
ముంబై: సొంత ప్రేక్షకుల మధ్య ముంబై సిటీ ఎఫ్‌సీ తడబడింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఆరో సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 2–4 గోల్స్ తేడాతో గోవా ఎఫ్‌సీ చేతిలో ఓడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన గోవా ఎఫ్‌సీ సీజన్‌లో రెండో విజయాన్ని ఖాయం చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గోల్స్ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో గోవా ఆటగాళ్లలో లెన్ని రోడ్రిగస్ (27వ ని.), ఫెర్రాన్ కొరొమినస్ (45వ ని.), హ్యూగో బొవుమౌస్ (59వ ని.), కార్లోస్ పెన (89వ ని.) తలా ఓ గోల్ చేశారు. ముంబై తరఫున సార్థక్ గోలుయ్ (49వ ని.), సౌవిక్ చక్రబర్తి (55వ ని.) చెరో గోల్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment