కేరళ బ్లాస్టర్స్‌పై ఘనవిజయం
ఇండియన్ సూపర్ లీగ్
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ జోరు కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొహన్ బగాన్ తరఫున జేమీ మెక్‌లారెన్ (33వ నిమిషంలో), జాసన్ కమింగ్స్ (86వ ని.లో), అల్బెర్టో రోడ్రిగ్వేజ్ (90+5వ ని.లో) తలా ఒక గోల్ సాధించారు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జెసెస్ జిమెనెజ్ (51వ ని.లో), మిలోస్ డ్రింకిక్ (77వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
తాజా సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన మోహన్ బగాన్ జట్టు 8 విజయాలు, ఒక పరాజయం, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్ 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 పరాజయాల, 2 ‘డ్రా’లతో 11 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, గోవా ఫుట్‌బాల్ క్లబ్ మధ్య శనివారమే జరిగిన మరో మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది.
బెంగళూరు తరఫున ర్యాన్ విలియమ్స్ (71వ నిమిషంలో), జార్జ్ డియాజ్ (83వ ని.లో) చెరో గోల్ చేయగా... గోవా తరఫున సందేశ్ జింగాన్ (7వ ని.లో), సాహిల్ తవోరా (66వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొలి సగంలో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్న బెంగళూరు జట్టు... ద్వితీయార్థంలో సత్తాచాటి స్కోరు సమం చేసింది.
తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన బెంగళూరు 7 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉండగా... గోవా (19 పాయింట్లు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment