పెరిగిన నిఘా..
పెరిగిన నిఘా..
Published Mon, Aug 15 2016 10:29 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
విజయవాడ(గుణదల):
పద్మావతి ఘాట్‌లో సోమవారం పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఘాట్‌లో చోటుచేసుకుంటున్న నేరాలను నిర్మూలించటానికి పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అక్టోపస్, సీఆర్‌పీఎఫ్ విభాగాలు రంగంలోకి దిగాయి. ఘాట్ల వద్ద పహార కాస్తున్నారు. పిండ ప్రధానం, స్నానాలు ఆచరించే ప్రాంతంలో కలియ తిరుగుతూ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఆకతాయిలకు చెక్..
నదిలో స్నానమాచరిస్తున్న మహిళలు, యువతుల వెంటపడుతున్న, స్నానమాచరిస్తున్న సమయం లో వారితోపాటు నదిలో దిగి వేధిస్తున్న పలువురు యువకులను ఘాట్ పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు పుణ్యస్నానాలకు వస్తున్న వారిని మోసం చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు.
నకిలీ గుర్తింపుకార్డు దారులు గుర్తింపు ..
స్నానఘాట్‌ల వద్ద కొంత మంది నకిలీ గుర్తింపు కార్డులు వేసుకుని భక్తులను మోసం చేసి వారివద్ద నగలు, నగదు అపహరించుకుపోతున్న వారిపై పోలీసులు నిఘాను పెంచారు. సోమవారం పలువురు పోలీసులు మఫ్టీలో తిరుగుతూ గుర్తింపు కార్డులు లేని అర్చకులను అక్కడి నుంచి పంపేశారు. గుర్తింపుకార్డుల్లో అధికారుల సంతకం లేకుండా, కలర్ జిరాక్స్ కాపీలతో గుర్తింపు కార్డులను రూపొందించుకుని వచ్చే వారిపై నిఘా పెంచారు. ఘాట్లలో విధులు నిర్వరిస్తున్న ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పోలీసులు, పోలీసు వాలంటీర్లు తనిఖీ చేసి అధికారుల సంతకం లేని వారిని విచారిస్తున్నారు.
మాయమాటలు నమ్మోద్దు..
ఘాట్‌లో మోసకారులు, దొంగలు తిరుగుతున్నారని, ఎవరైనా మోసం చేస్తున్నట్లు అనుమానం వచ్చినా, దొంగతనానికి పాల్పడినా వెంటనే తమ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఘాట్‌లో విధులు నిర్వర్తించే వివిధ విభాగాల ప్రతినిధులు తప్పని సరిగా గుర్తింపు కార్డుపై అధికారి సంతకం ఉండాలని, అలా లేకుంటే కేసు నమెదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Advertisement