84 క్వింటాళ్ల రేష న్ బియ్యం పట్టివేత
జంగారెడ్డిగూడెం (చింతలపూడి) : పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులోని ఓ గోడౌ న్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 84 క్వింటాళ్ల రేష న్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎం.కేశవరావు తెలిపిన వివరాలు ప్రకారం బుట్టాయగూడెం రోడ్డులో ఒక గోడౌ న్ లో రేష న్ బియ్యం నిల్వ ఉన్నాయని తమకు అందిన సమాచారం మేరకు వీఆర్వో జ్యోతి పోలీసు సిబ్బందితో దాడులు చేశారన్నారు. నిల్వ ఉంచిన 50 కిలోల 168 బస్తాల రేష న్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణకు సివిల్ సప్లయిస్ డీటీకి అప్పగించినట్టు ఎస్సై కేశవరావు చెప్పారు.