4–2 గోల్స్ తేడాతో ఒడిశాపై గెలుపు
ఇండియన్ సూపర్ లీగ్
భువనేశ్వర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో గోవా ఫుట్‌బాల్ క్లబ్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గోవా 4–2 గోల్స్ తేడాతో ఒడిశాను చిత్తుచేసింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెస్ (8వ, 53వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో విజృంభించగా... ఉదాంత సింగ్ (45+2వ నిమిషంలో), అమెయ్ రణవాడె (56వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. ఒడిశా తరఫున అహ్మద్ (29వ నిమిషంలో), జెరీ (88వ ని.లో) చెరో గోల్ చేశారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై గోవా 7 షాట్స్ ఆడగా... ఒడిశా 5 షాట్లు కొట్టింది.
తాజా సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన గోవా 7 ఇజయాలు, 2 పరాజయాలతు, 4 ‘డ్రా’లతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఒడిశా 14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 20 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో జంషెడ్‌పూర్ ఫుట్‌బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది.
జంషెడ్‌పూర్ తరఫున జోర్డన్ ముర్రే (84వ నిమిషంలో), మొహమ్మద్ ఉవైస్ (90వ నిమిషంలో) చెరో గోల్ సాధించగా... బెంగళూరు తరఫున అల్బెర్టో నొగురె (19వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్ ఆరంభంలో దూకుడు కనబర్చిన బెంగళూరు 19వ నిమిషంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా జంషెడ్‌పూర్ వెంటవెంటనే రెండు గోల్స్ చేసి విజయం సాధించింది.
ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన బెంగళూరు 8 విజయాలు 3 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 27 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో కొనసాగుతుండగా... జంషెడ్‌పూర్ 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 5 పరాజయాలతో 24 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ ఫుట్‌బాల్ క్లబ్‌తో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment