సాక్షి, అమరావతి: శాసనమండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలంటూ తెలుగుదేశం సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు. అయితే మరణాలపై చర్చకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్‌మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధమయ్యారు. దీంతో ఖంగుతున్న టీడీపీ నేతలు వెంటనే ప్లేటు ఫిరాయించారు. ముఖ్యమంత్రి సభకు వచ్చి జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్‌మెంట్ ఇవ్వాలని యనమల రామకృష్ణుడు మాటమార్చారు.
శాసనసభలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రే వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలన్న అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్‌మెంట్ పరిగణలోకి రాదని అన్నారు. అయితే యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రూల్ 306లో ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ స్టేట్‌మెంట్ ఇవ్వాలని రూల్ పొజిషన్‌లో చదివి వినిపించారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు శాసనమండలి చైర్మన్‌ను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం సభ నడపాలని సూచించారు.
సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు: మండలి ఛైర్మన్
టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని.. ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment