Goa team
-
గోవా ఘనవిజయం
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గోవా ఫుట్‌బాల్ క్లబ్ 2–1 గోల్స్ తేడాతో మోహన్ బగాన్‌పై గెలుపొందింది. గోవా జట్టు తరఫున బ్రిసన్ ఫెర్నాండెజ్ (12వ, 68వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో విజృంభించగా... మోహన్ బగాన్ జట్టు తరఫున దిమిత్రి పెట్రాటస్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా... మోహన్ బగాన్ జట్టు 59 శాతం బంతిని తమ ఆధీనంలో పెట్టుకొని మూడుసార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసి ఒక గోల్ నమోదు చేసింది. అదే సమయంలో 5 సార్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేసిన గోవా జట్టు అందులో రెండుసార్లు సఫలమైంది. లీగ్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన గోవా జట్టు 6 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మోహన్ బగాన్ జట్టు 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 26 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. శనివారం జరగనున్న మ్యాచ్‌ల్లో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో చెన్నైయిన్ జట్టు (సాయంత్రం గం. 5:00 నుంచి), ఈస్ట్ బెంగాల్ జట్టుతో జంషెడ్పూర్ ఎఫ్‌సీ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. -
ఏపీ విద్యా సంస్కరణలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు
-
అజహర్ కొడుకు అరంగేట్రం
పోర్వోరిమ్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ (28) రంజీ ట్రోఫీలో గోవా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. గురువారం సర్వీసెస్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో అతనికి చోటు దక్కింది. తొలి రోజు అసద్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. హైదరాబాద్‌లో స్థానిక లీగ్‌లు ఆడటం మినహా మరే అనుభవం లేని అసద్‌ను గోవా జట్టు ‘ప్రొఫెషనల్ ప్లేయర్’గా టీమ్‌లోకి తీసుకోవడంపై సీజన్ ఆరంభంనుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. గతంలో యూపీ తరఫున ఆడే ప్రయత్నం చేసినా తుది జట్టులోకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ ట్రయల్స్‌కు వెళ్లినా అసద్ ఎంపిక కాలేకపోయాడు. గోవా జట్టుకు గత ఆగస్టులో హైదరాబాద్‌లోనే శిక్షణా శిబిరం జరిగింది. దీనిని స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి ఫీజు లేకుండా జట్టుకు సలహాదారుడిగా కూడా అజహర్ వ్యవహరించాడు. ఇదే కారణంగా అసద్‌ను చోటిచ్చారని గోవా సీనియర్ క్రికెటర్లు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. -
గోవాను గెలిపించిన ఫెర్నాండెజ్
ఫటోర్డా (గోవా): సొంతగడ్డపై గోవా జట్టు సత్తా చాటుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గోవా జట్టు 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. ప్రథమార్థం ముగిసేసరికి రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యారుు. ఆట 50వ నిమిషంలో సితెసిన్ సింగ్ గోల్‌తో నార్త్ ఈస్ట్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. 62వ నిమిషంలో రాబిన్ సింగ్ గోల్‌తో గోవా జట్టు స్కోరును 1-1తో సమం చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకుంటున్న తరుణంలో 90వ నిమిషంలో రోమియో ఫెర్నాండెజ్ గోల్ చేసి గోవా జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. 10 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న గోవా పది పారుుంట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
హైదరాబాద్‌కు ఆధిక్యం
నాగ్‌పూర్: ఓపెనర్ అక్షత్ రెడ్డి (177 బంతుల్లో 17 ఫోర్లతో 105 బ్యాటింగ్) అజేయ సెంచరీ సాధించడంతో... గోవాతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ ట్రోఫీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్సలో 63 ఓవర్లలో నాలుగు వికెట్లకు 188 పరుగులు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ 24 పరుగుల ఆధిక్యంలో ఉంది. అక్షత్‌కు జతగా సందీప్ (18 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఆంధ్ర మ్యాచ్‌కు వర్షం అడ్డంకి భువనేశ్వర్: హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. భారీ వర్షం కారణంగా రెండో రోజు శుక్రవారం ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. ముంబై 176 ఆలౌట్ రోహ్తక్: తమిళనాడుతో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై తొలి ఇన్నింగ్సలో 176 పరుగులకు ఆలౌటై 89 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం తమిళనాడు తమ రెండో ఇన్నింగ్సలో ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 153 పరుగులు చేసింది. -
గోవా గోల్స్ వర్షం
ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్లో ఎఫ్‌సీ గోవా జట్టు మరోసారి అదరగొట్టింది. మంగళవారం ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిపించింది. ఫలితంగా 7-0తో ఘనవిజయం సాధించింది. పసలేని ప్రత్యర్థి ఆటతీరును ఉపయోగించుకున్న డూడూ (42, 64, 67వ ని.లో), హావోకిప్ (34, 52, 79వ ని.లో) హ్యాట్రిక్ గోల్స్‌తో రెచ్చిపోయారు. మరో గోల్‌ను రినాల్డో చేశాడు. ఐఎస్ఎల్లో ఓ జట్టు ఇంత భారీ తేడాతో ఓడడం ఇదే తొలిసారి. అలాగే ఈ లీగ్‌లో ఇది వందో మ్యాచ్ కావడం విశేషం. బుధవారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతాతో చెన్నైయిన్ జట్టు ఆడుతుంది.