జంషెడ్‌పూర్‌కు మూడో విజయం | Third win for Jamshedpur | Sakshi
Sakshi News home page

జంషెడ్‌పూర్‌కు మూడో విజయం

Oct 6 2024 4:11 AM | Updated on Oct 6 2024 4:11 AM

Third win for Jamshedpur

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌

జంషెడ్‌పూర్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో జంషెడ్‌పూర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో జంషెడ్‌పూర్‌ జట్టు 2–0తో ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌పై విజయం సాధించింది. జంషెడ్‌పూర్‌ జట్టు తరఫున రెయి తెచికవా (21వ నిమిషంలో), లాల్‌చుంగ్‌నుంగా (70వ ని.లో) చెరో గోల్‌ చేశారు. నిర్ణీత సమయంలో జంషెడ్‌పూర్‌ జట్టు కన్నా ఎక్కువసేపు బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ఈస్ట్‌బెంగాల్‌ జట్టు వరుస దాడులతో ఒత్తిడి పెంచినా.. జంషెడ్‌పూర్‌ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. 

జంషెడ్‌పూర్‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం కాగా.. 9 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇక నాలుగో పరాజయం మూటగట్టుకున్న ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ 3–0తో మొహమ్మదాన్‌ స్పోరి్టంగ్‌ క్లబ్‌పై గెలిచింది. మోహన్‌ బగాన్‌ తరఫున జేమీ మెక్‌లారెన్‌ (8వ నిమిషంలో), సుభాశీష్‌ బోస్‌ (31వ ని.లో), గ్రెగ్‌ స్టెవార్ట్‌ (36వ ని.లో) తలా ఒక గోల్‌ కొట్టారు. 

తాజా సీజన్‌లో మోహన్‌ బగాన్‌ జట్టుకు ఇది రెండో విజయం కాగా... 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మొహమ్మదన్‌ జట్టు రెండో ఓటమి మూటగట్టుకుంది. గత నెల 13న మొదలైన ఐఎస్‌ఎల్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఫలితాలు రాగా... ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 11 రోజుల విరామం అనంతరం ఈ నెల 17న నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో చెన్నైయిన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement