FC Pune City
-
ముంబై సిటీ ఎఫ్‌సీ విజయం
పుణే: ఐఎస్ఎల్ మూడో సీజన్లో ముంబై సిటీ ఎఫ్‌సీ శుభారంభం చేసింది. సోమవారం తమ తొలి మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీపై 1-0తో ముంబై నెగ్గింది. 69వ నిమిషంలో మటియాస్ ఏకైక గోల్ సాధించాడు. పుణేకు ఆరంభంలోనే రెండు ఫ్రీ కిక్ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. -
పుణే, కోల్‌కతా మ్యాచ్ డ్రా
పుణే: ఐఎస్ఎల్లో ఎఫ్‌సీ పుణే సిటీ, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పుణే నాకౌట్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. 17 పాయింట్లతో కోల్‌కతా రెండో స్థానంలో ఉండగా, 13 పాయింట్లతో పుణే ఏడో స్థానంలో కొనసాగుతోంది. 11వ నిమిషంలోనే కోల్‌కతా తరఫున పోడి అద్భుత రీతిలో హెడర్ గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో ఉంచాడు. ఆ తర్వాత ప్రథమార్ధం చివర 45వ నిమిషంలో కట్సౌరనీస్ గోల్‌తో పుణే స్కోరును సమం చేసింది. ద్వితీయార్ధంలో ఇరు జట్లుపేలవ ఆటతీరును ప్రదర్శించడంతో గోల్స్ నమోదు కాలేదు. కొచ్చిలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో చెన్నైయిన్ జట్టు తలపడుతుంది. -
నార్త్ఈస్ట్పై పుణే విజయం
పుణే: నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీ 1-0తో విజయం సాధించింది. ఐఎస్ఎల్లో భాగంగా సోమవారం శ్రీ శివ్ చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జాన్ గూసెన్స్ (88వ నిమిషంలో) గోల్‌తో పుణే గట్టెక్కింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్ల మధ్య గోల్ కోసం హోరాహోరీ పోరు జరిగింది. గోల్‌కీపర్లు సమర్థంగా అడ్డుకోవడంతో ఇరు జట్ల ఆటగాళ్ల ప్రయత్నాలు విఫలయమ్యాయి. అయితే ద్వితీయార్ధం 88వ నిమిషంలో పుణేకు అవకాశం చిక్కింది. అవుట్ సైడ్ బాక్సు నుంచి డుడు కొట్టిన కిక్.. క్రాస్ బార్‌కు తాకి బయటకు రాగా అక్కడే ఉన్న జాన్ గూసెన్స్ హెడర్ గోల్‌తో బంతిని గోల్ పోస్టులోకి పంపి తమ శిబిరంలో ఆనందం నింపాడు. ఈ విజయంతో పుణే ఏడు పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది.