పరిశ్రమల స్థాపనకు రుణాలు
పరిశ్రమల స్థాపనకు రుణాలు
Published Sun, Feb 5 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
ఏలూరు (మెట్రో): జిల్లాలో నిరుద్యోగులు చిన్నతరహా పరిశ్రమలను స్థాపించేందుకు రు.25 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నట్టు బీసీ కార్పొరేష న్ ఈడీ ఎ న్ .పుష్పలత చెప్పారు. కలెక్టరేట్‌లోని గోదావరి కాన్ఫెరెన్స్ హాల్‌లో రెండురోజుల పాటు ఎంటర్‌పెన్యూర్ అభివృద్ధి కార్యక్రమాన్ని (ఈడీపీ) నిర్వహించారు. శనివారం ఈడీ పుష్పలత మాట్లాడుతూ లబ్ధిదారులు తమ వాటాగా రూ.5 లక్షలు, బ్యాంకు రుణంగా రూ.10 లక్షలు, సబ్సిడీగా రూ.10 లక్షలతో పరిశ్రమలు స్థాపించవచ్చన్నారు. నాబ్‌కా న్స్ ,మెప్డా ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టి.శ్రీనివాసరావు, ప్రదీప్‌చంద్, ప్రమీలారాణి పాల్గొన్నారు.
Advertisement