
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మొద టి సెమీ ఫైనల్ తొలి అంచెలో ముంబై సిటీ ఎఫ్‌సీపై బెంగళూరు ఎఫ్‌సీ పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో ముంబైని ఓడించింది. మ్యాచ్ 79వ నిమిషంలో స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి చేసిన ఏకైక గోల్‌తో బెంగళూరు విజేతగా నిలిచింది.
అయితే ఈ గెలుపుతో బెంగళూరు ఫైనల్ చేరడం ఖాయం కాలేదు. ఇంటా, బయటా పద్ధతిలో ఒక సెమీస్ మ్యాచ్‌ను రెండు అంచెలుగా నిర్వహిస్తుండగా... ఇరు జట్లు ఆదివారం బెంగళూరులో జరిగే రెండో అంచె పోరులో మళ్లీ తలపడతాయి. మరో వైపు రెండో సెమీఫైనల్లో భాగంగా గురువారం హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ మధ్య గురువారం హైదరాబాద్‌లో తొలి అంచె మ్యాచ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment