![Amala Paul Reveals Son Ilai Face On Onam Festival 2024](/styles/webp/s3/article_images/2024/09/15/amala-paul-son-face.jpg.webp?itok=GAGHrJ80)
తెలుగులో అప్పట్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్‌గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. మధ్యలో రెండో పెళ్లి చేసుకుంది. 2023లో పెళ్లి జరగ్గా.. ఈ జూన్‌లో కొడుకు పుట్టాడు. తాజాగా ఓనం పండగ సందర్భంగా కొడుకు ముఖాన్ని రివీల్ చేసింది. అలానే క్యూట్ ఫొటోలకు పోజులిచ్చింది.
(ఇదీ చదవండి: ఏడు నెలల క్రితం నాకు బ్రేకప్: మృణాల్ ఠాకుర్)
తమిళ సినిమాలతో హీరోయిన్‌గా పరిచయమైన అమలాపాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్‌లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది.
ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. అలానే భర్తని ముద్దాడింది. ఈ ఫొటోలన్నింటినీ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫ్యామిలీని చూస్తుంటేనే చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/amala-paul-son.jpg)
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/amala-paul-son-husband_0.jpg)
Comments
Please login to add a commentAdd a comment