dwaraka
-
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ DGP రియాక్షన్..
-
బ్రహ్మోత్సవాలకు వేళాయే
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి శనివారం తెలిపారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను జరుపుతామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 13 నుంచి 20 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు.అక్టోబర్ 13న ఉదయం శ్రీవారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. 14 న రాత్రి ధ్వజారోహణ, రాత్రి 9 హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం చేపడతారు. 16 న ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని రాత్రి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు.17 న రాత్రి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. 18 న రాత్రి రథోత్సవాన్ని, 19న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ చేపడతారు. 20న ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
పోలవరం మట్టిన పందికొక్కుల్లా తినేస్తున్నారు
-
రైనీ డే కావాలి.. రెడ్ అలర్ట్ లో షూట్
-
‘సుదర్శన్ సేతు’ ప్రత్యేకత ఏమిటి?
దేశంలో మౌలిక సదుపాయాలకు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్) మరో ప్రత్యేక ఉదాహరణ మన కళ్ల ముందుకు వస్తోంది. అదే సుదర్శన సేతు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం)జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు. బ్రిడ్జికి ఇరువైపులా శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు. ఇందులో ఫుట్‌పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది. పడవపైనే ఆధారపడేవారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాల తీరనున్నాయి. అలాగే దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లో ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017, అక్టోబర్ 7న ఓఖా- భేట్ ద్వారకలను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా, తర్వాత దానిని రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్‌లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు-రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారయ్యింది. దీని వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు). ఈ వంతెనకు ఇరువైపులా 2.5 మీటర్లు (8 అడుగులు) వెడల్పు గల ఫుట్‌పాత్ కూడా ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు). ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. -
సముద్రగర్భంలో ద్వారక దర్శనం
-
జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం
భగవాన్ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక. హిందువులకు పరమ పవిత్రమైన ఈ పురాతన నగరం వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు, పర్యాటకులకు లభించనుంది. జలాంతార్గమిలో ప్రయాణించి, ద్వారకను దర్శించుకోవచ్చు. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. జలాంతర్గామి యాత్ర రెండు నుంచి రెండున్నర గంటలపాటు ఉంటుందని సమాచారం. ఈ సబ్‌మెరైన్ బరువు 35 టన్నులు. లోపల పూర్తిగా ఏసీ సౌకర్యం కలి్పస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భక్తులు 24 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన ఆరుగురు జలాంతర్గామిని నడిపించే సిబ్బంది, సహాయకులు. భక్తులకు ఆక్సిజన్ మాస్్క, ఫేస్ మాస్క్, స్కూబా డ్రెస్ అందజేస్తారు. అయితే, ద్వారక దర్శనానికి ఎంత రుసుము వసూలు చేస్తారన్న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించలేదు. జలాంతర్గామిలో ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సామాన్యుల కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ద్వారక కారిడార్ అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం డాక్ షిప్‌యార్డ్ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరో అద్భుతం ‘యశోభూమి’
ప్రాచీన కట్టడాలు, దర్శనీయ క్షేత్రాలకు నిలయమైన దేశ రాజధాని ఢిల్లీ కీర్తికిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. చూపు తిప్పుకోనివ్వని సుందరమైన, విశాలమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్(ఐఐసీసీ) యశోభూమి ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలో సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్ల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్రి సంకల్పం మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో యశోభూమిని అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించింది. ప్రధాన ఆడిటోరియం, కన్వెన్షన్ హాళ్లు, బాల్రూమ్, మీటింగ్ రూమ్‌లతో యశోభూమి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా నిలువనుంది. ఎనిమిది అంతస్తుల యశోభూమిలో మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్(ఎంఐసీఈ) సదుపాయాలన్నీ ఉన్నాయి. ఐఐసీసీ మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 17వ తేదీన స్వయంగా ప్రారంభించనున్నారు. అలాగే జాతికి అంకితం ఇస్తారు. విశేషాలివీ.. 1. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు ఏరియా 8.9 లక్షల చదరపు మీటర్లు, బిల్ట్–అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్‌ను 73,000 చదరపు మీటర్లకుపైగా వైశాల్యంలో నిర్మించారు. 2. మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఒక బాల్రూమ్, 13 మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి. 3. అన్ని గదుల్లో కలిపి ఏకకాలంలో 11,000 మంది ఆసీనులు కావొచ్చు. 4. 6,000 మంది అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రధాన ఆడిటోరియం(ప్లీనరీ హాల్) నిర్మించారు. ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టమ్ ఉంది. 5. అందమైన సీలింగ్‌తో ఆకట్టుకుంటున్న బాల్రూమ్ సీటింగ్ సామర్థ్యం 2,500. ఇక్కడే మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా ఉంది. 6. అలాగే 1.07 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. 7. మీడియా రూమ్‌లు, వీవీఐపీ గదులు, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 8. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ వర్షం నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసుకొని మళ్లీ ఉపయోగించుకునే ఏర్పాట్లున్నాయి. 9. సౌర విద్యుత్ కోసం రూప్‌టాప్ సోలార్ ప్యానళ్లు బిగించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. 10. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినమ్ సరి్టఫికేషన్ పొందింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అబ్బురపరిచే నిర్మాణం.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే
న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అదివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియోను విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేస్తూ దాని కింద ఇంజినీరింగ్ యొక్క ఘనత.. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే.. అత్యాధునికమైన కళాత్మక భవిష్యత్తుకు నాంది.. అని రాశారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఎనిమిది లైన్ల హైవే. నేషనల్ హైవే నెంబర్ 8 పై ఉన్న శివ మూర్తి నుండి ప్రారంభమై ఖేర్కి దౌలా వద్ద ముగిసే ఈ నాలుగు లైన్ల ప్యాకేజీ హైవే 563 కి.మీ వెడల్పుతో నిర్మితమైంది.ఈ ప్రాజెక్టు కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏకంగా 1200 చెట్లను తిరిగి నాటారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ హర్యానా మధ్య రాకపోకలు మరింత మెరుగవుతాయి. వీడియోలో చూపిన వివరాల ప్రకారం ద్వారకా నుండి మానేసర్ వరకు 15 నిముషాలు మానేసర్ నుండి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 20 నిముషాలు ద్వారకా నుండి సింఘు సరిహద్దు వరకు 25 నిముషాలు మానేసర్ నుండి సింఘు సరిహద్దు వరకు 45 నిముషాల వరకు ప్రయాణ సమయం ఉంటుందని తెలిపింది కేంద్ర రవాణా శాఖ. ఈ హైవే నిర్మాణం గనుక పూర్తయితే ద్వారకా సెక్టర్ 25లోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ తో కనెక్టివిటీని బాగా పెరుగుతుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా మూడు లైన్ల సర్వీసు రోడ్లను కూడా నిర్మించారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల ఉక్కును వినియోగించినట్టు ఇది పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 30 రేట్లు ఎక్కువ కాగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీటు వినియోగించగా ఇది దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో వినియోగించిన దానికంటే ఆరు రేట్లు ఎక్కువ కావడం విశేషం. Marvel of Engineering: The Dwarka Expressway! A State-of-the-Art Journey into the Future 🛣#DwarkaExpressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/Qhgd77WatW — Nitin Gadkari (@nitin_gadkari) August 20, 2023 ఇది కూడా చదవండి: Manipur Violence: మణిపూర్‌లో సజీవదహనమైన తల్లీకొడుకులు.. -
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వ్యయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ–గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం అత్యంత ఖరీదైన వ్యవహారంగా కనిపిస్తోందని కాగ్(కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వ్యాఖ్యానించింది. ఒక్కో కిలోమీటర్‌కు నిర్మాణ వ్యయం ప్రభుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా వాస్తవ ఖర్చు రూ.250.77 కోట్లకు పెరిగిందని తెలిపింది. అయితే, భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా ఈ 48వ నంబర్ జాతీయ రహదారిని 14 లేన్లుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే, 8 లేన్ల ఎలివేటెడ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవే కారిడార్‌లో వాహనాల రాకపోకలు సులభంగా జరిగేందుకు గాను తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఇవ్వడమే నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమని రోడ్డు రవాణా హైవేల శాఖ చెబుతోందని వివరించింది. ఈ కారణం సహేతుకంగా లేదని కాగ్ పేర్కొంది. కేవలం ఆరు లేన్లకు మాత్రమే ప్రణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశారని తెలిపింది. ఇదే కాకుండా, దేశవ్యాప్తంగా భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన హైవేల నిర్మాణంలో కేటాయింపుల కంటే 58% అధికంగా ఖర్చు చేశారని వివరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శులు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపిస్తున్నారు. ఇక, దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. CAG exposed the scam of 6741 crores in building of Dwarka Expressway. If TV media raise these issues & debate on this, BJP will fall like a pack of cards ♠️ pic.twitter.com/81ohaACopW — Baijuu Nambiar CFP®✋ (@baijunambiar) August 14, 2023 ఇది కూడా చదవండి: బీజేపీతో పొత్తుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు -
స్టార్టప్స్‌కు ద్వారక కో-వర్కింగ్ స్పేస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ స్పేస్ కంపెనీ ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్.. స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా 620 సీట్లతో మాదాపూర్‌లో ద్వారక ప్రైడ్‌ను ప్రారంభించింది. దీంతో సంస్థ ఖాతాలో 13 కేంద్రాలకుగాను 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 6,500 సీట్ల సామర్థ్యానికి చేరుకున్నామని ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. 100కుపైగా కంపెనీల కార్యాలయాలు ద్వారక ప్రాజెక్టుల్లో కొలువుదీరాయని చెప్పారు. కొత్తగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్టులను 2024 మార్చినాటికి జోడిస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా మరో 4,500 సీట్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ డైరెక్టర్ దీప్నా రెడ్డి వివరించారు. అనువైన విధానం..: ఆఫీస్ స్పేస్ పరిశ్రమలో ప్లగ్ అండ్ ప్లే, కో–వర్కింగ్, సర్వీస్డ్ ఆఫీస్ స్పేస్ విభాగాల్లో పోటీ పడుతున్నామని దీప్నా రెడ్డి తెలిపారు. ‘ఐటీ రంగంలో ఒడిదుడుకులు సహజం. అందుకే కంపెనీలకు దీర్ఘకాలిక ఒప్పందం భారం కాకుండా అనువైన విధానాన్ని అమలు చేస్తున్నాం. అంటే ఒప్పందం కుదుర్చుకుని సీట్లను తగ్గించుకున్నా వారిపై భారం ఉండదు. మహిళా వ్యాపారవేత్తలకు చార్జీల్లో డిస్కౌంట్ ఇస్తున్నాం. మహమ్మారి కాలంలో ఆఫీస్ స్పేస్ పరిశ్రమ తిరోగమించింది. ఇదే కాలంలో ద్వారక ఇన్ఫ్రా భారీ ప్రాజెక్టులకుతోడు రెండింతల సామర్థ్యాన్ని అందుకుంది. సాధారణ చార్జీలతోనే ప్రీమియం ఇంటీరియర్స్‌తో ఖరీదైన అనుభూతి కల్పిస్తున్నాం’ అని వివరించారు. -
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద శివైక్యం
భోపాల్: ద్వారకా పీఠాధిపతి స్వామి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి (99) ఆదివారం శివైక్యం పొందారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని ఆశ్రమంలో మధ్యాహ్నం 3.30 గంటలకు స్వరూపానంద సరస్వతి తుది శ్వాస విడిచినట్టు ఆయన ముఖ్య అనుచరుడైన స్వామి సదానంద మహరాజ్ తెలిపారు. ద్వారక, శారద, జ్యోతిష్ పీఠాలకు శంకరాచార్యుడిగా ఉన్న స్వామి స్వరూపానంద ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లా డిఘోరిలో 1924లో జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులో ఇల్లు వీడారు. స్వాతంత్య్ర సమయంలో జైలు జీవితం గడిపారు. 1981లో ద్వారకపీఠాధిపతి అయ్యారు. స్వరూపనంద శివైక్యం చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ట్విటర్ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन से अत्यंत दुख हुआ है। शोक के इस समय में उनके अनुयायियों के प्रति मेरी संवेदनाएं। ओम शांति! — Narendra Modi (@narendramodi) September 11, 2022 द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ। सनातन संस्कृति व धर्म के प्रचार-प्रसार को समर्पित उनके कार्य सदैव याद किए जाएँगे। उनके अनुयायियों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर दिवंगत आत्मा को सद्गति प्रदान करें। ॐ शांति pic.twitter.com/uPnv3JEull — Amit Shah (@AmitShah) September 11, 2022 -
గుజరాత్లో వరుణ విలయం
అహ్మదాబాద్: దక్షిణ గుజరాత్లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్‌నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. వల్సాద్ జిల్లాలోని కాప్రాడా తాలూకాలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రికార్డు స్థాయిలో 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నవసారిలోని వన్స్‌దాలో 164 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అహ్మదాబాద్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతంలో కేవలం 3 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. చాకుడియా, విరాట్‌నగర్‌లోనూ భారీ వర్షం కురిసింది. దక్షిణ గుజరాత్లో రానున్న 4 రోజులపాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముంబైలో కొంత ఊరట నాలుగు రోజులుగా ముంబైని ముంచెత్తుతున్న వర్షం శుక్రవారం కొద్దిగా తెరపినిచ్చింది. బస్సులు, సబర్బన్ రైలు సర్వీసులు యథావిధిగా నడిచాయి. రాగల 24 గంటల్లో 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు అలెర్ట్ చేశారు. థానె జిల్లా మిరాభయందర్ ప్రాంతంలో చెనా నది వరదలో చిక్కుకున్న ముగ్గురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. రాయ్‌గఢ్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాథేరన్‌లో అత్యధికంగా 210 మిల్లీమీటర్లు కురిసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు తెలంగాణ, రాజసాŠత్న్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
కౌరవుల జాబితా తయారు చేయండి: రాహుల్
ద్వారక: కాంగ్రెస్ పార్టీలోని కౌరవుల జాబితా తయారు చేయాలని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ గుజరాత్ పార్టీ శ్రేణులను కోరారు. ఏసీ కార్యాలయాల్లో కూర్చుని ఏపనీ చేయకుండా ఇతరులను ఇబ్బంది పెట్టే అటువంటి నాయకులు, చివరికి బీజేపీ పంచన చేరుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి కౌరవులను వదిలించుకోవాలని సూచించారు. ద్వారకలో మూడు రోజులపాటు జరిగే పార్టీ చింతన్ శిబిర్‌లో నేతలు, ఆఫీస్ బేరర్లనుద్దేశించి రాహుల్ మాట్లాడారు. బీజేపీ రాజకీయాల కారణంగా గుజరాత్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు. అధికారం అప్పగిస్తే ఏం చేయనుందనే విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పారు. ఆయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర విభాగాలైన సీబీఐ, ఈడీలతోపాటు మీడియా, పోలీస్ వ్యవస్థలను రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటోందని దుయ్యబట్టారు. చదవండి: (కులం, మతం పేరుతో ఇంకెన్ని రోజులు రెచ్చగొడతారు.. ప్రియాంక ఫైర్) -
Vaccine RJ Aswathy Murali: టీవీ కంటే రేడియో ద్వారానే.. అలా
Kerala Vaccine RJ Aswathy Murali: కరోనాకు వ్యాక్సిన్ రాకముందు..వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ఇంకెన్ని రోజులు ఈ మాస్కులు పెట్టుకోవాలి? బయటకెళ్లాలంటేనే భయమేస్తుంది..అంటూ వ్యాక్సిన్ కోసం ఒకటే ఎదురు చూపులు చూసిన వారు కూడా తీరా వ్యాక్సిన్ వచ్చాక.. కరోనా కంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఎక్కువ ప్రమాదమన్న అపోహతో వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రాలేదు. అస్వతి బామ్మ కూడా ‘‘ఇప్పటిదాకా నిక్షేపంగా ఉన్నాను నేను... వ్యాక్సిన్ వేసుకుంటే నా ఆరోగ్యం పాడవుతుంది.. వ్యాక్సిన్ వేసుకోను’’ అని మొండికేసింది. వ్యాక్సిన్ గురించి తెలిసిన అస్వతి.. ‘‘బామ్మా ..వ్యాక్సిన్ వేసుకుంటే ఏం కాదు, కరోనా వచ్చినా ప్రమాదం ఉండదు’’ అని ఆమెకు నచ్చజెప్పడంతో వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇవే మాటలు తన కమ్యూనిటీలో ఎంతోమందికి చెప్పి, వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించింది అస్వతి. దీంతో గ్రామంలో ఉన్న వారంతా వ్యాక్సిన్ తీసుకున్నారు. అస్వతి ద్వారక నుంచి ప్రసారమయ్యే ‘మట్టోలి(90.4 ఎఫ్ఎమ్)’ కమ్యూనిటీ రేడియో సర్వీస్‌లో రేడీయో జాకీగా పనిచేస్తుంది. వైనాడ్‌లో ‘పనియార్’ జాతికి చెందిన గిరిజనుల జనాభా 18 శాతం ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది ‘పనియా’ భాషనే మాట్లాడుతారు. మట్టోలి మారుమూల గ్రామం, పనియా భాష ఒక్కటే తెలుసు. వీరికి వ్యాక్సిన్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. వీరిలాగే అస్వతి బామ్మ ముందు మొరాయించినప్పటికీ తరువాత వ్యాక్సిన్ వేసుకున్నారు. బామ్మను ప్రేరణగా తీసుకున్న అస్వతి, తను కూడా పనియార్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి కావడంతో గ్రామస్థులందరికి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలనుకుంది. దీనికోసం ఒకపక్క ఆర్జేగా పనిచేస్తూనే తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా డాక్టర్ల టాక్‌షోలు శ్రద్దగా వినేది. కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించేది. కోవిడ్ లక్షణాలు, జాగ్రత్తలు, వ్యాక్సిన్ ప్రాముఖ్యత గురించి పనియా భాషలో రేడియోలో వివరించేది. ఈ కమ్యూనిటీకి సమాచారం అందించే ఒకే మాధ్యమం రేడియో కావడంతో..కరోనాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రేడియో ద్వారా అందించేది. అంతేగాక రేడియోకు కాల్ చేసి ఎవరైనా సందేహాలు అడిగినా వాటిని నివృత్తి చేసి, వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించింది. దీంతో గ్రామస్థులంతా వ్యాక్సిన్ వేసుకున్నారు. టీవీ కంటే రేడియో ద్వారా.. ‘‘మా కమ్యూనిటీలో ఎక్కువ మంది అపోహలతో వ్యాక్సిన్ చేసుకోవడానికి సంకోచిస్తున్నారు. వీరిని విపత్కర పరిస్థితుల్లో నుంచి బయట పడేయడానికి.. నావంతు సాయం కమ్యునిటీకి చేయాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి టీవీలో కంటే రేడియో ద్వారా ఎక్కువ సమాచారం తెలుసుకునేదాన్ని. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో కూడా రేడియోలో ప్రసారమయ్యే డాక్టర్ కార్యక్రమాలు ఇంగ్లిష్‌లో వచ్చేవి. అవి మా కమ్యూనిటీ వాళ్లకు అర్థం కావు. అందువల్ల అవన్నీ వింటూ రాసుకుని తరువాత మా పనియా భాషలో వివరించేదాన్ని. గ్రామస్థులకు ఉన్న సందేహాలను తెలుసుకుని వాటికి సమాధానాలు చెప్పేదాన్ని. ఈ ప్రశ్నలనే రేడియోలో కూడా ప్రస్తావిస్తూ ఎక్కువమందికి చేరేలా చెప్పాను. నేను కూడా పనియార్ కమ్యూనిటీకి చెందినదాన్ని కావడంతో అంతా నా మాటలపై నమ్మకంతో వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీంతో మట్టోలి గ్రామం పూర్తి వ్యాక్సినేషన్ అయిన గ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది’’ అని అస్వతి చెప్పింది. చదవండి: సోషల్ స్టార్.. ఇక్కడ కాకపోతే ఇంకోచోట! -
గుజరాత్లో భూకంపం
గాంధీనగర్: గుజరాత్ ద్వారకలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. గురవారం మధ్యాహ్నం 03.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ద్వారకకు వాయవ్య దిశలో 223 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు భూకంప అధ్యయన కేంద్రం(ఎన్సీఎస్) తెలిపింది. (చదవండి: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప భూకంపం) అసోంలో కూడా గురువారం ఉదయం భూకంపం సంభవించింది. తేజ్‌పూర్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదయ్యింది. చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
వారం క్రితం ప్రేమపెళ్లి.. నూతన జంటను వెంటాడి వేటాడి..
ఢిల్లీ: ఢిల్లీలోని ద్వారకా నగరంలో పరువు హత్య కలకలం రేపింది. పెద్దవాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న జంటపై ఏడుగురు దుండగులు వారి ఇంట్లోకి చొరబడి చంపేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో ఆ జంట తప్పించుకునే ప్రయత్నం చేయగా.. రోడ్డుపై వెంటాడి మరి తుపాకులతో కాల్చారు. ఈ దాడిలో యువకుడు చనిపోగా.. అతని భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నా ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. డీసీపీ ఎస్కే. మీనా తెలిపిన వివరాల ప్రకారం.. సోనాపేటకు చెందిన వినయ్ దహియా, కిరణ్‌లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే వారి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారం క్రితం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు కుటుంబసభ్యులు ఎలాగైనా వారిని చంపాలని నిర్ణయించుకున్నారు. దానికోసం పథకం వేసి కిరాయి అంతకులను మాట్లాడి వారు ఉంటున్న ప్రాంతం వివరాలు ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వచ్చిన వినయ్ తన భార్య కిరణ్‌తో కలిసి భోజనం చేస్తున్నాడు. ఇదే సమయంలో వారు ఉంటున్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చిన అగంతకులు తుపాకీలతో కాల్పులు జరిపారు. వినయ్ శరీరంలోకి బులెట్లు దిగడంతో ప్రాణభయంతో అతను భార్యను వెంటబెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. కానీ అగంతకులు వారిని వెంటాడి మరీ కాల్పులు జరిపారు. దీంతో వినయ్ అక్కడికక్కడే మరణించగా.. కిరణ్ గట్టిగా కేకలు వేయడంతో అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. కాగా స్థానికులు వచ్చి వారిని దగ్గర్లోని వెంకటేశ్వర్ ఆసుపత్రిలో చేర్చారు. వినయ్ అప్పటికే మృతి చెందగా.. కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చదవండి: బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు -
చిన్నారి ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
సాక్షి, విజయవాడ : విజయవాడలో దారుణ హత్యకు గురైన చిన్నారి ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నల్లకుంట గ్రామానికి తరలించారు. పోస్టుమార్టం మొత్తాన్ని డాక్టర్లు వీడియోల ద్వారా రికార్డు చేసి భద్రపరిచారు. ఈ నేపథ్యంలో ద్వారక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రకాశ్‌తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య ఫోన్లో సాగిన సంభాషనే విచారణలో కీలకం కానుంది. బాలిక తల్లికి అతను చాలా సార్లు ఫోన్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిన్నారి ద్వారకను తానే హత్య చేసినట్లు నిందితుడు ప్రకాశ్ ఇదివరకే అంగీకరించిన విషయం తెలిసిందే. -
చిన్నారి ద్వారక హత్య కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, కృష్ణ: విజయవాడలో దారుణ హత్యకు గురైన బాలిక మొవ్వ ద్వారక హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నారి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ద్వారక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు ప్రకాశ్‌తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య ఫోన్లో సాగిన సంభాషనే విచారణలో కీలకం కానుంది. బాలిక తల్లికి అతను చాలా సార్లు ఫోన్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిన్నారి ద్వారకను తానే హత్య చేసినట్లు నిందితుడు ప్రకాశ్ ఇదివరకే అంగీకరించిన విషయం తెలిసిందే. ( చదవండి: పక్కింటోడే చిన్నారి ప్రాణాలు తీశాడు) -
గోనె సంచిలో చిన్నారి ద్వారక మృతదేహం
సాక్షి, విజయవాడ: ఇంటి ముందు ఆడుకుంటూ నిన్న సాయంత్రం అదృశ్యమైన చిన్నారి ద్వారక మువ్వ ఉదంతం విషాదంగా ముగిసింది. పక్కింట్లోనే చిన్నారి మృతదేహం ఓ గోనె సంచిలో లభ్యమైంది. పక్కింట్లో నివాసం ఉంటున్న ప్రకాష్ అనే వ్యక్తి ... ద్వారకపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకుంటలో ఎనిమిదేళ్ల చిన్నారి ద్వారకా మువ్వ ఆదివారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ద్వారక తల్లి ఇంటి పక్కనే ఉన్న కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. పని ముగించుకుని ఆమె ఇంటికి వచ్చినా.. కూతురు మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకి తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ పుటేజీ కెమెరాలను పరిశీలించినా ఆధారాలు లభించలేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లను తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో ద్వారక ఉంటున్న పక్కింట్లోనే చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రకాష్...అత్యాచారానికి పాల్పడి అనంతరం హతమార్చి, మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి ఇంట్లోనే దాచాడు. అయితే భర్త ప్రవర్తన తేడాగా ఉండటాన్ని గమనించిన ప్రకాష్ భార్య ఇంట్లో వెతకగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ప్రకాష్ పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మరోవైపు కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చదవండి: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య? వర్షిత హంతకుడు ఇతడే! -
డబ్బులు చెల్లించమన్నందుకు దాడి
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : పొదుపు సంఘానికి చెందిన బకాయి డబ్బులు చెల్లించాలని అడిగినందుకు డ్వాక్రా సంఘాల సీసీ ఇబ్రహీం, హెడ్‌డీసీసీ రామ్మోహన్‌లపై పొదుపు సంఘం లీడర్ వరలక్ష్మితో పాటు ఆమె బంధువులు దాడి చేసి గాయపరిచారని వెలుగు అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి (ఏపీఎం) అపర్ణ దేవి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు... మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో సాయిచందన గ్రూపు పొదుపు సంఘం లీడర్ డి. వరలక్ష్మి తన అవసరాల నిమిత్తం రూ.2.70 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పును చెల్లించకపోవడంతో ఆ గ్రూపులోని సభ్యులందరూ బకాయి డబ్బులు చెల్లించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చిలంకూరు పొదుపు సంఘాలకు చెందిన కమ్యూనిటీ కో ఆర్డినేటర్ ఇబ్రహీం, హ్యూమన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామ్మోహన్‌లు డబ్బులు చెల్లించాలని ఆమెను అడిగారు. ఆగ్రహించిన వరలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరి కొందరు ఎర్రగుంట్లలోని వెలుగు కార్యాలయానికి వచ్చి విధి నిర్వహణలో ఉన్న సీసీ ఇబ్రహీం, హెచ్‌డీసీసీ రామ్మోహన్‌లపై కర్రలు, వాటర్‌పైపు, వైర్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోలీవుడ్‌కూ అర్జున్‌రెడ్డిగా..
సినిమా: టాలీవుడ్లో క్రేజీ కథానాయకుడిగా వెలుగొందుతున్న యువ నటుడు విజయ్‌దేవరకొండ. అక్కడ ఈయన సినీ జీవితంలో అర్జున్‌రెడ్డి చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అంత సంచలన విజయాన్ని ఆ చిత్రం సాధించింది. ఇప్పుడు అదే చిత్రం విక్రమ్ వారసుడు ధ్రువ్ హీరోగా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత విజయ్‌దేవరకొండ నటించిన గీతగోవిందం చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది. ఆయన నటించిన మరో చిత్రం ద్వారకా. ఇందులో విజయ్‌దేవరకొండకు జంటగా నటి పూజాజవేరి నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, బాహుబలి ప్రభాకర్, మురళీశర్మ, సురేఖవాణి పృథ్వీరాజ్ నటించారు. శ్రీనివాస రవీంద్ర కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి శ్యామ్ కే.నాయుడు ఛాయాగ్రహణం, సాయ్కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడీ చిత్రాన్ని జీఆర్.వెంకటేశ్ భాగ్య హోమ్స్ సంస్థ సమర్పణలో శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలాజి తమిళ ప్రేక్షకులకు అర్జున్‌రెడ్డి పేరుతో అందించనున్నారు. ఈయన ఇంతకు ముందు నంబర్ 1, బిజినెస్మెన్, హలో వంటి చిత్రాలను అనువదించారు. అర్జున్‌రెడ్డి చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ చిత్రం తెలుగులో ద్వారకా పేరుతో రూపొంది మంచి విజయాన్ని సాధించిందన్నారు. తెలుగులో విజయ్‌దేవరకొండ నటించిన అర్జున్‌రెడ్డి చిత్రం సంచలన విజయాన్ని సాధించిందని తెలిపారు. అదేవిధంగా ఆయన నోటా చిత్రంతో నేరుగా కోలీవుడ్‌కు ప్రేక్షకులకు దగ్గర అయ్యారని, తాజాగా తమ అర్జున్‌రెడ్డి తమిళ ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రేమ, యాక్షన్ అంటూ కమర్శియల్ ఫార్ములాలో తెరకెక్కిన అర్జున్‌రెడ్డి చిత్రం తమిళ ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత బాలాజి తెలిపారు. -
డ్వాక్రా మహిళలకు షాక్
-
ముక్కలుగా చేసి, సెప్టిక్ ట్యాంకులో దాచి..
సాక్షి, న్యూఢిల్లీ: డబ్బు కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కిరాతకులు అతన్ని దారుణంగా హతమార్చి ముక్కలు చేశారు. పోలీసులకు పట్టుబడకుండా వాటిని మూటకట్టి సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టారు. ఈ దారుణ ఘటన ద్వారకలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్లో నివాసముండే సచిన్ యాదవ్(21) ఒక ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే షాప్‌లో పనిచేసే వరుణ్ (26), అతని బావమరిది రితురాజ్ అలియాస్ విక్కీ (24)తో కలిసి సచిన్‌ను మే 12ని అపహరించారు. వారి బారినుంచి తప్పించుకునే క్రమంలో సచిన్ యాదవ్ దొరికిపోవడంతో హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. కొడుకు ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినా సచిన్‌కు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదని ద్వారకా డీసీపీ షిబేశ్ సింగ్ తెలిపారు. కిడ్నాప్ జరిగిన రోజున సచిన్ తల్లిదండ్రులకు ఒక బెదిరింపు కాల్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘మీ కొడుకుని కిడ్నాప్ చేశాం. 50 లక్షల రూపాయలు తీసుకొస్తేనే అతన్ని వదిలేస్తామ’ని సచిన్ తల్లిదండ్రులకు గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అనుమానం నిజమైంది.. సచిన్‌తో పాటు అదే ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్న వరుణ్ కిడ్నాప్ జరిగిన రోజు నుంచి పనిలోకి రావడంలేదు. అతను ఇల్లు ఖాళీ చేయడం, ఫోన్ చేస్తే స్పందించక పోవడంతో వరుణ్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేయడంతో నిందితులు పట్టుబడ్డారని డీసీపీ షిబేశ్ తెలిపారు. -
ద్వారక మునిగి తేలిన నగరం
ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం కదా... ఆయన తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ నగరం సముద్రంలో కలిసి పోయింది. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన, మునుల శాపప్రభావాన తమలో తాము కలహించికొని నిశ్శేషంగా మరణిస్తారు. ఆ తరువాత శ్రీ కృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్థం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరం మునిగిపోవడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది. పదహారో శతాబ్దంలో ఈ అలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని ముదిమనుమడు వజ్రనాభుడు ఈ ఆలయానికొక రూపునిచ్చాడని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి స్వర్గ, మోక్షద్వారాలనే రెండు ద్వారాలగుండా ప్రవేశించవచ్చు. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఆలయ సమీపంలో బలరాముడికి, కృష్ణుడికీ కుమారుడు, మనుమడూ అయిన ప్రద్యుమ్న అనిరుద్ధులకూ, శివకేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలున్నాయి. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ప్రధానమైనది కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంది. ఈ క్షేత్రానికి సమీపానే గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో బేట్ ద్వారక చేరాలి. ఇది శ్రీ కృష్ణుని నివాస స్థలం. ఇక్కడ స్వామి శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలాన శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. ఇక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం తిరుమంజనం జరుగుతుంది. పసిపిల్లాడిలా–రాజులా–వైదికోత్తమునిలా అలంకారాలు జరుగుతుంటాయి. ద్వారక నుండి ఓఖా పోవుమార్గంలో ఐదు కి.మీ.ల దూరాన రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశం. ద్వారకాపురిలో వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. బేట్ ద్వారక ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి. పవిత్ర నగరం ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి. ద్వార్ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకాధీశుని ఆలయాన్ని జగత్‌మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఆది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం. ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు. శ్రీద్వారకనాథ్ మహాత్యం ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటి. ద్వారకానా«థుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులుంటాయి. ద్వారకాసామ్రాజ్యం మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణుపురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీ కృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థ్ధం ఎంచుకోవడమైంది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి. ఇది నిర్వహణా సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యాసంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యు. కె లోని ఆక్స్ఫర్డ్, జర్మనీ లోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపారు. బేట్ ద్వారక బేట్ ద్వారక ప్రధాన దైవమైన శ్రీ కృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బేట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రీస్తు శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపార, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మతప్రధానమయిన కేంద్రం. శ్రీ కృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందనే విశ్వాసానికి బలం చేకూరుతోంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలికి వచ్చాయి. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బేట్ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బేట్ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి. ఎలా వెళ్లాలి? హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ద్వారకకు రోడ్డు మార్గాన వెళ్లవచ్చు. సికింద్రాబాద్, అహ్మదాబాద్ ఓఖా ఎక్స్‌ప్రెస్‌లో ద్వారకకు సుమారు 39 గంటల ప్రయాణం. ద్వారక రైల్వేస్టేషన్ నుంచి పదినిమిషాలలో ద్వారకాధీశుని ఆలయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకంగా ఆలయం ఉంది. –గోపరాజు పూర్ణిమాస్వాతి