Kerala Blasters team
-
ముంబై చేతిలో కేరళ ఓటమి
ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ముంబై సిటీ ఎఫ్‌సీ అజేయంగా దూసుకెళుతోంది. కేరళ బ్లాస్టర్స్‌ను వారి సొంతగడ్డపైనే ముంబై ఓడించింది. కొచ్చిలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై సిటీ 2–0తో కేరళను కంగు తినిపించింది. ముంబై తరఫున మెహతాబ్ (22వ ని.), పెరేరా దియాజ్ (31వ ని.) చెరో గోల్ చేయడంతో ఆట అర్ధభాగంలోనే ముంబై 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్ధంలో ప్రత్యర్థి స్ట్రయికర్లకు చెక్ పెట్టడంతో ముంబై విజయం సాధించింది. ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లాడిన ముంబై సిటీ ఎఫ్‌సీ రెండింటిలో గెలుపొందగా, మరో రెండు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గోవాతో హైదరాబాద్, ఈస్ట్ బెంగాల్‌తో ఏటీకే మోహన్ బగాన్ తలపడతాయి. చదవండి: PKL 9: జైపూర్పై తలైవాస్ గెలుపు -
హైదరాబాద్ తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: సొంత ప్రేక్షకుల మధ్య స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తొలి విజయాన్ని అందుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్‌కు సొంత మైదానం కలిసొచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–1 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై గెలిచింది. హైదరాబాద్ ఆటగాళ్లు స్టాంకోవిచ్ (54వ ని.), మార్సెలినో (81వ ని.) చెరో గోల్ సాధించారు. కేరళ తరఫున ప్రవీణ్ (34వ ని.) గోల్ చేశాడు. ఆరంభంలో ప్రత్యర్థి బలహీన డిఫెన్స్‌ను పదే పదే ఛేదించిన కేరళ హైదరాబాద్ గోల్ పోస్టుపైకి దాడులు చేసింది. 34వ నిమిషంలో సమద్ అందించిన పాస్‌ను గోల్ పోస్టులోకి నెట్టిన 19 ఏళ్ల కేరళ ఆటగాడు ప్రవీణ్ 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. విరామం తర్వాత హైదరాబాద్ పుంజుకుంది. 54వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన స్టాంకోవిచ్ స్కోర్‌ను సమం చేశాడు. 9 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఫ్రీ కిక్‌ను కళ్లు చెదిరే రీతిలో గోల్ పోస్టులోకి పంపిన మార్సెలినో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. -
సచిన్ ఓనం వేడుక
తిరువనంతపురం: భారత మాజీ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తిరువనంతపురంలో సందడి చేశారు. కేరళ బ్లాస్టర్ టీం సభ్యులతో కలిసి ఓనమ్ పండుగను జరుపుకున్నారు. కేరళ బ్లాస్టర్స్ యాజమాని అయిన సచిన్ టీం సభ్యులతో కలిసి భోజనాలు చేశాడు. ఈ విషయాన్ని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఓనం పండుగను దేశ, విదేశాల్లో ఉన్న కేరళీయులు ఘనంగా జరుపుకుంటారు. -
ఐఎస్ఎల్: కేరళ బ్లాస్టర్స్ గెలుపు
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పుణే ఎఫ్‌సీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 2-0 గోల్స్ తేడాతో గెలి చింది. ఆట 45వ నిమిషంలో డాగ్నల్ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన కేరళ జట్టుకు 60వ నిమిషంలో వాట్ రెండో గోల్‌ను అందించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లో నెగ్గిన కేరళ బ్లాస్టర్స్ ఆ తర్వాతి ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం కేరళ జట్టు ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. గురువారం జరిగే మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో గోవా ఎఫ్‌సీ జట్టు ఆడుతుంది.