ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ అజేయంగా దూసుకెళుతోంది. కేరళ బ్లాస్టర్స్‌ను వారి సొంతగడ్డపైనే ముంబై ఓడించింది. కొచ్చిలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై సిటీ 2–0తో కేరళను కంగు తినిపించింది. ముంబై తరఫున మెహతాబ్ (22వ ని.), పెరేరా దియాజ్ (31వ ని.) చెరో గోల్ చేయడంతో ఆట అర్ధభాగంలోనే ముంబై 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ద్వితీయార్ధంలో ప్రత్యర్థి స్ట్రయికర్లకు చెక్ పెట్టడంతో ముంబై విజయం సాధించింది. ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లాడిన ముంబై సిటీ ఎఫ్‌సీ రెండింటిలో గెలుపొందగా, మరో రెండు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గోవాతో హైదరాబాద్, ఈస్ట్ బెంగాల్‌తో ఏటీకే మోహన్ బగాన్ తలపడతాయి.
చదవండి: PKL 9: జైపూర్‌పై తలైవాస్ గెలుపు
Comments
Please login to add a commentAdd a comment