శ్రీవారి ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి (చినవెంకన్న) ఆలయంలో మంగళవారం డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. ఆలయ భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించామని ఏఆర్ ఎసై నాగేశ్వరులు అన్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆలయ పరిసరాలు, ప్రధాన, తూర్పు రాజగోపుర ప్రాంతాలు, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాలలు, పలు విభాగాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. క్షేత్రానికి వచ్చిన భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులను పరిశీలించాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో తనిఖీలు జరుపుతున్నట్టు తనిఖీ సిబ్బంది తెలిపారు. డాగ్ హ్యాండ్లర్ డీడీ ప్రసాద్, విజయ, రంగారావు, డాగ్ లిజీ పాల్గొన్నారు.