కమిషనర్‌కు నో ఎంట్రీ
ఆ తరువాత చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్ వాహనాన్ని అడ్డుకున్నారు. తాను అత్యవసరంగా కార్పొరేషన్‌కు వెళ్లాలని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే కానీ ఆయనకూ దారి ఇవ్వలేదు. నగరపాలక సంస్థ ఉద్యోగులు పాస్‌లు చూపించినా నిలిపివేశారు. దీంతో ఉద్యోగులు వర్సెస్ పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీలానే మేం డ్యూటీలు చేయాలా వద్దా అంటూ పలువురు ఉద్యోగులు పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ఫ్లైఓవర్‌ను వీవీఐపీల సేవకు మాత్రమే పోలీసులు వినియోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లెనిన్‌సెంటర్, పాత ప్రభుత్వాస్పత్రి, ఫ్లైఓవర్ రహదారుల్ని దిగ్బంధనం చేయడంతో బంగ్లా సెంటర్‌లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. తొలిరోజు పుష్కరాలకు భక్తుల హాజరుశాతం తక్కువగానే ఉంది. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో అత్యధిక రహదారులు మూసుకుపోవడంతో భక్తులు, వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.