మోహన్ బగాన్‌పై 2–1తో గెలుపు
ఇండియన్ సూపర్ లీగ్
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో గోవా జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గోవా ఫుట్‌బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో మోహన్ బగాన్‌పై గెలుపొందింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెజ్ (12వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో విజృంభించగా... మోహన్ బగాన్ జట్టు తరఫున దిమిత్రి పెట్రాటస్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... మోహన్ బగాన్ జట్టు 59 శాతం బంతిని తమ ఆధీనంలో పెట్టుకొని మూడుసార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసి ఒక గోల్ నమోదు చేసింది. అదే సమయంలో 5 సార్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేసిన గోవా జట్టు అందులో రెండుసార్లు సఫలమైంది.
లీగ్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన గోవా జట్టు 6 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మోహన్ బగాన్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.
శనివారం జరగనున్న మ్యాచ్‌ల్లో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో చెన్నైయిన్ జట్టు (సాయంత్రం గం. 5:00 నుంచి), ఈస్ట్ బెంగాల్ జట్టుతో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment