హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్ 273/3
హిమతేజ సెంచరీ
రంజీ ట్రోఫీ
జైపూర్: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌ను హైదరాబాద్ ‘డ్రా’చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఒక విజయం, 2 ఓటములు, ఒక ‘డ్రా’తో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానానికి చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 36/0తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.
హిమతేజ (176 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... తన్మయ్ అగర్వాల్ (126 బంతుల్లో 79; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో మెరిశాడు. అభిరత్ రెడ్డి (46; 7 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణీత సమయం కంటే ముందే ‘డ్రాకు అంగీకరించారు. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగులు చేయగా... రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన రాజస్తాన్ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకొని ఓవరాల్‌గా 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టుకు ఒక పాయింట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీ బాదిన రాజస్తాన్ బ్యాటర్ శుభమ్ గర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు లభించింది.
స్కోరు వివరాలు:
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్ 425; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (ఎల్బీ) (బి) అజయ్ సింగ్ 79; అభిరత్ రెడ్డి (సి) కునాల్ సింగ్ రాథోడ్ 46; రోహిత్ రాయుడు (సి) కునాల్ సింగ్ రాథోడ్ (బి) అనికేత్ చౌధరి 0; హిమతేజ (నాటౌట్) 101; రాహుల్ సింగ్ (నాటౌట్) 47; ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (65 ఓవర్లలో 3 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–56, 2–57, 3–196, బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 22–0–84–1, దీపక్ హుడా 6–2–17–0, మహిపాల్ లొమ్రోర్ 18–0–86–0, అరాఫత్ ఖాన్ 5–1–18–1, అనికేత్ చౌధరి 6–0–18–1, అభిజీత్ తోమర్ 6–0–39–0
Comments
Please login to add a commentAdd a comment