mohun bagan
-
గోవా ఘనవిజయం
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గోవా ఫుట్‌బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో మోహన్ బగాన్‌పై గెలుపొందింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెజ్ (12వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో విజృంభించగా... మోహన్ బగాన్ జట్టు తరఫున దిమిత్రి పెట్రాటస్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... మోహన్ బగాన్ జట్టు 59 శాతం బంతిని తమ ఆధీనంలో పెట్టుకొని మూడుసార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసి ఒక గోల్ నమోదు చేసింది. అదే సమయంలో 5 సార్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేసిన గోవా జట్టు అందులో రెండుసార్లు సఫలమైంది. లీగ్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన గోవా జట్టు 6 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మోహన్ బగాన్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. శనివారం జరగనున్న మ్యాచ్‌ల్లో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో చెన్నైయిన్ జట్టు (సాయంత్రం గం. 5:00 నుంచి), ఈస్ట్ బెంగాల్ జట్టుతో జంషెడ్పూర్ ఎఫ్‌సీ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. -
మోహన్ బగాన్ ‘టాప్’ షో
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ జోరు కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (33వ నిమిషంలో), జాసన్ కమింగ్స్ (86వ ని.లో), అల్బెర్టో రోడ్రిగ్వేజ్ (90+5వ ని.లో) తలా ఒక గోల్ సాధించారు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జెసెస్ జిమెనెజ్ (51వ ని.లో), మిలోస్ డ్రింకిక్ (77వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తాజా సీజన్లో 11 మ్యాచ్‌లాడిన మోహన్ బగాన్ జట్టు 8 విజయాలు, ఒక పరాజయం, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. కేరళ బ్లాస్టర్స్ 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 7 పరాజయాల, 2 ‘డ్రా’లతో 11 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, గోవా ఫుట్‌బాల్ క్లబ్ మధ్య శనివారమే జరిగిన మరో మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. బెంగళూరు తరఫున ర్యాన్ విలియమ్స్ (71వ నిమిషంలో), జార్జ్ డియాజ్ (83వ ని.లో) చెరో గోల్ చేయగా... గోవా తరఫున సందేశ్ జింగాన్ (7వ ని.లో), సాహిల్ తవోరా (66వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొలి సగంలో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్న బెంగళూరు జట్టు... ద్వితీయార్థంలో సత్తాచాటి స్కోరు సమం చేసింది. తాజా సీజన్లో 12 మ్యాచ్‌లాడిన బెంగళూరు 7 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో ఉండగా... గోవా (19 పాయింట్లు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
మోహన్ బగాన్ గెలుపు
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు 3–0తో జంషెడ్పూర్ ఎఫ్‌సీపై ఘనవిజయం సాధించింది. టామ్ అల్డ్రెడ్ (15వ ని.), లిస్టన్ కొలాకొ (45+2వ ని.), జేమి మెక్లారెన్ (75వ ని.) తలా ఒక గోల్ చేశారు. తాజా విజయంతో మోహన్ బగాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 8 మ్యాచ్‌లాడిన ఈ జట్టు ఐదింట గెలుపొంది ఒక మ్యాచ్‌లో ఓడింది. 2 మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. మరో మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో పంజాబ్ ఎఫ్‌సీపై గెలుపొందింది. నార్త్ ఈస్ట్ జట్టులో గులెర్మో ఫెర్నాండెజ్ (15వ ని.), నెస్టర్ అల్బియక్ (18వ ని.) చెరో గోల్ చేశారు. పంజాబ్ తరఫున ఇవాన్ నొవొసెలెక్ (88వ ని.) గోల్ సాధించాడు. -
23 ఏళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా.. రికార్డుస్థాయిలో
కోల్‌కతా: ఆసియాలోనే అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్‌ను మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్ జట్టు రికార్డుస్థాయిలో 17వ సారి సొంతం చేసుకుంది. ఫైనల్లో మోహన్ బగాన్ క్లబ్ 1–0తో ఈస్ట్ బెంగాల్ క్లబ్‌ను ఓడించి 23 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో మళ్లీ చాంపియన్‌గా నిలిచింది. ఆట 71వ నిమిషంలో పెట్రాటోస్ చేసిన గోల్‌తో మోహన్ బగాన్ క్లబ్ గెలిచింది. 135 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లు 16 సార్లు చొప్పున విజేతగా నిలిచి అత్యధికసార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే తాజా టైటిల్‌తో మోహన్ బగాన్ టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. -
ఐఎస్ఎల్ విజేత ఏటీకే మోహన్ బగాన్
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టైటిల్‌ను ఏటీకే మోహన్ బగాన్ (కోల్‌కతా) ఫుట్‌బాల్ క్లబ్ తొలిసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో ఏటీకే మోహన్ బగాన్ ‘పెనాల్టీ షూటౌట్’లో 4–3తో బెంగళూరు ఎఫ్‌సీ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగా ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’ లో మోహన్ బగాన్ తరఫున వరుసగా పెట్రాటోస్, లిస్టన్, కియాన్, మాన్వీర్ గోల్స్ చేశారు. బెంగళూరు తరఫున అలన్ కోస్టా, రాయ్ కృష్ణ, సునీల్ చెత్రి సఫలంకాగా... రమిరెస్, పెరెజ్ విఫలమయ్యారు. -
హైదరాబాద్ ఎఫ్సీకి వరుసగా రెండో పరాభవం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఏటీకే మోహన్ బగాన్ 1–0తో హైదరాబాద్‌ను ఓడించింది. మోహన్ బగాన్ తరఫున 11వ నిమిషంలో బుమూస్ ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
బ్రిటన్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంది
1911 జూలై 29 న ఆంగ్లేయులపై మనం సాకర్‌లో విజయం సాధించాం. అందుకు గుర్తుగా ఏటా ఈ రోజున ‘మోహన్ బగాన్’ డే జరుపుకుంటున్నాం. కలకత్తాలోని ‘మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్’ తరఫున మన భారత జట్టు.. ఆంగ్లేయ క్రీడాకారుల జట్టు అయిన ‘ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్’తో తలపడి ‘ఐ.ఎఫ్.ఎ. షీల్డ్’ పైనల్ మ్యాచ్‌లో నెగ్గింది. బెంగాల్ విభజనతో దేశం ఆగ్రహావేశాలతో ఉన్న సమయంలో బ్రిటిషర్లపై మనం సాధించిన ఆ ఘన విజయం.. ‘మా జన్మభూమిలో మాదే పైచేయి’ అనే బలమైన సంకేతాన్ని బ్రిటన్‌కు పంపినట్లయింది. కలకత్తాలో మ్యాచ్ జరిగింది. బెంగాల్‌తో పాటు దేశం మొత్తం ఉత్సవం జరుపుకుంది. ‘బ్రిటిష్ వాళ్లను భారత్ ఓడించింది..’ అనే విజయగర్వం ప్రతి ఒక్కరిలోనూ తొణికిసలాడింది. మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్ 1889లో ప్రారంభం అయింది. క్లబ్బుకి ఆ పేరే పెట్టడానికి కారణం ఉంది. కలకత్తాలో కీర్తి మిత్రా అనే క్రీడాభిమాని బంగ్లా పేరు మోహన్ బగాన్. ఆ బంగ్లాలో, ఆనాటి బెంగాల్ ప్రముఖుల సమక్షంలో క్లబ్ ఆరంభం అవడంతో క్లబ్‌కి కూడా మోహన్‌బగాన్ అనే నామకరణం చేశారు. 1911లో ‘వస్తారా మాతో పోటీకి’ అని ఇంగ్లిష్ వాళ్లే మొదట మోహన్ బగాన్ క్లబ్బుకు సవాల్ విసిరారు. ఆ సవాల్‌ని మనవాళ్లు స్వీకరించారు. ప్రతిష్ఠాత్మక ఐ.ఎఫ్.ఎ. షీల్డ్ టోర్నమెంట్లో విజయం సాధించారు. విశేషం ఏంటంటే.. బ్రిటిష్ జట్టు బూట్లతో బరిలోకి దిగితే, బగాన్ జట్టు వట్టికాళ్లతో దిగింది. ఇప్పటి మన క్రికెటర్లు మ్యాచ్ గెలిస్తే ఒంటిపై చొక్కాలు తీసేస్తారు కదా, అప్పటి బగాన్ విజేతలు ఆనందం పట్టలేక చొక్కాలు చింపుకుని చిందులేశారు. గాంధీ–ముసోలినీ మీట్ గాంధీజీ శాంతిప్రియులు. అహింసావాది. ఇటలీ నియంత ముసోలినీ అందుకు పూర్తిగా విరుద్ధం. బ్రిటిష్ వాళ్లంటే మనకు కంపరం కదా, బ్రిటిష్ వాళ్లకే కంపరం కలిగించిన ఫాసిస్టు పాలకుడు ముసోలిని. అలాంటి వ్యక్తిని కలవడానికి గాంధీజీ బయల్దేరి వెళ్లడం.. బ్రిటన్‌కి పెద్ద షాక్. గాంధీజీకీ అసలు ముసోలిని కలిసే ఉద్దేశమే లేదు. 1931లో రౌండ్ టేబుల్ సమావేశానికని లండన్ వెళ్లి, సమావేశం అయ్యాక ఇండియా తిరిగి వచ్చేందుకు ఇటలీ షిప్ ఎక్కారు గాంధీజీ. షిప్ రోమ్‌లో ఆగినప్పుడు పోప్‌ని కలిసేందుకు గాంధీజీ ప్రయత్నించారు కానీ కుదరలేదు. అయితే గాంధీజీని ముసోలిని కలవాలని అనుకుంటున్నారన్న కబురు వచ్చింది. ఆరోజు డిసెంబర్ 12, 1931. గాంధీజీ పక్కనే ఆయన కార్యదర్శి మహదేవ్ దేశాయ్, అంతరంగికురాలు మీరాబెన్ ఉన్నారు. ముగ్గురూ కలిసి ముసోలినీ కలిశారు. గాంధీజీ, ముసోలినీ కొద్దిసేపు భారత రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత గాంధీజీ ఇండియా వచ్చాక బ్రిటన్ పత్రికలన్నీ రగడ చేశాయి. నియంత ముసోలినిని ప్రశంసించిన గాంధీజీ అని పత్రికలన్నీ చిలవలు పలవలు చేసి ఉన్నవీ లేనివి రాశాయి. నేడు ముసోలిని జయంతి. 1883 జూలై 29న ఆయన జన్మించారు. ఇటలీ అంతర్యుద్ధంలో దేశాన్ని అధోగతిపాలు చేసినందుకు కమ్యూనిస్టులు అతడిని 1945 ఏప్రిల్ 28న కాల్చిచంపారు. ముసోలినీ మార్క్సిస్టు. తనని తను ‘అధారిటేరియన్ కమ్యూనిస్టు’ అని చెప్పుకునేవారు. (చదవండి: మహాత్ముడి మాటే మహాదేవి బాట) -
ముంబై మురిసింది
మార్గోవా: లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) అసలు సిసలు అంతిమ సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020– 2021 సీజన్లో చాంపియన్‌గా అవతరించింది. ఏటీకే మోహన్ బగాన్ క్లబ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో ముంబై సిటీ జట్టు 2–1 గోల్స్ తేడాతో విజయం సాధించి తొలిసారి ఐఎస్ఎల్ ట్రోఫీని హస్తగతం చేసుకుంది. మ్యాచ్ నిర్ణీత సమయం ముగియడానికి మరో నిమిషం ఉండగా రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఇక అదనపు సమయానికి మ్యాచ్ దారితీస్తుందని భావిస్తున్న తరుణంలో ముంబై సిటీ ఆటగాడు బిపిన్ సింగ్ అద్భుతం చేశాడు. ‘డి’ ఏరియా అంచులో మోహన్ బగాన్ గోల్‌కీపర్ బంతిని ఒడిసి పట్టుకోవడంలో విఫలం కావడం... వెంటనే ముంబై ఆటగాడు ఒగ్బెచె దానిని అందుకొని బిపిన్ సింగ్‌కు పాస్ ఇవ్వగా... బిపిన్ సింగ్ కళ్లుచెదిరే కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించడం... ముంబై సిటీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లడం సెకన్లలో జరిగిపోయింది. 90 నిమిషాలు ముగిశాక ఇంజ్యూరీ టైమ్‌గా అదనంగా నాలుగు నిమిషాలు ఆడించారు. ఈ నాలుగు నిమిషాలు ముంబై జట్టు ప్రత్యర్థిని నిలువరించి విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆట 18వ నిమిషంలో విలియమ్స్ గోల్‌తో మోహన్ బగాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 29వ నిమిషంలో మోహన్ బగాన్ జట్టు డిఫెండర్ టిరీ సెల్ఫ్ గోల్‌తో ముంబై సిటీ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలో పలు మార్లు గోల్‌చేసే అవకాశాలను వదులుకున్నాయి. చివరి నిమి షంలో బిపిన్ సింగ్ అద్భుత గోల్‌తో ముంబై ఖాతాలో విజయం చేరింది. విజేత ముంబై సిటీకి రూ. 8 కోట్లు... రన్నరప్ మోహన్ బగాన్‌కు రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీ లభిం చాయి. ‘గోల్డెన్ బూట్’ అవార్డును సీజన్లో 14 గోల్స్ చేసిన ఇగోర్ (గోవా) దక్కించుకోగా... ‘గోల్డెన్ గ్లవ్’ అవార్డు మోహన్ బగాన్ గోల్‌కీపర్ ఆరిందమ్ భట్టాచార్య పొందాడు. బెంగళూరు తర్వాత (2018–2019 సీజన్) లీగ్ దశలో ‘టాప్ ర్యాంక్’లో నిలువడంతోపాటు టైటిల్‌నూ నెగ్గిన రెండో జట్టుగా ముంబై గుర్తింపు పొందింది. -
మోహన్ బగాన్ కు భారీ విజయం
కోల్‌కతా: భారత్‌లో తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో భవానీపూర్‌తో జరిగిన సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 296 పరుగుల భారీ విజయం సాధించింది. మోహన్ బగాన్ జట్టు విసిరిన 496 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భవానీపూర్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 199 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో రాణించిన మొహ్మద్ షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు సాధించి మోహన్ బగాన్ విజయంలో పాలు పంచుకున్నాడు. అతనికి జతగా పార్ట్ టైమ్ సీమర్ వివేక్ సింగ్ ఐదు వికెట్లతో ఆకట్టుకోవడంతో భవానీపూర్ కు ఘోర పరాజయం ఎదురైంది. 132/6 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు ఆట ప్రారంభించిన భవానీ పూర్ మరో 67 పరుగులు మాత్రమే చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. నాల్గో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భవానీ పూర్ జట్టు గంట వ్యవధిలోనే తన రెండో ఇన్నింగ్స్ ముగించడం గమనార్హం. ఈ మ్యాచ్ లో మోహన్ బగాన్ ఆటగాడు ఆరిందమ్ ఘోష్ అజేయ శతకంతో రాణించాడు. తద్వారా భారత్ లో పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మోహన్ బగాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఘోష్ 125 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో ఘోష్ 225 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో శతకం సాధించాడు. -
ఆటోవాలా... రిఫరీ!
రెండు వారాల క్రితం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో భారత టాప్ ఫుట్‌బాల్ టోర్నీ ఐ-లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఒక వైపు ఫలితం తర్వాత మోహన్‌బగాన్ జట్టు, అభిమానులు సంబరాల్లో ఉన్నారు. మరో వైపు ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన 40 ఏళ్ల సంతోష్ కుమార్ మైదానం బయటికి వెళ్లి ‘తన ఆటోలో’ బయల్దేరాడు. అయితే అతనేమీ ప్యాసింజర్ కాదు! అదే అతని బతుకు తెరువు. ఆటోడ్రైవర్‌గా వచ్చే సంపాదనతోనే సంతోష్ జీవితం గడుస్తుంది. భారత్‌నుంచి ‘ఫిఫా’ అధికారిక గుర్తింపు పొందిన ఆరుగురు రిఫరీలలో అతను ఒకడు. ‘ఆదాయం విషయంలో మాత్రం ఫుట్‌బాల్‌ను నమ్ముకోలేం. అయితే ఎంత పెద్ద టోర్నీ అయినా ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకం ఉంటే, రిఫరీలకు మెమెంటో మాత్రం దక్కుతుంది. కాబట్టి నా భుక్తి కోసం తెలిసిన పని డ్రైవింగ్‌ను చేపట్టాను’ అని అతను చెప్పాడు. 20 ఏళ్లకు పైగా రిఫరీగా ఉన్న, అతను 45 ఏళ్ల వయసు వస్తే ఆ అర్హత కోల్పోతాడు. ఎంతో మంది సిఫారసుల తర్వాత కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్లో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ మాట నిలబెట్టుకోలేదని, ఉద్యోగం వస్తే ఆటో వదిలేస్తానని సంతోష్ చెబుతున్నాడు.