jangareddygudem
-
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విద్యార్థులకు శాపంగా లోకేశ్ బర్త్‌డే
-
టీడీపీకి జంగారెడ్డిగూడెం జనసేన నేతల మాస్ వార్నింగ్
-
లోకేశ్‌ను కలిసేందుకు రైతులు ససేమిరా
జంగారెడ్డిగూడెం రూరల్/కామవరపుకోట: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో బుధవారం నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వెలవెలబోయింది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి నుంచి పుట్లగట్లగూడెం మీదుగా గురవాయిగూడెం వరకు యాత్ర సాగింది. పాదయాత్ర షెడ్యూల్లో పుట్లగట్లగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే రైతులతో లోకేశ్ ముఖాముఖి ఏర్పాటు చేశారు. అయితే.. రైతుల వద్దకు లోకేశ్ రారని.. రైతులనే లోకేశ్ వద్దకు తీసుకు రావాలని చెప్పడంతో నాయకులు హైరానా పడ్డారు. లోకేశ్ వద్దకు రావాలని రైతులను బతిమాలుకోగా.. తాము రాబోమని రైతులు తెగేసి చెప్పారు. దీంతో టీడీపీ నేతలు తమ బంధువులను, పరిచయం ఉన్న వారిని తీసుకెళ్లి వాళ్లే రైతులని లోకేశ్‌కు చెప్పారు. వారితో ముక్తసరిగా మాట్లాడిన లోకేశ్ యాత్రను ముందుకు సాగించారు. చదవండి: 15 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం -
పోలవరం నిర్వాసితులు.. ఆ కాలనీలు అద్భుతం
1047 ఎకరాల భూమి సేకరణ.. 532 ఎకరాల్లో 6048 ఇళ్ల నిర్మాణం.. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఆడిటోరియం వరకు సకల సౌకర్యాలు.. పంచాయతీ శివారు కాలనీ నుంచి మెగా మున్సిపాలిటీ దిశగా అడుగులు. ఇదీ జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయి ఆర్అండ్ఆర్ కాలనీ పరిస్థితి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భూమిని సేకరించి అనేక గ్రామాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నిర్వాసితులతో పాటు పోలవరంలోని పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాలకు చెందిన గిరిజనేతరులకు జంగారెడ్డిగూడెం సమీపంలోని తాడువాయిలో అతి పెద్ద పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ప్రభుత్వం మొక్కుబడిగా నిర్మించి చేతులు దులుపుకోకుండా సకల సౌకర్యాలతో వందల కోట్ల వ్యయంతో కాలనీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే 7500 జనాభాతో ఉన్న తాడువాయి గ్రామం ఆర్అండ్ఆర్ కాలనీ పూర్తిస్థాయిలో సిద్ధమైతే ఒకేసారి 32 వేల పైచిలుకు జనాభాతో మున్సిపాలిటీగా మారనుంది. కలెక్టర్ నుంచి స్థానిక అధికారుల వరకు పర్యవేక్షణ తాడువాయిలో 6048 ఇళ్ల నిర్మాణం కోసం 1047 ఎకరాల భూమి సేకరించారు. ఇళ్లు, మౌలిక సదుపాయాల కోసం 530 ఎకరాలు కేటాయించారు. రూ.435.05 కోట్ల వ్యయంతో 3905 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇవిగాక 938 మంది నిర్వాసితులు ప్లాట్లు తీసుకుని వారే స్వయంగా నిర్మించుకుంటున్నారు. మరో 1205 ప్లాట్లను సిద్ధం చేసి ఉంచారు. 3905 ఇళ్ల నిర్మాణాలకు గాను 1024 ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నాయి. ప్రభుత్వం ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన క్రమంలో ప్రతి వారం సమీక్షలు నిర్వహించడంతో పాటు జిల్లా కలెక్టర్ మొదలుకొని స్థానిక అధికారుల వరకు పనులు పర్యవేక్షిస్తున్నారు. గత నెలలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ తాడువాయి కాలనీల్లో పర్యటించి నిర్మాణ పురోగతి, అక్కడి స్థితిగతులపై లబ్ధిదారులతో మాట్లాడారు. దీంతో పనుల్లో వేగం పెరిగింది. నిర్వాసితుల గృహం ఊరి నిర్మాణం ఇలా.. ► తాడువాయి మేజర్ పంచాయతీ కాగా, దీనికి శివారు గ్రామాలుగా మంగిశెట్టిగూడెం, చల్లవారి గూడెం, గొల్లగూడెం, జొన్నవారిగూడెం ఉన్నాయి. ►తాడువాయిలో మిగిలిన 517 ఎకరాలను యువతకు ఉద్యోగ కల్పన, మార్కెటింగ్, అవసరమైన కర్మాగారాల ఏర్పాటుకు, సామాజిక అవసరాలకు వినియోగించనున్నారు. ► ఇళ్ల నిర్మాణంతో పాటు గుడి, మసీదు, చర్చి, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాలు, పంచాయతీ కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, పాఠశాలలు, బ్యాంక్, రైతుబజార్, ఏఎన్ఎం సబ్‌సెంటర్, పశు ప్రాథమిక వైద్యశాల, గోడౌన్లు, మినీ కోల్డ్ స్టోరేజీ, వాటర్ ట్యాంక్, బస్ షెల్టర్, ఇండోర్ స్టేడియం, డంపింగ్ యార్డు, పోస్టాఫీసు, పీహెచ్సీ, 3 శ్మశానవాటికలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, రెండు పార్కులు నిర్మిస్తున్నారు. ►ఇవిగాక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో లబ్ధిదారులు కొందరు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్, అనువుగా ఉండే కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరిన నేపథ్యంలో దానిపై కార్యాచరణ ప్రారంభమైంది. ► తాడువాయి ప్రస్తుత జనాభా 7500 కాగా, నిర్వాసితులంతా వారి గృహాల్లోకి చేరుకుంటే అదనంగా 24,500 మంది పెరగనున్నారు. దీంతో మొత్తం జనాభా 32 వేలకు చేరుకోనున్నట్టు అంచనా. ► దీంతో మండలంలోనే అతి పెద్ద పంచాయతీగా తాడువాయి రూపుదిద్దుకోనుంది. భవిష్యత్తులో ప్రభుత్వ నిబంధనల మేరకు మున్సిపాలిటీగా రూపాంతరం చెందనుంది. -
అసెంబ్లీలో సీఎం ప్రసంగంపై మండలిలో నోటీసు చెల్లదు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడిన విషయాలపై మండలిలో టీడీపీ సభ్యులు నోటీసు ఇవ్వడం తగదని చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు స్పష్టంచేశారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన చర్య తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు కేఈ ప్రభాకర్, జి.దీపక్‌రెడ్డి, పి.అశోక్‌బాబు తదితరులు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును తిరస్కరిస్తున్నట్టు గురువారం సభలో ప్రకటించారు. ‘జంగారెడ్డిగూడెంలో సంభవించిన 26 మరణాలు సహజమైనవని, 2011 జనాభా లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెం జనాభా 48,994 అని, ఈ దశాబ్ద కాలంలో 12% పెరిగితే ప్రస్తుత జనాభా 54,880 మంది ఉంటారని, వారిలో 26 మంది మరణాలు ఒకే సమయంలో సంభవించలేదని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చెప్పారు. టీడీపీ వాస్తవాలను వక్రీకరించి సహజ మరణాలపై రాజకీయం చేస్తోందని సీఎం ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ఆ మరణాలు సహజమే తప్ప కల్తీ మద్యం వల్ల కాదని సీఎం అసెంబ్లీలో వివరించారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (శాసన మండలి) విధివిధానాలు, బిజినెస్ ప్రవర్తన నియమాలు 173 ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. వాస్తవానికి ఈ అంశాన్ని ఏ రోజున లేవనెత్తాలని అనుకుంటారో అదే రోజు సభ ప్రారంభానికి ముందు తగిన ఫార్మాట్లో ఆధారాలతో సహా చైర్మన్‌కు అందించాలి. సభ సమావేశ సమయంలో నోటీసు తగిన ఫార్మాట్లో లేకుంటే చైర్మన్‌కు ఉన్న ప్రత్యేకాధికారంతో తిరస్కరించవచ్చు. టీడీపీ సభ్యులు ఇచ్చిన నోటీసు ఆధారంగా నేను శాసన మండలి నియమాలు, పార్లమెంట్, ఇతర రాష్ట్ర శాసన సభల్లోని ఆచరణ, విధానానికి సంబంధించిన అంశాలు పరిశీలించాను. భారతదేశంలో పార్లమెంట్, ఇతర సభల్లో, మరేదైనా రాష్ట్ర శాసన సభలో ఒక సభ్యుడు చేసిన ప్రసంగంపై మరో సభలో అధికార ఉల్లంఘన, సభ ధిక్కార కేసు వర్తించదు. ఎందుకంటే ప్రతి సభ దానికదే సొంత అధికారాల మేరకు అత్యున్నతమైనది. ఈ కారణంతోనే టీడీపీ సభ్యులు ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తున్నాను. ఏ సభ కూడా ఎటువంటి ఆక్షేపణను ప్రదర్శించదు. ఈ విధంగా ఏ సభ్యునిపైన, మరే ఇతర సభపైన ఏ సభ్యుడూ ఎలాంటి అపోహను ప్రదర్శించరు. ఈ సంపూర్ణమైన సూత్రాన్ని ప్రతిచోటా పాటిస్తారని విశ్వసిస్తున్నాను’ అని చైర్మన్ మోషేన్‌రాజు స్పష్టం చేశారు. -
చంద్రబాబు, లోకేష్‌లకు సిగ్గుండాలి
సాక్షి, అమరావతి: జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న సహజ మరణాలను ఆసరాగా చేసుకుని శవ రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు సిగ్గుండాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే.. ‘ ఈ మరణాలపై ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి క్లియర్‌గా స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగడానికి నోరెలా వచ్చింది. రూ.రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెడితే దానిపై చర్చించకుండా, ప్రశ్నోత్తరాలను జరగనివ్వకుండా ప్లకార్డులు తీసుకువచ్చి పథకం ప్రకారం టీడీపీ సభ్యులు పదేపదే సభను అడ్డుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులేమో తమ తండ్రికి మద్యం అలవాటు లేదంటుంటే.. టీడీపీ శవ రాజకీయం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల సభలో ఏదేదో మాట్లాడారు’ అని విమర్శించారు. -
తప్పుదోవ పట్టిస్తారా?
సాక్షి, అమరావతి: వివిధ కారణాలతో చనిపోయిన వారిని కల్తీ సారా మృతులంటూ సభను టీడీపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (నాని) మండిపడ్డారు. ప్రతిపక్షం పదేపదే సభను అడ్డుకోవడంతో బుధవారం అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. ఇదీ వాస్తవం.. ఈ నెల 11న జంగారెడ్డిగూడెంలో వరదరాజులు అనే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో ఏలూరు అక్కడ నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే నేను 12వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు గుంటూరు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడా. వరదరాజులు బ్రెయిన్ హెమరేజ్‌తో మెదడులో రక్తస్రావం జరుగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. అతడిని బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. బాధితుడు మంగళవారం రాత్రి 7 గంటలకు చనిపోయాడు. ఇప్పటికే ఎంఎల్సీ ప్రాథమిక నివేదిక రాగా పూర్తి స్థాయి రిపోర్టు రావాల్సి ఉంది. ఈలోగానే టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. లక్షణాలన్నీ ఒకేలా ఉండాలి కదా? అవి నిజంగా కల్తీ సారాకు సంబంధించిన మరణాలే అయితే ఒకే రకమైన లక్షణాలుండాలి కదా? జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారందరి లక్షణాలు ఒకేలా లేవు. కొందరు కిడ్నీ వ్యాధులతో మరణిస్తే మరికొందరు కాలేయ సంబంధ జబ్బులతో మరికొందరు గుండెపోటు వల్ల మృతి చెందారు. వినే ఓపికా లేదా?: బుగ్గన టీడీపీ సభ్యులు రోజూ రెండు మరణాలను పెంచుతూ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. కనీసం అడిగిన ప్రశ్నలకు సమాధానం వినే ఓపిక కూడా వారికి లేదని విమర్శించారు. అప్పుడు ఎందుకు వెళ్లలేదు?: కన్నబాబు రాష్ట్రంలో ఏ సమస్యలు కనపడకపోవడంతో టీడీపీ సభ్యులు ఈ అంశాన్ని ఎత్తుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా ప్రచార వ్యామోహంతో గోదావరి పుష్కరాల్లో 29మంది, ఏర్పేడులో ఇసుక మాఫియా 16మందిని చంపినప్పుడు పరామర్శించని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం జంగారెడ్డిగూడెం పరుగెత్తుకెళ్లారని చెప్పారు. -
అబద్ధాలపై చర్చకు పట్టు
సాక్షి, అమరావతి: ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి టీడీపీ ఎంతకైనా తెగిస్తుందనడానికి గత సంఘటనలు ఎన్నో నిదర్శనంగా నిలిచాయి. ఈ కోవలో తాజాగా జంగారెడ్డిగూడెం అంశాన్ని తీసుకొని అబద్ధాన్ని ఎలాగైనా నిజం చేయాలని టీడీపీ పదేపదే ప్రయత్నిస్తోంది. ఇటు అసెంబ్లీలో, అటు బయట గందరగోళం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆ పార్టీ శ్రేణులు వ్యూహం రూపొందించాయి. బుధవారం కూడా శాసనసభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు సభను అడ్డుకోజూశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని, సీఎం అసెంబ్లీలో అసత్యాలు మాట్లాడారంటూ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి అడ్డుతగిలారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంత వారించినా వినలేదు. దీంతో సభ ప్రారంభమైన 20 నిమిషాలకే స్వీకర్ అయిదు నిమిషాల విరామం ప్రకటించారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వారు అదే ధోరణి కొనసాగించారు. దీంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం ఎటువంటి పదాలు వాడాలో తెలియడం లేదని అన్నారు. ఇలాంటి సభ్యులు ఉండటం ఖర్మ అని, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని కావడంతో సహనంతో ఉన్నానని, ఇంకొకరైతే ఈ పాటికి చర్యలు తీసుకునేవారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జోక్యం చేసుకుంటూ.. టీడీపీ బండారాన్ని గురువారం సభలో బయట పెడతానని అన్నారు. అప్పుడేం సమాధానం చెబుతారో చూద్దామంటూ సవాల్ విసిరారు. స్పీకర్ పదేపదే చెప్పినా తీరు మారకపోవడంతో ఇతర సభ్యుల హక్కుల పరిరక్షణ కోసం 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయిన అనంతరం సభ సజావుగా నడిచింది. అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ.. వాస్తవాలను అంగీకరించడానికి ప్రతిపక్షం సిద్ధంగా లేదన్నారు. ప్రభుత్వం మీద బురదజల్లి రాజకీయ ప్రయోజనం పొందాలనే తాపత్రయమే వారిలో కనిపిస్తోందని చెప్పారు. వాస్తవాలను విస్మరించి, అబద్ధాలను నిజాలుగా నమ్మించడానికి నిస్సిగ్గుగా ప్రయత్నించడం జుగుప్స కలిగిస్తోందన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై సభలో చర్చించకుండా, అల్లరి చేసి బురదజల్లడం మీదే ప్రతిపక్షం ఎక్కువ ఆసక్తి చూపిస్తోందని ఆయన విమర్శించారు. వాయిదా తీర్మానం తిరస్కరణ శాసన మండలిలో టీడీపీ సభ్యులు ముగ్గురిపై వైఎస్సార్సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. దీనిని సభా హక్కుల కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు మండలి చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం జగన్ అసత్య ప్రకటనలు చేశారని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలంటూ అంతకుముందు టీడీపీ సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు. అసెంబ్లీలో జరిగిన విషయంపై మండలిలో చర్య కోరడం సరికాదని చైర్మన్ చెప్పారు. అయినా టీడీపీ సభ్యులు పోడియం వద్ద నిలబడి ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమావేశాలను టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై మంత్రి కన్నబాబు తీవ్రంగా స్పందించారు. జంగారెడ్డిగూడెంలో పైడేటి సత్యనారాయణ (73) అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగానే చనిపోయారని, మద్యం వల్ల కాదని, ఒక్క రోజు కూడా మద్యం తాగని తమ తండ్రిని తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారని ఆయన కుమారుడు శ్రీనివాస్, కుమార్తె నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ టీడీపీ శవ రాజకీయాలు మానడంలేదని కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో కల్తీ నారా రాజకీయానికి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ సభా హక్కుల ఉల్లంఘన అని చెప్పారు. అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంపైన, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంపైన చర్చించే సమయంలో టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేయడం చూస్తే వారికి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందని మంత్రులు కన్నబాబు, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ తప్పుపట్టారు. పెద్దల సభకు కొత్తగా ఎన్నికైన తమ హక్కులకు టీడీపీ సభ్యుల తీరుతో భంగం కలుగుతోందని వరుదు కళ్యాణి, దువ్వాడ శ్రీనివాసరావు, మొండితోక అరుణ్‌కుమార్, వంశీకృష్ణ, భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను టీడీపీ సభ్యులు మండలిలో వక్రీకరించి చెప్పారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. టీడీపీ సభ్యులు అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, అంగర రామ్మోహన్‌లపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును మండలి చైర్మన్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసన మండలి బుధవారం ఆమోదం తెలిపింది. చంద్రబాబే కల్తీ: కన్నబాబు సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా సృష్టిస్తున్న చంద్రబాబే కల్తీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వివర్శించారు. బుధవారం సచివాలయం ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను కల్తీ సారా మరణాలంటూ జ్యుడిషియల్ విచారణ అడుగుతున్న లోకేష్‌కు సిగ్గుందా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి, వారి తప్పేమీ లేదని నివేదిక రాయించుకున్నారని చెప్పారు. ఏర్పేడులో ఇసుక మాఫియా లారీ ప్రమాదం జరిగి 22 మంది చనిపోయారన్నారు. ఈ రెండు సంఘటనల్లో చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పలేదని, బాధితులను ఓదార్చ లేదని, ఆర్థిక సాయం చేయలేదని, ఇప్పుడు మాత్రం రాజకీయ ర్యాలీలా జంగారెడ్డిగూడెం వెళ్లారని విమర్శించారు. బాధిత కుటుంబాలను సైతం టీడీపీ వారు బాధ పెడుతున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలతో సీఎం జగన్ మనోధైర్యాన్ని అంగుళం కూడా సడలించలేరని మంత్రి స్పష్టం చేశారు. ఎస్ఈబీని నాటుసారా, అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకే తెచ్చామన్నారు. -
కొడాలి నాని కీలక పాయింట్.. హెరిటేజ్ పాలు తాగి చనిపోయారు అంటే..
-
మండలిలో ప్లేటు ఫిరాయించి టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలంటూ తెలుగుదేశం సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు. అయితే మరణాలపై చర్చకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధమయ్యారు. దీంతో ఖంగుతున్న టీడీపీ నేతలు వెంటనే ప్లేటు ఫిరాయించారు. ముఖ్యమంత్రి సభకు వచ్చి జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వాలని యనమల రామకృష్ణుడు మాటమార్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రే వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలన్న అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పరిగణలోకి రాదని అన్నారు. అయితే యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రూల్ 306లో ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని రూల్ పొజిషన్లో చదివి వినిపించారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు శాసనమండలి చైర్మన్‌ను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం సభ నడపాలని సూచించారు. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు: మండలి ఛైర్మన్ టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని.. ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు. -
జంగారెడ్డిగూడెంలో ఇటీవల కొంతమంది దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలతో మరణం
-
జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ దుష్ప్రచారం: శ్రీకాంత్‌రెడ్డి
-
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వదంతులు
-
జంగారెడ్డిగూడెం : జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు ప్రమాదం ( ఫొటోలు )
-
బస్సు ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో బస్సు పడిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి ఆళ్లనాని తీవ్ర దిగ్భ్రాంతి జిల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనలో 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి ఆళ్ల నాని అదేశించారు. ఈ ప్రమాదంలో 20మందికి పైగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కోసం జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా అధికారులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. చదవండి: (జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి) -
జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 10 మంది మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని జల్లేరు వాగులో బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ రాహుల్ దేవ్‌శర్మ, ఎమ్మెల్యే ఎలీజా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాగు నుంచి బస్సును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు బయటకు వస్తేగాని మొత్తం మృతుల సంఖ్య ప్రకటించలేమని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత విచారకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. -
అమ్మపాలెంలో నిమ్మ జాతర.. ఇంటింటికీ సిరుల పంట, ఎలాగంటే..
జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి): నష్టాల నుంచి బయటపడేందుకు ఆ పంట వైపు మొగ్గారు. కష్టం కాయై కాసింది. నష్టం గట్టెక్కింది. దీంతో ఆ గ్రామంలోని రైతులు అటుగా అడుగులు వేశారు. నేడు ప్రతీ రైతుకు ఆ పంట సిరులు కురిపిస్తోంది. అదే అమ్మపాలెం నిమ్మ. జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెంలో ప్రతీ రైతు నిమ్మ పంటను పండిస్తున్నారు. గ్రామంలో సుమారు 100 ఇళ్లు ఉండగా, 150 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 100 మంది రైతులుగా ఉన్నారు. ప్రతీ రైతుకు ఉన్న భూమిలో కొంత భూమిలో నిమ్మ పంట పండిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ప్రధానంగా నిమ్మపంటపై ఆధారపడటమే కాక, కుటుంబసభ్యుల అంతా కలిసి నిమ్మ సేద్యం చేస్తారు. తమ కుటుంబాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఖాళీ సమయాల్లో నిమ్మతోటలకు వెళ్లి సొంతంగా కష్టపడుతారు. గ్రామరెవెన్యూ పరిధిలో సుమారు 600 హెక్టార్లు ఉండగా, దీనిలో 300 ఎకరాలు రైతులు నిమ్మపంట వేశారంటే విశేషమేమిటో ఇట్టే అర్థమవుతుంది. సుమారు 15 – 20 ఏళ్ల క్రితం వరకు గ్రామ రైతులు మిరప, పొగాకు వేసేవారు. ఆ సమయంలో ఈ పంటలకు నష్టాలు రావడంతో ఒకరిద్దరు రైతులు ప్రయోగాత్మకంగా నిమ్మపంట వేశారు. అంతే నిమ్మ పంట సిరులు కురిపించింది. ఇలా దశలవారీగా రైతులంతా తమ పంట భూమిలో కొంత మేర నిమ్మ పంట వేశారు. మెరకపొలాలు, వరి పొలాల్లో కూడా నిమ్మపంట వేశారు. దీంతో సేద్యపుభూమిలో సగ భూమి నిమ్మతోటలు వేశారు. ఎకరానికి సుమారు లక్ష రూపాయలు ఆదాయం రైతులకు లభిస్తోంది. దీంతో నిమ్మపంట అమ్మపాలెం గ్రామానికి బంగారం పంటగా మారిపోయింది. ఇప్పుడు ఊరంతా నిమ్మపంటపైనే ఆధారపడ్డారు. అంతే గాక రైతు ఇంటి పెరట్లో ఖాళీ జాగా ఉంటే ఖచ్చితంగా ఒకటి రెండు నిమ్మచెట్లు సెంటిమెంట్‌గా పెంచుతున్నారు. ఊరంతా రైతు కుటుంబాలే. వీరంతా ఒకే మాటపై కట్టుబడి ఉంటారు. పూర్వం సూరవరపు పున్నయ్య అనే వ్యక్తి గ్రామపెద్దగా వ్యవహరించారు. ఆయన మృతి అనంతరం ఆయన కుమారుడు రాంబాబు ప్రస్తుత గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు. అందరూ ఒకే కట్టుబాటు, సాంప్రదాయాలపై ఏకతాటిపై ఉంటారు. గ్రామంలో పండించిన నిమ్మ పంటను కుటుంబసభ్యులంతా ప్రతీ రోజు తోటల్లోకి వెళ్లి నిమ్మకాయలు కోసి సంచుల్లో నింపి ఊర్లో రోడ్డుపక్కన ఉంచుతారు. నిమ్మకాయల వ్యాపారులు మోటార్‌సైకిళ్లపై వచ్చి ఒకొక్క రైతు నుంచి వరుసుగా కొనుగోలు చేసుకుని ట్రక్కు, ఆటోలో ఏలూరు నిమ్మ మార్కెట్‌కు తరలిస్తారు. ఈ విధంగా రైతులకు నిమ్మకాయల మార్కెట్ ఇబ్బంది కూడా లేకుండా ఉంది. అమ్మపాలెం పండే నిమ్మ పంట మంచినాణ్యత కలిగి ఉంటుంది. మంచి ధర లభిస్తుంది. -
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బైపాసుపై రోడ్డు ప్రమాదం
-
గాయపడ్డ కొండ చిలువకు చికిత్స
సాక్షి, తాడేపల్లిగూడెం : వలలో చిక్కుకున్న ఓ కొండ చిలువకు పశు వైద్యాధికారి చికిత్స చేసి కాపాడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. జీలుగుమిల్లిలో శ్రీను అనే రైతు పొలానికి ఆనుకున్న ఉన్న చెరువులో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వల వేశారు. అందులో 12 అడుగుల కొండ చిలువ చిక్కడంతో వారు భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. వలలో చిక్కుకున్న కొండచిలువను గుర్తించిన శ్రీను ఈ విషయాన్ని జంగారెడ్డిగూడెం స్నేక్ సేవియర్ సొసైటీ వ్యవస్థాపకుడు క్రాంతికి తెలిపారు. అక్కడకు చేరుకున్న క్రాంతి గాయలుపాలైన కొండ చిలువను పట్టుకుని ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం స్థానిక పశు వైద్యశాలకు తీసుకు వెళ్లారు. కొండచిలువకు చికిత్స చేసిన పశు వైద్యులు తీవ్రంగా గాయం కావడంతో పదిరోజుల పాటు వైద్యం చేయాల్సి ఉందని తెలిపారు. అప్పటి వరకూ దాన్ని తాను సమరక్షిస్తూ, వైద్యం చేయిస్తానని క్రాంతి తెలిపారు. ఆ తర్వాత అధికారుల పర్యవేక్షణలో అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు. మరో కొండచిలువ కలకలం కాగా భీమడోలు శివారు లింగంపాడు గ్రామం వద్ద పంట కాలువలో కొండచిలువ కలకలం రేపింది. 10 అడుగుల కొండచిలువ చేపల వలలో చిక్కింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో, వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
యువతిని వేధించి.. కానిస్టేబుల్‌పై దాడిచేసి..
సాక్షి, పశ్చిమగోదావరి: జంగారెడ్డి గూడెంలో రోహిత్ అనే యువకుడు హరిప్రియ అనే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతిని కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశాడు. దీంతో రోహిత్‌పై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే రోహిత్ పోలీసులు తనపై అక్రమంగా కేసు పెట్టారంటూ నిన్న రాత్రి నుంచి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. ఈ క్రమంలో సెల్‌టవర్‌పై తేనేటీగలు ఒక్కసారిగా చెలరేగడంతో రోహిత్ కేబుల్ వైర్లు పట్టుకుని కిందకు దూకేశాడు. తేనేటీగలకు భయపడి స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో గాయపడిన రోహిత్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. -
వెలుగులోకి సీఐ అవినీతి బాగోతాలు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉంటూ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఐ నాగేశ్వరనాయక్ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సీఐ నాయక్ తమకు అన్యాయం చేశారంటూ ఆయన బాధితులు జిల్లా పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు గురువారం జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్లో ఎస్ఈబీ అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ నేతృత్యంలోని అధికారుల బృందం తనిఖీ నిర్వహించింది. జంగారెడ్డిగూడెం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇసుక అక్రమార్కులకు పెద్దఎత్తున లంచాలు తీసుకుని సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఎస్ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగిన విచారణపై ‘సాక్షి’ రాసిన కథనాలతో ఉన్నతాధికారులు తప్పనిసరి పరిస్థితిలో జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర్ నాయక్, ఎస్సై గంగాధర్‌ను వీఆర్‌లో పెట్టారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే విచారణ చేస్తున్న సందర్భంలో సీఐ అవినీతి బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలో నిందితుడిగా ఉన్న వ్యక్తి కారును ఇప్పటికీ సీఐ వినియోగిస్తున్నట్లుగా విచారణాధికారులు గుర్తించారు. సీఐపై మరికొన్ని ఆరోపణలు ఇవీ.. ఉన్నతాధికారుల అనుమతులు ఏమాత్రం లేకుండా జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఒక షెడ్ నిర్మాణంతోపాటు అనధికారికంగా సీఐ కార్యాలయంలో ఏసీలు పెట్టించడం వంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యలు చేపట్టినట్లు సీఐపై ఫిర్యాదులు వచ్చాయి. ►భీమడోలు సీఐగా పనిచేసే సమయంలో సీఐ నాయక్ తనను అక్రమంగా నిర్బంధించి, చేపల వ్యాపారస్తులకు చెందిన కేసులో ఇరికిస్తానంటూ బెదిరించి తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.40 లక్షలను అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల ఖాతాల్లోకి బదిలీ చేయించారని, సీఐ నాయక్‌పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఏలూరుకు చెందిన చేపల వ్యాపారి మామిడి వెంకట కృష్ణ అనే వ్యక్తి గురువారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ►సీఐ నాయక్ చింతలపూడి ఇన్చార్జ్ సీఐగా ఉంటూ చింతలపూడి ప్రాంతంలో మద్యం దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను అరెస్ట్ చేసి, వారినే ద్వారకాతిరుమలలో జరిగిన మద్యం దొంగతనం కేసులో కూడా నిందితులుగా పెట్టి, అసలైన నిందితులను వదిలేశారనే విషయం తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. ►జిల్లాలోని చింతలపూడి పోలీసుస్టేషన్లో నమోదైన ఓ కేసులో నిందితురాలిగా ఉన్న జిల్లా అధికారిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సదరు ఉద్యోగి నుంచి సీఐ పెద్దఎత్తున వసూళ్లు చేశారని గుర్తించి ఆ దిశగానూ విచారణ మొదలుపెట్టారు. మద్యం బాటిళ్ల మాయంపై క్రిమినల్ చర్యలు : ఎస్ఈబీ ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో పలు కేసుల్లో సీజ్చేసిన మద్యం బాటిళ్లు దురి్వనియోగం జరిగినట్లు గుర్తించామని దీనిపై సంబంధిత ఎస్హెచ్ఓపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ వెల్లడించారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. నాలుగు ఎన్డీపీ మద్యం కేసుల్లో బాటిళ్లను తారుమారు చేశారని పేర్కొన్నారు. మొత్తం 24 బాటిళ్లు తారుమారయ్యాయని వెల్లడించారు. అంతేగాక కేసులకు సంబంధం లేని అనధికార మద్యం బాటిళ్లు 51 క్వార్టర్ బాటిళ్లను పోలీస్‌స్టేషన్‌లో గుర్తించామన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించి మద్యం బాటిళ్లను తారుమారు చేసినట్లు, అక్రమాలు జరిగినట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఈ మద్యం కేసులు నమోదు జరిగిన సమయంలో ఉన్న ఎస్హెచ్ఓపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రస్తుత ఎస్హెచ్ఓను షరీఫ్ ఆదేశించారు. అంతేగాక అప్పటి ఎస్హెచ్ఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను నివేదించినట్లు కరీముల్లా షరీఫ్ చెప్పారు. -
రాయితో ఇల్లు.. ప్రదక్షిణతో పెళ్లి
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అంటుంటారు పెద్దలు. జీవితంలో ఈ రెండు ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు కావడంతోనే అలా అంటారేమో. రెండు కోర్కెలు నెరవేరాలని జీవితంలో ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ రెండు కోర్కెలు తీరే పుణ్యక్షేత్రాలు జిల్లాలోని జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉండటం విశేషమని భక్తులు చెబుతుంటారు. సొంతింటి కల నెరవేరాలన్నా, పెళ్లి కావాలన్నా ఈ క్షేత్రాలను దర్శిస్తే నెరవేరుతాయన్న నమ్మకం పూర్వం నుంచి వస్తోంది. అందులో ఒకటి జిల్లాలోని ప్రముఖ హనుమద్ క్షేత్రంగా విరాజిల్లుతోన్న గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి క్షేత్రం, మరొకటి జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం. ఆ వివరాలు ఇలా.. సాక్షి, పశ్చిమగోదావరి : జంగారెడ్డిగూడెం పట్టణంలో రాష్ట్ర రహదారిని ఆనుకుని ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి మెట్లమార్గంలో శ్రీమన్నారాయణ, జగదాంబ అమ్మవారు, వినాయకుడు, నటరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ దేవతామూర్తుల ఆలయాల ఎదుట భక్తులు రాయి మీద రాయి ఆపై మరో రాయి పేర్చి సొంతింటి కల నెవరవేరాలంటూ మొక్కుకుంటారు. ఈ క్షేత్రంలో రాయి మీదరాయి పెడితే సొంతింటిని నిర్మించుకునే భాగ్యం కలుగుతుందని పూర్వం నుంచి వస్తున్న భక్తుల నమ్మకం. అంజన్న సన్నిధిలో పెళ్లిళ్ల సందడి మద్ది ఆంజనేయస్వామి వారి క్షేత్రంలో స్వామివారి చుట్టూ చేసే ప్రదక్షిణలకు ప్రాముఖ్యత ఉంది. పెళ్లి కాని యువతీ, యువకులు ఈ క్షేత్రంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరిక తీరుతుందనే నమ్మకం. శని, ఆది, మంగళవారాల్లో అత్యధికంగా స్వామి వారి ప్రదక్షిణ మండపంలో ప్రదక్షిణలు చేస్తుంటారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఎక్కువగా విష్ణాలయాల్లో అత్యధికంగా వివాహాలు జరుగుతుంటాయి. కానీ పెళ్లిళ్ల సీజన్లో మద్ది అంజన్న సన్నిధిలో అధిక సంఖ్యలో వివాహాలు జరిగి అనేక జంటలు ఒకటి కావడం విశేషం. పూర్వం నుంచి భక్తుల నమ్మకం రాయి రాయి మీద పెట్టి స్వామి వారిని మొక్కుకుంటే సొంతింటి కల నెరవేరుతుందని భక్తులు నమ్మకం. ఈ సంప్రదాయం పారిజాతగిరిలో పూర్వం నుంచి వస్తోంది. కొల్లేపర చిట్టియ్య అనే భక్తుడు పారిజాతగిరి ఆలయ మెట్ల మార్గంలో దేవాతామూర్తుల విగ్రహ ప్రతిమలను ప్రతిష్ఠించారు. అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి రాయి మీద రాయి పేరుస్తుంటారు. – నల్లూరి రవికుమారాచార్యులు, ప్రధానార్చకులు, పారిజాతగిరి క్షేత్రం 108 ప్రదక్షిణలు చేయాలి మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పెళ్లికాని, యువతీ యువకులు, భక్తులు, విద్యార్థులు ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం పూర్వీకులు 27 నక్షత్రాలను గుర్తించారు. ఒకో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 27ని 4 పెట్టి గుణిస్తే 108 వస్తుంది. రాశులు 12గా విభజించారు. ఒకో రాశికి 9 పాదాలు కేటాయించారు. 12ని 9 పెట్టి గుణిస్తే 108 వస్తుంది. అందుకే 108 ప్రదక్షిణలు చేస్తే గ్రహ దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. –వేదాంతం వెంకటాచార్యులు, ప్రధానార్చకులు, మద్దిక్షేత్రం -
పశ్చిమ గోదావరిలో పెళ్లి బస్సు బోల్తా
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అరుంధతిపేటకు చెందిన 28 మంది తెలంగాణలోని మణుగూరులో జరిగే వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తు వలనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బామ్మ బాట.. బంగారం పంట
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: ఉద్యోగ విరమణ పొందాక ఆమె విశ్రాంతిని కోరుకోలేదు. వ్యవసాయం చేస్తూ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఎనిమిది పదుల వయస్సులోనూ సాగుబాట పట్టి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమే జంగారెడ్డిగూడెంకు చెందిన కేసనపల్లి లక్ష్మీకాంతం. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా తండ్రి శ్రీరాములు వ్యవసాయదారుడు కావడంతో చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయంపై ఆసక్తి ఏర్పడింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో 1954లో ఉపాధ్యాయురాలిగా విధుల్లో చేరాను. పోలవరం, కోండ్రుకోట, లక్ష్మీపురం, పైడిపాక, చేగొండపల్లి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి 1992లో ఉద్యోగ విరమణ పొందాను. బాధ్యతలన్నీ తీరిపోవడంతో జంగారెడ్డిగూడెం మండలం రామచర్లగూడెం సమీపంలో నాకున్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం ప్రారంభించాను. సేంద్రియ ఎరువులతోనే పామాయిల్, జామ, కొబ్బరి, కోకో వంటి పంటలు వేసి వ్యవసాయాన్ని ప్రారంభించాను. జామను ఒడిశాలో కటక్ వరకు ఎగుమతి చేసేవాళ్లం. ప్రస్తుతం పామాయిల్, కోకో పంటలు సాగుచేస్తున్నాను. పొలానికి నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం తదితర పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే వ్యవసాయమే నా ఆరోగ్య రహస్యం. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి పనులు ముగించుకుని పొలానికి వెళ్తుంటాను.’ -
జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభం
-
గిట్టుబాటు ధర కల్పించేలా చేస్తాం: పవన్ కల్యాణ్
జంగారెడ్డి గూడెం: రైతే రాజు అంటాం..అలాంటి రైతులు పంటలు వేసి గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకోవడం చూసి బాధ కలుగుతుందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెంలో రైతు సంఘాల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజకీయ నాయకుల ఇళ్లలో వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి గానీ రైతులకు మాత్రం కనీసం గిట్టుబాటు ధర ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ మనకు కనిపించే దేవుడు మాత్రం రైతే అని పేర్కొన్నారు. అన్ని పంటల రైతుల సమస్యలపై అక్టోబర్ 14 తర్వాత వారం రోజులు పాటు వ్యవసాయ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు తానూ రైతునేనని చెప్పారు. కష్టమంటే తెలియని వాళ్లు, సమస్యలపై అవగాహన లేని వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని వ్యాక్యానించారు. సంపద కొన్ని కుటుంబాలకే పరిమితమవ్వడం, ఆర్ధిక భద్రత అందరికీ లేకపోవడం, అసమానతలు చూసి రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయిందని, మన తర్వాతి తరాలైన సత్ఫలితాలు చూడాలంటే చిత్తశుద్ధితో పనిచేసే వ్యవస్థ కావాలని వ్యాఖ్యానించారు. -
వరద బీభత్సం :జల్లేరు వద్ద తెగిన రహదారి
-
945 గ్రాముల బంగారంతో ఉడాయించిన వ్యక్తి
జంగారెడ్డిగూడెం : బంగారు ఆభరణాలు తయారుచేసే ఒక వ్యక్తి బంగారు షాపు యజమానుల నుంచి బంగారం తీసుకుని ఉడాయించిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. 945 గ్రాముల బంగారం (సుమారు 118 కాసులు)తో అతను పరారయ్యాడు. ఎస్సై జీజే విష్ణువర్థన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మునసబుగారి వీధిలో బంగారు నగలు తయారు చేసే ముషరాఫ్ ముల్లా అనే వ్యక్తి అదే వీధిలోను, పట్టణంలో పలు బంగారు షాపుల యజమానుల నుంచి వస్తువులు తయారు చేసేందుకు బంగారం తీసుకున్నాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన అతను ఇక్కడకు వచ్చి కొన్నాళ్లుగా వస్తువులు తయారు చేస్తున్నాడు. సోమేశ్వర జ్యూయలర్స్ యజమాని కొనకళ్ల సురేష్‌బాబు బంగారు వస్తువులు తయారు చేయమని 203 గ్రాముల బంగారం ముషరాఫ్‌కు ఇచ్చినట్టు తెలిపారు. కొనకళ్ల ఉదయ్‌కుమార్ అనే బంగారు షాపు యజమాని 200 గ్రాములు, ఎస్కే జాని 103 గ్రాములు, తిరివీధి హనుమంతరావు 326 గ్రాములు, కె.మోహన్ 90 గ్రాములు, రమేష్ 23 గ్రాములు, మొత్తం 945 గ్రాముల బంగారం ముషరాఫ్‌కు ఇచ్చారు. అయితే అతడు ఆ బంగారాన్ని తీసుకుని ఈనెల 21వ తేదీ రాత్రి ఉడాయించాడు. 22, 23 తేదీల్లో అతడి కోసం గాలించిన యజమానులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. కాగా 2016లో కూడా ముషరాఫ్ ఇలాగే బంగారం తీసుకుని ఉడాయించగా, అప్పట్లో పోలీసులు పశ్చిమ బెంగాల్ వెళ్లి అతడిని అరెస్ట్ చేసి బంగారం రికవరీ చేశారు. అయితే ఇటీవల ముషరాఫ్ పట్టణానికి వచ్చి బంగారు షాపుల యజమానులను బతిమలాడి తాను పనిచేసుకుంటానని నమ్మించి మళ్లీ బంగారంతో ఉడాయించాడు. -
ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగం
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో ఆస్తిపన్ను సొమ్ము దుర్వినియోగమయ్యింది. ప్రా థమికంగా సుమారు రూ.75 వేలు స్వాహా అయినట్టు తేలింది. అయితే ఇది మరింత పెరగవచ్చని అంచనా. దీనిపై నగర పంచాయతీ అధికారులు విచారణ ప్రారంభించారు. వివరాలిలా ఉన్నా యి.. నగర పంచాయతీలో ఆస్తిపన్ను (ఇంటి పన్ను) వసూళ్లకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి సిబ్బంది సౌలభ్యాన్ని బట్టి ఒకరిని నియమిస్తుంటారు. ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఈ కౌంటర్లో పనిచేస్తుండగా రూ.75 వేలు దుర్వి నియోగం చేసినట్టు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. బయటపడిందిలా.. ఈ నెల 10న రెండో శనివారం సెలవు కావడంతో ఆస్తిపన్ను వసూలుకు అధికారులు కౌంటర్ ఏర్పాటు చేయలేదు. 12న సోమవారం ఆర్ఐ సీహెచ్ వెంకటేశ్వరరావు శుక్రవారం వరకు వసూలైన వివరాలు, రికార్డులు కంప్యూటర్లో పరిశీలించగా, శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో 8 ఇంటి పన్నులకు సంబంధించి రూ.75 వేల రశీదులు ఇచ్చినట్టు గుర్తించారు. అయితే దీనిపై ఆరా తీయగా స్థానిక చింతల బజారులోని ఓ ఈ–సేవ కేంద్రం నుంచి నగర పంచాయతీ వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి రశీదులు ఇచ్చినట్టుగా గుర్తించారు. దీనిపై ఆయన కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావుకు రిపోర్ట్ చేశారు. విచారించగా ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగి ఈ సేవ కేంద్రం ద్వారా రశీదులు జారీ చేసినట్టు తేలింది. క్యాన్సిలేషన్‌ను క్యాష్ చేసుకున్న వైనం నగర పంచాయతీ వెబ్సైట్లో ఆస్తిపన్నుల క్యాన్సిలేషన్‌కు ఆప్షన్ ఉంది. దీనిని ఆమె సొమ్ము చేసుకుంది. గతంలో కొందరు యజమానులు ఆస్తి పన్ను చెల్లించగా వారికి రశీదులు ఇచ్చి వెంటనే క్యాన్సిలేషన్ చేసి సొమ్మును స్వాహా చేసింది. అయితే ఇటీవల ఒకరిద్దరికి తాము ఆస్తిపన్ను చెల్లించినా డిమాండ్ నోటీసులు రావడంతో నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి ప్రశ్నిం చారు. దీంతో కంగారు పడిన ఆమె హడావుడిగా ఈ–సేవ కేంద్రం ద్వారా గత శనివారం రశీదులు జారీ చేసింది. అధికారులు ఆమెను నిలదీయడంతో భిన్నకథనాలు చెప్పుకొచ్చింది. అయితే చివరకు ఆమెకు కావాలి్సన ఒక కౌన్సిలర్‌తో మాట్లాడించడంతో సొమ్ము స్వాహా చేసినట్టు మంగళవారం ఒప్పుకున్నట్టు సమాచారం. ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన ఆమె నగర పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆత్మహత్యాయత్నం అవకతవకలకు పాల్పడిన ఆమె రాజమండ్రి గోదావరి రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జిపైకి చేరుకుని ఆత్మహత్యకు యత్నించగా ఓ కానిస్టేబుల్ చూసి పో లీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు అడిగి తెలుసుకుని జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె తండ్రి , నగర పంచాయతీ సిబ్బంది అక్కడకు వెళ్లి ఆమెను జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. సంఘటనపై నగర పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నాం నగర పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై విచారణ చేస్తున్నామని కమిషనర్ చోడగం వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రాథమికంగా 8 ఇంటి పన్నుల రశీదులకు సంబంధించి రూ.75 వేలు దుర్వినియోగమయ్యాయని, ఇంకా నిధులు ఏవైనా దుర్వినియోగమయ్యాయా అనే అంశంపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్టు చెప్పారు. -
ముగిసిన సాఫ్ట్‌బాల్ టోర్నీ
జంగారెడ్డిగూడెం : స్థానిక విద్యావికాస్ కళాశాలలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ నాలుగో సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. పురుషులు, మహిళల విభాగాల్లో ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగాయి. పురుషుల విభాగంలో గుంటూరు జిల్లా విజేతగా నిలిచింది. అనంతపురం ద్వితీయ స్థానం, వైఎస్సార్ కడప జిల్లా తృతీయ స్థానం సాధించాయి. మహిళల విభాగంలో అనంతపురం ప్రథమస్థానం, విజయనగరం, వైఎస్సార్ కడప ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ.. ఉత్తమ క్రీడాకారులను తయారు చేసుకోవాలి్సన బాధ్యత మనదేనన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. టోర్నీ నిర్వహణను చేపట్టిన విద్యావికాస్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. సహాయ సహకారాలు అందించిన మానవత స్వచ్ఛంద సంస్థ, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ను కూడా అభినందించారు. ప్రభుత్వం కూడా క్రీడాభిృద్ధికి కృషి చేస్తోందని రామ్మోహనరావు చెప్పారు. అనంతరం విజేతలకు పతకాలు, ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ మేడవరపు అశోక్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, డీఎస్డీఓ ఎస్.ఎ.అజీజ్, మానతవ జిల్లా అధ్యక్షుడు కె.జె.మాథ్యూ, కోశాధికారి తాడేపల్లి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు చావా రమేష్‌బాబు, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మిడత రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
జంగారెడ్డిగూడెంలో లాకప్ డెత్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఓ హోటల్ కార్మికుడు లాకప్ డెత్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని మాఫీ చేసేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలో వివిధ హోటళ్లలో ఒడిశాకు చెందిన బురిడి లక్ష్మణ్ (33) అనే వ్యక్తి వంట మేస్త్రిగా పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం అతడు జీవనోపాధి నిమిత్తం ఇక్కడకు వలస వచ్చాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత శుక్రవారం మఫ్టీలో ఉన్న పోలీసులు లక్ష్మణ్ వద్దకు వెళ్లి.. అతనిపై కేసు ఉందని, విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు రావాలని అడిగారు. అందుకు అతడు నిరాకరించడంతో ఆగ్రహించిన పోలీసులు మరికొందరు సిబ్బందిని తీసుకెళ్లి బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వారికి లక్ష్మణ్ సహకరించకపోవడంతో థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు సమాచారం. ఒక పోలీసు అధికారి, ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిపై ప్రతాపం చూపడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో కంగారుపడిన పోలీసులు లక్ష్మణ్ భార్య, మరికొందరిని పిలిచి అతడి ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించినట్టు సమాచారం. వెంటనే వారు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రాథమిక వైద్యం చేసి.. పరిస్థితి విషమించిందని చెప్పడంతో ఏలూరుకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లగా అక్కడ మృతి చెందినట్టు నిర్థారించారని సమాచారం. అయితే, లక్ష్మణ్ పోలీస్ స్టేషన్లోనే మరణించాడనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టే ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. లక్ష్మణ్ మృతదేహాన్ని అదే రోజున అంబులెన్స్‌లో ఒడిశాలోని అతడి స్వస్థలానికి పోలీసులే తరలించినట్టు చెబుతున్నారు. తన భర్తను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడని లక్ష్మణ్ భార్య రత్నం చెబుతోంది. కాగా, ఘటన నేపథ్యంలో అక్కడి ఎస్సై సెలవుపై వెళ్లినట్టు తెలిసింది. లాకప్ డెత్ కాదు : డీఎస్పీ పోలీసులు కొట్టడం వల్ల లక్ష్మణ్ చనిపోలేదని, అది లాకప్ డెత్ కాదని జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు పేర్కొన్నారు. లక్ష్మణ్ మద్యం సేవించి టైలరింగ్ షాప్‌పై దాడి చేశాడని వచ్చిన ఫిర్యాదు మేరకు అతణ్ణి స్టేషన్‌కు పిలిచి విచారించి పంపించివేశామన్నారు. పోలీసులు కొట్టడం వల్ల అతడు చనిపోయాడని బంధువులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. అతడు క్రానిక్ ఫ్రాంకియాసిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు జంగారెడ్డిగూడెంలో వైద్యం చేసిన డాక్టర్ చెప్పారన్నారు. దీంతో తానే ఏలూరులో ఆశ్రం ఆసుపత్రికి ఫోన్‌చేసి చెప్పి చికిత్స నిమిత్తం అతణ్ణి పంపించానని తెలిపారు. ఈ వ్యాధి ఎప్పుడు సీరియస్ అవుతుందో చెప్పలేమని, ఆ రోజు లక్ష్మణ్ 40కి పైగా వాంతులు చేసుకున్నట్టు వైద్యులు చెబుతున్నారని డీఎస్పీ వివరించారు. -
17 నుంచి పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు
జంగారెడ్డిగూడెం : గోకుల పారిజాత గిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మ న్ బిక్కిన సత్యనారాయణ, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 17న సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, అంకురారోహణ, వైనతేయ ప్రతిష్ట కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 18న పుణ్యాహవచనం, ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ట, కుంభస్థాపన, నిత్యహోమం, సాయంత్రం 8 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 19 న నిత్యహోమంతో పాటు నీరాజనం, తీర్థ ప్రసాదగోష్టి జరుగుతాయని తెలిపారు. రాత్రి 8 గంటలకు హనుమదుత్సవం చేపడుతున్నట్టు తెలిపారు. 20న శనివారం ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం, రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుందన్నారు. 21వ తేదీ ఆదివారం సాయంత్రం కోలాటం, భజన, విచిత్ర వేషధారణలతో గరుడ వాహన సేవ (గ్రామోత్సవం) నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 22 సోమవారం వసంతోత్సవం, చక్రస్నానం, మహా పూర్ణాహుతి, రాత్రికి గజవాహన సేవ, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు రుత్విక్కుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. 23 మంగళవారం ఉదయం ధృవమూర్తికి పంచామృతాభిషేకం, నవకలశ స్నపనము, రాత్రి ద్వాదశారాధ న, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా 17న ఉదయం 11 గంటలకు 108 మంది దంపతులతో సామూహిక కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ధర్మకర్తలు పొన్నాడ సత్యనారాయన, గుళ్లపూడి శ్రీదేవి, యిళ్ల రామ్మోహనరావు, మారిశెట్టి బాలకృష్ణ, తోట రామకృష్ణ, బోడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దంపతుల బలవన్మరణం కేసుపై డీఎస్పీ విచారణ
జంగారెడ్డిగూడెం : దంపతుల ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. ఈ నెల 20వ తేదీన స్థానిక రాజుల కాలనీలో ఆటోమొబైల్ వ్యాపారి చిక్కాల సీతారామరాజు(రాజా), అతని భార్య శ్రీదేవి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడే ముందు రాజా మూడు పేజీల సూసైడ్‌నోట్ రాశాడు. సూసైడ్ నోట్‌ను రాజా రాశాడా? లేక అతని భార్యతో రాయించి సంతకం పెట్టాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. రాజా చేతిరాతను, అతని భార్య శ్రీదేవి చేతిరాతను, సూసైడ్ నోట్‌ను హైదరాబాద్‌లోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. వీరిద్దరూ తాగిన విషం ఏమిటన్నది తెలియాల్సి ఉందని, ఇందుకోసం పోస్టుమార్టం నుంచి సేకరించిన నమూనాలను విజయవాడలో ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. రాజా రాసిన సూసైడ్‌నోట్‌లో తన తల్లికి పట్టణానికి చెందిన గొట్టుముక్కల రాయపరాజు, ఆయన భార్య విజయలక్ష్మి, కొడుకు వంశీ రూ.14 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఆ సొమ్ము కోసం చాలా మంది పెద్దల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని రాజా పేర్కొనడంతో సూసైడ్ నోట్లో పేర్కొన్న పెద్దలను కూడా విచారిస్తామని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉంటే ఆటోమొబైల్ షాప్ కోసం స్థానికంగా ఉన్న ఓ బ్యాంక్‌లో రాజా రుణం తీసుకున్నాడని, దానిని కూడా సక్రమంగా చెల్లించడం లేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. రాజా ఎవరెవరి వద్ద అప్పులు తీసుకున్నది కూడా విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే గొట్టుముక్కల రాయపరాజు, కొడుకు వంశీలను అరెస్ట్ చేశారు. -
పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బాలభోగ నివేదన, తీర్థప్రసాదగోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు జంగారెడ్డిగూడేనికి చెందిన మానికల వేంటేశ్వరరావు, దుర్గ దంపతులు, చింతపల్లి బాలకృష్ణ, చాందిని దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ బిక్కిన సత్యనారాయణ, సభ్యులు పొన్నాడ సత్యనారాయణ, గొట్టుముక్కల రాయపరాజు, అన్నప్రగడ వీరరాఘవులు, బోడ వేంకటేశ్వరరావు, మారిశెట్టి బాలకృష్ణ, యిళ్ల రామ్మోహనరావు, తోట రామకృష్ణ, అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
84 క్వింటాళ్ల రేష న్ బియ్యం పట్టివేత
జంగారెడ్డిగూడెం (చింతలపూడి) : పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులోని ఓ గోడౌ న్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 84 క్వింటాళ్ల రేష న్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎం.కేశవరావు తెలిపిన వివరాలు ప్రకారం బుట్టాయగూడెం రోడ్డులో ఒక గోడౌ న్ లో రేష న్ బియ్యం నిల్వ ఉన్నాయని తమకు అందిన సమాచారం మేరకు వీఆర్వో జ్యోతి పోలీసు సిబ్బందితో దాడులు చేశారన్నారు. నిల్వ ఉంచిన 50 కిలోల 168 బస్తాల రేష న్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణకు సివిల్ సప్లయిస్ డీటీకి అప్పగించినట్టు ఎస్సై కేశవరావు చెప్పారు. -
పరీక్ష బాగా రాయలేదని ఎం.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య
పెదవాలే్తరు (విశాఖ తూర్పు): పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైన ఎం.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కర్నేటి రాజేష్(22) ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం పరీక్ష రాశాడు. తర్వాత హాస్టల్‌కు చేరుకుని భోజనం చేశాడు. అనంతరం స్నేహితులతో కాసేపు గడిపిన రాజేష్ హాస్టల్ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. సాయంత్రం హాస్టల్లో తోటి విద్యార్థి చైతన్య వచ్చి తలుపుకొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ లోంచి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని రాజేష్ వేలాడుతున్నాడు. దీంతో విద్యార్థులు మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేష్ గదిలో పరిశీలించగా సూసైడ్ నోట్ లభించిందని ఎస్సై దాలిబాబు తెలిపారు. ఆ నోట్లో తన మరణానికి ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో తాను చదువులో రాణించలేకపోతున్నానని, భయస్తుడిని కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఉంది. ‘తమ్ముడూ.. అమ్మానాన్నలను నువ్వే చూసుకో’ అని కూడా ఉంది. జంగారెడ్డిగూడెంలో విషాదం జంగారెడ్డిగూడెం : రాజేష్ ఆత్మహత్యతో జంగారెడ్డిగూడెంలోని అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తొలుత రాజేష్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్ రావడంతో అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మి ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మరణవార్త తెలియడంతో తీవ్రంగా రోదిస్తున్నారు. బుధవారం రాత్రి రాజేష్ తండ్రి సత్యనారాయణతోపాటు బంధువులు సుమారు 20 మంది కార్లలో వైజాగ్ బయలుదేరి వెళ్లారు. రాజేష్ తండ్రి సత్యనారాయణ జీడిపిక్కల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. తన ఇద్దరు కొడుకులను చదివించుకుంటున్నాడు. రాజేష్ తమ్ముడు మధుబాబు డిగ్రీ పూర్తిచేసి స్థానిక వైనాట్ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. నా కొడుకు పిరికివాడు కాదు నా కొడుకు రాజేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. తొలి నుంచి బాగా చదివే విద్యార్థి. బీఫార్మసీ సీటు ఉచితంగా లభించింది. ఎంఫార్మసీలోనూ ఆంధ్రాయూని వర్సిటీలో సీటు లభించింది. ఇటీవలే సంక్రాంతికి ఇంటికి వచ్చాడు. 19న వైజాగ్ వెళుతూ రూ.6వేలు హాస్టల్ ఫీజు కట్టాలని అడగ్గా, రూ.7వేలు ఇచ్చి పంపాను. ఇంతలోనే నా కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం వచ్చింది. రాజేష్‌కు ఎటువంటి ఇతర వ్యవహరాలూ లేవు. సూసైడ్ నోట్ రాసినట్టు చెబుతున్నారు. దానిపై అనుమానం ఉంది. – కర్నాటి సత్యనారాయణ, రాజేష్ తండ్రి -
తెల్లవార్లూ కోడిపందేలు
జంగారెడ్డిగూడెం : సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగో రోజు రాత్రి ప్రారంభమైన కోడిపందేలు తెల్లవార్లూ పెద్దెత్తున ఫ్లడ్‌లైట్ల వెలుతురులో యథేచ్ఛగా సాగాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం తదితర మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము వరకు కోడిపందాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కొన్ని కోడిపందాల వద్దకు పోలీసులు వెళ్లినా కోడిపందాల నిర్వాహకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. మంత్రులు, ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఈ పందాలు నిర్వహించినట్టు సమాచారం. గతంలో భోగి, సంక్రాంతి, కనుమ రోజు మాత్రమే నిర్వహించేవారు. ఈ ఏడాది మాత్రం ముక్కమనాడు కూడా పందేలు నిర్వహించడం విశేషం. -
నట్టేట ముంచారు
జంగారెడ్డిగూడెం : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) అధికారులు తమను నట్టేముంచారని వర్జీనియా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం స్థానిక ఎస్బీఐ, ఎస్బీహెచ్ వద్ద వర్జీనియా పొగాకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దెత్తున ధర్నా నిర్వహించారు. ఏటా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు వర్జీనియా రైతులకు బ్యాంకులు రుణాలుగా ఇచ్చేవని అయితే ఈ ఏడాది రూ.3 లక్షలు ఇచ్చి మిగిలిన రుణాన్ని తర్వాత ఇస్తామని చెప్పి పంట చేతికి వచ్చే సమయంలో మోసం చేశారని ఆరోపించారు. రెండు నెలలుగా తిరుగుతున్నా.. గతేడాది బ్యార¯ŒSకు 25 క్వింటాళ్లు పంట అనుమతి ఇవ్వగా బ్యాంకులు ఐదు నుం చి ఆరు లక్షల రూపాయలు రుణాలు ఇచ్చాయని, ఈ ఏడాది బ్యార¯ŒSకు 30 క్వింటాళ్లు అనుమతి ఉన్నా మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెండు నెలలుగా బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించినా ఫలితం లేదన్నారు. అదనపు రుణం వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు బ్యాంకు అధికారుల నిర్ణయం శరాఘాతంగా తగిలిందన్నారు. 30 ఏళ్లుగా లేని నిబంధనలు పెట్టి రైతులను నట్టేట ముంచారని ఆందోళన చెందుతున్నారు. బకాయిలకు జమ రైతులకు మంజూరు చేసిన రూ.3 లక్షలూ గత బకాయిలకు బ్యాంకులు జ మచేసుకున్నాయని, దీంతో రైతు చేతికి కనీసం రూ.25 వేలు కూడా అందలేదని అన్నారు. పంట చేతికి వచ్చే సమయం లో ఎక్కువ ఖర్చులు ఉంటాయని కూ లీలకు పండుగ అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంటుందని, ఇటువంటి సమయంలో బ్యాంకర్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నా అనంతరం ఎస్బీహెచ్ చీఫ్ మేనేజర్ ఎంవీ సీతారామన్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని అక్కడ ఏవో పి.సత్యనారాయణకు తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. పొగాకు బోర్డు సభ్యులు గడ్డమణుగు సత్యనారాయణ, గంటశాల గాంధీ, జి.రవికుమార్, చెరుకూరి సందరరావు, వేగేశ్న రాధాకృష్ణరాజు, తెల్లం వెంకటేశ్వరరావు, గద్దే వీరకృష్ణ తది తరులు పాల్గొన్నారు. మభ్యపెట్టి మోసం చేశారు ఎస్బీఐ, ఎస్బీహెచ్ బ్యాంకులు వర్జీనియా రైతులను నట్టేట ముంచాయి. రుణాలు పెంచి ఇస్తామని మభ్యపెడుతూ ఇప్పుడు అకస్మాత్తుగా రుణం పెంచేది లేదని చేతులెత్తేశాయి. వర్జీనియా తోటలు మధ్యరకంగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పవు. మధ్యస్థంగా ఉన్న, చేతికి వచ్చే పంట దశలో ఉన్న రైతులు నష్టపోతారు. –గడ్డమణుగు సత్యనారాయణ, పొగాకుబోర్డు సభ్యుడు ఆత్మహత్యలే శరణ్యం వర్జీనియా రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. ఇప్పటివరకు రుణాలు పెంచి ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ఇవ్వలేమని ప్రకటించారు. దీంతో వర్జీనియా రైతులంతా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. అదంతా కోల్పోవాల్సి వస్తోంది. –గంటశాల గాంధీ, వర్జీనియా పొగాకు రైతు -
ఎర్రకాలువ నీటి మళ్లింపునకు ప్రతిపాదనలు
ఏలూరు (మెట్రో) : జంగారెడ్డిగూడెం పట్టణ ప్ర జల దాహార్తిని తీర్చడానికి ఎర్రకాలువ ప్రాజెక్ట్ నుంచి నీటిని మళ్లించి మంచినీటి పథకాన్ని అమలు చేసే ందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 26 సమస్యలపై ప్రజలు ఫోన్లో తెలపగా ఆయన స్పందించారు. చింతలపూడి మండలం రేచర్లకు చెందిన మద్దిపాటి శ్రీను ఫోన్లో మాట్లాడుతూ పశువు దాణా ఖర్చుతో కూడుకోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పగా రూ.10 లక్షల విలువైన దాణా తయారీ పరిశ్రమ స్థాపనకు అనుమతిస్తామని కలెక్టర్ సమాధానమిచ్చారు. ఏలూరుకు చెందిన పైడేటి రఘు మాట్లాడుతూ కన్యకాపరమేశ్వరి సత్రం వద్ద భారతి పాఠశాలలో మరుగుదొడ్డి సదుపాయం లేక చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణానికి విద్యాశాఖకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణమే మరుగుదొడ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఏజేసీ షరీఫ్, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, ఉద్యాన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, ఎల్డీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం రామప్రభు పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనకు సహకరించాలి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం నెలకొల్పాలని, సకాలంలో అనుమతులు ఇస్తేనే పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. కలెక్టరేట్లో పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు వచ్చిన 81 దరఖాస్తులను ఎందుకు పెం డింగ్‌లో పెట్టారని ప్రశ్నించారు. సింగిల్ విండో విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. పనులు వేగిరపర్చాలి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లలో భవనాల నిర్మాణ పనులను వేగిరపర్చాలని నాబార్డు, ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నాబార్డు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి నెలాఖరుకు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి
జంగారెడ్డిగూడెం : రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించామని ఏలూరు రేంజ్ డీఐజీ పి.వి.రామకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఓ ప్రణాళిక రూపొందించనున్నట్టు వివరించారు. దీనికోసం ఆర్అండ్బీ, హైవే అథారిటీ, ఇంజనీరింగ్ అధికారుల సహకారం కూడా తీసుకోనున్నట్టు చెప్పారు. వాహన చోదకులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఐజీ వెల్లడించారు. ఏలూరు రేంజ్ పరిధిలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదని డీఐజీ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు వైపు అక్కడక్కడ మావోయిస్టులు ఉన్నారని, చత్తీస్‌గఢ్ నుంచి వీరు వచ్చినట్లు సమాచారం ఉందని వివరించారు. ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో వారు ప్రతీకార చర్యలకు పూనుకునే అవకాశం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. మావోయిస్టుల కదలికపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో కమ్యునిటీ పోలీసు వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్ మాట్లాడుతూ కోడిపందేలపై త్వరలో ప్రత్యేక వివరణ ఇస్తామన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులు అందిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎం.కేశవరావు, ట్రాఫిక్ ఎస్సై ఆనందరెడ్డి పాల్గొన్నారు. -
ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్
జంగారెడ్డిగూడెం : స్థానిక బైపాస్ రోడ్డులో బుధవారం రాత్రి వాహనాలను ఆపి పోలీసులమని బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని జంగారెడ్డిగూడెం ఎస్ఐ ఎం.కేశవరావు సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ కథనం ప్రకారం.. అదిలాబాద్ జిల్లా అసీఫాబాద్ మండలం టి.నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ సీహెచ్ రాము, కడియం నుంచి నాగపూర్‌కు మొక్కలను రవాణా చేస్తున్నారు. స్థానిక బైపాస్ రోడ్డులో ఎస్సార్ బంక్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి తాము పోలీసులమని బెదిరించి లారీకి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేవని, తమకు కొంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ పోలీసులు తాడేపల్లిగూడేనికి చెందిన కలవచర్ల నాగవెంకట రజనీష్, స్థానిక పేరంపేట రోడ్డులో నివశిస్తున్న మల్లవరపు దుర్గాప్రసాద్, పేరంపేటకు చెందిన చదలవాడ కాంతారావును అరెస్ట్ చేశారు. -
తల్లిపై తనయుడి దాడి: పరిస్థితి విషమం
ఏలూరు: జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లిపై తనయుడు దాడిచేసిన సంఘటన శుక్రవారం అక్కంపేట గ్రామంలో చోటుచేసుకుంది. పులపాకుల వెంకటలక్ష్మిపై ఆమె కుమారుడు రామకృష్ణ దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బస్సెక్కుతుండగా చోరీ
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్‌కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పడంతో వారు బస్సును పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. -
బస్సెక్కుతుండగా చోరీ
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్‌కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పడంతో వారు బస్సును పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. -
బస్సెక్కుతుండగా చోరీ
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు చోరీకి గురయ్యా యి. బాధితురాలు షేక్ షమీల, ఆమె భర్త అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్ వేదాంతపురం హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ జంగారెడ్డిగూడెంలో నివాసముంటున్నారు. శనివా రం సాయంత్రం అజీజ్, ఆయన భార్య షమీల, ఇద్దరు పిల్లలతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు జంగారెడ్డిగూడెం ఆ ర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. 27 కాసుల బంగారు నగలు, రూ.30 వేల నగదు హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచి షమీల భుజానికి తగిలించుకున్నారు. భద్రాచలానికి చెందిన ఆర్టీసీ బస్సు రాజ మండ్రి నుంచి జంగారెడ్డిగూడెం బ స్టాండ్‌కు రాగా షమీల బస్సు ఎక్కారు. మిగిలిన సామాన్లు బస్సు ఎక్కించిన తర్వాత హ్యాండ్ బాగ్ తెరిచి ఉండటాన్ని గమనించి కంగారుగా చూడగా బంగారు నగలు, నగదు కనిపించలేదు. విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పడంతో వారు బస్సును పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. అక్కడ పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. షమీల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. -
సృజనను వెలికితీసేందుకే ‘ఇన్స్పైర్’
జంగారెడ్డిగూడెం : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా ప్రతిష్టాత్మకంగా ఇన్‌సె్పౖర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఇక్కడ నిర్వహించే సైన్స్ ఫెయిర్‌కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు హాజరవుతారని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సైన్స్‌ఫెయిర్‌ను రాష్ట్రమంత్రి పీతల సుజాత ప్రారంభిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా విద్యా డివిజన్లు ఎప్పుడు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించాలో షెడ్యూల్ ఇచ్చామని, అందరూ వారికిచ్చిన షెడ్యూల్ ప్రకారం సైన్స్‌ఫెయిర్‌లో హాజరుకావాలన్నారు. సైన్స్‌ఫెయిర్‌ను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన వక్తృత్వ, వ్యాసరచన పోటీలు , 18వ తేదీన క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజులూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 18వ తేదీ సాయంత్రం నిర్వహించి ముగింపు ఉత్సవంలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు. ఈ నెల 29న టీఎల్ఎం ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్‌వాష్ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఆ రోజు సైన్స్ ఉపాధ్యాయులంతా విధిగా విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నాం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్య బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేషన్‌లో ఒక సబ్జెక్టు కంప్యూటర్ విద్య పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డీఈవోడబ్ల్యూజీ డాట్ ఆర్గ్ వెబ్సైట్లో ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20వ తేదీన దరఖాస్తులు పరిశీలించి అదే రోజు నియామకాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎంఈవోలు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
సృజనను వెలికితీసేందుకే ‘ఇన్స్పైర్’
జంగారెడ్డిగూడెం : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా ప్రతిష్టాత్మకంగా ఇన్‌సె్పౖర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఇక్కడ నిర్వహించే సైన్స్ ఫెయిర్‌కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు హాజరవుతారని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సైన్స్‌ఫెయిర్‌ను రాష్ట్రమంత్రి పీతల సుజాత ప్రారంభిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా విద్యా డివిజన్లు ఎప్పుడు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించాలో షెడ్యూల్ ఇచ్చామని, అందరూ వారికిచ్చిన షెడ్యూల్ ప్రకారం సైన్స్‌ఫెయిర్‌లో హాజరుకావాలన్నారు. సైన్స్‌ఫెయిర్‌ను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన వక్తృత్వ, వ్యాసరచన పోటీలు , 18వ తేదీన క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజులూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 18వ తేదీ సాయంత్రం నిర్వహించి ముగింపు ఉత్సవంలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు. ఈ నెల 29న టీఎల్ఎం ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్‌వాష్ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఆ రోజు సైన్స్ ఉపాధ్యాయులంతా విధిగా విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నాం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్య బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేషన్‌లో ఒక సబ్జెక్టు కంప్యూటర్ విద్య పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డీఈవోడబ్ల్యూజీ డాట్ ఆర్గ్ వెబ్సైట్లో ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20వ తేదీన దరఖాస్తులు పరిశీలించి అదే రోజు నియామకాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎంఈవోలు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
'న్యాయం జరిగేవరకూ సీఎంను వదిలిపెట్టం'
-
'న్యాయం జరిగేవరకూ చంద్రబాబును వదిలిపెట్టం'
ఏలూరు : చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓ పక్క డబ్బులు లేవంటూనే సీఎం మరోవైపు విమానాల్లో విదేశాలకు వెళుతున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో బుధవారం వైఎస్ జగన్ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాల్లో విదేశాలకు వెళ్లడం కాదని, రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు విస్మరించారన్నారు. రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు రావటం లేదని, మరోవైపు పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని వైఎస్ జగన్ అన్నారు. రుణాలపై బ్యాంకులు రూపాయిన్నర నుంచి రెండు రూపాయిలు అపరాధ రుసుం వసూలు చేస్తున్నాయని, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటివరకూ పొగాకు కొనుగోళ్లు చేపట్టలేదని వైఎస్ జగన్ అన్నారు. జులై వచ్చినా సగం పొగాకు కూడా కొనుగోలు చేయకపోవటం దారుణమన్నారు. జిల్లాలో ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని మండిపడ్డారు. ఒక్క పొగాకు రైతులే కాదని, వరి నుంచి పామాయిల్ రైతుల వరకూ అందరి పరిస్థితి ఇదేనన్నారు. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. గిట్టుబాటు ధర రాక రైతులందరూ అవస్థలు పడుతున్నారన్నారు. ఎన్నికలు ముందు చంద్రబాబు ఏం చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఆయన చేస్తున్నారో చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడితే తాను రూ.5వేల కోట్లతో పెడతానని చంద్రబాబు చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆ విషయాన్ని మరచిపోయారని ధ్వజమెత్తారు. రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. కొత్త రుణాలు రాక, పాత రుణాలు రెన్యువల్ కాక రైతులు కష్టాల్లో కూరుకుపోయారన్నారు. పొగాకుకు రూ.20 బోనస్ ఇస్తామని చెప్పి, కేవలం పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.70 లక్షలు ముష్టి వేశారని వైఎస్ జగన్ అన్నారు. పొగాకు ఉత్పత్తిని 65 మిలియన్ క్వింటాళ్ల నుంచి 35 మిలియన్ క్వింటాళ్లకు తగ్గించారని ఆయన వ్యాఖ్యానించారు. పొగాకు కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. స్థిరీకరణ నిధిని తీసుకొచ్చేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. అప్పుడైనా పొగాకు బోర్డు స్పందించి, రైతులకు న్యాయం చేస్తుందని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో పొగాకకు కనీసం రూ.165 మద్దతు ధర లభిస్తే...చంద్రబాబు గత ఏడాది 114 రూపాయలే ఇచ్చారన్నారు. అలాగే పామాయిల్ విషయానికి వస్తే వైఎస్ఆర్ హయాంలో రూ.10 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కి పడిపోయిందన్నారు. ఉత్పత్తి ధర పెరుగుతు ఉంటే, మద్దతు ధర మాత్రం తగ్గుతోందన్నారు. నాయకులు మాట మీద నిలబడాలని, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలన్నారు. లేకుంటే చంద్రబాబు ప్రతి ఒక్కరికీ విమానం లేదా కారు కొనిస్తానంటారని ఎద్దేవా చేశారు. మాట నిలబెట్టుకోకపోతే నిలదీసే పరిస్థితి రావాలని, అప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. ప్రాజెక్టులకు పరిహారం విషయంలోనూ చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పట్టిసీమ కింద ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తే, చింతలపూడి కింద రూ.12 లోలే ఇస్తున్నారన్నారు. రైతులు కొట్టుకోవాలి, ఉద్యమాలు రావాలి...ప్రాజెక్టులు కట్టకుండా కాలయాపన చేయాలనేది చంద్రబాబు ఉద్దేశమన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ చంద్రబాబు వదిలిపెట్టమని, రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
పొగాకు రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి
జంగారెడ్డిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఆయన జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా పొగాకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లో క్వాలిటీ పొగాకుకు కనీస ధర ఇవ్వడం లేదని రైతులు ...వైఎస్ జగన్ వద్ద వాపోయారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని కూడా తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిపై పొగాకు బోర్డు అధికారులను నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
బంగారంతో ఉడాయించిన వ్యాపారి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలో నగలు తయారు చేసిస్తానని బంగారంతో ఉడాయించిన వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన ముషారఫ్ ముల్లా అనే వ్యక్తి జంగారెడ్డిగూడెంలో ఎనిమిదేళ్లుగా ఉంటున్నాడు. బంగారు నగలు తయారు చేసిస్తూ స్థానికంగా నమ్మకంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నగలు చేసి ఇమ్మంటూ పలువురు ఇచ్చిన సుమారు కేజీ బంగారంతో గత మార్చిలో అకస్మాత్తుగా మాయమయ్యాడు. కొద్ది రోజుల అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ముషారఫ్ ముల్లా పశ్చిమబెంగాల్లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని జంగారెడ్డిగూడెం తీసుకువచ్చారు. అతని నుంచి సుమారు 590 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు పంపనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) : జంగారెడ్డి గూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డు రూములో అనధికారికంగా ఉన్న రూ.14వేలు, బి.శ్రీనివాస్ అనే దస్తావేజు లేఖరి వద్ద రూ.1.03 లక్షలు, మరో ఏడుగురు దస్తావేజు లేఖరుల వద్దనున్న రూ.62వేలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని సోదాలకు నేతృత్వం వహించిన ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. -
జంగారెడ్డిగూడెంలో ఐదుగురు దొంగలు అరెస్ట్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 57 కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్యాయత్నం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భాస్కర్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని... నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంత కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మంటలార్పి... ఆతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : నలుగురు మహిళల మృతి
-
ఆటో బోల్తా : నలుగురు మహిళల మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శనివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. గోకుల తిరుమల పారిజాతగిరిపై ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా.... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోకుల తిరుమల పారిజాతగిరిపై కొలువైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని సదరు మహిళలు ఆటోలో కొండ దిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. -
4,500 రూపాయల చేప!
ఇది ఆషామాషీ చేప కాదు. ఎన్నాళ్లు పెరిగిందో తెలీదుగానీ.. ఏకంగా 40 కేజీల బరువుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో గురువారం మత్స్యకారుల వలకు చిక్కింది. జలాశయంలోకి వేటకు వెళ్లిన గంగాధరరావు, ఘంటశాల లోకేష్ విసిరిన వలలో ఈ భారీ చేప పడింది. సుమారు 3 అడుగుల పొడవున్న ఈ చేప 40 కేజీల బరువు తూగింది. దీనిని కొనేందుకు వినియోగదారులు ఎగబడ్డారు. ఒక ఆసామి రూ. 4,500 చెల్లించి దీనిని దక్కించుకున్నాడు. -జంగారెడ్డిగూడెం రూరల్: -
నాన్నా... నీ కోరిక మేరకు...
జంగారెడ్డిగూడెం రూరల్: తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆ ఐదుగురు కుమార్తెలు ఆయనకు అంతిమ సంస్కారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన తెలుగుదేశం నాయకుడు మట్టా నాగేశ్వరరావు (55) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. నాగేశ్వరరావుకు కొడుకులు లేరు. తన మరణానంతరం మీరే తలకొరివి పెట్టాలని ఆయన తన ఐదుగురు కుమార్తెలను కోరారు. తండ్రి కోరిక మేరకు పెద్ద కుమార్తె జక్కుల సుజాత చితికి నిప్పంటించగా, మిగిలిన నలుగురు కుమార్తెలు.. విజేత, కుమారి, సుబ్బలక్ష్మి, స్వాతి పాడెను మోసి అంత్యక్రియలు నిర్వహించారు. -
'అన్న' ను అవమానించిన తెలుగు తమ్ముళ్లు
-
ఫోన్ చేస్తే చాలు
జంగారెడ్డిగూడెం : మధ్యాహ్నం 3.45 గంటలైంది. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తరగతులు ముగిసి విద్యార్థులు బయటకొచ్చే సమయమది. అక్కడేమైనా ర్యాంగింగ్ జరుగుతోందా.. విద్యార్థినులు ఆకతాయిల బెడదను ఎదుర్కొంటున్నారా.. అనే విషయాలను తెలుసుకునేందుకు డీఎస్పీ జె.వెంకటరావు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా విద్యార్థులు, విద్యార్థినులు, అధ్యాపకులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. డీఎస్పీ వెంకటరావు వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది. డీఎస్పీ : ఏమ్మా.. ఏం చదువుకుంటున్నారు. సీహెచ్ ఉష, విద్యార్థిని : డీసీఈ ఫైనలియర్ చదువుతున్నా సార్. డీఎస్పీ : మీది ఏ ఊరు. ఎం.సుధావలి : మేమంతా విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం సార్. డీఎస్పీ : మరి ఎక్కడ ఉంటున్నారమ్మా. ఎం.కల్యాణ్‌దుర్గ : హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం. డీఎస్పీ : మీకేమైనా ఇబ్బందులున్నాయా. విద్యార్థినులు : లేవు సార్. అంతా బాగానే ఉంది. డీఎస్పీ : మీ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతోందా. ఎ.అనూష : లేదు సార్. డీఎస్పీ : ర్యాగింగ్ నివారణ కమిటీలు ఉన్నాయా టి.స్నేహ : ఉన్నాయండి. ఆ కమిటీ పెద్దలు సమస్యలు లేకుండా చూస్తున్నారు. డీఎస్పీ : మీరు కాలేజీకి వచ్చేప్పుడు.. హాస్టల్ వెళ్లేప్పుడు ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారా. సీహెచ్.ఉమ : లేదు సార్. డీఎస్పీ : మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా 100కు లేదా నా నంబర్ 94407 96626కు ఫోన్ చేసి చెప్పండి. పోలీసులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు. పి.రాజేశ్వరి : థాంక్యూ సార్. మాకు ఎలాంటి సమస్య వచ్చినా మీ దృష్టికి తీసుకువస్తాం. డీఎస్పీ : మీ హాస్టల్లో సమస్యలున్నాయా. అక్కడకు వచ్చి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా. పి.రాజేశ్వరి : లేవండి. అక్కడ సంరక్షకులు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీఎస్పీ : మాస్టారూ.. మీ ఈ కాలేజీలో ఏ బాధ్యతలు చూస్తున్నారు. ఎన్‌జేకే నరేంద్రకుమార్ : నేను ఈ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నాను. డీఎస్పీ : కళాశాల లోపల, బయట ఆకతాయిల బెడద ఉంటున్నట్టు మీ దృష్టికి వచ్చిందా. ప్రిన్సిపాల్ : లేదండి. తరగతులు ప్రారంభమయ్యే సందర్భంలోనే విద్యార్థులకు ఈవ్‌టీజింగ్ వల్ల కలిగే అనర్థాలను, మంచి స్నేహితులుగా ఉంటే కలిగే లాభాలను వివరిస్తున్నాం. ఈ విషయాలను తరచూ గుర్తు చేస్తుంటాం. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉంచుతున్నాం. ఇప్పటివరకు మా కాలేజీలో ఎటువంటి ఇబ్బంది రాలేదు. డీఎస్పీ : విద్యార్థినుల విషయంలో మీరు తీసుకుంటున్న చర్యలేమిటి. ఎం.ఉషారాణి, రసాయన శాస్త్ర అధ్యాపకులు: మా కాలేజీ విద్యార్థినులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అప్పుడప్పుడూ పోలీ సు శాఖ అధికారులు కూడా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. నిర్భయంగా ఫిర్యాదు చేయండి కళాశాలలకు వచ్చి చదువుకునే విద్యార్థినీ, విద్యార్థులకు చక్కని వాతావరణం అవసరం. ముఖ్యంగా చాలామంది ర్యాగింగ్ భూతానికి భయపడుతుంటారు. ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం. అవసరమైతే కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. భారీ జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది. ఈ విషయాలను తెలుసుకుని విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలి. చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత చదువుల వైపు సాగాలి. కళాశాలకు వచ్చే సమయంలో బయట వ్యక్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎవరూ భయపడొద్దు. నిర్భయంగా విద్యార్థులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలి. బాధితులకు అన్నివిధాలుగా సహకారం అందిస్తాం. ప్రతి ఒక్క విద్యార్థి చట్టంపై అవగాహన పెంచుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. - జె.వెంకటరావు, డీఎస్పీ, జంగారెడ్డిగూడెం -
హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎస్సీ బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు విద్యార్థునులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతి గృహం ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రెండు రోజుల క్రితం అదృశ్యమైయ్యారని హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కళాశాలలో వారు ఇంటర్ చదువుతున్నారని వార్డెన్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికల అదృశ్యంపై సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు హస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులు అదృశ్యమైతే వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వారు వార్డెన్‌ను ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మోరికి విభజన సెగ
జంగారెడ్డిగూడెం :గిరిజనుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న గుబ్బల మంగమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువైంది. దట్టమైన అటవీ ప్రాంతం మధ్య కొలువై పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ఆలయం వాస్తవానికి మన జిల్లాలోని బుట్టాయగూడెం మండల పరిధిలో ఉంది. గతంలో అమ్మవారి పాత ఆలయం ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేది. అది శిథిలం కావడంతో పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో కొత్త ఆలయం నిర్మించారు. ఈ ప్రాంతం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉన్నా.. అమ్మవారు మాత్రం ఖమ్మం జిల్లాకు చెందిన వారని, అందువల్ల ఆలయం తమకే చెందుతుందని ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజనులు వాదిస్తున్నారు. కొండరెడ్డి గిరిజనులు, కోయ తెగకు చెందిన గిరిజనుల మధ్య పొడసూపిన ఈ వివాదం ముదిరి రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారింది. వివాదం ఇలా మొదలైంది గుబ్బల మంగమ్మ గుడి నిర్వహణలో విషయమై తలెత్తిన వివాదం గిరిపుత్రులైన కొండరెడ్లు, కోయ తెగల మధ్య చిచ్చు రగులుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయం వ్యక్తంగా వెలసినగుబ్బల మంగమ్మను గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతల్లిగా, వరాలిచ్చే అమ్మగా పేరుండటంతో ఆలయానికి మైదాన ప్రాంతాల నుంచి సైతం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల తాకిడి సైతం పెరుగుతోంది. ఇదే స్థారుులో ఆలయూనికొచ్చే ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఈ మొత్తాన్ని ఆలయ నిర్వహణతోపాటు బుట్టాయగూడెం మండలం కామవరం, మోతుగూడెం, పందిరి మామిడిగూడెం గ్రామాలకు చెందిన కొండరెడ్లు ఆ గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. ఇందుకోసం ఆలయ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని గోగులపూడి, కన్నాయిగూడెం గిరిజనులు సైతం ఆలయ ఆదాయంలో సమాన వాటా పొందుతూ గ్రామాల అభివృద్ధికి వినియోగించేవారు. ఇదిలావుండగా, 1996లో ఆలయూన్ని దేవాదాయ శాఖకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయూన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించడంతో దేవాదాయ శాఖ వెనక్కి తగ్గింది. అప్పటినుంచి ఆలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోనే ఉంది. ఆలయ ఆదాయూన్ని పాత పద్ధతిలోనే ధూపదీప నైవేద్యాలతోపాటు ఆ గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తూ వస్తున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోగా, తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అశ్వారావుపేట మండలం గోగులపూడి, కన్నాయిగూడెం గ్రామాలకు ఇస్తున్నట్టుగానే తమ గ్రామాలకూ ఆల య ఆదాయంలో సమాన వాటా ఇవ్వాలంటూ అదే మండలంలోని రామచంద్రపురం, వేపులపాడు గ్రామస్తులు పట్టుబడుతున్నారు. దీంతో అశ్వారావుపేట మండల పరిధిలోని గిరిజనులకు, బుట్టాయగూడెం మండల పరిధిలోని గిరిజనులకు మధ్య వివాదాలు మొదలయ్యూయి. రెండు ప్రాంతాల గిరి జనులు కొట్లాటలకు దిగి పోలీసు కేసులు పెట్టుకునే స్థారుుకి విభేదాలు పెరిగారుు. దీంతో అశ్వారావుపేట, బుట్టాయగూడెం మండలాలకు చెందిన పోలీ సులు, అటవీ శాఖ అధికారులు గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సరిహద్దు ఏ ప్రాంతానికి చెందుతుందో కచ్చితంగా చెప్పాలని అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం, రామచంద్రపురం గ్రామాల గిరిజనులు పట్టుబట్టారు. దీంతో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు పశ్చిమగోదావరి జిల్లా ఐటీడీఏ అధికారులతో ఇటీవల చర్చలు జరిపారు. అమ్మవారి ఆలయం ఖమ్మం జిల్లాకే చెందుతుందంటూ అక్కడి అధికారులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పటివరకూ గిరిజనులకే పరిమితమైన ఈ సమస్య కాస్తా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. ఆ ప్రాంతమంతా ‘పశ్చిమ’దే వివాదాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమై చర్చించగా, ప్రస్తు తం ఉన్న ఆలయంతోపాటు, అమ్మవారి పాత ఆల యం కూడా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉన్నట్టు తేలింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అశ్వారావుపేట మండల పరిధిలోని అటవీ ప్రాంతమంతా పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైందనే విషయూన్ని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా జిల్లా పరిధిలో ఉన్న కొత్త ఆలయంతోపాటు శిథిల మైన పాత ఆలయం కూడా మనకే చెందుతుందని రూఢీ చేశారు. ఇందుకు ఖమ్మం జిల్లా అధికారులు ససేమిరా అంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో భక్తులు అధికంగా వచ్చే ప్రతి మంగళవారం, ఆది వారం రోజుల్లో గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నారుు. ప్రస్తుత కార్తీక మాసంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తున్నారు. ఈ వివాదానికి వెంటనే పరిష్కారం దొరక్కపోతే ముదిరి పాకాన పడుతుందని, ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు రగిల్చే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 60 కింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీని సీజ్ చేసి... పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'తూర్పు, పశ్చిమ'లోకి ముంపు మండలాలు
హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్లలో ముంపు మండలాలను చేర్చింది. కుకునూరు, వేలూరుపాడు మండలాలను జంగారెడ్డిగూడెం డివిజన్లో కలిపింది. బూర్గంపాడులోని ఆరుగ్రామాలు కూనవరం, చింతూరు, సీఆర్పూర్, భద్రాచలం డివిజన్లోని గ్రామాలను రంపచోడవరం డివిజన్లో చేర్చినట్టు నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
జంగారెడ్డిగూడెం రూరల్ : అనుమానమో.. మరేదైనా కారణమో తెలీదుగానీ కట్టుకున్న భార్యను ఆమె భర్త గొడ్డలితో కిరాతకంగా నరికిచంపిన ఘటన జంగారెడ్డిగూడెం మండ లం చిన్నంవారిగూడెంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం సీఐ ఎం.అంబికాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుద్దే రాధ, ఏసురత్నం అనేవారికి 12ఏళ్ల క్రితం వివాహమైంది. చిన్నంవారిగూడెంలో నివాసం ఉంటున్న వీరిద్దరి మధ్య శనివారం రాత్రి ఘర్షణ తలెత్తింది. అర్ధరాత్రి దాటిన తరువాత రాధను ఆమె భర్త ఏసురత్నం గొడ్డలితో బలంగా నరికాడు. మెడ చాలావరకు తెగిపోవడంతో ఆమె రక్తపు మడుగులో కొట్టుకుని మరణించింది. హత్యచేసిన వెంటనే ఏసురత్నం పరారయ్యాడు. భార్యపై అనుమానంతోనే ఏసురత్నం హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం రాధ ఒక యువకునితో వెళ్లినట్టు ఏసురత్నం అనుమానిస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోందని సీఐ పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిన రాధ అదేరోజున అర్ధరాత్రి చింతలపూడిలో ఉంటున్న అక్క ఇంటికి చేరిందని సీఐ చెప్పారు. భార్యను బాగా చూసుకుంటానని చెప్పి భార్యను ఇంటికి తీసుకొచ్చిన ఏసురత్నం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని రాధ బంధువులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గిరిజన జిల్లాలో జంగారెడ్డిగూడెం లేదు
జంగారెడ్డిగూడెం :నూతనంగా ఏర్పాటు చేసే గిరిజన జిల్లాలో జంగారెడ్డిగూడెం మండలాన్ని విలీనం చేసే అంశం ప్రభుత్వ దృష్టిలో లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. బుధవారం ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ గిరిజన జిల్లాలో కలిపే మండలాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం అభిప్రాయ సేకరణ మాత్రమే చేపట్టారన్నారు. గిరిజన మండలాలతో మైదాన ప్రాంత మండలాలను కలిపే అవకాశం ఉండదని తెలిపారు. అలాకాకుండా జంగారెడ్డిగూడెంను గిరిజన జిల్లాలో కలపాల్సి వస్తే తప్పనిసరిగా కేబినెట్లో చర్చించాల్సి వస్తుందన్నారు. ఆ సమయంలో తామే ఆ ప్రతిపాదనలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తాం నామినేటెడ్ పదవుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చినరాజప్ప చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తామని, అన్నివిధాలుగా వారిని ఆదుకుంటామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో చోరీలు, ఇతర నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇక్కడ నేర పరిశోధన స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరగా, దీనిపై ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. కోర్టు భవనాల పరిశీలన శిథిలావస్థలో ఉన్న జంగారెడ్డిగూడెం కోర్టు భవనాలను ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మంగళవారం పరిశీలించారు. కోర్టు ఏర్పాటు చేసిన స్థలాన్ని ప్రభుత్వం ఇంకా అప్పగించలేదని, దీంతో నిధులు ఉన్నప్పటికీ నూతన భవనాలు నిర్మించుకోలేక శిథిలావస్ధలో ఉన్న భవనాల్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు గన్నమనేని శేఖర్, న్యాయవాదులు అచ్యుత శ్రీనివాసరావు, మాండ్రు మోహన్ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు గదులను పరిశీలించిన మంత్రులు సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉద్దండం ఏసుబాబు, కైకాల చంద్రశేఖర్, మాజీ బార్ అసోషియేషన్ అధ్యక్షులు నిమ్మగడ్డ రాంబాబు ఉన్నారు. సీసీ రోడ్లు, పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో రూ.5.45 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, రూ.3 లక్షలతో చేపట్టే పైప్‌లైన్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.14.80 లక్షలతో అదనపు తరగతుల భవనాల నిర్మాణ పనులకు చినరాజప్ప శంకుస్థాపన చేశారు. తహిసిల్దార్ కార్యాలయం సమీపంలో టీటీడీ కల్యాణ మండపం వద్ద లో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన 63కేవీ ట్రాన్స్ఫార్మర్ను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఆర్డీవో వి.మురళీమోహన్రావు, తహసిల్దార్ జేవీవీ సత్యనారాయణ, నగర పంచాయతీ కమిషనర్ వి.నటరాజన్, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంఈవో డి.సుబ్బారావు, టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు, నాయకులు షేక్ ముస్తఫా, రాజాన సత్యనారాయణ (పండు), దల్లి కృష్ణారెడ్డి, పెనుమర్తి రామ్‌కుమార్, అబ్బిన దత్తాత్రేయ, డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, సీఐ కె.అంబికాకృష్ణ పాల్గొన్నారు. -
'రెండేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధి చేస్తా'
జంగారెడ్డిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): ప్రజలకు అందుబాటులో ఉండడానికే జిల్లా పర్యటనలు చేపట్టినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల హామీలు నేరవేరుస్తామని చెప్పారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ జరుగుతుందన్నారు. కుటుంబానికి ఒక రుణమాఫీ మాత్రమే చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ముంపు బాధితుల్ని ఆదుకుంటామని హామీయిచ్చారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు. గిరిజన హక్కులు కాపాడే విధంగా మెరుగైన పునరావాసం కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌ను మించిన నాలుగు నగరాలను ఏపీలో నిర్మిస్తామని వాగ్దానం చేశారు. రాబోయే రెండేళ్లలో ఎవరూ ఊహించని అభివృద్ధి సాధిస్తానని చెప్పారు. తీరప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయడం, జిల్లాలోని దేవాలయాన్నింటిని అనుసంధానం చేస్తూ పర్యాటక అభివృద్ధి సాధించడం, జిల్లా అభివృద్ధిపై అధికారుల సూచనలను ఈ సందర్భంగా చంద్రబాబు స్వీకరించారు. -
మహిళను నరికి చంపిన వృద్ధుడు
జంగారెడ్డిగూడెం రూరల్ : క్షణికావేశంలో ఓ వృద్ధుడు మహిళను కత్తితో నరికి చంపిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బేతాళ సరస్వతి(45) స్థానిక ప్రధాన రోడ్డు పక్కన కిళ్లీకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటి పక్కనే అదే గ్రామానికి చెందిన వీరెంకి గంగరాజు(72) భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరిద్దరూ తరచూ ఒకరినొకరు దూషించుకుంటూ గొడవలు పడుతుంటారని స్థానికులు చెబుతున్నారు. సరస్వతి ఇంటికి.. గంగరాజు ఇంటి ముందు మరుగ్గా ఉండే స్థలం నుంచి నడిచే దారి ఉంది. బుధవారం సరస్వతి మనవరాలు ఈ దారి సమీపంలో బహిర్భూమికి వెళ్తుండగా గంగరాజు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన గంగరాజు కత్తితో సరస్వతి తల, మెడపై నరికాడు. అనంతరం కత్తితో నడుచుకుంటూ వెళ్లి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో లొంగిపోయూడు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుకుంటున్న సరస్వతిని బంధువులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, సీఐ అంబికా ప్రసాద్, ఎస్సై శ్రీహరి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు
జంగారెడ్డిగూడెం : రాష్ట్ర విభజన నేపథ్యంలో తన పరిధిలో నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.రేణుక తెలిపారు. సోమవారం రాత్రి ఆమె స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఎన్నికల నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను సీఐ జె.రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవిభజన నేపథ్యంలో చింతలపూడి శివారు గురుభట్లగూడెం, జీలుగుమిల్లి మండలం శివారు తాటియాకులగూడెం, అదేమండలంలోని రాచన్నగూడెం, సీతంపేట గ్రామాల్లో ఎక్సైజ్ చెక్‌పోస్టుల ఏర్పాటుకు అనుమతి లభించిందన్నారు. అయితే అక్కడ ఎంతమంది సిబ్బంది నియమించాలనేది ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు బెల్టుషాపుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 90 శాతం బెల్టుషాపులను అదుపుచేశామని చెప్పారు. బెల్టుషాపుల నివారణ నేపథ్యంలో నాటుసారా అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా నల్లబెల్లం అమ్మకాలపై కొరడా ఝులిపిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక నిఘా బృందాలను నియమించామన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో బూర్గుంపాడు, కుకునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమగోదావరి జిల్లాలో కలిసినప్పటికీ అవి ఏ పరిధిలోకి వస్తాయో స్పష్టమైన ఆదేశాలు అందలేదన్నారు. ప్రస్తుతం ఏలూరు నుంచి ఆ మూడు మండలాలకు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఎస్సై సుబ్రహ్మణ్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పరిధిలో పట్టుకున్న సుమారు 2వేల లీటర్ల నాటు సారాను ఆమె సమక్షంలో అధికారులు ధ్వంసం చేశారు. -
‘మొడియం’కు మొండిచేయి
జంగారెడ్డిగూడెం : చంద్రబాబు క్యాబినెట్లో చోటు దక్కించుకున్న 17 మంది మంత్రులకు బుధవారం శాఖలు కేటాయించడంతో పోలవ రం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు ఇక మంత్రి పదవి రానట్టేనని తేలిపోయింది. మొదటిసారి గెలుపొందిన శ్రీనివాసరావుకు గిరిజన సంక్షేమ శాఖ కేటాయిస్తారని అతని అనుచరులు చెబుతూ వచ్చారు. శ్రీనివాస్కూడా మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం రోజైన ఈ నెల 8 మధ్యాహ్నం వరకు మంత్రుల జాబితాల్లో శ్రీనివాసరావు ఉండొచ్చనే చర్చ సాగుతూనే ఉంది. మంత్రి వర్గంలో ఆయన పేరు లేదు. మంత్రి వర్గ విస్తరణలో శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కుతుందని అతని అనుచరులు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు రెండు మంత్రి పదవులను కేటాయించడంతో మరొకరికి అవకాశంలేదనే సంకేతాలు పార్టీ ఇచ్చినా ఈనెల 20 లోపు శ్రీనివాసరావు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తారని అతని అనుచరులు ఆశపడ్డారు. బుధవారం మంత్రులకు శాఖలు కేటాయింపులో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజవర్గంనుంచి గెలుపొందిన రావెల కిషోర్‌బాబుకు గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో మొడియంకు మొండిచెయ్యే అని పార్టీలో చర్చసాగుతోంది. అవశేష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ఎస్టీ శాసన సభ్యుడిగా ఎన్నికైన మొడియంకు గిరిజనసంక్షేమ శాఖ తప్పనిసరిగా దక్కుతుందని భావించిన అతని అనుయాయులు ఆ శాఖ వేరొకరికి కేటాయిచటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. శ్రీనివాసరావును శాసనసభ ఎస్టీ కమిటీ చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని అతని అనుయాయులు ఊరట చెందుతున్నారు. -
కేబినెట్లో చోటు ఎవరికో!
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : చంద్రబాబునాయుడు కేబినెట్లో జిల్లా నుంచి ఏ ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందోననే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తుండగా, వీరిలో ఇద్దరికి మాత్రమే పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు ఇప్పటికే చంద్రబాబు సుముఖత వ్యక్తంచేసినట్టు తెలిసింది. జిల్లా నుంచి సుజాతను ఎంపిక చేస్తే మరొకరికి మాత్రమే అవకాశం ఉంది. పోలవరం ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన మొడియం శ్రీనివాసరావుకు మంత్రి పదవి లభించవచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో 13 జిల్లాల్లో ఆపార్టీ తరుపున ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఈయన కాక పార్టీ సీనియర్ నాయకుడు బూరుగుపల్లి శేషారావు లేదా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కుగాని క్యాబినేట్లో చోటు దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే టీడీపీతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి కూడా తన కేబినేట్లో అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ జిల్లా నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పి.మాణిక్యాలరావు లేక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు దక్కుతుందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే ఇప్పటికే రేసులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురితో మొడియం శ్రీనివాసరావు పోటీ పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకు రెండు కేబినేట్ దక్కనున్నాయన్న సమాచారంతో ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు కేబినేట్లో ఒకొక్క మంత్రికి రెండు శాఖలు కేటాయించే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ రెండు శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకురావచ్చని అంటున్నారు. ఈ నేపధ్యంలో గతంలో ఎమ్మెల్యే అనుభవంతో పాటు, మహిళా ఎమ్మెల్యేగా పీతల సుజాతకే క్యాబినేట్లో ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. అలాకాకుండా గిరిజన సంక్షేమ శాఖ స్వయంగా పరిపాలన సాగించాల్సి వస్తే మొడియం శ్రీనివాస్‌కు మంత్రి పదవి లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నా మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని మాత్రం 12వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో కసరత్తు చేసేందుకే వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. -
జంగారెడ్డిగూడెంలో విజయమ్మ ప్రసంగం
-
చంద్రబాబుది నరకాసుర పాలన
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ :చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన నరకాసురుని పాలనను తలపించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా ఆదివారం జంగారెడ్డిగూడెంలోని తాండ్ర పాపారాయుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసిందన్నారు. వర్షాలు లేక తాగునీరు, సాగునీరు కోసం రైతులు, ప్రజలు అల్లాడిపోయారన్నారు. తానేదో గొప్ప పాలన సాగించినట్లు నేడు ప్రజాగర్జనలు పెట్టి ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు గుప్పిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రజాగర్జన సమయంలో జగన్మోహన్రెడ్డిని సైకోగా వర్ణించారని, అయితే విపరీత స్వభావం కలిగిన భయంకరమైన సైకో చంద్రబాబే అన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆందోళన చేస్తున్న రైతులను తుపాకులతో కాల్పించారని, అలాగే సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తుంటే గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. అలాగే దగ్గరకు చేరదీసి ఎంతో నమ్మకంతో తన కూతురినిచ్చి పెళ్లి చేసిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మహాఘనుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో, రైతులకు, పేదలకు ఏం మేలు చేశారో నిజాయితీతో చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వసనీయతకు మారుపేరు వైఎస్సార్ అయితే, నమ్మకద్రోహానికి మారుపేరు చంద్రబాబు అన్నారు. రెండుకళ్ల సిద్దాంతంతో నేటి రాష్ట్ర పరిస్థితికి కారణమయ్యారన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తూ ప్రజలపై పన్నుల మీద పన్నులు విధిస్తున్నారన్నారు. వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనికి చంద్రబాబు కూడా కారకుడే అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల మధ్యకు వస్తే తరిమికొట్టేందుకు సిద్దంగా ఉన్నారని బాలరాజు విమర్శించారు. వైఎస్సార్ పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో అందని వారు ఎవరూ లేరన్నారు. కాని కిరణ్‌పాలనలో పథకాలకు కొత్తపేర్లు పెడుతూ, తానేదో ప్రజాకర్షణ పథకాలను అమలు చేస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు జవసత్వాలు అందించిన వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బందులు పాల్జేసింది టీడీపీతో కుమ్మక్కైన నేటి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. సోనియా అనాలోచిత చర్యల వల్లే రాష్ట్రం విడిపోయే దుస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రాన్ని సమైఖ్యంగాఉంచేందుకు జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనివాసరావు, మండల కన్వీనర్ నులకాని వీరాస్వామినాయుడు అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు పోల్నాటి బాబ్జి, బీవీఆర్‌చౌదరి, కొయ్యరాజారావు రెడ్డి, రావూరి కృష్ణ, అచ్యుత రామయ్య, మిడతా రమేష్, బాలస్వామి, బి.వెంకటేశ్వరరావు, కేమిశెట్టిమల్లిబాబు, మంగా రామకృష్ణ, రాఘవరాజు ఆదివిష్ణు, పాములపర్తి శ్రీనివాసరావు, ముప్పిడి అంజి, పాటిబండ్ల సుదర్శనం పాల్గొన్నారు. -
నేడు కూడా వైసీపీ ఆధ్వర్యంలో బంద్
-
నేడు కూడా వైసీపీ ఆధ్వర్యంలో బంద్
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ నిరంకుశ విధానాలను నిరశిస్తూ శుక్రవారం కూడా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బంద్‌కు పిలుపు ఇచ్చారని పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన కోరారు. గురువారం బాలరాజు మాట్లాడుతూ సీమాంధ్రప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రలను నిలిపి వేయాలని పదే పదే చెబుతున్నా యూపీఏ సర్కార్ నియంతలా ప్రవర్తిస్తూ, పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లు పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాహుల్‌ను దేశ ప్రధానిని చేయాలనే స్వార్థ ఆలోచనతో సోనియా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న 10 ఎంపీ సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రప్రజల మనోభాలు దెబ్బతీసేవిధంగా ఆమె ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్లో చోటుచేసుకున్న పరిణామాలకు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ ప్రధాన కారణమని విమర్శించారు. పార్లమెంట్ సభ్యుల వాదనలు కూడా వినకుండా కేంద్ర హోం శాఖ మంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం, సభను వాయిదా వేయడం కాంగ్రెస్ ఆడుతున్న నాటకాల్లో భాగమన్నారు. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న ఎంపీలను సస్పెండ్ చేయటం అత్యంత దారుణమని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని బాలరాజు విమర్శించారు. -
నేడు వైసీపీ ఆధ్వర్యంలో బంద్
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్: రాష్ట్ర పునర్విభజన బిల్లును అసెంబ్లీలో తిరస్కరించినా.. యూపీఏ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధపడటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలో బంద్ పాటిస్తున్నట్టు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు తెల్లం బాలరాజు తెలి పారు. బంద్‌ను పార్టీ శ్రేణులంతా విజయవంతం చేయూలని పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ప్రజలు అనేక ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా గురువారం నిర్వహించే బంద్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. -
గెలుపెవరిదో..!
జంగారెడ్డిగూడెంరూరల్/టి.నరసాపురం, న్యూస్‌లైన్ : సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందేలకు జిల్లావ్యాప్తంగా బరులు సిద్ధమయ్యాయి. కోళ్లతో పందెం రాయుళ్లూ సిద్ధమయ్యారు. పందేలను జరగనిచ్చేది లేదని పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. పందాలు వేసి జూదరులు గెలుస్తారా.. వాటిని అడ్డుకుని పోలీసులు గెలుస్తారా అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. పందేలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడాబాబులు జిల్లాకు చేరుకుంటున్నారు. వారికి నెల రోజుల క్రితమే నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా తాము అన్నీ చూసుకుంటామంటూ హామీలు ఇవ్వడంతో పారిశ్రామిక, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. జిల్లాలోని భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, ఆచంట, తణుకు తదితర ప్రాంతాల్లో భారీగా పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. పందేలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరతామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా ఇదే మాట చెబుతున్నారని, చివరిలో అనుమతి ఖాయమనే ధీమాతో నిర్వాహకులు ఉన్నారు. సంక్రాంతి మూడు రోజులూ జరిగే పందేల జాతరలో కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో కోడి పందాల నిర్వహణకు రెండు వర్గాల వారు పోటాపోటీగా బరిలు సిద్ధం చేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ హరికృష్ణ ఆదేశాల మేరకు శ్రీనివాసపురంలోని బరిలపై పోలీసులు దాడులు చేసి ఫెన్సింగ్‌లను తొలగించారు. అయినా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. టి.నరసాపురం మండలం శ్రీరామవరంలోని ఒక గార్డెన్లో కోడిపందేలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన బరిని, ఫెన్సింగ్‌ను ఆదివారం ఎస్సై రాంబాబు తన సిబ్బందితో వెళ్లి తొలగించారు. మండలంలో కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తణుకులో భారీస్థాయిలో ఏర్పాట్లు తణుకు క్రైం, తణుకు రూరల్, న్యూస్‌లైన్ : తణుకు మండలంలో పందేలకు నిర్వాహకులు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. తేతలి, వేల్పూరు, దువ్వ, మండపాక గ్రామాల్లో బరులు సిద్ధమయ్యాయి. ఇక్కడ సుమారు రూ.5 కోట్ల మేర చేతులు మారనున్నట్టు అంచనా. ఇప్పటికే పందేల రాయుళ్లు రూ.10 వేల నుంచి రూ.50 వేలు విలువ చేసే కోళ్లను కొనుగోలు చేసి బరిలో దింపేందుకు సిద్ధం చేశారు. పోలీసులకు ఏటా లక్షలాది రూపాయిల నజరానాతోపాటు ఉన్నతస్థాయిలోని నాయకులకు కోజా (పందెం చనిపోయిన పుంజు)ల మాంసాన్ని భారీగా పంపుతుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. ఏటా పందేలకు అనుమతులు ఉండవని చెబుతూనే అనుమతి ఇవ్వడం అధికారులకు ఆనవాయితీనేనని నిర్వాహకులు చెబుతుండడం విశేషం. మండలంలోని పందేలను తిలకించేందుకు సినీ ప్రముఖులతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సైతం రానున్నట్టు సమాచారం. -
దాడికి నిరసనగా రాస్తారోకో
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ :సిటీకేబుల్ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఆదివారం స్థానిక బోసుబొమ్మ సెంటర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వైసీపీ, టీడీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా బాధితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా సిటీకేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం రాత్రి సిటీకేబుల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారన్నారు. వారు ఇచ్చిన సమాచారాన్ని ప్రచారం చేయలేదనే కోపంతో సుమారు 25 మోటార్ సైకిళ్లపై వచ్చిన యువకులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. అంతే కాకుండా తాను కుటుంబసభ్యులతో కలిసి కారులో వెళుతుండగా దాడిచేసేందుకు ప్రయత్నించారన్నారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చనమాల శ్రీనివాసరావు, బీవీఆర్‌చౌదరి, పోల్నాటి బాబ్జి, రావూరి కృష్ణ, మంగారామకృష్ణ, కేమిశెట్టి మల్లిబాబు, పి.శ్రీనివాస్, టీడీపీ నాయకులు షేక్‌ముస్తఫా, రామ్‌కుమార్, ప్రింట్మీడియా ప్రతినిధులు వాసా సత్యనారాయణ, పసుమర్తి సాయి, ఎలక్ట్రానిక్ మీడియా సిటికేబుల్ బాలు, రామకృష్ణ, అచ్యుత శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కావూరి కక్ష సమైక్యవాదులకు సంకెళ్లేనా !
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యవాదం వినిపిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులకు, సమ్యైదులకు అరెస్ట్‌లు తప్పటం లేదు. వారు చేసిన తప్పల్లా రాష్టాన్ని ముక్కలు కానీయకుండా ప్రయత్నించమని కోరటమే. కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు ఆదివారం జిల్లా పర్యటన సందర్భంగా ముందుగానే పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను అరెస్టు చేయటాన్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా విమర్శించాయి. గత నెల 17న చింతలపూడి పర్యటనకు వచ్చిన కావూరి సాంబశివరావును రాష్ట్ర విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకున్నందున సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించాలని కోరటానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్‌తో పాటు 20 మందిపై అక్రమ కేసులు బనాయించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కావూరి కక్షగట్టి అదే రోజు రాత్రి పోలీసు అధికారులతో మాట్లాడి వారిని అరెస్టుచేసి జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశార ని పలువురు విమర్శించారు. 18వ తేదీ ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ను పోలీసులు నిద్రలేసి మరీ అరెస్టు చేశారు. రాజేష్‌తో పాటు ఇతర నాయకులను కరుడుగట్టిన నేరస్తుల మాదిరిగా చెప్పులు కూడా వేసుకోనీయకుండా నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువె ళ్లారు. ఐపీసీలోని మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. తాజాగా ఆదివారం కేంద్రమంత్రి కావూరి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మండలాల్లో పర్యటించనున్న సందర్భంగా ఉదయమే పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను ముందస్తు చర్యగా గృహ నిర్బంధంలో ఉంచటంతోపాటు, పలువురిని అరెస్టుచేసి ప్రైవేట్ గదుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంచారు. ఈ తీరుపట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేశాయి. కావూరి పర్యటనను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన వైసీపీ నాయకుడు పోల్నాటి బాబ్జీని ఉదయం 6 గంటలకు అదుపులోకి తీసుకునే ప్రయత్నంచేశారు పోలీసులు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించటంతో వారు వెళ్లిపోయారు. అనంతరం ఉదయం 8 గంటలకు సీఐ, ఇద్దరు ఎస్సైలు, 15 మంది పోలీసులు వచ్చి బాబ్జిని అరెస్టుచేసేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం పట్టణ వైసీపీ నాయకులు శ్రీనివాసపురానికి చేరుకుని పోలీస్ వాహనానికి అడ్డంగాపడుకుని సమైక్య నినాదాలు చేసి నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులు ూనుకోవాలని నినాదాలు చేశారు. గ్రామస్తులు, వైసీపీ నాయకులు భారీగా చేరుకోవటంతో పోలీసులు చేసేదేమీలేక బాబ్జితోపాటు పార్టీ నాయకులు బీవీఆర్ చౌదరి, చనమాల శ్రీనివాసరావు, మంగా రామకృష్ణ, పోల్నాటి ఉదయ్‌కుమార్, పంది రాజా, పీతల కృష్ణమూర్తి, చిప్పాడ వెంకన్న, పోల్నాటి శ్రీను, బుజ్జా పరమేశ్వరరావు, కూనపాం పండు, అడబాల రాంబాబు, కాసర సోమిరెడ్డి, పోల్నాటి చెల్లారావు, బల్లె రామచంద్రరావు, టి.శ్రీను, రాంబాబు, ఎం.హరీష్, శివలను పోల్నాటి బాబ్జిని ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు నిర్బంధంలో ఉంచి తరువాత విడుదలచేశారు. చింతలపూడిలో కావూరు పర్యటన సాయంత్రం అయినప్పటికీ వైసీపీ నాయకులను ఉదయం 6 గంటలకే 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని తొలుత పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి వారిని పోలీసుల ఆధీనంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పెట్టారు. జీలుగుమిల్లి మండలంలో వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రేమ్‌కుమార్‌తో పాటు ఆరుగురిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని మధ్యాహ్నం వదిలిపెట్టారు. పోలీసులు అధికార పార్టీ నేతల చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రజాస్వామ్యబద్ధంగా సమైక్యవాదన వినిపించే వారి నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్యటనల సందర్భంగా వైసీపీ నాయకులను అరెస్టుచేయటాన్ని వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. -
వైసీపీ శ్రేణుల హౌస్ అరెస్ట్
జంగారెడ్డిగూడెం రూరల్, న్యూస్‌లైన్ : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పర్యటన అడ్డుకుంటారనే భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల చింతలపూడిలో జరిగిన కేంద్ర మంతి కావూరి పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవడం, అనంతరం కోడిగుడ్లతో దాడికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కావూరి పర్యటన సందర్భంగా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, జీలుగుమిల్లి మండలాల్లో సమైక్యవాణి వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఉదయం 11.30 గంటలకు వాటర్ ట్యాంకు శంకుస్థాపన పనులకు కేంద్రమంత్రి కావూరు సాంబశివరావు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎదుట సమైక్యవాణి వినిపించేందుకు మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుడు పోల్నాటి బాబ్జి ఇంటి వద్ద జంగారెడ్డిగూడెం మండల, పట్టణ వైసీపీ నాయకులు 21 మంది సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై బీఎన్ నాయక్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంటిలోనే నిర్భంధించి ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. పోల్నాటి బాబ్జి, పట్టణ కన్వీనర్ చనమాల శ్రీనువాస్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు బొల్లిన వెంకటేశ్వరరావు, మంగా రామకృష్ణ, కాసర సోమిరెడ్డి, పోల్నాటి ఉదయ్‌కుమార్, బల్లే వెంకట రామచంద్రరావు, పోల్నాటి శ్రీనివాసరావు, చల్లారావు, యరమళ్ల గంగా నాగ దుర్గారావు, కూనపాముల వెంకటేశ్వరరావు, పీతల కృష్ణమూర్తి, చిప్పాడ నరసింహరావు, బొజ్జా పరమేశ్వరరావు, పంది రాజా, పస్తుల శివ, పారేపలి నాగేంద్ర, ప్రగడ సత్యనారాయణ, పోల్నాటి సత్యనారాయణ, టెక్కం శ్రీనివాసరావు, పొడుదోలు రాంబాబులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోల్నాటీ బాబ్జి విలేకర్లతో మాట్లాడుతూ మంత్రిని కలువకుండా గృహనిర్భంధం చేయించడం బ్రిటిష్ పాలను తలపించేలా ఉందన్నారు. చింతలపూడిలో... చింతలపూడి : ఏడవ విడత భూ పంపిణీలో పాల్గొనడానికి ఆదివారం చింతలపూడికి కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు విచ్చేశారు. ఆయనను నేతలు అడ్డుకుంటారనే భయంతో వైఎస్సార్ సీపీ నాయకులు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని స్థానిక రత్నా అపార్ట్‌మెంట్‌కు తరలించి అపార్ట్మెంట్ చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. చింతలపూడి సర్పంచ్ మారిశెట్టి జగన్, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, సీహెచ్ నరేంద్రరాజు, గంధం చంటి, శీలపురెడ్డి రమేష్‌రెడ్డి, జల్లిపల్లి పుల్లారావు, బి.రామరాజునాయక్, మోటపోతుల శ్రీనివాస్‌గౌడ్, కొవ్వూరి రవి, ఎం.తిరుపతిరావు, టి.జయరాజులను అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై బి.మోహన్‌రావు తెలిపారు. వీరిలో కొందరు వృద్ధులు ఉండటంతో వారి ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా అపార్ట్‌మెంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడికి తరలించినట్టు చెప్పారు. మంత్రి పర్యటన పూర్తయిన వెంటనే వారిని విడుదల చేస్తామన్నారు. జీలుగుమిల్లిలో... జీలుగుమిల్లి మండలంలో వైసీపీ జిలా ్లస్టీరింగ్ కమిటీ సభ్యుడు ప్రేమ్ కుమార్‌తో పాటు మరో ఆరుగురిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని మధ్యాహ్న సమయానికి వదిలిపెట్టారు.