
2–0 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్ చిత్తు
ఇండియన్ సూపర్ లీగ్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) 12వ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో గోవా జట్టు 2–0 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. గోవా జట్టు తరఫున ఇకెర్ గుర్రొటెనె (46వ నిమిషంలో), మొహమ్మద్ యాసిర్ (73వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. హోయ్‌్చలో గోవా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై 6 షాట్లు ఆడగా... కేరళ బ్లాస్టర్స్ ఒక్కటేసారి గోల్ పోస్ట్‌పైకి గురిచూసినా అది లక్ష్యాన్ని చేరలేదు.
తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడిన గోవా జట్టు 12 విజయాలు, 3 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 42 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్ 21 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 11 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు సాధించి 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు 3–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది.
ఈస్ట్ బెంగాల్ తరఫున దిమిత్రోస్ (15వ నిమిషంలో), మహేశ్ సింగ్ (47వ నిమిషంలో), లాల్‌చుంగుంగా (54వ నిమిషంలో) తలా ఒక గోల్ కొట్టారు. పంజాబ్ తరఫున ఇజెక్వెల్ విడాల్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం ఈస్ట్ బెంగాల్ జట్టు 24 పాయింట్లతో పట్టిక తొమ్మిదో స్థానంలో ఉండగా... పంజాబ్ అన్నే పాయింట్లతో 11వ స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో మోహన్ బగాన్‌తో ఒడిషా ఫుట్‌బాల్ క్లబ్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment