ISL football
-
ఐఎస్ఎల్ 1000వ మ్యాచ్ ‘డ్రా’
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చరిత్రలో 1000వ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శనివారం ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జరిగిన పోరు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ అయింది. ముంబై జట్టు తరఫున నాథన్ రోడ్రిగ్స్ (63వ నిమిషంలో) ఒక గోల్ సాధించగా... చెన్నైయన్ ఎఫ్‌సీ తరఫున కెప్టెన్ ర్యాన్ ఎడ్వర్డ్స్ (60వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు.మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఇరు జట్లు చెరో 14 షాట్లు ఆడగా... అందులో ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా నాలుగేసి సార్లు దాడులు చేశాయి. ముంబై జట్టు చిన్న చిన్న పాస్‌లతో ముందుకు సాగగా... చెన్నైయన్జట్టు 15 ఫౌల్స్ చేసింది. ఈ ఫలితంతో 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకున్న చెన్నైయన్ జట్టు 12 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానానికి చేరగా... 10 పాయింట్లు ఖాతాలో ఉన్న ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది.ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌తో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. -
ముంబై చేతిలో కేరళ ఓటమి
ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ముంబై సిటీ ఎఫ్‌సీ అజేయంగా దూసుకెళుతోంది. కేరళ బ్లాస్టర్స్‌ను వారి సొంతగడ్డపైనే ముంబై ఓడించింది. కొచ్చిలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై సిటీ 2–0తో కేరళను కంగు తినిపించింది. ముంబై తరఫున మెహతాబ్ (22వ ని.), పెరేరా దియాజ్ (31వ ని.) చెరో గోల్ చేయడంతో ఆట అర్ధభాగంలోనే ముంబై 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్ధంలో ప్రత్యర్థి స్ట్రయికర్లకు చెక్ పెట్టడంతో ముంబై విజయం సాధించింది. ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లాడిన ముంబై సిటీ ఎఫ్‌సీ రెండింటిలో గెలుపొందగా, మరో రెండు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గోవాతో హైదరాబాద్, ఈస్ట్ బెంగాల్‌తో ఏటీకే మోహన్ బగాన్ తలపడతాయి. చదవండి: PKL 9: జైపూర్పై తలైవాస్ గెలుపు -
బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా
Ganguly Quits ATK Mohun Bagan Director Position: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోల్‌కతాకు చెందిన ఏటీకే మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు డైరెక్టర్ పదవికి బుధవారం(అక్టోబర్ 27) రాజీనామా చేశాడు. ఐపీఎల్లో లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న RPSG గ్రూప్ యాజమాన్యంలోనే మోహన్ బగన్ జట్టు కూడా ఉండడమే ఇందుకు కారణం. బీసీసీఐ విరుద్ధ ప్రయోజనాల వివాదాన్ని నివారించేందుకు మోహన్ బగాన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు. ఈ జట్టుకు గంగూలీ డైరెక్టర్ మాత్రమే కాదు..షేర్ హోల్డర్ కూడా. కాగా, RPSG గ్రూప్ లక్నో జట్టును రూ.7,090 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ రూ. 5625 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ రెండు జట్ల చేరకతో ఐపీఎల్ 2022లో 10 జట్లు రంగంలోకి దిగనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లను విక్రయించడం ద్వారా బీసీసీఐ రూ.12,715 కోట్లు ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. చదవండి: నీరజ్, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..! -
మళ్లీ ఓడిన హైదరాబాద్
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు ఆరో ఓటమి చవిచూసింది. ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో ఓడింది. ఒడిశా తరఫున డెల్గాడో (27వ ని.లో), జిస్కో హెర్నాండెజ్ (41వ ని.లో), పెరెజ్ (71వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. హైదరాబాద్ జట్టుకు బోబో (65వ ని.లో), రోహిత్ (89వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. -
ముంబైపై గోవా విజయం
ముంబై: సొంత ప్రేక్షకుల మధ్య ముంబై సిటీ ఎఫ్‌సీ తడబడింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 2–4 గోల్స్ తేడాతో గోవా ఎఫ్‌సీ చేతిలో ఓడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన గోవా ఎఫ్‌సీ సీజన్లో రెండో విజయాన్ని ఖాయం చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గోల్స్ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో గోవా ఆటగాళ్లలో లెన్ని రోడ్రిగస్ (27వ ని.), ఫెర్రాన్ కొరొమినస్ (45వ ని.), హ్యూగో బొవుమౌస్ (59వ ని.), కార్లోస్ పెన (89వ ని.) తలా ఓ గోల్ చేశారు. ముంబై తరఫున సార్థక్ గోలుయ్ (49వ ని.), సౌవిక్ చక్రబర్తి (55వ ని.) చెరో గోల్ సాధించారు. -
హైదరాబాద్ తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: సొంత ప్రేక్షకుల మధ్య స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తొలి విజయాన్ని అందుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్‌కు సొంత మైదానం కలిసొచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–1 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై గెలిచింది. హైదరాబాద్ ఆటగాళ్లు స్టాంకోవిచ్ (54వ ని.), మార్సెలినో (81వ ని.) చెరో గోల్ సాధించారు. కేరళ తరఫున ప్రవీణ్ (34వ ని.) గోల్ చేశాడు. ఆరంభంలో ప్రత్యర్థి బలహీన డిఫెన్స్‌ను పదే పదే ఛేదించిన కేరళ హైదరాబాద్ గోల్ పోస్టుపైకి దాడులు చేసింది. 34వ నిమిషంలో సమద్ అందించిన పాస్‌ను గోల్ పోస్టులోకి నెట్టిన 19 ఏళ్ల కేరళ ఆటగాడు ప్రవీణ్ 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. విరామం తర్వాత హైదరాబాద్ పుంజుకుంది. 54వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన స్టాంకోవిచ్ స్కోర్‌ను సమం చేశాడు. 9 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఫ్రీ కిక్‌ను కళ్లు చెదిరే రీతిలో గోల్ పోస్టులోకి పంపిన మార్సెలినో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. -
గెలుపు కిక్ కోసం హైదరాబాద్ ఎఫ్‌సీ
సాక్షి, హైదరాబాద్: లీగ్‌లో కొత్త జట్టు... గాయాల బెడద... ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమే... చేసిన గోల్స్ కన్నా సమరి్పంచుకున్న వే ఎక్కువ... అయినా హైదరాబాద్ ఎఫ్‌సీ ఆత్మవిశ్వాసంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) బరిలో దిగనుంది. సొంత ప్రేక్షకుల మధ్య తొలి విజయాన్ని సాధించి కొత్త ఉత్సాహాన్ని సాధించాలని చూస్తోంది. అదే లక్ష్యంతో నేడు గచి్చ»ౌలి స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో తలపడేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. గాయాలతో సతమతం... ఫుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే అది గతం. ప్రస్తుతం పూర్వవైభవం సాధించాలని తపిస్తున్న హైదరాబాద్ ఫుట్‌బాల్‌కు ఐఎస్ఎల్లో భాగంగా నేడు నగరంలో జరుగనున్న మ్యాచ్ కీలకం కానుంది. ఇందులో ఎలాగైనా గెలుపొందడమే లక్ష్యంగా హైదరాబాద్ ఎఫ్‌సీ బరిలో దిగనుంది. కానీ కీలక ఆటగాళ్ల గాయాలు జట్టును కలవరపరుస్తున్నాయి. తుది పదకొండు మందిని ప్రకటించడమే కోచ్ ఫిల్ బ్రౌన్కు కష్టంగా మారింది. టోరీ్నలో గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో జట్టు డీలా పడింది. అట్లెటికో డి కోల్‌కతా జట్టు చేతిలో 0–5తో, జంషెడ్పూర్ చేతిలో 1–3తో ఓడిపోయిన హైదరాబాద్‌కు సొంత మైదానంలో వచ్చే తొలి విజయం మాంచి కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. కానీ హైదరాబాద్ డిఫెన్స్ బలహీనంగా ఉంది. దీనికి తోడు టోరీ్నలో ఇప్పటివరకు గోల్ నమోదు చేసిన అటాకర్ మార్సెలో పెరీరా, మరో కీలక ఆటగాడు రాబిన్ సింగ్ తమ స్థాయి ప్రదర్శన ఇంకా కనబరచలేదు. వీరే కాకుండా బోబో, గిల్స్ బర్న్స్, నెస్టర్ బెనిటెజ్, రాఫెల్ లోపెజ్, సాహిల్ పన్వర్ కూడా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన జట్టు కోచ్ ఫిల్ బ్రౌన్.. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేనప్పటికీ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నానని అన్నారు. సొంత ప్రేక్షకుల మధ్య ఒక గెలుపు లభిస్తే అది మిగతా మ్యాచ్‌ల్లో మరింత బాగా ఆడేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పారు. ఓటమి నుంచి బయటపడేందుకు... మరోవైపు గత మ్యాచ్‌లో ముంబై ఎఫ్‌సీ చేతిలో ఎదురైన ఓటమి నుంచి బయటపడేందుకు కేరళ బ్లాస్టర్స్ ఈ మ్యాచ్‌ను వినియోగించుకోనుంది. లీగ్‌లో తొలిసారి అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ను సొంతగడ్డపై ఓడించి మళ్లీ గెలుపుబాట పట్టాలని ఆ జట్టు ఉవ్విళ్లూరుతోంది. కెపె్టన్ బర్తోలోమెవ్ ఒబెబ్ జట్టుకు కీలకం కానున్నాడు. డిఫెన్స్ విభాగం కూడా మెరుగవ్వడం పట్ల హెడ్ కోచ్ ఎల్కో స్కాటెరీ హర్షం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు లేని హైదరాబాద్ జట్టును ఎదుర్కొనేందుకు కేరళ సిద్ధమైంది. జట్లు (అంచనా) కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ: బిలాల్ హుస్సేన్ ఖాన్ (గోల్‌కీపర్), మొహమ్మద్ రాకిప్, జైరో రోడ్రిగ్స్, జియాని జువెర్లోన్, జింగ్, జెస్సెల్ కారి్నరో, నర్జారీ, సెర్గియో సిడోంచా, జెకెన్ సింగ్, సహల్ సమద్, బర్తోలోమెవ్. హైదరాబాద్ ఎఫ్‌సీ: కమల్జిత్ సింగ్ (గోల్ కీపర్), ఆశిష్ రాయ్, మాథ్యూ కిల్గాలాన్, గుర్జీత్ సింగ్, యాసిర్, నిఖిల్ పుజారి, మార్కో స్టాంకోవిక్, ఆదిల్ ఖాన్, రోహిత్ కుమార్, మార్సెలో పెరీరా, రాబిన్ సింగ్. ‘ఈవెంట్స్‌నౌ’లో టికెట్లు... హైదరాబాద్ ఎఫ్‌సీ, కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు eventsnow.comలో లభిస్తున్నాయి. టికెట్ల ధరలను వరుసగా రూ. 100, రూ. 300, రూ. 500, రూ. 1000, రూ. 1500లుగా నిర్ణయించారు. -
హైదరాబాద్ ‘కిక్’
కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ పుటల్లో హైదరాబాద్ ఆటగాళ్లకు ప్రత్యేక స్థానముంటుంది. అలనాటి జాతీయ సాకర్ జట్టును నడిపించినా... గెలిపించినా... అది హైదరాబాదీ ఆటగాళ్ల ఘనతే! ఇంకా చెప్పాలంటే ఒకానొక దశలో మనవాళ్లే భారత జట్టును శాసించారు. తుది జట్టుకు ఆడినవారిలో ఏకంగా 8 నుంచి 10 మంది హైదరాబాద్ అటగాళ్లే ఉన్నారంటే మన ఫుట్‌బాలర్ల సత్తా ఏంటో ఇప్పటికే అర్థమైవుంటుంది. భారత ఫుట్‌బాల్ జట్టుకు నాయకత్వం వహించిన విక్టర్ అమల్‌రాజ్ సహా ఎస్.ఎ.రహీమ్, నయీమ్, హకీమ్, జులిఫకర్, పీటర్ తంగరాజ్ తదితరులు భారత ఫుట్‌బాల్‌కు ఎనలేని సేవలందించారు. కాలక్రమంలో హైదరాబాదీల ప్రతిభ మరుగునపడింది. జాతీయ ఫుట్‌బాల్ జట్టులో మనోళ్లకు చోటే గగనమయ్యే పరిస్థితి తలెత్తింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ద్వారా హైదరాబాద్ ఫుట్‌బాల్ తెరముందుకొచ్చింది. పుణే స్థానంలో లీగ్‌లోకి... ఐఎస్ఎల్లో పుణే ఆరంభం నుంచి ఉంది. అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఆ ఫ్రాంచైజీ తప్పుకోవడంతో అనూహ్యంగా హైదరాబాద్‌కు చాన్స్ వచ్చింది ఈ సీజన్‌కైతే మొత్తంగా పుణే ఎంపిక చేసుకున్న ఆటగాళ్లతోనే ఆడుతున్నప్పటికీ వచ్చే సీజన్లో హైదరాబాదీలకు చోటిస్తామని ఫ్రాంచైజీ సహ యజమాని వరుణ్ త్రిపురనేని చెప్పారు. తమ జట్టుకు విశేష అనుభవమున్న కోచ్ ఫిల్ బ్రౌన్ (ఇంగ్లండ్) ఉన్నారని... తప్పకుండా ఈ సీజన్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ రాణిస్తుందని ముఖ్యంగా హైదరాబాదీ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు. విజయ్ మద్దురితో కలిసి ఆయన ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. హైదరాబాద్ ఎఫ్‌సీ తమ హోమ్ మ్యాచ్‌లను గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆడుతుంది. -
ఐఎస్ఎల్ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సీ
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. ముంబైలో ఆదివారం జరిగిన ఫైనల్లో బెంగళూరు 1–0తో గోవా ఎఫ్‌సీ జట్టును ఓడించింది. నిర్ణీత 90 నిమిషాలు ముగిసే సమయానికి రెండు జట్లు 0–0తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోని తొలి భాగంలోనూ గోల్ నమోదు కాలేదు. మరో నాలుగు నిమిషాల్లో అదనపు సమయం కూడా ముగుస్తుందనగా రాహుల్ భాకే గోల్ చేసి బెంగళూరుకు టైటిల్‌ను ఖాయం చేశాడు. -
రెండో సీజన్‌కు రంగం సిద్ధం
రేపటి నుంచి ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ ఈ ఏడాది రూ.100 కోట్లకు చేరిన స్పాన్సర్షిప్ ఆదాయం న్యూఢిల్లీ: భారత్‌లో ఆటంటే క్రికెటే అన్న అభిప్రాయాన్ని ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ తిరగరాసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. తొలి ఏడాది ఈ టోర్నీకి విశేష ఆదరణ లభించింది. ఎనిమిది నగరాల్లో జరిగిన మ్యాచ్‌లకు ఫుట్‌బాల్ ప్రేమికులు పోటెత్తారు. ఈనేపథ్యంలో శనివారం నుంచి జరిగే రెండో సీజన్‌పై అంచనాలు పెరిగాయి. టోర్నీ తొలి మ్యాచ్ అట్లెటికో డి కోల్‌కతా, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరుగుతుంది. ఇక ఐఎస్ఎల్-1 సూపర్ సక్సెస్‌తో ఫ్రాంచైజీలన్నీ సంతోషంగా ఉన్నాయి. ఇదే జోరు కొనసాగితే నాలుగో సీజన్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పడతామని గట్టిగా నమ్ముతున్నాయి. ఐఎస్ఎల్-2పై కార్పొరేట్ కంపెనీలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. అందుకే స్పాన్సర్షిప్ ఆదాయం కింద నిర్వాహకులకు ఈసారి రూ.100 కోట్ల ఆదాయం లభించింది. ఇది గతేడాది రూ.55 కోట్లుగా ఉంది. ఆయా జట్లు కూడా తమ స్పాన్సర్షిప్ ఆదాయాన్ని దాదాపు రెండింతలుగా ఆర్జించాయి. 2014లో జెర్సీ ముందు లోగోకు రూ.5-6 కోట్ల మధ్య తీసుకుంటే ఈసారి అది రూ.8-10 కోట్లకు చేరింది. కోల్‌కతా గతేడాది ఐదు ముఖ్య స్పాన్సర్లతో రంగంలోకి దిగగా ఈసారి ఆరింటితో బరిలోకి దిగుతోంది. ప్రారంభ వేడుకల్లో ఐశ్వర్య, రెహమాన్ ‘షో’ ఐఎస్ఎల్ రెండో సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించనుంది. శనివారం సాయంత్రం జరిగే ప్రారంభ వేడుకల్లో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఐదేళ్ల విరామం అనంతరం ఆమె తన డ్యాన్స్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేయనుంది. అంతేకాకుండా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా తన సంగీతంతో ఉర్రూతలూగించనున్నాడు. ఇంకా ఇతర ప్రముఖులు కూడా తమ షోతో ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. -
అక్టోబర్ 3 నుంచి ఐఎస్ఎల్
న్యూఢిల్లీ : రెండో అంచె ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 20 వరకు పోటీలు జరుగుతాయి. ఇంటా, బయటా పద్ధతిలో మొత్తం 61 మ్యాచ్‌లు ఆడనున్నారు. చెన్నైలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా... చెన్నైయిన్ ఎఫ్‌సీతో తలపడుతుంది. -
క్రికెటర్ల నాలుగు జట్లు సెమీస్‌కు
ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ కోల్‌కతా: క్రికెటర్లు సహ యజమానులుగా ఉన్న నాలుగు జట్లు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో సెమీస్‌కు అర్హత సాధించాయి. బుధవారం ఎఫ్‌సీ గోవాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న అట్లెటికో డి కోల్‌కతా పాయింట్ల పట్టికలో మూడో స్థానం (19 పాయింట్లు)లో నిలిచింది. కేరళతో కూడా 19 పాయింట్లతోనే ఉన్నా గోల్స్ తేడాలో వెనుకబడి నాలుగో స్థానంతో సంతృప్తిపడింది. సెమీస్‌కు అర్హత సాధించాలంటే కనీసం డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు సత్తా చాటింది. యువ భారతీ క్రీడాంగన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... ప్రథమార్ధంలో 0-1తో వెనుకబడ్డా రెండో అర్ధభాగంలో చెలరేగి ఆడింది. కోల్‌కతా తరఫున 68వ నిమిషంలో లభించిన పెనాల్టీని ఫిక్రూ గోల్‌గా మల్చగా, ఎడ్గర్ మార్సెలినో (27వ ని.) గోవాకు గోల్ అందించాడు. నార్త్ఈస్ట్, ముంబైల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. 34వ నిమిషంలో కొకే (నార్త్ఈస్ట్) గోల్ చేయగా... 84వ నిమిషంలో సుశీల్ (ముంబై) గోల్ సాధించాడు. ఈ మ్యాచ్‌తో ఐఎస్ఎల్లో లీగ్ దశ ముగిసింది. ఇంటా, బయటా పద్ధతిలో జరగనున్న సెమీస్ మ్యాచ్‌ల్లో... శనివారం కేరళ, చెన్నైయిన్‌లు కొచ్చిలో తలపడుతాయి. ఆదివారం కోల్‌కతా, గోవాలు కోల్‌కతాలో ఎదురుపడతాయి. మంగళవారం చెన్నైలో జరిగే మ్యాచ్‌లో చెన్నైయిన్, కేరళ; బుధవారం గోవాలో జరిగే మ్యాచ్‌లో గోవా, కోల్‌కతా అమీతుమీ తేల్చుకుంటాయి.