ఐఎస్‌ఎల్‌ 1000వ మ్యాచ్‌ ‘డ్రా’ | ISL 1000th Match Draw On Saturday Between Mumbai FC And Chennai FC | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్‌ 1000వ మ్యాచ్‌ ‘డ్రా’

Published Sun, Nov 10 2024 2:33 PM | Last Updated on Sun, Nov 10 2024 2:33 PM

ISL 1000th Match Draw On Saturday Between Mumbai FC And Chennai FC

చెన్నై: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) చరిత్రలో 1000వ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. శనివారం ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్, చెన్నైయిన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మధ్య జరిగిన పోరు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ అయింది. ముంబై జట్టు తరఫున నాథన్‌ రోడ్రిగ్స్‌ (63వ నిమిషంలో) ఒక గోల్‌ సాధించగా... చెన్నైయన్‌ ఎఫ్‌సీ తరఫున కెప్టెన్‌ ర్యాన్‌ ఎడ్వర్డ్స్‌ (60వ ని.లో) ఏకైక గోల్‌ సాధించాడు.

మ్యాచ్‌ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఇరు జట్లు చెరో 14 షాట్లు ఆడగా... అందులో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా నాలుగేసి సార్లు దాడులు చేశాయి. ముంబై జట్టు చిన్న చిన్న పాస్‌లతో ముందుకు సాగగా... చెన్నైయన్‌జట్టు 15 ఫౌల్స్‌ చేసింది. ఈ ఫలితంతో 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకున్న చెన్నైయన్‌ జట్టు 12 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానానికి చేరగా... 10 పాయింట్లు ఖాతాలో ఉన్న ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది.

ఈస్ట్‌ బెంగాల్, మొహమ్మదాన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ కూడా 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్‌ సాధించడంలో విఫలమయ్యాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం ఒడిశా ఫుట్‌బాల్‌ క్లబ్‌తో మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ జట్టు తలపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement