
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు 3–0తో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీపై ఘనవిజయం సాధించింది. టామ్ అల్‌డ్రెడ్ (15వ ని.), లిస్టన్ కొలాకొ (45+2వ ని.), జేమి మెక్‌లారెన్ (75వ ని.) తలా ఒక గోల్ చేశారు. తాజా విజయంతో మోహన్ బగాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
8 మ్యాచ్‌లాడిన ఈ జట్టు ఐదింట గెలుపొంది ఒక మ్యాచ్‌లో ఓడింది. 2 మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. మరో మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో పంజాబ్ ఎఫ్‌సీపై గెలుపొందింది. నార్త్ ఈస్ట్ జట్టులో గులెర్మో ఫెర్నాండెజ్ (15వ ని.), నెస్టర్ అల్బియక్ (18వ ని.) చెరో గోల్ చేశారు. పంజాబ్ తరఫున ఇవాన్ నొవొసెలెక్ (88వ ని.) గోల్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment