4-1తో ముంబైపై గెలుపు
న్యూఢిల్లీ: ఐఎస్‌ఎల్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు సత్తా చూపింది. శుక్రవారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ 4-1 తేడాతో నెగ్గింది. మ్యాచ్ ప్రథమార్ధం ముగుస్తుందనగా 44వ నిమిషంలో ఢిల్లీ తరఫున ముల్డర్ గోల్ చేశాడు.
ఆ తర్వాత 50వ నిమిషంలో జుంకర్, 60వ నిమిషంలో డాస్ సాంటోస్ గోల్స్‌తో జట్టు 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 86వ నిమిషంలో ముంబైకి అభిషేక్ గోల్‌తో ఓదార్పు దక్కింది. కానీ 90వ నిమిషంలో మనీష్ గోల్‌తో ముంబై దారుణ పరాజయం పాలైంది. ఢిల్లీ ప్రస్తుతం 13 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది. ముంబై 12 పాయింట్లతో అట్టడుగున ఉంది.
దుమ్ము రేపిన ఢిల్లీ
Published Sat, Nov 29 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement
Advertisement