ముంబై సిటీ ఎఫ్‌సీ విజయం
పుణే: ఐఎస్‌ఎల్ మూడో సీజన్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ శుభారంభం చేసింది. సోమవారం తమ తొలి మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీపై 1-0తో ముంబై నెగ్గింది. 69వ నిమిషంలో మటియాస్ ఏకైక గోల్ సాధించాడు. పుణేకు ఆరంభంలోనే రెండు ఫ్రీ కిక్ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు.