ముగిసిన సాఫ్ట్‌బాల్ టోర్నీ
ముగిసిన సాఫ్ట్‌బాల్ టోర్నీ
Published Sat, Jun 10 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
జంగారెడ్డిగూడెం : స్థానిక విద్యావికాస్ కళాశాలలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ నాలుగో సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. పురుషులు, మహిళల విభాగాల్లో ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగాయి. పురుషుల విభాగంలో గుంటూరు జిల్లా విజేతగా నిలిచింది. అనంతపురం ద్వితీయ స్థానం, వైఎస్సార్ కడప జిల్లా తృతీయ స్థానం సాధించాయి. మహిళల విభాగంలో అనంతపురం ప్రథమస్థానం, విజయనగరం, వైఎస్సార్ కడప ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ.. ఉత్తమ క్రీడాకారులను తయారు చేసుకోవాలి్సన బాధ్యత మనదేనన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. టోర్నీ నిర్వహణను చేపట్టిన విద్యావికాస్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. సహాయ సహకారాలు అందించిన మానవత స్వచ్ఛంద సంస్థ, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ను కూడా అభినందించారు. ప్రభుత్వం కూడా క్రీడాభిృద్ధికి కృషి చేస్తోందని రామ్మోహనరావు చెప్పారు. అనంతరం విజేతలకు పతకాలు, ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ మేడవరపు అశోక్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, డీఎస్‌డీఓ ఎస్.ఎ.అజీజ్, మానతవ జిల్లా అధ్యక్షుడు కె.జె.మాథ్యూ, కోశాధికారి తాడేపల్లి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు చావా రమేష్‌బాబు, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మిడత రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement