saturday
-
ఐఎస్ఎల్ 1000వ మ్యాచ్ ‘డ్రా’
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చరిత్రలో 1000వ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శనివారం ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జరిగిన పోరు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ అయింది. ముంబై జట్టు తరఫున నాథన్ రోడ్రిగ్స్ (63వ నిమిషంలో) ఒక గోల్ సాధించగా... చెన్నైయన్ ఎఫ్‌సీ తరఫున కెప్టెన్ ర్యాన్ ఎడ్వర్డ్స్ (60వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు.మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఇరు జట్లు చెరో 14 షాట్లు ఆడగా... అందులో ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా నాలుగేసి సార్లు దాడులు చేశాయి. ముంబై జట్టు చిన్న చిన్న పాస్‌లతో ముందుకు సాగగా... చెన్నైయన్జట్టు 15 ఫౌల్స్ చేసింది. ఈ ఫలితంతో 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకున్న చెన్నైయన్ జట్టు 12 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానానికి చేరగా... 10 పాయింట్లు ఖాతాలో ఉన్న ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది.ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌తో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. -
Rajasthan Assembly polls: రాజస్థాన్ ఎవరిదో!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగింపునకు వస్తోంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే ముగియగా కీలకమైన రాజస్థాన్ లో ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. శనివారం పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నా యి. ఏడు హామీలకు తోడు ప్రజాకర్షక పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోత్ నమ్ముతున్నారు. దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు కచ్చితంగా సర్కారు పుట్టి ముంచుతాయని, మోదీ మేనియాకు హిందూత్వ కార్డు తోడై ఘనవిజయం సాధించి పెడుతుందని బీజేపీ అంటోంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ముగిశాక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008పరిశీలకులతో పాటు అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది! కాంగ్రెస్ మరోసారి విజయబావుటా ఎగరేసింది. గెహ్లోత్ మళ్లీ సీఎం అయ్యారు. ప్రజల ఆదరణ బీజేపీకే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలినా ఆ పార్టీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె సింధియా అనుసరించిన లోప భూయిష్టమైన ఎన్నికల వ్యూహమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఆమె అహంకారపూరిత ప్రవర్తన, సీనియర్లకు ప్రా ధాన్యం ఇవ్వకపోవడం, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు పార్టీని ముంచాయంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. మొత్తం 200 స్థానా లకుగాను కాంగ్రెస్ 96 చోట్ల నెగ్గగా బీజేపీ 78 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌కు 36.8 శాతం ఓట్లు పోలవగా బీజేపీకి 34.3 శాతం పడ్డాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు పోలవడం బీజేపీ విజయావ కాశాలను గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకంటే 2003 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. బీజేపీ ఏకంగా 5 శాతానికిపైగా ఓట్లను నష్టపోయింది! ఇక బీఎస్పీ 7.6 శాతం ఓట్లతో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2013 ఆనవాయితీని కొనసాగిస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. వసుంధరా రాజె మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో బీజేపీ 163 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన పార్టీకి లభించిన అత్యల్ప స్థానాలు ఇవే! 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లొచ్చాయి. బీజేపీ 45.2 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు 33.1 శాతం దక్కాయి. గుజ్జర్ నేత కిరోరీసింగ్ బైన్స్లా దన్ను కాంగ్రెస్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఎప్పుడూ ఆదరించే మేవార్ ప్రాంతం ఈసారి బీజేపీకే జై కొట్టడంతో ఆ పార్టీ తేరుకోలేకపోయింది. 34 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా నెగ్గలేకపోవడం విశేషం. 25 ఎస్టీ సీట్లలో నాలుగే గెలిచింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ మేనియానే బీజేపీ ఘన విజయానికి కారణమని సీఎం అశోక్ గెహ్లోత్ అంగీకరించడం విశేషం! బీఎస్పీ సగం అసెంబ్లీ సీట్లు కోల్పోయి మూడింటికే పరిమితమైంది. 2018 ప్రభుత్వాలను పడగొట్టే ధోరణి మరోసారి కాంగ్రెస్‌కు గెలుపు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్‌గా యువ నేత సచిన్ పైలట్ అంతా తానై ఎన్నికల బాధ్యతలను చూసుకున్నారు. పార్టీ విజయంలో ఒకరకంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నెగ్గితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీకి బాగా లాభించింది. 100 సీట్లతో పార్టీ ఘనవిజయం సాధించింది. 2013లో 59 ఎస్సీ, ఎస్టీ స్థానాలు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలం 21 స్థానాలకు పరిమితమైంది. ఆళ్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, టోంక్, ధోల్పూర్, కరౌలీ జిల్లాల్లోనైతే ఒక్క ఎస్సీ, ఎస్టీ స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఫలితాల అనంతరం పైలట్ సీఎం అవుతారని అంతా భావించారు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా పాత కాపు మరోసారి గెహ్లోత్‌కే చాన్స్ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం అవకాశమిస్తామంటూ పైలట్‌ను అనునయించి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మాట నిలుపుకోకపోవడంతో 2020లో ఆయన తిరుగుబాటు చేసినా రాహుల్‌గాంధీ జోక్యంతో రాజీ పడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది?
వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు. సంవత్సరంలో చివరిసారిగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సంభవించే ప్రతీసారీ ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరగనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడనుంది. అక్టోబరు 14న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది కంకణాకృతి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సమయంలో కొన్నిసార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుని వెనుక దాక్కుంటాడు. కొన్నిసార్లు మెరుస్తున్న ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. సూర్యుని ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు చంద్రుని బ్లాక్ డిస్క్ చుట్టూ ఉండే రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. దీనినే యాన్యులస్ అంటారు. సాధారణ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. అయితే వార్షిక సూర్యగ్రహణంలో, చంద్రుడు.. భూమి కక్ష్యలో దానికి దూరంగా ఉంటాడు. ఈ కారణంగా చంద్రుడు ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా కనిపిస్తూ, సూర్యుడిని అడ్డుకుంటాడు. అంటే సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. ఈ స్థితిలో సూర్యుని స్థానంలో అగ్ని వలయం కనిపిస్తుంది. కాగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో రాత్రి సమయంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి, సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారతదేశ ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణాన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు చూడవచ్చు. అమెరికాలో, ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌లలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు! -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకంత ప్రీతి ?
ఏయే వారాల్లో ఏ దేవుడుని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుదనే వాటి గురించి పండితులు శాస్త్రాల్లో విపులంగా వివరించారు. అందులో భాగంగానే ఆదివారం సూర్యభగవానుడికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రమణ్యేశ్వర స్వామికి, బుధవారం గణపతి, అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, దత్తాత్రేయుడు, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి అని ఇలా.. ఒక్కో రోజు ఒక్కోస్వామికి ప్రత్యేకం కేటాయించి మరి చెప్పారు. అయితే వెంకటేశ్వర స్వామికి మాత్రం శనివారం అంటేనే ఎందకంత ప్రత్యేకం అంటే.. శనివారమే శ్రీవారిని పూజించటానికి గల కారణం.. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శనివారం శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటి సారి దర్శించిన రోజు శనివారం ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే ఇక వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం. వెంకటేశ్వర స్వామికి కూడా శనివారం ప్రత్యేకం కావడంతో ..భక్తులు ఆ రోజు దేవుడికి పూజలు, మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కలౌ వేంకట నాయకః అన్న నానుడి ప్రకారం..కలియుగంలో అత్యంత శక్తిమంతమైన దైవం శ్రీనివాసుడు. అందువల్ల భక్తులు తమకు ఎదురయ్యే కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కించి బయటపడేశావాడు ఆయనే అని విశ్వసిస్తారు. ఈ శనివారం రోజు వాడవాడల ఉన్న శ్రీనివాసుని ఆలయాలన్ని కిటకిటలాడుతుంటాయి. మాములు రోజుల కంటే శనివారం ఆయన్ను పూజిస్తే శనిశ్వరుడు పెట్టే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పైగా అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా శ్రీనివాసుడు తమను అనుగ్రహిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. (చదవండి: గాంధారి వాన ఏమిటి?..అసలు దృతరాష్ట్రుని భార్యకు.. వానకు సంబంధం ఏమిటి) -
ఇకపై శనివారం కూడా బడి?
సాక్షి, చెన్నై: ఇకపై ప్రతి శనివారం కూడా పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే తరగతుల నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శని, ఆదివారాలు సెలవులే. ఈ పరిస్థితుల్లో తాజాగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కొంత ఆలస్యమైంది. భానుడి ప్రతాపం పుణ్యమా రెండు సార్లు పాఠశాలల పునః ప్రారంభాన్ని వాయిదా వేశారు. సోమవారం నుంచి 6–12 తరగతులకు, ఈనెల 14 వతేదీ నుంచి 1–5 తరగతులకు పాఠశాలలు తెరచుకోనున్నాయి. అదే సమయంలో ఈ ఏడాది నైరుతి రుతు పవనాల ప్రభావంతోవ ర్షాలు ఆశాజనకంగా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణకేంద్రం ప్రకటించింది. ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకడంలో రాష్ట్రంలో అనేక జిల్లాలో తేలిక పాటి వర్షం మొదలైంది. శనివారం చెన్నై , శివారులలో అనేక చోట్ల వర్షం పడింది. ఈవర్షం ప్రభావం క్రమంగా పెరిగిన పక్షంలో పాఠశాలలకు తరచూ సెలవులు ఇవ్వక తప్పదు. దీంతో ఈ సెలవులతో విద్యా బోధనలు కుంటు పడే పరిస్థితి ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి శనివారం కూడా పాఠశాలలు పనిచేసే విధంగా చర్యలకు సిద్ధమైంది. ఈ విషయంగా విద్యా మంత్రి అన్బిల్ మహేశ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, పరిశీలన జరుపుతున్నామన్నారు. సకాలంలో సిలబస్ ముగించాలంటే శనివారం కూడా తరగతుల నిర్వహణ అవశ్యమని, అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా, సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వస్థలాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్లిన జనం చెన్నై వైపుగా తిరుగు ప్రయాణమయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సులను శని, ఆదివారం కూడా నడిపేందుకు రవాణాశాఖ చర్యలు తీసుకుంది. -
Bank Holidays December 2022:13 రోజులు సెలవులు
సాక్షి, ముంబై: ఆర్బీఐ డేటా ప్రకారం డిసెంబర్ నెలలో బ్యాంకులు 13 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. డిసెంబర్లో వచ్చే రెండు, నాలుగు శనివారాలు 4 ఆదివారాలతో పాటు రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల బ్యాంకుల సెలవులు జాబితాను విడుదల చేస్తుంది. బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకొని దాని కనుగుణంగా ప్లాన్ చేసుకోవడం బెటర్. డిసెంబర్లో 3,4,10,11,18,24,25 తేదీల్లో దేశవ్యాప్త సెలవు. అలాగే డిసెంబర్ 24న, క్రిస్మస్, నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. డిసెంబర్లో బ్యాంకులకు సెలవులు: డిసెంబర్ 3 - శనివారం (సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ , గోవాలో హాలిడే) డిసెంబర్ 4 -ఆదివారం డిసెంబర్ 10- రెండో శనివారం డిసెంబర్ 11 -ఆదివారం డిసెంబర్ 12- సోమవారం (పా టాగన్ నెంగ్మింజ సంగం, మేఘాలయలో సెలవు) డిసెంబర్ 18 - ఆదివారం డిసెంబర్ 19 - సోమవారం (గోవా లిబరేషన్ డే,గోవాలో సెలవు) డిసెంబర్ 24- శనివారం ( క్రిస్మస్, నాలుగో శనివారం దేశవ్యాప్త సెలవు) డిసెంబర్ 25 - ఆదివారం డిసెంబర్ 26- సోమవారం (క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ మిజోరం, సిక్కిం, మేఘాలయలో హాలిడే) డిసెంబర్ 29- గురువారం (గురు గోవింద్ సింగ్ పుట్టినరోజు,చండీగఢ్‌లో హాలిడే) డిసెంబర్ 30- శుక్రవారం ( యు కియాంగ్ నంగ్వా మేఘాలయలో సెలవు డిసెంబర్ 31 - శనివారం (నూతన సంవత్సర వేడుకలు, మిజోరంలో సెలవు) రాష్ట్రాల పండుగల ఆధారంగా అక్కడ బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోవాలి. -
AP: రెండో శనివారం బడులు, కాలేజీలకు పనిదినమే
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృతోత్సవాలను ఈనెల 15న ఘనంగా నిర్వహించడానికి, విద్యార్థులందరి భాగస్వామ్యాన్ని పెంచడానికి సన్నాహ కార్యక్రమాల కోసం ఈనెల 13వ తేదీ రెండో శనివారాన్ని పనిదినంగా పరిగణిస్తూ పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ సర్క్యులర్లు విడుదల చేశాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15న పెద్ద ఎత్తున సంబరాన్ని నిర్వ హించడానికి ఆజాదీ కా అమృతోత్సవాల పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమా లను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి హర్ ఘర్ జెండా కార్యక్రమం చేపట్టారు. పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 13, 14 తేదీలు రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలుగా ఉండడంతో సన్నాహక కార్యక్రమాలకు ఆటంకంగా మారింది. విద్యార్థులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిహార్సల్స్ వంటివి చేయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండో శనివారం సెలవు దినాన్ని పనిదినంగా కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్లు ఎస్.సురేష్‌కుమార్, ఎం.వి.శేషగిరిబాబు సర్క్యులర్లు విడుదల చేశారు. జూనియర్ కాలేజీలకు రెండో శనివారానికి బదులు మూడో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్.. రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు సూచించారు. (క్లిక్: మార్పును పట్టుకుందాం) -
చినవెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
వరపల్లి : ద్వారకాతిరుమలేశుని క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. కిక్కిరిసిన భక్తులతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. ప్రసాదం, టికెట్ కౌంటర్లు, దర్శనం క్యూలైన్లు, కేశఖండన శాల ఇతర విభాగాలు భక్తులతో నిండిపోయాయి. దర్శనం క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో భక్తులు బారులు తీరారు. దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఆలయంలో రద్దీ కొనసాగింది. దాదాపు 5 వేల మందికి పైగా భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలరించిన కోలాట భజనలు శ్రీవారి ఆలయ పరిసరాల్లో తిరుమల తిరుపతి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట భజనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. ముందుగా వారు స్వామి, అమ్మవార్లను దర్శించి పూజించారు. ఆ తరువాత ఆలయ ఆవరణలోను, శ్రీహరికళాతోరణ వేదికపైన భక్తిగీతాలను ఆలపిస్తూ కోలాట భజనలు జరిపారు. -
భీమవరంలో ’డ్రగ్స్’ తనిఖీలు
భీమవరం టౌన్: భీమవరంలో శనివారం ఔషధ నియంత్రణ అధికారుల బృందం మందుల దుకాణాలు, హోల్‌సేల్స్ ఏజెన్సీల్లో విస్తృత తనిఖీలు చేశారు. జిల్లా ఔసధ నియంత్రణ విభాగం ఏడీ వి.విజయశేఖర్ నేతృత్వంలో భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్లు కె.అనిల్‌కుమార్, విక్రమ్, ఎం.విజయలక్ష్మిల బృందం తనిఖీలు చేశాయి. డ్రగ్ మాఫియా నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ (మత్తు కలిగించే మందులు)ను ఏ వ్యాపారులు ఎక్కువ మొత్తంలో క్రయవిక్రయాలు చేస్తున్నారో రికార్డులను పరిశీలిస్తున్నారు. భీమవరం వన్‌టౌన్, టూటౌన్ ప్రాంతాల్లో పలు మందుల దుకాణాలు, హోల్‌సేల్ ఏజెన్సీల్లో తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. డాక్టర్ల సూచనల మేరకు ప్రిస్కిప్షన్ ప్రకారం మందుల విక్రయించాల్సి ఉండగా దానిని ఎవరూ పట్టించుకోవడం లేదన్న దిశగా కూడా అధికారులు దృష్టిసారించారు. -
‘అంధ’గాడు సందడి
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : అంధగాడు చిత్ర యూనిట్ శనివారం హేలాపురిలో సందడి చేసింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా స్థానిక సాయి బాలాజీ థియేటర్‌ను చిత్ర బృందం సందర్శించింది. ప్రేక్షకులను పలకరించింది. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బాపటేల్ వారితో ముచ్చటించారు. చిత్రంలోని సన్నివేశాలు, తమ నటన, పాటలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. డైలాగులు చెప్పి మెప్పించారు. అనంతరం రాజ్‌తరుణ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ తాను నటించిన అన్ని చిత్రాలనూ ప్రేక్షకులు ఆదరించారని ఆనందం వ్యక్తం చేశారు. తనపై విశేష ఆదరణ చూపుతున్న జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు మరిచిపోలేనన్నారు. త్వరలో అన్నపూర్ణా స్టూడియోస్ సంస్థ నిర్మించే చిత్రంతోపాటు దిల్ రాజు నిర్మాణంలో మరో చిత్రం చేస్తున్నట్టు వివరించారు. అంధగాడు చిత్ర నిర్మాతలతోనే మరో చిత్రం చేయనున్నట్టు వెల్లడించారు. హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ రాజ్ తరుణ్‌తో తాను మూడు చిత్రాల్లో నటించానని, అన్నీ ప్రేక్షకాదరణ పొందాయని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ రాజ్‌తరుణ్‌తో చేసే అవకాశం వస్తే వదులుకోనని పేర్కొన్నారు. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కథా రచయితగా బలుపు, పండగచేస్కో, బెండు అప్పారావు వంటి చిత్రాలకు కథలు అందించానని, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాతలు, హీరో రాజ్ తరుణ్ ప్రోత్సాహంతోనే దర్శకుడిగా మారానని పేర్కొన్నారు. తొలిచిత్రమే విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో చిత్ర పంపిణీదారు ఉషా పిక్చర్స్ అధినేత వి.వి.బాలకృష్ణారావు మాట్లాడుతూ రాజ్‌తరుణ్ నటించిన ఏడు చిత్రాల్లో నాలుగు చిత్రాలను తానే పంపిణీ చేశానని వివరించారు. అనంతరం వారిని పుష్పగుచ్ఛాలతో అభినందించారు. సమావేశంలో విలన్ పాత్రధారి రాజారవీంద్ర, నిర్మాత కిషోర్ గరికపాటి, ఉషా పిక్చర్స్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు, సాయిబాలాజీ థియేటర్ మేనేజర్ మొహిద్దీన్, సీహెచ్ సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాల వెల్లువ
దేవరపల్లి(ద్వారకాతిరుమల): ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు రూ.2.01లక్షలను విరాళంగా అందించారు. నిడమర్రు మండలం చిన నిండ్రకొలనుకు చెందిన పాతపాటి వెంకట రామలింగరాజు, పద్మ దంపతులు రూ.1,00,116లను అందించారు. అలాగే ఉండి మండలం యండగండికి చెందిన వేగేశ్న సత్తిరాజు, సూర్యకాంతమ్మ దంపతులు రూ.1,01,116లను అందించారు. ఈవో వేండ్ర త్రినాథరావు దాతల కుటుంబాలకు ఉచిత దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వారికి ప్రసాదాలు అందించారు. -
ముగిసిన సాఫ్ట్‌బాల్ టోర్నీ
జంగారెడ్డిగూడెం : స్థానిక విద్యావికాస్ కళాశాలలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ నాలుగో సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు శనివారంతో ముగిశాయి. పురుషులు, మహిళల విభాగాల్లో ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగాయి. పురుషుల విభాగంలో గుంటూరు జిల్లా విజేతగా నిలిచింది. అనంతపురం ద్వితీయ స్థానం, వైఎస్సార్ కడప జిల్లా తృతీయ స్థానం సాధించాయి. మహిళల విభాగంలో అనంతపురం ప్రథమస్థానం, విజయనగరం, వైఎస్సార్ కడప ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ.. ఉత్తమ క్రీడాకారులను తయారు చేసుకోవాలి్సన బాధ్యత మనదేనన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. టోర్నీ నిర్వహణను చేపట్టిన విద్యావికాస్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. సహాయ సహకారాలు అందించిన మానవత స్వచ్ఛంద సంస్థ, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ను కూడా అభినందించారు. ప్రభుత్వం కూడా క్రీడాభిృద్ధికి కృషి చేస్తోందని రామ్మోహనరావు చెప్పారు. అనంతరం విజేతలకు పతకాలు, ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ మేడవరపు అశోక్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, డీఎస్డీఓ ఎస్.ఎ.అజీజ్, మానతవ జిల్లా అధ్యక్షుడు కె.జె.మాథ్యూ, కోశాధికారి తాడేపల్లి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు చావా రమేష్‌బాబు, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మిడత రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
కాళ్లకూరు వెంకన్నకు బంగారు పుష్పాలు సమర్పణ
కాళ్ల : కాళ్లకూరులో స్వయంభువుడిగా కొలువైన వేంకటేశ్వరస్వామికి భక్తులు శనివారం బంగారు పుష్పాలు సమర్పించారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన చేకూరి అప్పలరాజు, సుశీల దంపతులు స్వామికి 54 గ్రాముల బరువైన 108 బంగారు పుష్పాలు సమర్పించారు. కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు భక్తులను అభినందించారు. స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు. -
గూడెంలో పసుపు కొనుగోలు కేంద్రం
తాడేపల్లిగూడెం : పసుపు రైతుల సమస్యను పరిష్కరించేందుకు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. జిల్లాలోని పసుపు రైతులు తమ సమస్యలపై మంత్రికి శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాలతో పాటు ఆచంట. పెనుగొండ మండలాల్లో రైతులు పసుపు పండిస్తున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రితో మాట్లాడినట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఏఎంసీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమాన పనికి సమానవేతనం రావడంలేదని 108 అంబులె న్స్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జీవీకే సంస్థ నుంచి లీవ్‌ఎన్ క్యాష్మెంట్ సొమ్ములు రాక ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ సమస్యపై సీఎంతో మాట్లాడి అంబులె న్స్ సిబ్బందికి న్యాయం చేస్తామన్నారు. గోవధ నిరోధక చట్టం సంచలనం కేంద్రం తీసుకువచ్చిన గోవధ నిరోధక చట్టం సంచలనమని ఇలాంటి చట్టాన్ని తీసుకొచి్చన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలో ఉండే అత్యధిక శాతం హిందువులు భగవంతునితో సమానంగా గోవును పూజిస్తారన్నారు. మోపురం ఉన్న దేశీయ ఆవుల పాల నుంచి తయారుచేసిన పదార్థాలలో రోగనిరోధకశక్తితో పాటు అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్నాయని ప్రపంచం గుర్తించిదన్నారు. గత పాలకులు పిరికితనం, నిర్లక్ష్యం కారణంగా గోవులు కబేళాలకు తరలిపోతున్నాయన్నారు. ఎర్రకాల్వ ముంపు సమస్య పరిష్కారం కోసం నందమూరులో ఎర్రకాలువపై ఉన్న పాత అక్విడెక్ట్‌ను తొలగించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందన్నారు. -
వైభవోపేతం.. శ్రీనివాసుని కల్యాణం
జంగారెడ్డిగూడెం : గోకుల తిరుమల పారి జాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీని వాసుని కల్యాణాన్ని శని వారం వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు కల్యాణ మహోత్సవంలో తొలుత విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, హోమ కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యుల పర్యవేక్షణలో ఋత్విక్ స్వాములు జరి పారు. రెడ్డి శ్రీనివాసరావు దంపతులు, తానింకి సత్యనారాయణ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కోరా నాగేశ్వరరావు, రేవతి దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మ¯ŒS బిక్కిన సత్యనారాయణ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పోలవరం రాక
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. శనివారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఎస్పీ భాస్కర్‌భూషణ్, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో రివ్యూ సమావేశం జరపనున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబు, ఆర్డీవో ఎస్.లవన్న, పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్ ఉన్నారు. -
పంటకుంటలకు ప్రాధాన్యమివ్వండి
కొవ్వూరు రూరల్ : రైతులు పొలాల్లో పంట కుంటలు తవ్వేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఆదేశించారు. శనివారం కొవ్వూరులోని మంత్రి కార్యాలయంలో ఇంకుడు గుంతలు, పంటకుంటలపై మండల పరిషత్, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ చాగల్లు మండలంలోని మల్లవరం, చిక్కాల గ్రామాల్లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్నాయన్నారు. నీరు–ప్రగతి కార్యక్రమంలో చెరువుల పూడికతీత, కాలువల ఆధునికీకరణ, ఇంకుడుగుంతలు, ఫామ్పాండ్ల తవ్వకం ద్వారా భూగర్భ జలాలలను పెంపొందించుకోవచ్చన్నారు. దీనికి సంబంధించి గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కొవ్వూరు, తాళ్లపూడి తహసీల్దార్లు కె.విజయకుమార్, శ్రీనివాసరావు, ఎంపీడీవోలు ఎ.రాము, కె.పురుషోత్తమరావు, జ్యోతిర్మయి పాల్గొన్నారు. -
రాజకీయ చైతన్యంతోనే సమాజంలో మార్పు
కోడేరు (ఆచంట) : యువత రాజకీయ చైతన్యం పొందడం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారామ్ అన్నారు. కోడేరులోని ఆత్మీయ సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న యువ కమ్యూనిస్టుల అధ్యయన శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతారామ్ మాట్లాడుతూ పాలకులు యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్నారు. యువతను కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి వారి ఐక్యతను దెబ్బదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం పెంచేందుకు తోడ్పడుతున్న సెంట్రల్ యూనివర్సిటీలలో బీజెపీ, దాని అనుబంధ సంఘాలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. హెచ్‌సీయూలో వేముల రోహిత్, జేఎన్‌యూలో కన్హయ్యకుమార్‌లపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. శిక్షణ తరగతులకు శివకుమార్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఈ తరగతుల్లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కేతాగోపాలన్, పార్టీ నాయకులు ఎస్వీఎస్ శర్మ, పి.అనూరాధ, ఎ. అరుణ్‌కుమార్, పి.మంగరాజు, బత్తుల విజయ్‌కుమార్, కె.సుధీర్, వద్దిపర్తి శ్రీనివాసు, తోటపల్లి సత్యనారాయణ, వద్దిపర్తి అంజిబాబు, పాల్గొన్నారు. -
విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించాలి
పాలకోడేరు: విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలతో అధ్యయనం చేయాలని జనవిజ్ఞాన వేదిక విద్యాభాగం జిల్లా కన్వీనర్ చింతపల్లి ప్రసాదరావు అన్నారు. మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేసవి అధ్యయన శిబిరం శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతపల్లి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ అవగాహన పెంచుకోవడం ద్వారా మూఢ నమ్మకాలను పారద్రోలవచ్చన్నారు. సమాజంలో పెరుగుతున్న అశాస్త్రీయ భావజాలం, మూఢ నమ్మకాలపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులను చైతన్య పరచాలని కోరారు. రాజ్యం నుంచి మతాన్ని వేరుగా చూడడమే లౌకికవాదమని, నేటి పాలకులు లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు పెన్మెత్స శ్రీనివాసరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కాగితపు అనిల్ పాల్గొన్నారు. -
ఆత్మీయ స్వాగతం
జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం భీమవరం చేరుకున్న ఆయన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు సాగర్–సుధ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఏలూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ కుమార్తె డాక్టర్ పావని, డాక్టర్ నిషాంత్ వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు అత్మీయ స్వాగతం పలికారు. ఆయన భీమవరం, ఏలూరులో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి అభిమాన నేతకు నీరాజనం పలికారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలు విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి పెనుగొండ మండలం సిద్ధాతం వద్ద జిల్లాలో అడుగుపెట్టారు. ఆయన పర్యటన ఏ రూట్లో ఉంటుందో ప్రకటించకపోయినా.. అప్పటికప్పుడు ఆయన వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు సెంటర్లలోకి చేరుకుని స్వాగతం పలికారు. సిద్ధాతం, ఉండ్రాజవరం జంక్షన్, తణుకు, దువ్వలో అభిమానులు ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. తాడేపల్లిగూడెం మీదుగా భీమవరం చేరుకున్న వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. ఈనెల 9న భీమవరంలో గ్రంధి ఇంట జరిగిన వివాహ వేడుకకు అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం వెళ్లి నూతన దంపతులు సాగర్, సుధలకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం అక్కడి నుంచి ఏలూరు బయలుదేరి వచ్చారు. మండుటెండలోనూ ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి, ఆకివీడు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. ఆకివీడులో హారతులు పట్టారు. అక్కడ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన వైఎస్ జగన్ ఏలూరు చేరుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఇంటికి వెళ్లారు. అక్కడ పార్టీ నగర, మండల శాఖ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, మంచెం మైబాబు ఆధ్వర్యంలో స్వాగతం లభించింది. నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నాని ఇంటికి తరలివచ్చారు. అనంతరం వట్లూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్‌కు చేరుకున్న వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ కుమార్తె డాక్టర్ పావని, డాక్టర్ నిషాంత్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, శ్రీకాకుళం జిల్లా పార్టీ ఇన్ చార్జి కొయ్యే మోషేన్ రాజు, నియోజకవర్గాల కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, తానేటి వనిత, దయాల నవీన్ బాబు, గుణ్ణం నాగబాబు, దూలం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తోట గోపి, చీర్ల రాధయ్య, మామిళ్లపల్లి జయప్రకాష్, వందనపు సాయిబాలపద్మ, పేరిచర్ల విజయనర్సింహరాజు, డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, బొద్దాని శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పరిశోధనలతో రైతులకు మేలు
తాడేపల్లిగూడెం రూరల్ : రైతులకు మేలు చేసేలా విద్యార్థులు పరిశోధనలు జరపాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చిరంజీవి చౌదరి అన్నారు. మండలంలోని వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాల 10వ వార్షికోత్సవం శనివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి చౌదరి మాట్లాడుతూ వ్యవసాయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చదువుతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందించే సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులు నైపుణ్యం కనబర్చాలన్నారు. అనంతరం చదువు, పాటల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు, డీ న్ ఆఫ్ హార్టీకల్చర్ డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, లైబ్రేరియ న్ డాక్టర్ ఎంబీ నాగేశ్వరరావు, డాక్టర్ డి.శ్రీహరి, డాక్టర్ జె.దిలీప్‌రెడ్డి, డాక్టర్ ఆర్‌వీఎస్‌కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
కొవ్వూరులో వడగళ్ల వాన
కొవ్వూరు : పట్టణంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి వేసవి తాపంతో జనం ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం సేదతీరారు. వీధుల్లో చిన్నారులు కోలాహలంగా వర్షంలో తడుస్తూ చిందులు వేస్తూ, వడగళ్లను ఏరుకున్నారు. చాగల్లు, తాళ్లపూడి మండలాల్లోనూ వర్షం కురిసింది. రైతుల ఉరుకులు పరుగులు భీమవరం : ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. శనివారం సాయంత్రం వాతావరణం చల్లబడి కారుమబ్బులు కమ్మాయి. జిల్లాలో కొన్ని చోట్ల వర్ష పడింది. దాళ్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ చిరుజల్లులు పడడం రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. జిల్లావ్యాప్తంగా దాళ్వా పంట ఆశాజనకంగా ఉండడంతో పాటు ధర కూడా రైతులకు కొంతమేరకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో దాళ్వా మాసూళ్లతో రైతులు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వరికోత యంత్రాలతో మాసూళ్లు చేసిన ధాన్యం ఎక్కడికక్కడ చేలల్లోనే రైతులు ఆరబెట్టే ప్రయత్నంలో బరకాలపై వేసి ఉంచడంతో ఆకాల వర్షం ఎటువంటి నష్టం కలిగిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఉరుకులు.. పరుగులు ధాన్యం ఎక్కడికక్కడ చేలలోను, రోడ్లు వెంబడి ఉంచడంతో శనివారం నాటి వర్షం జల్లులకు రైతులు బెంబేలెత్తిపోయారు. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి శ్రీలంకలోని కొమరిన్ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిన అల్పపీడన ద్రోణి కారణంగా శని, ఆదివారాలు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెప్పడంతో రైతుల్లో మరింత గుబులు పుట్టింది. రైతులు చేల వద్ద, రోడ్లుపైనే ఎండబెట్టిన ధాన్యాన్ని రాశులుగా చేసి చీకటిలో కూడా చార్జింగ్ లైట్ల వెలుతురులో భద్రపర్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈదురుగాలులకు పలుచోట్ల చేలు నేలనంటాయి. -
చంద్రబాబుకు ఝలక్
సీఎం పర్యటన, పోతవరంలో, శనివారం cm tour, in pothavaram, saturday అందరూ సంతోషంగా ఉన్నారా’ నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు అడిగిన ప్రశ్న ఇది. ‘లేదు.. లేదు.. ఎవరికీ సంతోషం లేదు’ గ్రామస్తులిచ్చిన సమాధానం అదిరిపడిన సీఎం ‘ఎంతమంది సంతృప్తికరంగా లేరో చేతులెత్తుండి’ అనగానే.. సభా ప్రాంగణంలో ఉన్న వారిలో 70 శాతం మంది చేతులెత్తారు. సర్దుకున్న చంద్రబాబు కారణం ఏమిటో చెప్పండని అడగ్గా.. ‘ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది. పాలన లంచాలమయంగా మారింది’ అంటూ ఘాటుగానే జవాబిచ్చారు. నల్లజర్ల మండలం పోతవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులు ఝలక్ ఇచ్చారు. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చంద్రబాబు అక్కడి పాఠశాలలో డిజిటల్ అక్షరాస్యత భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమ గోదావరిని ప్రకటిస్తున్నానని ఘనంగా చెప్పారు. ‘ఈ గ్రామానికి అన్నీ చేశాం. అందరూ సంతోషంగా ఉన్నారా’ అని వేదికపై నుంచి ప్రజలను సీఎం ప్రశ్నించారు. దీనికి జనం నుంచి ‘లేదు.. లేదు’ అనే సమాధానం రావడంతో ముఖ్యమంత్రి కంగుతిన్నారు. ఎంతమంది అసంతృప్తితో ఉన్నారని ప్రశ్నించగా.. సభలోని 70 శాతం మంది చేతులు పైకెత్తారు. వారిలో కొందరిని మీ సమస్యలేమిటని చంద్రబాబు ఆరా తీశారు. లంచం ఇస్తేనే పని చేస్తారట గ్రామానికి చెందిన అబ్బూరి లక్ష్మి మాట్లాడుతూ తన మామగారు చనిపోయారని, తమకున్న పొలానికి పట్టాదార్ పాస్‌బుక్ మంజూరు చేసి.. 70 సెంట్ల పొలాన్ని తన భర్త పేరుపై మార్చేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను అడుగుతుంటే... రూ.30 వేలు లంచమిస్తేనే పని చేస్తామని చెబుతున్నారని వాపోయింది. ఎవరు అడిగారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. వీఆర్ఓ ఫణిబాబు అని సమాధానం చెప్పింది. దీంతో ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ రెవెన్యూ అధికారిపై విచారణ జరిపి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు. మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదు మరో వృద్ధురాలు శ్యామలను సంతృప్తిగా ఉన్నావా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. తనకు మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదని, సంతృప్తి ఎలా ఉంటుందని బదులిచ్చింది. రేషన్ కార్డు ఉందా అన్ని అడగ్గా.. ‘కార్డు లేదు. రేషన్ లేదు. పింఛన్ కూడా రావడం లేదు’ అని బదులిచ్చింది. కంగుతిన్న ముఖ్యమంత్రి నీ కుటుం బంలో ఎవరికైనా పింఛను వస్తుందేమో.. అందుకే తొలగించి ఉంటారన్నారు. తన కుటుంబంలో ఎవరికీ పెన్షన్ లేదని, తనకూ రావడం లేదని వాపోయింది. అధికారులు నీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి వేరే వ్యకితో మాట్లాడారు. ఇల్లు మంజూరు కాలేదు గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ‘నీవు సంతృప్తిగా ఉన్నావా’ అని సీఎం అడగ్గా.. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇంటి కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని చెప్పాడు. సీఎం బదులిస్తూ.. ‘ఇప్పుడే శంకుస్థాపన చేశాను. త్వరలో నీకు ఇల్లు వస్తుందిలే. అప్పుడు సంతృప్తిగా ఉందువు’ అని ముఖ్యమంత్రి సర్ధి చెప్పారు. అవినీతి ఎక్కడ జరిగినా వెంటాడతానని సీఎం హెచ్చరించారు. అవినీతిపరులపై దాడులు చేయిస్తామని.. పట్టుబడిన సొమ్మును స్వాధీనం చేసుకుని పేదల సంక్షేమానికి ఖర్చు పెడతామని అన్నారు. దాడుల్లో పట్టుబడిన అధికారులు రెండు నెలల అనంతరం తమ ఉద్యోగం తిరిగొస్తుందనే భావనలో ఉన్నారని.. ఇకనుంచి అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఇదిలావుండగా నల్లజర్లలో జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సభకు జనం రాలేదు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ కార్యకర్తలను తీసుకొచ్చినా.. సభావేదిక ముందు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. రైతులు భూములివ్వాల్సిందే ఏలూరు (మెట్రో) : రైతులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నల్లజర్లలో బహిరంగ సభలో మాట్లాడుతూ రోడ్లు అభివృద్ధి చేయాలంటే భూమి అవసరమన్నారు. అందువల్ల రైతులు ఉదా రంగా భూములు ఇవ్వాలని కోరారు. చేపల, రొయ్యల పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవస రం ఉందని, అటువంటి పరిశ్రమలకు అడ్డుపడకూడదని పరోక్షంగా ఆక్వాపార్క్ అంశాన్ని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. అంతకుముందు పోతవరం విచ్చేసిన చంద్రబాబుకు స్వాగతం లభించింది. మంత్రులు దేవినేని ఉమ, పైడికొం డల మాణిక్యాలరావు, పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, జెడ్పీ చైర్మన్ ఎం.బాపిరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, మురళీమోహన్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులవర్తి రామాం జనేయులు, ఎం.శ్రీనివాసరావు, కలెక్టర్ కె.భాస్కర్, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, పోతవరం సర్పంచ్ పసుమర్తి సతీష్ పాల్గొన్నారు. -
ముగిసిన రాట్నాలమ్మ తిరునాళ్లు
రాట్నాలకుంట (పెదవేగి రూరల్): కన్నుల పండువగా రాట్నాలమ్మతల్లి తిరునాళ్లు శనివారంతో ముగిశాయి. తిరునాళ్ల చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సీహెచ్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఉత్సవ మూర్తికి అవబృతోత్సవం, కుంభాభిషేకం, పుష్పయాగోత్సవం విజయవాడకు చెందిన మండలి హనుమంతరావు, పద్మ దంపతులు నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు ఉదయం 9 గంటల నుంచి అన్నసమారాధన, రాత్రి 7 గంటలకు వృక్ష కల్యాణం, కూచిపూడి నృత్య ప్రదర్శన, తెప్పోత్సవం భక్తులను అలరించాయి. రాత్రి 9 గంటలకు సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు.