శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగ
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు ఈ వేడుకను జరపడం ఇక్కడ సాంప్రదాయ బద్ధమైంది. ఈ క్రమంలో చినవెంకన్న అమ్మవార్లతో కలసి క్షేత్రపురవీదుల్లో ఊరేగుతారు. అయితే మధ్యాహ్నం నుంచి అడపాదడప వర్షపు జల్లులు కురుస్తుండటంతో శ్రీవారి తిరువీధిసేవను ఆలయ అధికారులు రద్దు చేశారు. దీంతో ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టి, యువకులు ఆనందోత్సాహాలతో సందడి చేశారు.