వయసొచ్చిన తర్వాత చాలామంది ప్రేమలో పడుతుంటారు. ఇది సాధారణమైన విషయమే. సెలబ్రిటీలు కూడా దీనికి అతీతులేం కాదు. అయితే ప్రేమ ఎల్లకాలం ఉండదన్నట్లు బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వీటిని ఎవరూ పెద్దగా బయటపెట్టరు. కానీ 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ మాత్రం తనకు ఏడు నెలల క్రితం బ్రేకప్ జరిగిన విషయాన్ని రివీల్ చేసింది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తన లవ్ స్టోరీస్ గురించి చెప్పింది.
'సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చేవరకు వచ్చివెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. మీకు ఎవరు సూట్ అవుతారనేది మీకే తెలుస్తుంది. అంతెందుకు నేను గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా. కానీ నటితో డేటింగ్ అతడికి ఎందుకో ఇష్టం లేదు. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దీంతో బ్రేకప్ చెప్పేసుకున్నాం. ఏడు నెలల క్రితం కూడా నాకు బ్రేకప్ అయింది. అయితే నన్ను చేసుకునేవాడికి లుక్స్ లేకపోయినా పర్లేదు కానీ మంచి మనిషి అయ్యిండాలి' అని మృణాల్ ఠాకుర్ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)
ఇప్పటివరకు తన జీవితంలో బ్రేకప్స్ జరిగాయి కానీ మరీ బాధపడిపోయేంతలా ఏం కాలేదని మృణాల్ చెప్పింది. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని పేర్కొంది. మరి మృణాల్ ఠాకుర్ మనసు గెలుచుకునేవాడు ఎక్కడున్నాడో ఏమో చూడాలి?
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకుర్.. హిందీలో పలు సినిమాలు చేసింది. 'సీతారామం' మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' తదితర చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఫోకస్ అంతా హిందీపైనే ఉంది. తెలుగులో ఇప్పుడప్పుడే మూవీ చేస్తుందో లేదో డౌటే?
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. హాజరైన సీఎం)
Comments
Please login to add a commentAdd a comment