ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సీజన్‌లో ఎఫ్‌సీ గోవా జట్టు మరోసారి అదరగొట్టింది. మంగళవారం ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో గోల్స్ వర్షం కురిపించింది. ఫలితంగా 7-0తో ఘనవిజయం సాధించింది. పసలేని ప్రత్యర్థి ఆటతీరును ఉపయోగించుకున్న డూడూ (42, 64, 67వ ని.లో), హావోకిప్ (34, 52, 79వ ని.లో) హ్యాట్రిక్ గోల్స్‌తో రెచ్చిపోయారు.
మరో గోల్‌ను రినాల్డో చేశాడు. ఐఎస్‌ఎల్‌లో ఓ జట్టు ఇంత భారీ తేడాతో ఓడడం ఇదే తొలిసారి. అలాగే ఈ లీగ్‌లో ఇది వందో మ్యాచ్ కావడం విశేషం. బుధవారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కతాతో చెన్నైయిన్ జట్టు ఆడుతుంది.
గోవా గోల్స్ వర్షం
Published Wed, Nov 18 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM
Advertisement
Advertisement