Mumbai City FC
-
హైదరాబాద్ పరాజయం
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 0–1 గోల్ తేడాతో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ చేతిలో ఓటమి పాలైంది. ముంబై జట్టు తరఫున మెహతాబ్ సింగ్ (29వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్‌లో ముంబై జట్టు హైదరాబాద్ గోల్ పోస్ట్‌పై 4 షాట్లు బాదగా... అందులో ఒకటి లక్ష్యాన్ని చేరింది. హైదరాబాద్ మూడు ప్రయత్నాలు చేసినా ఖాతా తెరవలేకపోయింది. 55 శాతం బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ముంబై చివరకు విజేతగా నిలిచింది. తాజా సీజన్లో 9 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు 2 విజయాలు, ఒక ‘డ్రా’, 6 పరాజయాలతో 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 11వ స్థానంలో ఉండగా... ముంబై జట్టు 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 ‘డ్రా’లు, 2 పరాజయాలతో 13 పాయింట్లు సాధించి పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 1–0 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. మోహన్ బగాన్ తరఫున జాసన్ కమింగ్స్ (86వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆరో విజయం ఖాతాలో వేసుకున్న మోహన్ బగాన్ జట్టు 20 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది. ఆదివారం ఒడిశా జట్టుతో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తలపడనుండగా... హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ను బుధవారం గోవా ఫుట్‌బాల్ క్లబ్‌తో ఆడనుంది. -
ISL 2023: బెంగళూరును గెలిపించిన సునీల్ ఛెత్రి
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మొద టి సెమీ ఫైనల్ తొలి అంచెలో ముంబై సిటీ ఎఫ్‌సీపై బెంగళూరు ఎఫ్‌సీ పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో ముంబైని ఓడించింది. మ్యాచ్ 79వ నిమిషంలో స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి చేసిన ఏకైక గోల్‌తో బెంగళూరు విజేతగా నిలిచింది. అయితే ఈ గెలుపుతో బెంగళూరు ఫైనల్ చేరడం ఖాయం కాలేదు. ఇంటా, బయటా పద్ధతిలో ఒక సెమీస్ మ్యాచ్‌ను రెండు అంచెలుగా నిర్వహిస్తుండగా... ఇరు జట్లు ఆదివారం బెంగళూరులో జరిగే రెండో అంచె పోరులో మళ్లీ తలపడతాయి. మరో వైపు రెండో సెమీఫైనల్లో భాగంగా గురువారం హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ మధ్య గురువారం హైదరాబాద్‌లో తొలి అంచె మ్యాచ్ జరుగుతుంది. -
ముంబై చేతిలో కేరళ ఓటమి
ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ముంబై సిటీ ఎఫ్‌సీ అజేయంగా దూసుకెళుతోంది. కేరళ బ్లాస్టర్స్‌ను వారి సొంతగడ్డపైనే ముంబై ఓడించింది. కొచ్చిలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై సిటీ 2–0తో కేరళను కంగు తినిపించింది. ముంబై తరఫున మెహతాబ్ (22వ ని.), పెరేరా దియాజ్ (31వ ని.) చెరో గోల్ చేయడంతో ఆట అర్ధభాగంలోనే ముంబై 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్ధంలో ప్రత్యర్థి స్ట్రయికర్లకు చెక్ పెట్టడంతో ముంబై విజయం సాధించింది. ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లాడిన ముంబై సిటీ ఎఫ్‌సీ రెండింటిలో గెలుపొందగా, మరో రెండు మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గోవాతో హైదరాబాద్, ఈస్ట్ బెంగాల్‌తో ఏటీకే మోహన్ బగాన్ తలపడతాయి. చదవండి: PKL 9: జైపూర్పై తలైవాస్ గెలుపు -
ముంబై మురిసింది
మార్గోవా: లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) అసలు సిసలు అంతిమ సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020– 2021 సీజన్లో చాంపియన్‌గా అవతరించింది. ఏటీకే మోహన్ బగాన్ క్లబ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో ముంబై సిటీ జట్టు 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించి తొలిసారి ఐఎస్ఎల్ ట్రోఫీని హస్తగతం చేసుకుంది. మ్యాచ్ నిర్ణీత సమయం ముగియడానికి మరో నిమిషం ఉండగా రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఇక అదనపు సమయానికి మ్యాచ్ దారితీస్తుందని భావిస్తున్న తరుణంలో ముంబై సిటీ ఆటగాడు బిపిన్ సింగ్ అద్భుతం చేశాడు. ‘డి’ ఏరియా అంచులో మోహన్ బగాన్ గోల్‌కీపర్ బంతిని ఒడిసి పట్టుకోవడంలో విఫలం కావడం... వెంటనే ముంబై ఆటగాడు ఒగ్బెచె దానిని అందుకొని బిపిన్ సింగ్‌కు పాస్ ఇవ్వగా... బిపిన్ సింగ్ కళ్లుచెదిరే కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించడం... ముంబై సిటీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లడం సెకన్లలో జరిగిపోయింది. 90 నిమిషాలు ముగిశాక ఇంజ్యూరీ టైమ్‌గా అదనంగా నాలుగు నిమిషాలు ఆడించారు. ఈ నాలుగు నిమిషాలు ముంబై జట్టు ప్రత్యర్థిని నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆట 18వ నిమిషంలో విలియమ్స్ గోల్‌తో మోహన్ బగాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 29వ నిమిషంలో మోహన్ బగాన్ జట్టు డిఫెండర్ టిరీ సెల్ఫ్ గోల్‌తో ముంబై సిటీ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలో పలు మార్లు గోల్‌చేసే అవకాశాలను వదులుకున్నాయి. చివరి నిమి షంలో బిపిన్ సింగ్ అద్భుత గోల్‌తో ముంబై ఖాతాలో విజయం చేరింది. విజేత ముంబై సిటీకి రూ. 8 కోట్లు... రన్నరప్ మోహన్ బగాన్‌కు రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీ లభిం చాయి. ‘గోల్డెన్ బూట్’ అవార్డును సీజన్లో 14 గోల్స్ చేసిన ఇగోర్ (గోవా) దక్కించుకోగా... ‘గోల్డెన్ గ్లవ్’ అవార్డు మోహన్ బగాన్ గోల్‌కీపర్ ఆరిందమ్ భట్టాచార్య పొందాడు. బెంగళూరు తర్వాత (2018–2019 సీజన్) లీగ్ దశలో ‘టాప్ ర్యాంక్’లో నిలువడంతోపాటు టైటిల్‌నూ నెగ్గిన రెండో జట్టుగా ముంబై గుర్తింపు పొందింది. -
ముంబైపై గోవా విజయం
ముంబై: సొంత ప్రేక్షకుల మధ్య ముంబై సిటీ ఎఫ్‌సీ తడబడింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 2–4 గోల్స్ తేడాతో గోవా ఎఫ్‌సీ చేతిలో ఓడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన గోవా ఎఫ్‌సీ సీజన్లో రెండో విజయాన్ని ఖాయం చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గోల్స్ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో గోవా ఆటగాళ్లలో లెన్ని రోడ్రిగస్ (27వ ని.), ఫెర్రాన్ కొరొమినస్ (45వ ని.), హ్యూగో బొవుమౌస్ (59వ ని.), కార్లోస్ పెన (89వ ని.) తలా ఓ గోల్ చేశారు. ముంబై తరఫున సార్థక్ గోలుయ్ (49వ ని.), సౌవిక్ చక్రబర్తి (55వ ని.) చెరో గోల్ సాధించారు. -
ముంబైకి షాకిచ్చిన పుణే
ముంబై: ఇక మ్యాచ్ డ్రా ఖాయమనుకున్న సమయంలో సొంత గడ్డపై ముంబై సిటీ ఎఫ్సీకి... ఎఫ్‌సీ పుణే సిటీ షాకిచ్చింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే 1-0తో నెగ్గింది. 89వ నిమిషంలో యుగెనెసన్ లింగ్డో చేసిన గోల్‌తో పుణే గట్టెక్కింది. మ్యాచ్ చివరి వరకు కూడా ముంబై సిటీ ఆధిక్యం కనబరిచినా గోల్స్ చేయడంలో విఫలమైంది. అరుుతే పుణే మాత్రం పట్టు వదలకుండా పోరాడింది. లెప్ట్ వింగ్ నుంచి నారాయణ్ దాస్ ఇచ్చిన క్రాస్‌ను లింగ్డో ఎలాంటి పొరపాటుకు తావీయకుండా నెట్లోకి పంపడంతో పుణేకు అద్భుత విజయం దక్కింది. -
ముంబై సిటీ ఎఫ్‌సీ విజయం
పుణే: ఐఎస్ఎల్ మూడో సీజన్లో ముంబై సిటీ ఎఫ్‌సీ శుభారంభం చేసింది. సోమవారం తమ తొలి మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీపై 1-0తో ముంబై నెగ్గింది. 69వ నిమిషంలో మటియాస్ ఏకైక గోల్ సాధించాడు. పుణేకు ఆరంభంలోనే రెండు ఫ్రీ కిక్ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. -
ముంబై సిటీ ఎఫ్‌సీ కోచ్‌గా అనెల్కా
ఐఎస్ఎల్ ఫ్రాంచైజీ ప్రకటన ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ కోసం ముంబై సిటీ ఎఫ్‌సీ తమ జట్టు కోచ్ కమ్ ఆటగాడిగా స్ట్రయికర్ నికోలస్ అనెల్కాను నియమించింది. తన నాయకత్వంలో ముంబై జట్టు ఈసారి మెరుగైన ఫలితాలను రాబడుతుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఈ ప్రముఖ ఆటగాడు గత సీజన్లో రెండు గోల్స్ సాధించాడు. ‘ఈ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై సిటీ ఎఫ్‌సీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కొత్త సీజన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఈసారి కచ్చితంగా గట్టి పోటీనిచ్చి టైటిల్ బరిలో నిలుస్తామని ఆశిస్తున్నాను’ అని 36 ఏళ్ల అనెల్కా తెలిపాడు. అలాగే గత ఏడాది తన అద్భుత నైపుణ్యంతో పాటు యువ ఆటగాళ్లను ఉత్తేజపరిచిన విధానం తమను ఆకట్టుకుంటుందని, అందుకే ఈసారి కోచ్ బాధ్యతను కూడా అనెల్కాకే కట్టబెట్టినట్టు టీమ్ యజమాని రణబీర్ కపూర్ తెలిపాడు. 69 అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు అనెల్కాకు అర్సెనల్, చెల్సీ, మాంచెస్టర్ సిటీ, రియల్ మాడ్రిడ్, లివర్‌పూల్, జువెంటస్ లాంటి అగ్రశ్రేణి క్లబ్బుల తరఫున ఆడిన అనుభవం ఉంది. అలాగే 2012లోనూ అనెల్కా.. చైనీస్ క్లబ్ షాంఘై షెన్హువాకు ఇలాగే రెండు బాధ్యతలు నిర్వర్తించాడు. -
దుమ్ము రేపిన ఢిల్లీ
4-1తో ముంబైపై గెలుపు న్యూఢిల్లీ: ఐఎస్ఎల్లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు సత్తా చూపింది. శుక్రవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ 4-1 తేడాతో నెగ్గింది. మ్యాచ్ ప్రథమార్ధం ముగుస్తుందనగా 44వ నిమిషంలో ఢిల్లీ తరఫున ముల్డర్ గోల్ చేశాడు. ఆ తర్వాత 50వ నిమిషంలో జుంకర్, 60వ నిమిషంలో డాస్ సాంటోస్ గోల్స్‌తో జట్టు 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 86వ నిమిషంలో ముంబైకి అభిషేక్ గోల్‌తో ఓదార్పు దక్కింది. కానీ 90వ నిమిషంలో మనీష్ గోల్‌తో ముంబై దారుణ పరాజయం పాలైంది. ఢిల్లీ ప్రస్తుతం 13 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది. ముంబై 12 పాయింట్లతో అట్టడుగున ఉంది.