కళ్లలో దుమ్ము
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఘాట్ల సమీపంలోని రహదారులపై ఉన్న దుమ్ము, ధూళి పుష్కర యాత్రికుల కళ్లల్లో పడి ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారులపై వేసిన బ్లీచింగ్‌తో పాటు యాత్రికులు, స్థానికులు పడేసిన వర్ధా్యలు గాలలకు పైకిలేచి ముఖాలపై పడుతున్నాయి. ఘాట్ల వద్ద ఇసుక రేణువులు ఎక్కువుగా కళ్లల్లో పడుతుండడంతో యాత్రికులు అసౌకర్యానికి గురవుతున్నారు. భవానీ, పున్నమి ఘాట్ల వద్ద ఈ పరిస్థితి అధికంగా ఉంది.