ఇక మ్యాచ్ డ్రా ఖాయమనుకున్న సమయంలో సొంత గడ్డపై ముంబై సిటీ ఎఫ్‌సీకి... ఎఫ్‌సీ పుణే సిటీ షాకిచ్చింది.
ముంబై: ఇక మ్యాచ్ డ్రా ఖాయమనుకున్న సమయంలో సొంత గడ్డపై ముంబై సిటీ ఎఫ్‌సీకి... ఎఫ్‌సీ పుణే సిటీ షాకిచ్చింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే 1-0తో నెగ్గింది. 89వ నిమిషంలో యుగెనెసన్ లింగ్డో చేసిన గోల్‌తో పుణే గట్టెక్కింది.
మ్యాచ్ చివరి వరకు కూడా ముంబై సిటీ ఆధిక్యం కనబరిచినా గోల్స్ చేయడంలో విఫలమైంది. అరుుతే పుణే మాత్రం పట్టు వదలకుండా పోరాడింది. లెప్ట్ వింగ్ నుంచి నారాయణ్ దాస్ ఇచ్చిన క్రాస్‌ను లింగ్డో ఎలాంటి పొరపాటుకు తావీయకుండా నెట్‌లోకి పంపడంతో పుణేకు అద్భుత విజయం దక్కింది.