
సచిన్ ఓనం వేడుక
తిరువనంతపురం: భారత మాజీ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తిరువనంతపురంలో సందడి చేశారు. కేరళ బ్లాస్టర్ టీం సభ్యులతో కలిసి ఓనమ్ పండుగను జరుపుకున్నారు. కేరళ బ్లాస్టర్స్ యాజమాని అయిన సచిన్ టీం సభ్యులతో కలిసి భోజనాలు చేశాడు. ఈ విషయాన్ని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఓనం పండుగను దేశ, విదేశాల్లో ఉన్న కేరళీయులు ఘనంగా జరుపుకుంటారు.