకు రూ.10 లక్షల వరకు నగదు డ్రా చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.