పంజాబ్‌ ఎఫ్‌సీ బోణీ | Punjab Football Club team is off to a good start | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ ఎఫ్‌సీ బోణీ

Sep 16 2024 3:58 AM | Updated on Sep 16 2024 3:58 AM

Punjab Football Club team is off to a good start

కొచ్చి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో పంజాబ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు శుభారంభం చేసింది. కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీతో ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ ఎఫ్‌సీ 2–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో చివరి పది నిమిషాల్లో మూడు గోల్స్‌ కావడం విశేషం. పంజాబ్‌ తరఫున 86వ నిమిషంలో లుకా మాజ్‌సెన్‌ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు.

ఇంజ్యూరీ సమయంలోని 90+2వ నిమిషంలో జిమెనెజ్‌ గోల్‌తో కేరళ జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. 90+5వ నిమిషంలో ఫిలిప్‌ మిర్జాక్‌ గోల్‌తో పంజాబ్‌ అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో మొహమ్మదాన్‌ స్పోరి్టంగ్‌ క్లబ్‌తో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement