ఒడిశాపై బెంగళూరు గెలుపు | Bangalore Beats Odisha | Sakshi
Sakshi News home page

ఒడిశాపై బెంగళూరు గెలుపు

Published Thu, Dec 5 2019 1:30 AM | Last Updated on Thu, Dec 5 2019 1:30 AM

Bangalore Beats Odisha - Sakshi

పుణే: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ సీజన్‌–6లో బెంగళూరు ఎఫ్‌సీ తన జోరు కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1–0తో ఒడిశా ఎఫ్‌సీపై విజయం సాధించింది. సీజన్‌లో మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆట ఆరంభం నుంచే ఇరు జట్లు కూడా దూకుడైన ఆటతీరుకే ప్రాధాన్యం ఇచ్చాయి. అటాక్, కౌంటర్‌ అటాక్‌లతో ప్రత్యర్థి ‘డి’ బాక్సుల్లోకి చొచ్చు కొని వెళ్లాయి. అయితే గోల్‌ కీపర్లు అడ్డుగోడగా నిలవడంతో గోల్‌ చేయడంలో ఇరు జట్లు సఫలం కాలేదు. ఆట 37వ నిమిషంలో లభించిన కార్నర్‌ కిక్‌ను గోల్‌గా మలిచిన జునాన్‌ బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. రెండో అర్ధభాగంలో గోల్‌ కోసం ఒడిశా చేసిన ప్రయత్నాలను బెంగళూరు గోల్‌ కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు అద్భుతంగా అడ్డుకున్నాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న బెంగళూరు విజయాన్ని ఖాయం చేసుకుంది. నేటి మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో కేరళ తలపడుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement