tuesday
-
కడుపు నింపుతున్న.. 'దోసెడు బియ్యం'
నెలలో మూడో మంగళవారం వచ్చిoదంటే..భుజాన పుస్తకాల బ్యాగే కాదు.. ప్రతి విద్యార్థి చేతిలోని బాక్సు నిండా ఇంటి వద్ద నుంచి బియ్యం నింపుకొని కాలేజీకి తెస్తారు. కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వాటిని పోస్తారు.వచ్చిన బియ్యం మొత్తాన్ని మూడు నుంచి ఐదు కేజీల చొప్పున ప్యాకెట్లుగా చేసి వాటిని పేదలకు అందజేసి వారి ఆకలిని తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలోని శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ (గుప్పెడు బియ్యం) పేరిట రెండున్నరేళ్లుగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. – సాక్షి, భీమవరంవిద్యార్థుల్లో మానవత్వం పెంపుదల.. కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉండగా వాటిలో 300 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. విద్యతో పాటు ఎన్ఎస్ఎస్, రెడ్‌క్రాస్ సంబంధిత సేవా కార్యక్రమాల నిర్వహణకు ఇక్కడి అధ్యాపక బృందం, విద్యార్థులు ప్రాధాన్యమిస్తుంటారు. అందులో భాగంగానే 2022లో ‘దోసెడు బియ్యం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం తీసుకునే ఆహారంలో కొంచెం భాగం ఇతరులకు ఇవ్వడం, విద్యార్థుల్లో మానవత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థీ నెలలో నిర్ణీత రోజున తమ ఇంటి వద్ద నుంచి గుప్పెడు బియ్యాన్ని తెచ్చి కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రమ్‌లో వేస్తే.. సేకరించిన మొత్తాన్ని అవసరమైన నిరుపేదలకు అందించాలి. ప్రతినెలా మూడో మంగళవారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏదైనా నెలలో ఆ రోజు సెలవు వస్తే ముందురోజున లేదా మరుసటి రోజున అమలు చేస్తున్నారు. నెలకు దాదాపు 100 నుంచి 120 కేజీల వరకు బియ్యం వస్తుండగా, వాటిని మూడు నుంచి ఐదు కేజీల వరకు బ్యాగులుగా ప్యాక్ చేసి గ్రామంలోని మార్కెట్ తదితర ప్రాంతాల్లోని నిరుపేదలకు పంపిణీ చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.నిర్మలకుమారి నేతృత్వంలో వైస్ ప్రిన్సిపల్ పి.మధురాజు, కామర్స్, బోటనీ లెక్చరర్లు బి.రాణిదుర్గ, డాక్టర్ సీహెచ్ చైతన్యల పర్యవేక్షణలో రెండున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.మూడో మంగళవారం వచ్చిందంటే చాలు తమకంటే ముందే తమ పేరెంట్స్ బాక్సులో బియ్యం పోసి సిద్ధం చేయడం ద్వారా ఇప్పటికే తమ కళాశాలలో చేస్తున్న ఈ సేవలో భాగస్వాములయ్యారని విద్యార్థులు చెబుతున్నారు. మిగిలినచోట్ల విద్యార్థులు ప్రయత్నిస్తే ఒక పెద్ద సేవగా మారుతుందని వారు ఆశిస్తున్నారు. ఆనందంగా అనిపిస్తుంది ప్రతినెలా విద్యార్థులమంతా కలసి బియ్యం తెచ్చి పేదలకు పంచడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఈ హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ప్రోగ్రాం మరింత విస్తరించి ప్రతి ఒక్కరూ ఇతరులకు పంచే సేవ చేయటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. – పి.హర్షిత, బీకాం సెకండియర్ బియ్యం ఇచ్చి పంపుతారు నెలలో మూడో మంగళవారం వచ్చి0దంటే చాలు కాలేజీకి ఈరోజు బియ్యం తీసుకువెళ్లాలి ఇవిగో అంటూ బాక్సులో పోసి పేరెంట్స్ పంపిస్తుంటారు. మా స్టూడెంట్సే కాదు మా పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. – కె.జాయ్, బీకాం కంప్యూటర్స్, సెకండియర్మార్పుకోసం చిన్న ప్రయత్నం ఇది కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం కాదు. పేదరికాన్ని తగ్గించేందుకు, మానవత్వాన్ని పెంచేందుకు, సమాజంలో మార్పు కోసం మా విద్యార్థులు చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ కార్యక్రమం నిర్వహించే బాధ్యత నాకు అప్పగించడచాలా ఆనందంగా ఉంది. – బి.రాణి దుర్గ, కామర్స్ లెక్చరర్ పంచే గుణాన్ని అలవాటు చేసేందుకు తమకు ఉన్న దానిలో ఇతరులకు కొంచెం పంచే గుణాన్ని విద్యార్థులకు అలవాటు చేయడం హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ ముఖ్య ఉద్దేశం. మా కళాశాలలో ప్రిన్సిపల్ నిర్మలకుమారి మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న అత్యుత్తమ సేవా కార్యక్రమాల్లో ఇదీ ఒకటి. – డాక్టర్ సీహెచ్ చైతన్య, బోటనీ లెక్చరర్ విద్యతో పాటు విలువలు మా కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో మంచి విలువలు పెంపొందించాలన్నదే మా లక్ష్యం. పేదవారి ఆకలిని తీర్చడంలో ఉండే సంతృప్తిని వారు ఆనందిస్తున్నారు. ప్రతినెలా అందరూ ఎంతో ఉత్సాహంగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ రైస్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. – డాక్టర్ పి.నిర్మలాకుమారి, ప్రిన్సిపల్ -
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
నేడు ఒడిశాకు రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర
మణిపూర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర 24వ రోజు అంటే నేడు (మంగళవారం)ఒడిశాలోకి ప్రవేశించనుంది. జనవరి 14న ఈశాన్య భారతం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు వివిధ రాష్ట్రాలలోని ప్రజలను కలుస్తున్నారు. జార్ఖండ్ యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశా వైపు వెళ్లనుంది. మంగళవారం సుందర్‌గఢ్ జిల్లా నుంచి రాహుల్ ఒడిశాలో అడుగుపెట్టనున్నారు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ఒడిశా కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేశారు. సుందర్‌గఢ్ జిల్లాలోని పారిశ్రామిక పట్టణం బిరామిత్రపూర్‌లో ఒడిశా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకనున్నారు. రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం బిర్మిత్రాపూర్ చేరుకుంటారని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర బిజా బహల్ ప్రాంతంలో విరామం తీసుకోనుంది. బుధవారం రూర్కెలాలోని ఉదిత్‌నగర్ నుండి పాన్‌పోష్ వరకు 3.4 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. రాహుల్ పాన్‌పోష్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మరుసటి రోజు రాణిబంద్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. రాజ్గంగ్పూర్లో జరిగే ర్యాలీలో కూడా రాహుల్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 8న రాహుల్ గాంధీ జర్సుగూడ పాత బస్టాండ్ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం ర్యాలీలో ప్రసంగిస్తారు. జార్సుగూడలోని కనక్‌తోరా నుంచి యాత్ర మొదలై అనంతరం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశిస్తుంది. -
మంగళవారం మంచిదికాదా? ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయరు!
మనలో చాలా మంది ఏ పని ప్రారంభించాలన్నా వారం, వర్జ్యం అనేవి చూసుకుంటారు. అలాగే చాలా మంది మంగళవారం గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోవడం అశుభంగా భావిస్తారు. దీని వెనుక కారణమేంటో తెలుసా? వారంలో అన్ని రోజులు తెరిచి ఉండే సెలూన్ షాప్‌లు మంగళవారం మాత్రం మూసి ఉంటాయి. ఆరోజున క్షౌరశాలలు నిర్వహించే నాయి బ్రాహ్మణులు అందరూ సెలవు దినంగా పాటిస్తారు. పైగా ఆ రోజు ఏ మంచి పని మొదలుపెట్టరు. ఎక్కడికీ వెళ్ళరు మరీ అర్జెంటు.. తప్పనిసరి ఐతే తప్ప. మంగళవారం మంచిదికాదన్న సంగతి ఎలా వచ్చింది..? ఎవరు చెప్పారు..? ఎంతవరకు నిజం..? చూద్దామా!. తమ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే హిందువులు ఎవరూ కూడా మంగళవారం రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోరు. శరీరంపై అంగారక గ్రహ ప్రభావం మంగళవారాన్ని అంగారక గ్రహం రోజుగా (Mars Day) భావిస్తుంటారు. అంగారక గ్రహం అనేది ఎరుపు వర్ణానికి చిహ్నం. ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. గ్రహ ప్రభావం వల్ల మంగళవారం రోజున ఆ వేడి మానవ శరీరంపై ప్రభావం చూపుతుందంటారు. ఆ రోజు శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. శరీరంపై గాట్లు పడే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. కాబట్టి ఆ రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోవద్దని పెద్దలు చెప్పారు. జుట్టు కత్తిరించుకోడాన్ని ఆయుష్కర్మ అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పని చేయరాదు. ముందుగా గడ్డం, ఆపైన మీసం, ఆ తరువాత తలమీద ఉన్న జుట్టూ తీయించుకోవాలి. ఆపైన చేతిగోళ్లు, చివరగా కాలిగోళ్ళు తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరుసను అతిక్రమించరాదు. కొన్ని రోజులలో ఈ ఆయుష్కర్మ నిషిద్ధం. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య పౌర్ణమి తిధులు నిషిద్ధాలు. ప్రతినెలా వచ్చే సంక్రాంతి కూడా నిషిద్ధమే. వ్యతీపాత, విష్టి యోగ కరణాలలో, శ్రాద్ధ దినాలలో నిషిద్ధం. వ్రతదినాలైతే కూడా క్షవరము చేయించుకోరాదు. ఆయుష్కర్మ చేయించుకునే వారాన్ని బట్టి ఆయుష్షు పెరగడం కానీ తరగడం కానీ ఉంటుంది. శుక్ర వారమైతే పదకొండు నెలలు, బుధవారం అయితే ఐదు నెలలు, సోమవార అయితే ఎనిమిది నెలలు ఆయుష్షు పెరుగుతుంది. గురువారమైతే ఆయుష్షు పది నెలలు పెరుగుతుంది. ఆదివారం క్షవరము చేయించుకుంటే ఆయుష్షు నెల రోజులు తగ్గుతుంది. శనివారం అయితే ఏడు నెలలు తగ్గుతుంది. మంగళవారం అయితే ఎనిమిది నెలలు తగ్గుతుంది. పూర్వం షాపులు లేని రోజుల్లో ఇంటికి వచ్చే మంగలి పని చేసేవారు. (ఈ పదం వృత్తిరీత్యా వాడబడింది కానీ కులాన్ని సూచించేది కాదు.) ప్రతిరోజూ ఉద్యోగానికి వెడుతూ, గడ్డం, మీసం కావలసినంతగా కత్తిరించుకుని వెళ్లే అవసరం కూడా ఆ రోజుల్లో లేదు. మంగలి అతను వచ్చి క్షవరకర్మ చేసి వెళ్ళాక అతని భార్య వచ్చి ఇంట్లో వారిచ్చిన అన్నము, పదార్థాలు తీసుకుని వెళ్ళేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం చూసి క్షవరకర్మ చేయించుకునే పరిస్థితి లేదు. క్షవర కర్మ వృత్తిలో ఉన్నవారు కూడా షాపు తెరిచి అక్కడకు వచ్చిన వారికే ఆయుష్కర్మ చేస్తున్నారు. కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంచితే వారికి కిట్టదు. ఈ సూత్రాలలో చెప్పినవన్నీ పూర్తిగా వదిలివేయడానికి భారతీయులు ఇష్టపడరు అందుకే క్షవరం చేయించుకుంటే ఆయుష్షు ఎక్కువగా తరిగిపోయే మంగళవారాన్ని మాత్రమే సెలవు దినంగా స్వీకరించడం జరిగింది. తగాదలయ్యే అవకాశం ఎక్కువ.. అంగారక గ్రహ ప్రభావం కారణంగా మంగళవారం రోజున తగాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఇబ్బందుల్లో పడతారు. మంచి శకునాలు ఉండవు కాబట్టి ఆ రోజున ఏ కార్యం తలపెట్టినా అశుభంగా భావిస్తారు. దేవతలకు ఆ రోజు ప్రత్యేకం పూజలు, వ్రతాలకు ప్రత్యేకం ఇదే కాకుండా, మంగళవారం రోజున గోర్లు, జుట్టు కత్తిరించుకోకపోవడానికి మరో నమ్మకం కూడా ప్రాచుర్యంలో ఉంది. దుర్గాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఎక్కువగా మంగళవారాల్లోనే ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఆ రోజున దేవతలను పూజించడం వల్ల మంచి ఐశ్వర్యం, ధన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. అమ్మవార్లకు సంబంధించి మంగళవారం ప్రత్యేక దినంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయరు. -
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పెంపు
కొవ్వూరు : జిల్లాలో పశ్చిమ డెల్టా ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాల నిమిత్తం కాలువలకు మంగళవారం సాయంత్రం వరకు 5,500 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. సాయంత్రం మరో 500 క్యూసెక్కులు పెంచారు. దీనిలో నరసాపురం కాలువకు 1,501, జీ అండ్ వీ కెనాల్‌కి 732, ఉండి కాలువకు 1,406, ఏలూరు కెనాల్‌కి 855, అత్తిలి కాలువకి 399 క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు. సీలేరు నుంచి గోదావరికి నీటి విడుదల పెంచారు. మంగళవారం 728.92 క్యూసెక్కుల నీరు గోదావరికి చేరుతుంది. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 10,100 క్యూసెక్కుల నీరు విడిచి పెడుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 2,800, సెంట్రల్ డెల్టాకు 1,800, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున సాగునీరు విడుదల చేస్తున్నారు. -
భక్తులతో కిటకిటలాడిన మద్దిక్షేత్రం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు స్వామ వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. 1,110 మంది భక్తులు స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని, 2,58,123 రూపాయల ఆదాయం లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఆలయ చైర్మన్ యిందుకూరి రంగరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం
టీడీపీ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. భీమవరంలో నిర్వహించిన నియోజకవర్గ ప్లీనరీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, కొట్టు సత్యనారాయణ మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. భీమవరం: తెలుగుదేశం పార్టీ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పిలుపునిచ్చారు. మంగళవారం భీమవరం కిరాణా మర్చంట్స్ అసోసియేష న్ భవనంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ అధ్యక్షతన నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం ముఖ్య అతిథి ఆళ్ల నాని మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ప్రజాసమస్యలను సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లీనరీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. టీడీపీ నాయకులు దోచుకు–దాచుకో పద్ధతిలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారులపై దాడులు, ఇసుక, మట్టి మాఫియా వంటి దుశ్చర్యలతో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజల ను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని మంత్రి లోకేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ న్మోహ న్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లోకేశ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేకనే అవాకులు చవాకులు పేలుతున్నారని, టీడీపీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని లోకేశ్ గ్రహిం చాలని నాని హితవు చెప్పారు. భీమవరం మండలం తుందుర్రులో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్‌పై జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చించి తీర్మానం చేసి రాష్ట్రస్థాయిలో చర్చకు పెడతామన్నారు. వచ్చే నెలలో జిల్లాస్థాయి ప్లీనరీ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు జూ న్ 16 నుంచి మూడురోజులపాటు జిల్లాస్థాయిలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు నాని చెప్పారు. నియోజకవర్గస్థాయిల్లోని ప్రధాన సమస్యలను జిల్లాస్థాయి ప్లీనరీలో చర్చించి అవసరం మేరకు సమస్యల ప్రాధాన్యతను బట్టి రాష్ట్రస్థాయి ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగ న్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతామని నాని చెప్పారు. టీడీపీ పాలనలో రాష్ట్రం నిర్వీర్యం రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయించుకోలేని దుస్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని పార్టీ శ్రీకాకుళం జిల్లా ఇ న్చార్జ్ కొయ్యే మోషే న్‌రాజు విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నాయకులకే అన్నట్టు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. హామీలను గాలికొదిలి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీంతో విసుగుచెందిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించడానికి కంకణబద్ధులై ఉన్నారన్నారు. చంద్రబాబుది అవినీతి పాలన దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండగా చంద్రబాబు అవినీతి పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తీవ్రంగా దుయ్యబట్టారు. పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు వి.సాయిబాలపద్మ, ఉండి, నియోజకవర్గ కన్వీనర్లు పాతపాటి సర్రాజు, కవురు శ్రీనివాస్, పార్టీ యూత్ రాష్ట్ర కార్యదర్శి పేరిచర్ల విజయనర్సింహరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్‌కుమార్, యూత్ జిల్లా అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్, నాయకులు వేగేశ్న కనకరాజు సూరి, మేడిది జాన్సన్, కోడే యుగంధర్, తిరుమాని ఏడుకొండలు, గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు, చినమిల్లి వెంకట్రాయుడు, కోటిపల్లి బాబు, గుండా చిన్న, భూసారపు సాయి సత్యనారాయణ, ఆకుల సుబ్బలక్ష్మి, పాలవల్లి మంగ, బొక్కా సూర్యకుమారి, గుండా జయప్రకాష్‌నాయుడు, నాగరాజు శ్రీనివాసరాజు, మద్దాల అప్పారావు, నూకల కనకరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, కామన నాగేశ్వరరావు, ముల్లి నర్సింహమూర్తి, బొల్లెంపల్లి శ్రీనివాస్, గూడూరి ఓంకారం, సుంకర బాబూరావు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. తీర్మానాలివే.. నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేశారు. గృహ నిర్మాణాల్లో అవినీతి, యనమదుర్రు డ్రెయి న్కాలుష్యం, కంపోస్ట్యార్డ్ సమస్య, రక్షిత మంచినీటి పథకాల అభివృద్ధి వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. ఇది దోపిడి రాజ్యం: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం నియోజవర్గంలో టీడీపీ పాలనలో దోపిడి రాజ్యం సాగుతోందని నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం 82 ఎకరాలు సేకరిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే రామాంజనేయులు ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం జీప్లస్–3 విధానంలో ఇళ్లు నిర్మిస్తామంటూ సుమారు రూ. 450 కోట్లు దోచుకోడానికి వ్యూహరచన చేశారని ఆరోపించారు. తన హయాంలో యనమదుర్రు కాలువను డెల్టా ఆధునీకరణ పథకంలో ప్రక్షాళన చేపడితే ప్రస్తుతం మున్సిపాలిటీ చెత్తతో పూడ్చుతున్నారని విమర్శించారు. భీమవరం మండలంలో తాగునీటి సమస్యను తీరుస్తానంటూ రైతుల నుంచి సేకరించిన భూమిలో ఎమ్మెల్యే రామాంజనేయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. బైపాస్ రోడ్డుకు రైల్వే గేటు ఏర్పాటుచేయించలేకపోవడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
జిల్లా క్రికెట్ పోటీల విజేత భీమడోలు
కొవ్వూరు రూరల్ : ఐ.పంగిడి క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. భీమడోలు టీమ్ విజేతగా నిలిచింది. 18 రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో 32 జట్లు పాల్గొన్నాయి. మంగళవారం ఫైనల్స్‌లో భీమడోలు, ఐ.పంగిడి జట్లు తలపడ్డాయి. తొలి బ్యాటింగ్ చేసిన భీమడోలు 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం పంగిడి జట్టు 15 ఓవర్లలోనే 110 పరుగుల వద్ద ఆల్ అవుట్ కావడంతో భీమడోలు జట్టును విజేతగా ప్రకటించారు. విజేతకు రూ.22,220 నగదుతో పాటు, షీల్డ్‌ను, రన్నరప్‌కు రూ.11,111తో పాటు షీల్డ్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ చేతుల మీదుగా అందించారు. మ్యాన్ఆఫ్ది మ్యాచ్‌గా భీమడోలు టీముతో శివకు, బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఐ.పంగిడి జట్టు నుంచి రాచపోలు గోపీకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ ముళ్లపూడి రాజేంద్రప్రసాద్, నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, పొట్రు సిద్దూ తదితరులు పాల్గొన్నారు. -
మద్ది అంజన్నకు పంచామృతాభిషేకం
జంగారెడ్డిగూడెం రూరల్ (చింతలపూడి) : హనుమద్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు దంపతులతో ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజుతో నిత్య హోమ బలిహరణ పూజలు జరిపారు. ఒక్కరోజు ఆదాయం రూ.1,35,473 ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ‘మద్ది’లో నేడు: మద్దిక్షేత్రంలో జరుగుతున్న హనుమద్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం హనుమత్ దీక్షాధారులు ఇరుముళ్లు సమర్పిస్తారని ఆలయ చైర్మన్ యిందుకూరి రంగరాజు, ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. రాష్ట్రం నలు మూలల నుంచి దీక్షాధారులు మద్ది చేరుకుంటారని వారు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి జరుపుతామన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సీపీవోలపై దాడులు చేస్తే కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : కమ్యూనిటీ పోలీస్ అధికారుల (సీపీవో)పై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్థానిక అమీనాపేటలో ఉన్న సురేష్ బహుగుణ స్కూల్ ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో సీపీవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీపీవోల సేవలను కొనియాడారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారు పోలీసులతో పాటు సమాజసేవలో పాటు పడుతున్నారని అందుకు ప్రతిఫలంగా వారి సేవల ప్రాతిపదికన ఏటా బెస్ట్ సీపీవోలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను అందిస్తామని, బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఏఎస్పీ వలిశల రత్న, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సీపీవోలపై దాడులు చేస్తే కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : కమ్యూనిటీ పోలీస్ అధికారుల (సీపీవో)పై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్థానిక అమీనాపేటలో ఉన్న సురేష్ బహుగుణ స్కూల్ ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో సీపీవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీపీవోల సేవలను కొనియాడారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారు పోలీసులతో పాటు సమాజసేవలో పాటు పడుతున్నారని అందుకు ప్రతిఫలంగా వారి సేవల ప్రాతిపదికన ఏటా బెస్ట్ సీపీవోలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను అందిస్తామని, బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఏఎస్పీ వలిశల రత్న, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
7.3 మిలియన్ల పొగాకు కొనుగోలు
కొయ్యలగూడెం : ఎన్ఎల్ఎస్ పరిధిలోని 5 వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో ఇప్పటివరకు 7.3 మిలియన్ల పొగాకు కొనుగోలు చేసినట్టు పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ ఎం.శ్రీరామమూర్తి పేర్కొన్నారు. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ మొత్తం 45.79 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు బోర్డు అనుమతి ఇచ్చిందన్నారు. ఇంకా రైతుల నుంచి 38.49 మిలియన్కేజీల పొగాకును కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. 47 రోజలుగా నిర్వహించిన పొగాకు వేలంలో 57,238 బేళ్లను రైతులు వేలం కేంద్రానికి తీసుకువచ్చినట్టు తెలిపారు. కొయ్యలగూడెంలో 12,64,138 కేజీల పొగాకు అమ్మకం కాగా, సగటు ధర రూ.144.70 వచ్చిందన్నారు. జంగారెడ్డిగూడెం–1 కేంద్రంలో 21,15,540 కేజీల పొగాకు , సరాసరి రూ.143.35 వచ్చిందన్నారు. జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 17,48,408 కేజీలకు సరాసరి రూ.143.89 రాగా, దేవరపల్లిలో 8,33,768 కేజీలకు సరాసరి రూ.144.26 రాగా గోపాలపురం వేలం కేంద్రంలో 13,66,222 కేజీల పొగాకు అమ్మకానికి 145.98 రూపాయల సరాసరి ధర వచ్చిందని తెలిపారు. సగటు ప్రకారం అత్యధికంగా గోపాలపురం, కొయ్యలగూడెం ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. -
కల్యాణ వైభోగమే
ద్వారకాతిరుమల: శ్రీనివాసుడు సర్వాభరణ భూషితుడై నుదుటిన కల్యాణ తిలకం, బుగ్గన చుక్కతో ఉభయ దేవేరులను పెళ్లాడాడు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హేవిళంబి నామ సంవత్సర వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం కనుల పండువగా జరిపించారు. అంతకుముందు ఉదయం సింహ వాహనంపై ఉభయ దేవేరులతో ఆశీనులైన శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అట్టహాసంగా జరిగిన ఈ తిరువీధిసేవను భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఆకర్షణీయంగా కల్యాణ వేదిక శ్రీవారి ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేదికను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. అనంతరం ఆలయంలో తొళక్క వాహనంపై శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. తర్వాత ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ మేళతాళాలు, మంగళవాయిద్యాలతో శ్రీవారి వాహనాన్ని కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన రజత సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. శుభముహూర్త సమయంలో వధూవరుల శిరస్సులపై జీలక్రర్ర, బెల్లం ధరింపజేసి మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం తరపున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు పట్టువస్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న గరుడోత్సవం శ్రీవారి కల్యాణ తంతు ముగిసిన అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామి ఉభయదేవేరులతో క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. స్వామికి గరుడ నిత్య సేవకుడు. అటువంటి గరుడ వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చినవెంకన్న ఉభయ దేవేరులతో కలసి తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ అలంకరణలో.. మోహినీ అలంకారంలో స్వామి మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. చినవెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో మోహినిగా శ్రీవారు భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ∙ఉదయం ..10 గంటలకు భక్తిరంజని ∙సాయంత్రం ..5 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శన ∙రాత్రి 7 గంటలకు ..శ్రీవారి దివ్య రథోత్సవం ∙రాత్రి 8.30 గంటల ..నుంచి అన్నమాచార్య సంకీర్తనలు -
ఖరీఫ్ లక్ష్యం 5.50 లక్షల ఎకరాలు
ఆకివీడు: రాబోయే ఖరీఫ్‌లో జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరిసాగు లక్ష్యమని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు. ఆకివీడులోని సమతానగర్ రోడ్డులో రైతు జూపూడి శ్రీనివాస్‌కు చెందిన పంట భూమిలో మంగళవారం దాళ్వా దిగుబడి అంచనా వేశారు. ఎకరాకు 38.50 బస్తాలు దిగుబడి వచ్చింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు వేసవిలోనే మెట్ట దుక్కులు చేపట్టాలని సూచించారు. జూన్ మొదటి వారంలో నారుమళ్లు పోసుకుని జూలై మొదటి వారానికి నాట్లు పూర్తిచేయాలన్నారు. సకాలంలో నాట్లు వేయడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని చెప్పారు. మెట్టలో మొలకెత్తని అపరాల విత్తనాలు జిల్లాలో 12 వేల క్వింటాళ్ల అçపరాల విత్తనాలు పంపిణీ చేయగా మెట్ట ప్రాంతంలో నాటిన విత్తనాలు మొలకెత్తలేదని చెప్పారు. అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువుగా ఉండటమే కారణమన్నారు. డెల్టాలో మూడో పంట ఆశాజనకంగా ఉందన్నారు. 9 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు జిల్లాలో వచ్చే ఖరీఫ్‌లో 9 వేల ఎకరాల్లో ప్రకృతి సాగుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. 4 వేల ఎకరాల్లో వరి, మిగిలినది వాణిజ్య పంటల సాగు ఉంటుందన్నారు. గతేడాది 3 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు చేశామన్నారు. గోమూత్రం, మలంతో తయారు చేసిన ఎరువుల్ని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. దీనికి అవసరమైన ఆవులను రైతులు పెంచుకునేందుకు సబ్సిడీపై కొనుగోలు చేస్తామన్నారు. జీవ ఎరువుల సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వంగడాల మినీకిట్లు సిద్ధం ఖరీఫ్‌లో సాగుచేసేందుకు కొత్త వంగడాల మినీ కిట్లు సిద్ధం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1229, సాంబ మసూరీకి ప్రత్యామ్నాయంగా ఉన్న ఎంటీయూ 1224, 1010కి ప్రత్యామ్నాయంగా 1224 వంగడాన్ని రైతులు సాగు చేయాలని సూచించారు. యంత్రం.. రైతు ఇష్టం వ్యవసాయ పనిముట్లను రైతుల ఇష్టానుసారం కొనుగోలు చేసుకోవచ్చని ఆమె చెప్పారు. రైతుకు నచ్చిన కంపెనీ యంత్రాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. 20 శాతం సబ్సిడీ, 30 శాతం రైతు పెట్టుబడి, 50 శాతం రుణం బ్యాంకులు అందజేస్తాయన్నారు. వ్యవసాయాధికారి నిమ్మల శ్రీనివాస్, గంణాంకాధికారి గంగయ్య, వీఆర్ఓ చైతన్య, ఎంపీఈఓలు ఆమె వెంట ఉన్నారు. -
తిరునక్షత్ర ఉత్సవ శోభ
నరసాపురం రూరల్ : నరసాపురం పట్టణంలోని శ్రీ ఆదికేశవ ఎంబేరు మన్నార్‌స్వామి దేవస్థానం తిరునక్షత్ర ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది. 22 నుంచి ప్రారంభమైన రామనుజ సహస్రాబ్ది తిరునక్షత్ర ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రామానుజ సహస్రాబ్ది జయంత్యుత్సవం నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. నిత్యం స్వామికి తిరుమంజనం, లీలా విభూతి ఉత్సవం, పల్లకిలో అగ్రహార ఉత్సవాలు వైభవంగా జరిపిస్తున్నారు. మద్రాసు సమీపంలోని పెరంబదూరులో విరాజిల్లే ఆదికేశవ భాష్యకార స్వామివార్ల ఆలయం తరువాత దేశంలో అంతటి ప్రాశస్త్యం గల ఆలయం ఇదే. సుమారు 230 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి చెందిన పుప్పాల రమణప్ప నాయుడు ప్రోద్బలంతో అక్కడి సంప్రదాయం ప్రకారం..ఈ ఆలయాన్ని నిర్మించినట్టు అర్చకులు చెబుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాజాధిరాజ వాహనంలో స్వామి తిరువీధుల్లో ఊరేగారు. రామానుజాచార్యులు సుందరంగా ముస్తాబయ్యారు. కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ కార్యనిర్వహణఅధికారి అరుణ్‌కుమార్, సిబ్బంది బి.శ్రీనివాసరెడ్డి, బి.సుబ్బారావు, కె.వెంకన్న, ఎస్.నాగేశ్వరరావు, ఎం.నాగబాబులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
అండర్–16 వాలీబాల్ విజేత తాడేపల్లిగూడెం
పాలకోడేరు: జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మాజీ జాయింట్ సెక్రటరీ దెందుకూరి వరప్రసాదరాజు మెమోరియల్ పేరిట నిర్వహించిన అండర్–16 వాలీబాల్ పోటీల్లో తాడేపల్లిగూడెం జోనల్ జట్టు విజేతగా నిలిచింది. పాలకోడేరు హైసూ్కల్ క్రీడా మైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు మంగళవారం ముగిశాయి. చింతలపూడి, కేఆర్‌పురం, కొయ్యలగూడెం, తణుకు, భీమవరం, జోనల్ జట్లు పాల్గొని తలపడగా తాడేపల్లిగూడెం జోనల్ జట్టు విజేతగా నిలిచింది. కేఆర్‌పురం జట్టు రన్నర్‌గా నిలిచింది. కొయ్యలగూడెం జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రతిభ కనబర్చిన జట్లకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందించారు. 10 మందిని క్యాంప్‌కు ఎంపిక చేశారు. అనంతరం ఏపీ సబ్ జూనియర్ కెప్టెన్, నేషనల్ వాలీబాల్ క్రీడాకారుడు గోల్డ్‌మెడలిస్ట్ సునీల్‌ను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ గాదిరాజు చంద్రావతి, గాదిరాజు రాంబాబు, పశ్చిమగోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేష న్ కార్యదర్శి పి.నారాయణరాజు, హైసూ్కల్ ప్రధానోపాధ్యాయురాలు జి.çసుధారాణి, కొత్తపల్లి బాబు, కోచ్ జి.పవ న్ కుమార్రాజు, పీఈటీలు పాల్గొన్నారు. -
‘యనమదుర్రు’ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్
భీమవరం: కాలుష్య కాసారంలా మారిన యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. భీమవరం విష్ణు కళాశాలల ఆడిటోరియంలో మంగళవారం యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, ప్రజాప్రతినిధిలు, వివిధ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పితాని మాట్లాడుతూ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ప్రతి పరిశ్రమ వద్ద తప్పనిసరిగా ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. జిల్లాలో డ్రెయిన్ల కాలుష్యానికి పరిశ్రమల వ్యర్థాలతో పాటు ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీలు చెత్తాచెదారాలతో నింపడం, ఆక్వా సాగు కూడా కారణమవుతున్నాయన్నారు. పరిశ్రమలల్లోని ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం నిజమని పేర్కొన్నారు. ఆక్వాతో భూగర్భ, నదీ జలాలు కలుషితమవుతున్నాయని, ఆక్వాకు ప్రభుత్వం అనుకూలం తప్ప పూర్తిస్థాయిలో ప్రోత్సహించడం లేదని చెప్పారు. పలు గ్రామాలు, పట్టణాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం కూడా కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. తుందుర్రులో ఆక్వాపార్క్ వ్యతిరేక ఉద్యమంతో మిగిలిన ఫ్యాక్టరీల్లోనూ కాలుష్యం వెలువడకుండా అధికారులు చర్యలు చేపట్టారని స్పష్టం చేశారు. వచ్చేనెల 10వ తేదీలోపు యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళనకు సంబంధించి ప్రణాళిక రూపురేఖలను సిద్ధం చేయాలని పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. కాలుష్యపాపం తలాపిడికెడు: కలెక్టర్ యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యానికి అందరూ కారకులేనని, తలాపాపం తిలాపిడికెడు అన్నట్టుగా మారిందని కలెక్టర్ భాస్కర్ అన్నారు. పరిశ్రమలు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుచేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం ఖర్చును భరించనున్నాయని చెప్పారు. యనమదుర్రు డ్రెయిన్ పరిధిలోని 21 పరిశ్రమలను గుర్తించి వాటిలో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టిందన్నారు. సమావేశంలో ఫ్యాక్టరీస్ సంచాలకుడు జి.బాలకిశోర్, పర్యావరణ శాఖ జాయింట్ చీఫ్ ఇంజినీర్ ఎంవీ భాస్కరరావు, పర్యావరణ సీనియర్ ఇంజినీర్ పి.రవీంద్రనాథ్, పర్యావరణ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, కొవ్వూరు ఆర్డీఓ బి.శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు, శెట్టిపేట ఈఈ జి.శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు, డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నీటి కాలుష్యంతో కేన్సర్..డెల్టా ప్రాంతంలో నీటి కాలుష్యంతో కేన్సర్ రోగులు పెరుగుతున్నారు. యనమదుర్రు డ్రెయిన్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయకుంటే ఈ ప్రాంత ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ప్రక్షాళనలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి.–పులపర్తి రామాంజనేయులు, భీమవరం ఎమ్మెల్యే మున్సిపాలిటీల చెత్త కూడా..నిడదవోలు-నరసాపురం కాలువలో పాలకొల్లు, నరసాపురం మున్సిపాలిటీల మురుగు నీరు, చెత్తాచెదారాలు కలుస్తున్నాయి. మృతదేహాలను సైతం కాలువల్లో వేయడం కలుషితానికి కారణమవుతోంది. యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యానికి పరిశ్రమల యజమానుల నిర్లక్ష్యమే కారణం. –బండారు మాధవనాయుడు, నర్సాపురం ఎమ్మెల్యే అధ్యయనాలు చేస్తున్నా అమలు శూన్యం..జిల్లాలోని పంట కాలువలు, డ్రెయిన్ల కలుషితంపై ప్రభుత్వం అధ్యయనాలు చేస్తున్నా వాటి ప్రక్షాళనకు చేస్తున్న చర్యలు శూన్యం. జిల్లాలో కొల్లేరు, యనమదుర్రు, గోస్తనీ, గొంతేరు కాలుష్య కారకంగా మారడానికి పరిశ్రమలే కారణం. ఆక్వా సాగుతోనూ డ్రెయిన్, కాలువ జలాలు కలుషితమవుతున్నాయి.–బి.బలరాం, సీపీఎం జిల్లా కార్యదర్శి మత్స్య సంపద మాయం..యనమదుర్రు డ్రెయిన్ కాలుష్య కాసారంలా మారడంతో మత్స్య సంపద పూర్తిగా మాయమైపోయింది. గతంలో డ్రెయిన్‌పై ఆధారపడి 30 గ్రామాల్లోని సుమారు 80 వేల మంది మత్స్యకారులు జీవనం సాగించేవారు. భీమవరం మండలం కొత్తపూసలమర్రులోని ఆనంద గ్రూప్ రొయ్యల మేత పరిశ్రమ వల్ల వాతావరణం కూడా కాలుష్యమవుతోంది. –రామకృష్ణ, మత్స్యకార సంఘ నాయకుడు నీటిమీద రాతలుగా..జిల్లాలో డ్రెయిన్ల ప్రక్షాళనకు ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రకటనలు నీటిమీద రాతలుగా మిగులుతున్నాయి. ఆక్వా సాగుతో భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆక్వా అక్రమ సాగుకు అధికారులే అనుమతులు ఇస్తున్నారు. వివిధ పరిశ్రమల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు లేకపోయినా పట్టించుకోవడం లేదు.–డేగ ప్రభాకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మున్సిపల్, పంచాయితీల చెత్త కాలువల్లోనే..డెల్టా ప్రాంతంలోని వివిధ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు మురుగునీటిని పంట కాలువల్లో కలపడంతోపాటు చెత్తను కూడా వేస్తున్నారు. దీంతో జల కాలుష్యం పెరుగుతోంది. నీటి కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. –పొత్తూరి రామాంజనేయరాజు, జిల్లా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ -
వేసవిలోనూ నిరంతర విద్యుత్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో వేసవిలో కూడా 24 గంటలూ విద్యుత్ సరఫరా అందించి ప్రజల అభిమానాన్ని చూరగొంటామని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి పథకం అమలులో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపి రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ఆయన్ని విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియోషన్ కంపెనీ ప్రధాన కార్యదర్శి తురగా రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఈ కార్యాలయంలో మంగళవారం దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఉత్పత్తికి వినియోగానికి తీవ్ర అంతరం ఉండేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద జిల్లాలో 1,169 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వేగవంతంగా అందించి రాష్ట్రంలో ఉత్తమ జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దడంలో విద్యుత్ ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా 23/11 కేవీ సబ్స్టేషన్లను అభివృద్ధి చేస్తామని, సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం కింద 6 ఇండోర్ సబ్స్టేషన్లు గత రెండున్నరేళ్లలో ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియోషన్ జిల్లా అధ్యక్షుడు బి.వీరభద్రరావు, నాయకులు జి.గంగాధర్, ఎన్.అప్పారావు, సీహెచ్ వెంకట్రాజు, నారాయణ, కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ బహుజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సాల్మన్‌రాజు, ఎస్.సురేష్, పి.సుగుణ రావు, వీఆర్ ఆంజనేయులు ఎస్ఈకి పుష్పగుచ్చం అందించారు. -
పాఠశాలల మూసివేతను నిరసిస్తూ ధర్నా
ఏలూరు సిటీ : విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి కె.దినేష్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా పిల్లల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో స్కూళ్లను మూసివేత నిర్ణయం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. మూడు అంచెల పాఠశాల విధానానికి చరమగీతం పాడుతూ రెండు అంచెలకు తీసుకురావటం అనేది విద్యహక్కు చట్టాన్ని ఉల్లంఘించటమేనని తెలిపారు. పాఠశాలలను రేషనలైజేషన్ పేరిట కుదిస్తే వేలాదిమంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్పొరేట్ విద్యాసంస్థలు లాభపడతాయని తెలిపారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు ఎం.దిలీప్, రాకేష్, ఏలూరు సిటీ నాయకులు పి.ప్రదీప్‌చంద్ర, ఎన్.నాగార్జున, ప్రకాష్, రాజేష్, ఎల్.సందీప్, ఎల్.ఆర్య, గణేష్ ఉన్నారు. -
‘అమ్మఒడి’ ప్రారంభం
ఏలూరు సిటీ : జిల్లాలో 5 సంవత్సరాల వయసు నిండి బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేకంగా అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్ఎస్ గంగాభవాని, సర్వశిక్షాభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి చెప్పారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమ కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 5 ఏళ్ల వయసు కలిగిన పిల్ల లు 50 వేల 200 మంది ఉండగా, అంగన్వాడీ కేంద్రాల్లో 27 వేలమంది వరకూ ఉన్నారని తెలిపారు. ఈ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే సౌకర్యాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రస్తుతం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని, యూనీఫామ్స్, మధ్యాహ్న భోజన పథకం, భవనాలు, మరుగుదొడ్లు సౌకర్యం వంటివాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 22 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బడిఈడు పిల ్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామ -
జిల్లాలో 24 కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు
నల్లజర్ల : యాంత్రీకరణపై రైతుకు పెట్టుబడి భారం తగ్గించే విధంగా యంత్ర పరికరాలు అద్దెకు (కస్టమ్ హైరింగ్ సెంటర్) ఇచ్చే కేంద్రాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తెలిపారు. జిల్లాలో ఒక్కోటీ రూ. కోటి వ్యయంతో 24 కష్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నల్లజర్లలో రూ.10 లక్షలతో నిర్మించిన వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాన్ని జెడ్పీ చైర్మన్ బాపిరాజు, రూ.8.50 లక్షలతో నిర్మించిన ఉద్యానశాఖ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంపునకు యాంత్రీకరణ తప్పనిసరి అన్నారు. యాంత్రీకరణతో పాటు సాగు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. తాడిపూడి, ఎర్రకాలువ కుడికాలువ, చింతలపూడి లిప్ట్‌ల నుంచి సాగునీరు అందించి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. అధికారుల కష్టంతోనే నల్లజర్ల మండలం జాతీయస్థాయిలో ఉత్తమ పురస్కారం అందుకోబోతుందని బాపిరాజు చెప్పారు. పంచాయతీరాజ్ దినోత్సవం ఈ నెల 24న సీఎం చంద్రబాబును పోతవరం తీసుకువచ్చి సత్కరించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, జెడ్పీటీసీ కొఠారు అనంతలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ ్మశ్వరి, ఉద్యానశాఖ ఏడీ జి.విజయలక్ష్మి, ఆత్మ పీడీ ఆనందకుమారి, ఏడీఏ రాజన్ తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దుతో ఒరిగిందేమీ లేదు
ఏలూరు (సెంట్రల్): పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తప్ప జరిగిన మేలు ఏమిలేదని, ఏటీఎంల నుంచి నగదు రాకపోవడంతో అవస్థలు తప్పడం లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మాద్ రఫీఉల్లా బేగ్ అన్నారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏలూరు, దెందులూరు, గోపాలపురం, చింతలపూడి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకుల్లో నగదు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదని, గంటల కొద్ది క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు పూర్తిస్థాయిలో నగదు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏటీఎంల్లో పూర్తిస్థాయిలో నగదు అందుబాటులో ఉంచాలని కోరుతూ ఈనెల 23న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్ద ‘మోదీ హఠావో ఏటీఎం భచావో ’ నినాదంతో ధర్నా చేయనున్నట్టు చెప్పారు. అనంతరం ప్రజా సమస్యల పోరాటం చేసేలా నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. నాయకులు పి.హరికుమార్రాజు, పెద్దిరెడ్డి సుబ్బారావు, డీజే ప్రభాకర్, గెడ్డం సాయిబాబా, దండుబోయిన చంద్రశేఖర్, కొల్లి అప్పారావు, సీహెచ్ నాగేశ్వరరావు, దావూరి బాబురావు, సుంకర సుబ్బారావు పాల్గొన్నారు. -
ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
జగన్నాథపురం (తాడేపల్లిగూడెం రూరల్): మండలంలోని జగన్నాథపురం హజరత్ కాలే మస్తాన్ షాఔలియా దర్గాలో మంగళవారం ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి దర్గాలో ప్రత్యేక నమాజ్‌లు, భక్తి పాటలు ఆలపించారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ జి.మధుబాబు, దర్గా పోషకురాలు అబ్బిన నాగమణి, ఆమె కుమారుడు అబ్బిన రాజీవ్ చౌదరి నవాబ్‌పాలెం సొసైటీ అధ్యక్షుడు పరిమి వీరభద్రరావు, నీటి సంఘం అధ్యక్షుడు బొల్లిన రామకృష్ణ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. కుల మతాలకతీతంగా ప్రజలు దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం చందల్ ఊరేగింపు జరుగుతుందని దర్గా పోషకురాలు అబ్బిన నాగమణి తెలిపారు. -
మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామిని విశేషంగా అలంకరించి తమలపాకులతో పూజలు నిర్వహించారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఒక్కరోజు ఆదాయం రూ.86,413 వచ్చినట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. 1160 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. -
ఆక్వా పార్క్ పనులు ఆపాల్సిందే
మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో విషవాయువుల్ని వెదజల్లి ఐదుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఘటనతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని డిమాండ్ చేశారు. తక్షణమే తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పనులను నిలుపుదల చేయాలని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మీడియాతో కలిసి మొగల్తూరు నల్లంవారి తోటలో ఆనంద ఆక్వా ప్లాంట్‌ను, గొంతేరు డ్రెయిన్‌ను మంగళవారం పరిశీలించారు. నరసాపురం : ‘మొగల్తూరులో ఐదుగురు మరణానికి కాలుష్యం కారణం కాదు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. ఆ ప్లాంట్‌లో అసలు కాలుష్యమే లేదు’ అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ కాలుష్యం ఏ మేరకు ఉంది, నిబంధనలకు నీళ్లొదిలి అనంద యాజమాన్యం కాలుష్యాన్ని గొంతేరులో ఏవిధంగా కలుపుతోందన్న విషయాలపై అఖిలపక్షం మొగల్తూరులో పర్యటించింది. అక్కడి పరిస్థితులను ఆళ్ల నాని మీడియాకు చూపించారు. ఆనంద ఆక్వా ప్లాంట్ నిర్వహణ నిబంధనల మేరకే జరుగుతోందని, తొలగించారని ప్రభుత్వం అబద్ధపు ప్రకటన చేసింది. వాస్తవానికి ప్లాంట్‌లో ప్రమాదానికి కారణమైన సంప్ నుంచి నేరుగా పైపులైన్లను ఆనంద యాజమాన్యం గొంతేరు డ్రెయిన్‌లోకి వేసింది. పడవల్లో గొంతేరు డ్రెయిన్‌లోకి మీడియాను, అఖిలపక్షాన్ని తీసుకువెళ్లిన స్థానిక మత్య్సకారులు అక్రమ పైపులైన్లను చూపిం చారు. ఆ పైపులైన్ల ద్వారా గొంతేరులో కలిసిన వ్యర్థాలను సైతం నీటిలోంచి తీసి చూపించారు. రొయ్యల తలలు, ఇతర భాగాలను గొంతేరు డ్రెయిన్‌లో కలుపుతున్న విషయం దీంతో తేటతెల్లమైంది. ఈ పైప్లైన్లనే ఐదు నెలల క్రితం తొలగించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పారని, మరి వీటి గురించి ఇప్పుడేం సమాధానం చెబుతారని మీడియా ద్వారా ఆళ్ల నాని ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన సంప్ నుంచి వారం రోజులు గడుస్తున్నా విషవాయువులకు సంబంధించిన దుర్వాసన తగ్గకపోవడాన్ని అక్కడికి వెళ్లిన వారంతా గమనించారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రమాదానికి విద్యుదాఘాతం కారణమంటూ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఆనంద యాజమాన్యం చేస్తున్న తప్పులను, వారిని వెనకేసుకొస్తూ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెపుతున్న అబద్ధాలను వివరించారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారని, ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని యాజమాన్యం మొక్కల పెంపకానికి వినియోగిస్తున్నారని మంత్రులు అసెంబ్లీలో చెప్పారన్నారు. ఇక్కడ యాజమాన్యం పెంచుతున్న మొక్కలు ఎక్కడ ఉన్నాయని, ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడుందని ప్రశ్నించారు. అక్కడున్న రైతులు, మహిళలు, మత్స్యకారులు వైఎస్సార్ సీపీ, అఖిలపక్ష నాయకులకు తమ ఇబ్బందులను వివరించారు. ప్లాంట్‌ను ఇక్కడి నుంచి తరలించకపోతే తమకు బతుకులు ఉండవని వేడుకున్నారు. వారితో ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ఇదే విషయమై ప్రభుత్వంతో తీవ్రంగా పోరాడుతున్నారని చెప్పారు. అధైర్యపడవద్దని వైఎస్సార్ సీపీ అండగా నిలబడుతుందని, న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో పచ్చి అబద్ధపు ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు దమ్ముంటే మీడియాతో కలిసి ఫ్యాక్టరీ వద్దకు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆనంద ప్లాంట్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ఇచ్చిందని, పరిస్థితి మారకపోతే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఫ్యాక్టరీని సీజ్ చేయాలని కూడా ఆదేశించిందని వివరించారు. అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఘోరం జరిగింది, ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆలోచన చేయండని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో కోరితే.. తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయకపోగా శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అనడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జనం చనిపోతే వారిని ప్రతిపక్ష నేతగా పరామర్శించడం శవ రాజకీయాలు అవుతాయా, మానవత్వం మరిచిపోయి ఎక్కడ శవాలు ఉంటే అక్కడకు వైఎస్ జగన్ వెళ్లిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పితాని సత్యనారాయణకు జిల్లాలో కాలుష్యకారక పరిశ్రమలపై అవగాహన ఉందన్నారు. ముఖ్యంగా నరసాపురం ప్రాంతంపై పట్టుందన్నారు. ఆయనైనా మొగల్తూరు ఘటనపై న్యాయంగా వ్యవహరించాని సూచించారు. తుందుర్రు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపాలనే డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఈనెల 7, 8 తేదీల్లో నరసాపురంలో నిరాహార దీక్ష చేస్తున్నారని వివరించారు. ప్రజలు క్షమించరు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మిస్తే తమ జీవితాలు నాశనమైపోతాయని మూడేళ్లుగా ప్రజలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఐదుగురు యువకులు బలైపోయారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే, ప్రజలు క్షమించరని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ తుందుర్రు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించే ఏర్పాటు చేయాలని కోరారు. తాము పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదనే విషయాన్ని మొదటి నుంచీ చెబుతున్నామని, ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా పరిశ్రమలు పెట్టొదని మాత్రమే కోరుతున్నామన్నారు. ఆనంద పరిశ్రమలో లోప మే ఐదుగురి ప్రాణాలు తీసిందన్నారు. వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీ నర్ గుణ్ణం నాగబాబు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడీ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకరం, నాయకులు బొద్దాని శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్‌బాబు, గుడిదేశి శ్రీనివాస్, ఎం.జయప్రకాష్, పాలంకి ప్రసాద్, వైకేఎస్, మంచెం మైబాబు, సీపీఎం నేత జేఎన్వీ గోపాలన్, పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు. -
ఆక్వా పార్క్ పనులు ఆపాల్సిందే
మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో విషవాయువుల్ని వెదజల్లి ఐదుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఘటనతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని డిమాండ్ చేశారు. తక్షణమే తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పనులను నిలుపుదల చేయాలని కోరారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మీడియాతో కలిసి మొగల్తూరు నల్లంవారి తోటలో ఆనంద ఆక్వా ప్లాంట్‌ను, గొంతేరు డ్రెయిన్‌ను మంగళవారం పరిశీలించారు. నరసాపురం : ‘మొగల్తూరులో ఐదుగురు మరణానికి కాలుష్యం కారణం కాదు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. ఆ ప్లాంట్‌లో అసలు కాలుష్యమే లేదు’ అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ కాలుష్యం ఏ మేరకు ఉంది, నిబంధనలకు నీళ్లొదిలి అనంద యాజమాన్యం కాలుష్యాన్ని గొంతేరులో ఏవిధంగా కలుపుతోందన్న విషయాలపై అఖిలపక్షం మొగల్తూరులో పర్యటించింది. అక్కడి పరిస్థితులను ఆళ్ల నాని మీడియాకు చూపించారు. ఆనంద ఆక్వా ప్లాంట్ నిర్వహణ నిబంధనల మేరకే జరుగుతోందని, తొలగించారని ప్రభుత్వం ఆబద్ధపు ప్రకటన చేసింది. వాస్తవానికి ప్లాంట్‌లో ప్రమాదానికి కారణమైన సంప్ నుంచి నేరుగా పైపులైన్లను గొంతేరు డ్రెయిన్‌లోకి వేసింది. పడవల్లో గొంతేరు డ్రెయిన్‌లోకి మీడియాను, అఖిలపక్షాన్ని తీసుకువెళ్లిన స్థానిక మత్య్సకారులు అనంద యాజమాన్యం అక్రమంగా వేసిన పైపులైన్లను చూపించారు. ఆ పైపులైన్ల ద్వారా గొంతేరులో కలిసిన వ్యర్థాలను సైతం నీటిలోంచి తీసి చూపించారు. రొయ్యల తలలు, ఇతర భాగాలను గొంతేరు డ్రెయిన్‌లో కలుపుతున్న విషయం దీంతో తేటతెల్లమైంది. ఈ పైప్లైన్లనే ఐదు నెలల క్రితమే తొలగించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పారని, మరి వీటి గురించి ఇప్పుడేం సమాధానం చెబు తారని మీడియా ద్వారా ఆళ్ల నాని ప్రశ్నించారు. ప్రమాదానికి కారణమైన సంప్ నుంచి వారం రోజులు గడుస్తున్నా విషవాయువులకు సంబం« దించిన దుర్వాసన తగ్గకపోవడానికి అక్కడికి వెళ్లిన వారంతా గమనించారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రమాదానికి విద్యుదాఘాతం కారణమంటూ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. ఆనంద యాజమాన్యం చేస్తున్న తప్పులను, వారిని వెనకేసుకొస్తూ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెపుతున్న అబద్ధాలను వివరించారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారని, ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని యాజమాన్యం మొక్కల పెంపకానికి వినియోగిస్తోందని మంత్రులు అసెంబ్లీలో చెప్పారన్నారు. ఇక్కడ యాజమాన్యం పెంచుతున్న మొక్కలు ఎక్కడ ఉన్నాయని, ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడుందని ప్రశ్నించారు. అక్కడున్న రైతులు, మహిళలు, మత్స్యకారులు వైఎస్సార్ సీపీ, అఖిలపక్ష నాయకులకు తమ ఇబ్బందులను వివరించారు. ప్లాంట్‌ను ఇక్కడి నుంచి తరలించకపోతే తమకు బతుకులు ఉండవని వేడుకున్నారు. వారితో ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ఇదే విషయమై ప్రభుత్వంతో తీవ్రంగా పోరాడుతున్నారని చెప్పారు. అధైర్యపడవద్దని వైఎస్సార్ సీపీ అండగా నిలబడుతుందని, న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీలో పచ్చి అబద్ధపు ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు దమ్ముంటే మీడియాతో కలిసి ఫ్యాక్టరీ వద్దకు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆనంద ప్లాంట్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ఇచ్చిందని, పరిస్థితి మారకపోతే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఫ్యాక్టరీని సీజ్ చేయాలని కూడా ఆదేశించిందని వివరించారు. అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఘోరం జరిగింది, ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆలోచన చేయండని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో కోరితే.. తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయకపోగా శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అనడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జనం చనిపోతే వారిని ప్రతిపక్ష నేతగా పరామర్శించడం శవ రాజకీయాలు అవుతాయా, మానవత్వం మరిచిపోయి ఎక్కడ శవాలు ఉంటే అక్కడకు వైఎస్ జగన్ వెళ్లిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడతా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పితాని సత్యనారాయణకు జిల్లాలో కాలుష్యకారక పరిశ్రమలపై అవగాహన ఉందన్నారు. ముఖ్యంగా నరసాపురం ప్రాంతంపై పట్టుందన్నారు. ఆయనైనా మొగల్తూరు ఘటనపై న్యాయంగా వ్యవహరించాని సూచించారు. తుందుర్రు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపాలనే డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఈనెల 7, 8 తేదీల్లో నరసాపురంలో నిరాహార దీక్ష చేస్తున్నారని వివరించారు. ప్రజలు క్షమించరు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మిస్తే తమ జీవితాలు నాశనమైపోతాయని మూడేళ్లుగా ప్రజలు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఐదుగురు యువకులు బలైపోయారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే, ప్రజలు క్షమించరని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ మాట్లాడుతూ తుందుర్రు ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించే ఏర్పాటు చేయాలని కోరారు. తాము పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదనే విషయాన్ని మొదటి నుంచీ చెబుతున్నామని, ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా పరిశ్రమలు పెట్టొదని మాత్రమే కోరుతున్నారన్నారు. చిన్న పరిశ్రమలో లోపమే ఐదుగురి ప్రాణాలు తీసిందన్నారు. వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుణ్ణం నాగబాబు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పీడీ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బర్రి శంకరం, నాయకులు బొద్దాని శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్‌బాబు, గుడిదేశి శ్రీనివాస్, ఎం.జయప్రకాష్, పాలంకి ప్రసాద్, వైకేఎస్, మంచెం మైబాబు, సీపీఎం నేత జేఎన్వీ గోపాలన్, పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు. -
అధిక ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు
మార్టేరు (పెనుమంట్ర): కాలానుగుణంగా అధిక దిగుబడినిచ్చే వంగడాల కోసం మార్టేరు వరి పరిశోధనా సంస్థలో నిరంతర ప్రక్రియగా పరిశోధనలు సాగుతున్నాయని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు కె.రాజారెడ్డి అన్నారు. మార్టేరు వరి పరిశోధనా స్థానంలో మంగళవారం మెగా కిసాన్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 50 వరి పరిశోధనా స్థానాల్లో మరెక్కడా లేనన్ని మేలైన విత్తనాలు సృష్టించి దేశవ్యాప్తంగా ఉన్న సాగుభూమిలో 25 శాతం మార్టేరు విత్తానాలు సాగులో ఉండేలా కృషిచేయడం అభినందనీయమన్నారు. రూ.6 కోట్లతో సంస్థలో బయోటెక్నాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునే మేలైన వంగడాలు మరిన్ని అందుబాటులోకి రావాలని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు చేరువైనప్పుడే వారి కృషికి సార్థకత ఉంటుందన్నారు. రైతు క్షేమం లక్ష్యంగా పరిశోధనలు ఉండాలని ఆకాంక్షించారు. ఆరోగ్యకర పంటల సాగు పెరగాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. నరసాపురం, తణుకు ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. డీసీడీసీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మార్టేరు విత్తనాలు వరి రైతులకు సిరులు పండిస్తున్నాయని అభినందించారు. పరిశోధనా సంచాలకుడు ఎన్వీ నాయుడు, రిజిస్ట్రార్ టీవీ సత్యనారాయణ, సంస్థ డైరెక్టర్ పీవీ సత్యనారాయణ, జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి, తూర్పుగోదావరి జిల్లా సంయుక్త సంచాలకులు కేఎన్వీ ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న స్టాల్స్ వరి, వాణిజ్య, ఉద్యాన పంటలపై రైతులకు శాస్త్రజ్ఞులు అవగాహన కల్పించారు. మెళాలో ఏర్పాటుచేసిన వ్యవసాయ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన 15 రకాల వంగడాలు, త్వరలో అందుబాటులోకి రానున్న రకాలను ప్రదర్శించారు. ఇక్కడే రూపుదిద్దుకున్న స్వర్ణతో పాటు దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన 1121, 1156, 1153, 1140, 1129 రకాలను ఎక్కువ మంది రైతులు తిలకించారు. వరితో పాటు, మొక్కజొన్న, కొబ్బరి, అరటి వంటి వాణిజ్య, ఉద్యాన పంటలపై శాస్త్రజ్ఞులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆసక్తిగా పరిశీలించారు. పాడి పెంపకం, పశుగ్రాస రకాలపై అవగాహన పెంచేలా ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. రైతుల హాజరు తక్కువ కిసాన్ మేళాకు పెద్దెత్తున ఏర్పాట్లు చేసినా ఆశించిన స్థాయిలో రైతులు రాలేదు. 5 వేల మంది రైతులను ఆహ్వానించినట్టు అధికారులు చెబుతున్నా రైతుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. పురుగు మందులు, ఎరువులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, వారి సిబ్బంది హడావుడి బాగా కనిపించింది. కుర్చీలన్నింటినీ ఆయ కంపెనీల సిబ్బంది, కళాశాల విద్యార్థులతో నింపేశారు. -
పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సబ్‌స్టేషన్
పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంగళవారం ఈపీడీసీఎల్ సీఎండీ ఎంఎం నాయక్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. 20 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. డంపింగ్‌ల కారణంగా పోలవరం ప్రాంతంలో విద్యుత్ లైన్లు, స్తంభాలు మార్చాల్సి వస్తే అంచనాలు పంపాలని ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు. ట్రాన్స్ట్రాయ్ ఏజెన్సీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ కె.తిరుమలేశ్, ట్రాన్స్‌కో ఏడీ కె.నరసింహమూర్తి, డీఈ ఆర్.సాల్మన్‌రాజు, ప్రాజెక్టు ఈఈ పి.కుమార్ పాల్గొన్నారు. స్పిల్‌వే గేట్ల నిర్మాణ పనుల పరిశీలన పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే ప్రాంతంలో గేట్ల నిర్మాణ పనులను ప్రాజెక్ట్ అధారిటీ కమిటీ సభ్యుడు ఓంకార్‌సింగ్, రాజీవ్ జస్వాల మంగళవారం పరిశీలించారు. మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రెండు గేట్ల నిర్మాణం పూర్తయ్యిందని, మరో రెండు గేట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. నిర్మాణానికి వినియోగించే స్టీల్ నాణ్యత, గేట్లు తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్రాజెక్ట్ ఈఈ పి.బుల్లియ్య వారి వెంట ఉన్నారు. -
పర్యాటక కేంద్రంగా దొంగరావిపాలెం
దొంగరావిపాలెం (పెనుగొండ) : దొంగరావిపాలెంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. మంగళవారం దొంగరావిపాలెంలోజరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దొంగరావిపాలెం వద్ద లంకభూములు, గోదావరిలో నీటి నిల్వలు ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటికే రూ.36 లక్షలతో పర్యాటక కేంద్ర పనులు ప్రారంభమయ్యాయన్నారు. బోటు షికారు, విశ్రాంతి ప్రాంతాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే ఏటిగట్టు పొడవునా రెస్టారెంట్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో దొంగరావిపాలెం పర్యాటకులతో కళకళలాడేవిధంగా నిర్మాణాత్మకమైన ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందన్నారు. పర్యాటక కేంద్రాలైన దిండి, పెదమల్లం, దొంగరావిపాలెంలను అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. దీంతో యువతకు ఉపాధి సైతం దొరుకుతుందన్నారు. సమావేశంలో పెనుగొండ, ఆచంట ఏఎంసీ చైర్మన్లు సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్‌బాబు, పీహెచ్సీ చైర్మన్ కేతా సత్తిబాబు, దొంగరావిపాలెం, సిద్ధాంతం సర్పంచ్‌లు పమ్మి మురళీ వెంకటేశ్వరరావు, బిరుదగంటి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. -
మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.18,50,426
భీమవరం (ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ ఆలయ హుండీలను మంగళవారం లెక్కించగా రూ.18,50,426 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 21–02–2017 నుంచి 21–03–2017 వరకూ ఈ ఆదాయం లభించిందన్నారు. హుండీలో బంగారం 71.3 గ్రాములు, వెండి 70 గ్రాములు, పాత రూ.1,000 నోట్లు రెండు, పాత రూ.500 నోట్లు ఐదు వచ్చినట్టు చక్రధరరావు తెలిపారు. పర్యవేక్షణాధికారి కర్రి శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
కుమారదేవంలో సినీ సందడి
కొవ్వూరు రూరల్ : కుమారదేవంలో మంగళవారం ఓ సినిమా యూనిట్ సందడి చేసింది. అంజిరెడ్డి ప్రొడక్ష న్ నంబర్– 2 బ్యానర్‌పై టీవీ నటుడు, కథా రచయిత హర్షవర్ధ న్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం షూటింగ్ గ్రామంలోని సినిమా చెట్టు, గోదావరి లంకల్లో జరుగుతోంది. మల్లెపువ్వు ఫ్రేమ్, చిత్ర హీరో మురళీకృష్ణ, బుల్లితెర యాంకర్, హీరోయి న్ శ్రీముఖిలపై మంగళవారం పాట చిత్రీకరణ జరిగింది. ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నట్టు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్కీ న్‌ప్లే, దర్శకత్వం హర్షవర్థ న్ కాగా, కెమెరా రగుతు సురేష్, కో–డైరెక్టర్ రాజ్‌కుమార్, ఆర్ట్ ఆనంద్. -
వైద్యుల ఖాళీల భర్తీకి చర్యలు
తణుకు అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు తెలిపారు. తణుకు ఏరియా ఆస్పత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 21 సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఏలూరులో నిర్మాణంలో ఉన్న మాతా శిశు విభాగంలో ప్రత్యేకంగా ఐదు గైనిక్ వైద్యులు, 10 స్టాఫ్ నర్సులు, రెండు అనస్తీషియా పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. తణుకు ఏఆర్టీ సెంటర్లో సిబ్బందిని నియమిస్తాం హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం తణుకు ఏఆర్టీ సెంటర్లో అవసరమయ్యే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, కేర్ కో-ఆర్డినేటర్, డేటా మేనేజర్, కౌన్సిలర్ పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామని డీసీహెచ్ఎస్ శంకరరావు చెప్పారు. ఏపీ శాక్స్ నుంచి ఇటీవల వచ్చిన ఆదేశాల మేరకు పీడీ రాజేంద్రప్రసాద్ సూచనలతో ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తణుకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెలగల అరుణ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వజావత్ కానరాజ్, సభ్యులు కంటిపూడి రాంబాబు, ఆత్మకూరి బులిదొరరాజు, కేవీ బాలకృష్ణ పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ కారును ఢీకొన్న లారీ
తాడేపల్లిగూడెం రూరల్ : ఇన్నోవా కారును లారీ ఢీకొన్న ఘటన మండలంలోని నవాబ్‌పాలెం కొత్త బ్రిడ్జిపై మంగళవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కారు(ఏపీ 05 డీఏ 555)ను నవాబ్‌పాలెం కొత్త బ్రిడ్జిపై కూల్‌డ్రింక్స్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయింది. అయితే కారులోని వారు క్షేమంగా బయటపడ్డారు. కారు డ్రైవర్ కడియాల తారక రామారావు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేర పరిశోధనలో జాగిలాల పాత్ర అపూర్వం
ఏలూరు అర్బన్ : నేర పరిశోధనలో పోలీసు జాగిలాల పాత్ర అపూర్వమని ఎస్పీ భాస్కర్‌భూషణ్ అన్నారు. తాజాగా శిక్షణ ముగించుకున్న (స్నిఫర్ డాగ్) పోలీసు జాగిలం‘ సింబా’ మంగళవారం డాగ్ స్క్వాడ్‌లోకి చేరేందుకు నగరానికి వచ్చిన సందర్భంగా ఎస్పీ భాస్కర్‌భూషణ్ డాగ్ కెన్నెల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనుష్యులతో పోల్చుకుంటే జంతువులలో గ్రాహ్యశక్తి అధికమన్నారు. జాగిలాల సాయంతో గతంలో ఎన్నో కీలక కేసులను పరిష్కరించగలిగామన్నారు. సింబా చేరికతో జిల్లా డాగ్‌స్క్వాడ్ మరింత బలోపేతం కానుందన్నారు. సింబా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిలిజెన్స్ విభాగం కెనైన్ ట్రైనింగ్ సెంటర్లో 8 నెలల పాటు ఎక్స్‌ప్లోజివ్ డిటెక్షన్‌లో శిక్షణ పొంది ఈ నెల 18న హైదరాబాద్‌లో జరిగిన పాసింగ్ పెరేడ్ అనంతరం ఏలూరు స్క్వాడ్‌లో చేరిందని తెలిపారు. డాగ్ కెన్నెల్‌లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం డాగ్ కెన్నెల్‌ను ఎస్పీ సందర్శించిన సందర్భంలో ఏఆర్ డీఎస్పీ ఎన్.చంద్రశేఖర్ కెన్నెల్‌లో ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. నూతనంగా చేరిన సింబాతో కలుపుకుని ప్రస్తుతం కేంద్రంలో 6 స్నిఫర్ డాగ్‌లు ఉన్నాయన్నారు. అయితే కేంద్రంలో నాలుగు కెన్నెల్స్ మాత్రమే ఉండడం ఇబ్బందిగా ఉందన్నారు. వేసవి కాలం వేడి కారణంగా డాగ్స్ ఇబ్బందిపడుతున్నాయని విన్నవించారు. స్పందించిన ఎస్పీ ఆరు కూలర్లు, ఒక ఫ్రిజ్ మంజూరు చేశారు. మరో నాలుగు కెన్నెల్స్ నిర్మించేందుకు ఎస్టిమేషన్ తయారు చేసి పంపితే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు, ట్రైనీ ఎస్పీ ఆరిఫ్ అఫీజ్, ఓఎస్డీ బి.రామకృష్ణ, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి ఎస్సై జి.జీవనరావు, హ్యాండ్లర్ సీహెచ్ మహేంద్ర పాల్గొన్నారు. -
‘మీసేవ’లపై విజిలెన్స్ దాడి
తాళ్లపూడి : తాళ్లపూడిలోని మీసేవా కేంద్రాలను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో గల ఏపీ ఆన్లైన్ మీసేవా కేంద్రంపై పలు ఆరోపణలు రావడంతో మీ సేవా ఏడీ అదేశాలతో విచారణ చేయడానికి వచ్చినట్టు విజిలెన్స్ మేనేజర్ భగత్ తెలిపారు. మీ సేవలో పౌర సేవలకు నిర్ణయించిన దాని కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయన్నారు. కేంద్రం నిర్ణయించిన ప్రదేశంలో లేదని, రికార్డులు సక్రమంగా నిర్వహించడంలేదని, కంప్లెంట్ రిజిస్టర్ లేదని తెలిపారు. పౌరసేవల వివరాల చార్ట్ లేదని, సొంత వ్యాపారం మాదిరిగా నిర్వహిస్తున్నారన్నారని అన్నారు. నిర్వాహుకుడు అప్పన చంద్రగుప్త నుంచి వివరాలు సేకరించారు. చర్యల కోసం ఉన్నతా«ధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. అనంతరం మరో కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీటీ నాగ లక్ష్మమ్మ, ఆర్ఐ భరతి, వీఆర్వో ప్రవీణ్, కొండబాబు ఉన్నారు. -
పాలీహౌస్ ఉత్పత్తులకు మార్కెటింగ్
తాడేపల్లిగూడెం రూరల్ : పాలీ హౌస్‌ల్లో పండించే ఉత్పత్తులకు సబ్సిడీతో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని ఏపీ హార్టీకల్చర్ గుంటూరు కమిషనరేట్ అధికారి శరవణ న్ అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో పాలీహౌస్, షెడ్ నెట్‌ల్లో సాగు చేసే క్యాప్సికమ్, టమోట, జర్బెరా, కార్మెషన్, గులాబీ, పూలు, కూరగాయల సాగు విధానంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాలీహౌస్, షెడ్ నిర్మాణం కోసం సంబంధిత ఉద్యాన అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. క్యాప్సికంకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ప్రకాశం జిల్లాకు చెందిన రైతు దండా వీరాంజనేయులు కోరారు. కోపర్ట్ బయోలాజికల్ ల్యాబ్ (బెంగళూరు) ప్రతినిధి కె.మహేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రకృతి యాజమాన్య పద్ధతుల ద్వారా సులభంగా చీడపీడలను నివారించవచ్చని చెప్పారు. రాజ్వా న్ హైబ్రీడ్ సీడ్స్ ప్రతినిధి ఎల్వీ ప్రసాద్, నెటాఫిమ్ డ్రిప్ కంపెనీ ప్రతినిధి ఏఎస్ సుబ్బారావు మాట్లాడారు. ఉద్యాన వర్సిటీ పరిశోధన సంచాలకుడు దిలీప్‌బాబు, విస్తరణ సంచాలకులు ఆర్వీఎస్కే రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ రామ్మోహ న్‌రావు, ఉద్యాన ఏడీ జి.విజయలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు, ఎంపీఈవోలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
పదవీ విరమణ రోజే బెనిఫిట్స్
ఏలూరు అర్బన్ : ముఫ్పై ఏళ్ల సుదీర్ఘ కాలం ఒత్తిళ్లు, సవాళ్లతో విధులు నిర్వహించి అలిసిపోయారు ఇకపై ప్రశాంతంగా జీవించండి అని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ సూచించారు. నల్లజర్ల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎ.ప్రకాశరావు పదవీ విరమణ చేయనున్న సందర్భంగా మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉద్యోగ విరమణ చెందిన వారికి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు ఆఖరిరోజునే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ప్రకాశరావుకు పూర్తి మొత్తం చెక్కు రూపంలో అందించామని చెప్పారు. అనంతరం ప్రకాశరావు దంపతులకు శాలువా కప్పి సత్కరించారు. ఎస్పీ వారిని పోలీసు బ్యాండు మేళంతో పోలీసు వాహనంలో సాగనంపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అరిఫీ హఫీజ్, ఏఎస్పీ వలిశల రత్న, పోలీసు అధికారుల సంక్షేమ సంఘ నాయకులు కె.వెంకటరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పట్టపగలే దోచేశారు
పెదపాడు (దెందులూరు): పెదపాడు మండలం ఏపూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఓ ఇంట్లో పట్టపగలే దొంగలు పడి 12 కాసుల బంగారు ఆభరణాలు అపహరించారు. పెదపాడు పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఏపూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని సీతారామాంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న పడాల గోపి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. బీరువాలోని 12 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయా రు. బాధితుడు గోపి ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్ఐ ఎ న్ వీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూల్‌డ్రింక్స్ వ్యాన్‌బోల్తా
పోడూరు (పాలకొల్లు): పోడూరు మండలం జిన్నూరు వద్ద ప్రమాదవశాత్తు కూల్‌డ్రింక్స్ లోడుతో వెళుతున్న వ్యాన్ నరసాపురం ప్రధాన కాలువలోకి పల్టీ కొట్టింది. మంగళవారం మార్టేరు వైపు నుంచి పాలకొల్లు వస్తున్న వ్యాన్ మట్టపర్రు రోడ్డు దాటాక రైస్‌మిల్లు సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ సమయంలో రోడ్డుపై వాహన రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. -
ప్రకృతి వ్యవసాయంతోనే మంచి ఆహారం
తణుకు టౌన్ : ప్రకృతి వ్యవసాయంలో రసాయనాలకు బదులుగా కషాయాలతో కీటకాలను నిర్మూలించడం ద్వారా మంచి ఆహార పదార్థాలను అందించవచ్చని గుంటూరు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు చెప్పారు. మంగళవారం ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల లైఫ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ఆవు ప్రధాన భూమిక కలిగి ఉంటుందని, ఒక ఆవుతో ఐదు ఎకరాలను సాగు చేయవచ్చన్నారు. ఈ విధానంలో ఎకరానికి 65 నుంచి 70 బస్తాల ధాన్యాన్ని పండించవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రోజూ రైతు పంటను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఈ విధానంలో పండించిన పంటను కూడా రైతే స్వయంగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా లాభాలను పొందవచ్చని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంలో పండిన పంటలను కొనుగోలు చేసేందుకు ఇటీవల విజయవాడలో ఒక సొసైటీ ఏర్పాటు చేసినట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో తమ ఫౌండేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై ప్రతి ఆదివారం రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన చిట్టూరి సుబ్బారావు మాట్లాడుతూ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎరువులు, పురుగు మందులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు అశోక్‌కుమార్ మాట్లాడుతూ విచ్చలవిడిగా రసాయనాలు వాడటం వల్ల భూములు సారాన్ని కోల్పోయాయన్నారు. వాటిని మళ్లీ వృద్ధి చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు పరిశోధనలు చేస్తున్నట్టు తెలిపారు. మదనపల్లి ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలన్నారు. నువ్వులు, బెల్లం, వేరుశనగ, జొన్నలు, సజ్జలు ఎక్కువ ఆహారంగా తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతు భూపతిరాజు రామకృష్ణంరాజు మాట్లాడుతూ జిల్లాలోని నాచుగుంటలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎకరానికి సంవత్సరానికి రూ.72,500 లాభం ఆర్జిస్తున్నట్టు చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 110 మంది రైతులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అరుణ, ఏవో డాక్టర్ డాక్టర్ డి.సుబ్బారావు, కళాశాల కమిటీ సభ్యురాలు చిట్టూరి సత్య ఉషారాణి, ప్రిన్సిపాల్ ఎం.రాజేంద్రప్రసాద్, వీవీవీ సత్యనారాయణరెడ్డి, బి.నాగపద్మావతి, కె. రాధాపుష్పావతి పాల్గొన్నారు. -
రాజకీయాల కోసమే ముద్రగడ ఉద్యమం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : కాపుల కోసమంటూ ముద్రగడ చేస్తున్న ఉద్యమం సమంజసంగా లేదని, ఆయన కేవలం రాజకీయం కోసమే ఉద్యమాలు చేస్తున్నట్టు ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తమిళనాడులో జల్లికట్టుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు ముడిపెట్టడం సరికాదని చెప్పారు. మంగళవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు నెలలకోసారి నిద్రలేచి ప్రకటనలకే పరిమితమయ్యే పవన్‌కల్యాణ్‌కు అనుభవం లేదని, అందుకే అటువంటి ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రధాని నరేంద్రమోదీతో కలిసి హెలికాఫ్టర్లలో తిరిగేంత చనువు ఉందని, ఏదైనా సమస్య అనిపిస్తే మోదీతోనే మాట్లాడాలని హితవు పలికారు. అంతకుముందు టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన వెల్లడించారు. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు పునాదులు కట్టుకున్న వారికి ఇళ్లు నిర్మించే అవకాశం లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి వారికి కూడా నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రిని కోరాలని సమావేశంలో తీర్మానించామన్నారు. ద్వారకాతిరుమలలో ఏర్పాటు చేసిన విర్డ్ ఆసుపత్రిలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు అమలు చేయాలని కోరతామన్నారు. త్వరలో జిల్లాలో ఖాళీకానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పలువురు ఆశావహులు మంత్రులు అయ్యన్న పాత్రుడు, పీతల సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్షి్మలకు వినతిపత్రాలు సమర్పించారు. -
జగన్ పర్యటనను జయప్రదం చేయండి
జంగారెడ్డిగూడెం రూరల్ (చింతలపూడి) : ద్వారకాతిరుమలలో ఈనెల 29న జరిగే బహిరంగ సభకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేస్తున్నారని, ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మంగళవారం పోలవరం నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణ, మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నాని మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో జరిగే బహిరంగసభలో కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ పార్టీలో చేరుతున్నారన్నారు. శ్రీధర్ చేరిక పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ఆయన రాక శుభపరిణామంగా భావిస్తున్నామని నాని చెప్పారు. పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో తరలివచ్చి వైఎస్సార్ సీపీ బలాన్ని తెలియజెప్పాలని కోరారు. అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి జిల్లా ప్రజలను త్రీవంగా మోసం చేశారని విమర్శించారు.రైతులకు ఉపయోగడపని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారని, ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విజయవాడలోని పారిశ్రామికవేత్తలకు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకనసాగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సాకారం కావాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యపడుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై టీడీపీ ప్రభుత్వం కనీసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఆలోచన కూడా చేయడం లేదన్నారు. నిర్వాసితులకు పరిహారం అందడం లేదు పార్టీ జిల్లా పరిశీలకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో జరిగే వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో తరలిరావాలన్నారు. పార్టీ మండల అధ్యక్షులు బాధ్యత తీసుకుని జనసమీకరణ చేయాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం అందడం లేదన్నారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలు త్రీవంగా మోసం చేశారన్నారు. చంద్రబాబునాయుడుకి ప్యాకేజీలపై ఉన్న శ్రద్ధ ప్రత్యేకహోదా సాధనపై లేదన్నారు. కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధివిధానాల నచ్చి తాను పార్టీలోకి చేరుతున్నానని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను అందరితో కలిసి సైనికుడిలా పనిచేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, పార్టీ సీనియర్ నాయకులు మండవల్లి సోంబాబు, తల్లాడ సత్తిపండు, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ మండల అ««దl్యక్షుడు తాతకుంట్ల రవికుమార్, రాఘవరాజు ఆదివిష్ణు, పార్టీ నాయకులు పాశం రామకృష్ణ, చనమాల శ్రీనువాస్, కరాటం కృష్ణ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు
దేవరపల్లి : ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 18 రోజులకు గాను వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.1,03,06,383 లభించినట్టు ఆలయ కార్యనిర్వాహణా««ధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. 239 గ్రాముల బంగారం, 3 కేజీల 152 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీలు లభించినట్టు చెప్పారు. రూ1,15,116 విరాళం అందజేత చిన వెంకన్న ఆలయానికి మంగళవారం కామవరపుకోటకు చెందిన దాత గంటా బులిస్వామి కుటుంబ సభ్యులు 1,15,116 రూపాయలను అన్నదాన విరాళంగా అందజేశారు. విరాళాన్ని దాతలు ఈవో వేండ్ర త్రినాథరావుకు అందించారు. -
ఏలూరు రేంజ్లో 13 మంది సీఐల బదిలీ
ఏలూరు అర్బ న్ : ఏలూరు రేంజ్లో 13 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో పని చేస్తున్న వీరికి రేంజ్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. సీఐ పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం పి.మురళీకృష్ణారెడ్డి కాకినాడ వ న్‌టౌ న్ రాజమండ్రి సీసీఎస్ జె.జోగేశ్వరరావు పశ్చిమ గోదావరి (అటాచ్) తూర్పు గోదావరి (వీఆర్) ఎస్ఎస్వీ నాగరాజు ఏలూరు (సీఐడీ) భీమవరం రూరల్ ఆర్జీ జయసూర్య భీమవరం రూరల్ డీసీఆర్బీ ఏలూరు కె.వెంకటేశ్వరరావు రాజమండ్రి (వీఆర్) విజయవాడ సిటీ ఎ.శ్రీనివాసరావు తూర్పు గోదావరి (వీఆర్) ప్రత్తిపాడు (తూర్పు గోదావరి) జి.సత్యనారాయణ ప్రత్తిపాడు (తూర్పు గోదావరి) వీఆర్ (పశ్చిమ గోదావరి) ఎల్.రవితేజ వీఆర్ (పశ్చిమ గోదావరి) వీఆర్ (కృష్ణా) బి.పెద్దిరాజు వీఆర్ (కృష్ణా) రావులపాలెం పి.వెంకటరమణ రావులపాలెం డీఎస్బీ, కాకినాడ వి.శ్రీనివాస్ డీఎస్బీ, కాకినాడ తుని బి.అప్పారావు తుని టౌ న్ పిఠాపురం మహ్మద్ ఉమర్ పిఠాపురం కాకినాడ టూటౌ న్ -
35 పాఠశాలల్లో ‘మధురాన్నం’
తాడేపల్లిగూడెం: గోదావరి విద్యావికాస చైతన్య సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుంచి జిల్లాలోని 35 పాఠశాలల్లో మధురాన్నం పథకాన్ని ప్రారంభించనున్నట్టు సొసైటీ చైర్మన్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతోపాటు 35 ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థులకు మధురాన్నం పథకంలో భాగంగా పోషకాహారం అందిస్తామనిచచెప్పారు. మధురాన్నం పేరుతో మధ్యాహ్న భోజనాన్ని నూరుశాతం నాణ్యతతో వేడిగా విద్యార్థులకు అందిస్తామన్నారు. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్లు అందిస్తామనిచచెప్పారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని భారతీయ విద్యాభవన్స్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక వంటశాల నుంచి మధురాన్నం సరఫరా చేస్తామన్నారు. స్టీమ్ కుక్కింగ్ ద్వారా పూర్తి పరిశుభ్రత గల వాతావరణంలో వంటలు వండుతామన్నారు. భోజన సరఫరా కోసం ఎనిమిది వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. పెదతాడేపల్లి విద్యాభవన్స్ నుంచి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలకు ఉదయం 10.30 నిమిషాల నుంచి మ«ధ్యాహ్నం 12 గంటలలోపు ఆహార పదార్థాలు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ పథకం అమలుకు సంబంధించి కలెక్టర్‌తో ఒప్పందం కుదిరిందన్నారు. పథకం అమలుకోసం వంద మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. మధురాన్నంతో పాటు పథకం అమలు జరిగే పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల ద్వారా ఆయా పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు , దాతల సహకారంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, నల్లజర్ల, ఇరగవరం, అత్తిలి, భీమవరం మండలాల్లో పాఠశాలలకు తొలివిడతగా మధురాన్నరం పథకం అమలు చేస్తామని వివరించారు. -
వైఎస్సార్ సీపీ పటిష్టతే లక్ష్యం : ఆళ్లనాని
యలమంచిలి (పాలకొల్లు) : వైఎస్సార్ సీపీని మరింత పటిష్టం చేయడమే లక్ష్యమని, దీనికోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) సూచించారు. స్థానిక తమ్మినీడి ఉమానరసింహ కల్యాణ మండపంలో మంగళవారం పార్టీ మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. ఈ విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగ న్మోహ న్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇ న్చార్జ్ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన తెలుగుదేశం నాయకులు ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. పార్టీ నియోజకవర్గ అదనపు కన్వీనర్ గుణ్ణం నాగబాబు మాట్లాడుతూ గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని, ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారని చెప్పారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ చెల్లెం ఆనందప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి రాజధాని అభివృద్ధిపై ఉన్న శ్రద్ధలో ఇసుమంతైనా ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. నరసాపురం నియోజకవర్గ ఇ న్చార్జ్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ.. వై.ఎస్.జగ న్మోహ న్‌రెడ్డి మోసపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటే ఇప్పటికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయి ఉండేవారని, ఆయన నైజం అది కాదని స్పష్టం చేశారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయి బాల పద్మజ మాట్లాడుతూ రుణమాఫీ అంటూ రైతులు, మహిళలను, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటు యువతను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా నిరీక్షిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పాలకొల్లు మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు యడ్ల తాతాజీ, నాయకులు పీడీ రాజు, గుణ్ణం సర్వారావు, మైలాబత్తుల మైఖేల్‌రాజు, ఎంపీటీసీ సభ్యులు చేగొండి సూర్యశ్రీనివాస్, శిరిగినీడి రామకృష్ణ, మోకా వెంకటలక్ష్మి నాయకులు బోనం బులివెంకన్న, విప్పర్తి నవీన్, చివటపు నాగేశ్వరరావు, కల్యాణం గంగాధరరావు, రావూరి వెంకటకోటి మురళీకృష్ణ, లంక చిరంజీవి, గుడాల సురేష్, ఉచ్చుల స్టాలిన్, మోకా నరసింహారావు, దేవరపు మల్లేశ్వరరావు, జల్లి నాగేశ్వరరావు, మద్దా చంద్రకళ, ఖండవల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ 32 గ్రామ కమిటీల అధ్యక్షులను ఆళ్ల నానికి స్థానిక నేతలు పరిచయం చేశారు. -
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
ఆకివీడు(ఉండి) : కాటన్ పార్కుతోపాటు కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి , కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. మంగళవారం పార్కును వారు సందర్శించారు. పార్కులో జరుగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు వారికి వివరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, దాసరి సత్యనారాయణ, పిన్నమరాజు శ్రీనివాసరాజు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. ఉండి డంపింగ్ యార్డు రాష్ట్రానికే ఆదర్శం ఉండి : ఉండిలో నిర్మిస్తున్న డంపింగ్‌యార్డు రాష్ట్రానికే ఆదర్శంగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఉండిలోని డంపింగ్ యార్డును ఆయన కలెక్టర్ భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఢిల్లీలో జరిగే సమావేశాల్లో ఈ డంపింగ్‌యార్డును నమూనాగా ప్రదర్శిస్తామని చెప్పారు. -
ఆటోను ఢీకొట్టిన కారు
కొవ్వూరు : పట్టణంలోని టోల్గేట్ జంక్షన్ సమీపంలో రోడ్డు కం రైలు వంతెనపై ఎదురుగా వచ్చిన మోటార్‌సైకిల్‌ను తప్పించే క్రమంలో కారు ఆటోను ఢీకొట్టింది. కారు అదుపుతప్పి వంతెన దిగువకు వెళ్లి ఆగిపోయింది. ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మేకల శ్రీనివాసరావు స్వల్పంగా గాయపడ్డాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఏలూరి ప్రభాకరావు, కమల కుమారి సురక్షితంగా బయటపడ్డారు. చాగల్లు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఆటోను రాజమహేంద్రవరం నుంచి పెనకనమెట్ట వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. రోడ్డు కం రైలు వంతెన అప్రోచ్రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో కారు రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో సిమెంట్ దిమ్మె కారు దిగువున ఇరుక్కుంది. ఎదురుగా చెట్ల కొమ్మల్లో ఇరుక్కోవడంతో కారు ముందుకు వెళ్లలేదు. కారుకు దిగువన తాటాకిళ్లు ఉన్నాయి. కారు అదుపు తప్పితే ఇళ్లల్లోకి దూసుకెళ్లి ఉండేది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
త్రోబాల్ జట్టు ఎంపిక పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం జిల్లా స్థాయి అండర్17 బాలబాలికల త్రోబాల్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా నలుమూలల 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఎర్రన్న, స్టాలిన్, జిలాని, చంద్రకళ, తబితజెస్సిరాణి పర్యవేక్షించారు. జార్జికారొనేషన్ క్లబ్ వారు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించారు. ఎంపికైన క్రీడా జట్లు ఈ నెల 19, 20వ తేదీల్లో రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలు, ఎంపికలలో పాల్గొనాల్సి ఉంటుందని, బుధవారం నుంచి దేవగుడి గ్రామంలో జరిగే శిక్షణ శిబిరంలో హాజరు కావాలని తెలిపారు. ఈ ఎంపికలలో పీఈటీలు లక్ష్మీనారాయణ, ప్రసాద్‌రెడ్డి, రాజా, అంకాల్‌రెడ్డి, అంకారావు, సుధాకర్ పాల్గొన్నారు. ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి త్రోబాల్ అండర్17 బాలుర జట్టుకు ఎం.నవీన్, కె.పురుషోత్తం, లక్ష్మినారాయణ, పి.జయప్రకాష్, బి.పెద్దమునయ్య, జె.సాయి, సుమన్, ప్రవీన్, డి.దేవేంద్ర, పి.శ్రీధర్, బి.బ్రహ్మయ్య, ఎస్.సునీల్, స్టాండ్‌బైగా వి.సాయితేజ, ఎం.శివమోహన్, బి.అనిల్, పి.హరికుమార్ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు స్వాతి, శ్రావణి, బి.కళ్యాణి, కల్పన, కావ్య, శ్రీలేఖ, గౌతమి, చాముండి, మహాలక్ష్మి, పద్మావతి, సుకన్య, దీప్తి, స్టాండ్‌బైగా వరలక్ష్మీ, గాయత్రి, భార్గవి, నిరిషా ఎంపికయ్యారు. -
త్రోబాల్ జట్టు ఎంపిక పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం జిల్లా స్థాయి అండర్17 బాలబాలికల త్రోబాల్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా నలుమూలల 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఎర్రన్న, స్టాలిన్, జిలాని, చంద్రకళ, తబితజెస్సిరాణి పర్యవేక్షించారు. జార్జికారొనేషన్ క్లబ్ వారు క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించారు. ఎంపికైన క్రీడా జట్లు ఈ నెల 19, 20వ తేదీల్లో రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలు, ఎంపికలలో పాల్గొనాల్సి ఉంటుందని, బుధవారం నుంచి దేవగుడి గ్రామంలో జరిగే శిక్షణ శిబిరంలో హాజరు కావాలని తెలిపారు. ఈ ఎంపికలలో పీఈటీలు లక్ష్మీనారాయణ, ప్రసాద్‌రెడ్డి, రాజా, అంకాల్‌రెడ్డి, అంకారావు, సుధాకర్ పాల్గొన్నారు. ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి త్రోబాల్ అండర్17 బాలుర జట్టుకు ఎం.నవీన్, కె.పురుషోత్తం, లక్ష్మినారాయణ, పి.జయప్రకాష్, బి.పెద్దమునయ్య, జె.సాయి, సుమన్, ప్రవీన్, డి.దేవేంద్ర, పి.శ్రీధర్, బి.బ్రహ్మయ్య, ఎస్.సునీల్, స్టాండ్‌బైగా వి.సాయితేజ, ఎం.శివమోహన్, బి.అనిల్, పి.హరికుమార్ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు స్వాతి, శ్రావణి, బి.కళ్యాణి, కల్పన, కావ్య, శ్రీలేఖ, గౌతమి, చాముండి, మహాలక్ష్మి, పద్మావతి, సుకన్య, దీప్తి, స్టాండ్‌బైగా వరలక్ష్మీ, గాయత్రి, భార్గవి, నిరిషా ఎంపికయ్యారు. -
నోట్లు మార్పిడి ముఠా అరెస్టు
నందలూరు: పాత పెద్ద నోట్లను తీసుకుని కమీషన్ పట్టుకుని కొత్త నోట్లను ఇచ్చేందుకు ప్రయత్నించిన తొమ్మిది మంది సభ్యులు గల ముఠాను అరెస్టు చేసినట్లు నందలూరు ఎస్ఐ శ్రీనివాసులరెడి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరుకు చెందిన మోడి శ్రీనివాసులు, యస్.రాజగోపాల్, మొగలి నవీన్‌కుమార్, రాచపోయిన చెంగల్రాయుడు, మద్దిల నాగరాజు, కోడూరు రాంబాబు, నాటూరు నరసింహారెడ్డి, కొండా వెంకటేష్, కొండా రమేష్‌బాబులు నందలూరు చెయ్యేరు బ్రిడ్జి కింద నీలిపల్లి ప్రాంతంలో ఉండగా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.10 వేలు నగదు, ఒక ఇండికా కారు, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు కమీషన్‌కు కక్కుర్తి పడి పాత నోట్లుతీసుకు ని కొత్త నోట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారన్నారు. తమకు అందిన పక్కా సమాచారంతో వీరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. కాగా 9 మంది వద్ద కేవలం రూ.10 వేలు మాత్రమే ఉన్నాయనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మావుళ్లమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 21.99 లక్షలు
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం మావుళ్లమ్మ ఆలయ హుండీలను మంగళవారం లెక్కించగా రూ. 21,99,561 ఆదాయం లభించింది. ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో బంగారం 082.400 మీలీ గ్రాములు, వెండి 0.218 మిల్లీగ్రాములు వచ్చింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత నెల 29న హుండీలను లెక్కించామని, అప్పటి నుంచి మంగళవారం వరకూ ఈ ఆదాయం లభించిందన్నారు. కలెక్టర్, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రతివారం అమ్మవారి హుండీలను తెరిచి ఆదాయం లెక్కించి బ్యాంకులో జమ చేస్తామన్నారు. పర్యవేక్షణ అధికారి కర్రి శ్రీనివాసరావు, ధర్మకర్తలు శీరిగినీడి చంద్రశేఖర్, అడ్డగర్ల ప్రభాకరగాంధీ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఏలూరు (సెంట్రల్) : స్థానిక సెయింట్ థెరిస్సా డిగ్రీ మహిళా కళాశాలలో మంగళవారం యువజనోత్సవాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థినీవిద్యార్థులు హాజరయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సినీ దర్శకుడు మహేంద్ర చక్రవర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన సంభవామి అనే ఏకాంకిక నాటిక విశేషంగా ఆకట్టుకుంది. త్వరలో 2 లక్షల మందికి వృత్తి శిక్షణ : మంత్రి సుజాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ వచ్చే జనవరిలో జిల్లాలోని 2 లక్షల మంది యువతకు 12 వృత్తుల్లో వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే జిల్లాకు చెందిన 50 మంది యువతకు ఆర్మీలో ఉద్యోగావకాశాలు లభించడం హర్షణీయమని అన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి జిల్లాకు చెందిన 10 మంది యువత ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ మరుగున పడిపోతున్న కళలను పైకి తీసుకువచ్చేందుకు యువజన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ యువత కోసం జిల్లాలో యువజన భవన్ నిర్మించనున్నామని చెప్పారు. యువతకు వివిధ రంగాలలో శిక్షణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఈ యువజనోత్సవాల్లో జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన అభ్యర్థులకు ప్రయాణ, భోజన, వసతి సదుపాయాలన్నీ ఉచితంగా కల్పిస్తామన్నారు. ఏకాంకిక నాటికలో పాల్గొన్న విద్యార్థినులను ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. సెట్వెల్ సీఈవో శ్రీనివాసులు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.మెర్సి, కల్చరల్ కో ఆర్డినేటర్ బ్రహ్మేశ్వరి పాల్గొన్నారు. -
బాల్‌బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపిక
నిడదవోలు : జిల్లా సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలపాటి శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో సెలెక్షన్స్ జరిగాయని, ఎంపికైన జట్టు ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈనెల 10, 11, 12 తేదీల్లో జరిగే ఎన్టీఆర్ మెమోరియల్ రెండో ఏపీ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ అంతర్ జిల్లాల చాంపియన్‌షిప్ పోటిల్లో పాల్గొంటారన్నారు. ఎంపిౖకైన క్రీడాకారులకు ఊనగట్ల గ్రామానికి చెందిన పి.బాబీ క్రీడా దుస్తులు అందించారు. ఎంవీఎన్రాజు తదితరులు పాల్గొన్నారు. 8నుంచి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు చాగల్లు జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ బాల్‌బ్యాడ్మింటన్ అంతర్ జిల్లాల అండర్–17 బాల బాలికల చాంపియన్Sషిప్ పోటీలను ఈనెల 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్టు పోటీల పరిశీలకుడు గోపాలపురం జెడ్పీ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పాలేటి శ్రీనివాస్ తెలిపారు. -
డిపాజిట్ సొమ్ము చోరీ
భీమడోలు : బ్యాంకులో నగదు డిపాజిట్ వేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి వద్ద రూ.21వేలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన మంగళవారం పూళ్ల ఆంధ్రాబ్యాంకులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పూళ్ల గ్రామానికి చెందిన కూటికుప్పల వాసు, అతని భార్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందారు. వాసు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో దాతలు ఇచ్చిన ఆర్థిక సాయంతో కుటుంబ సభ్యులకు చెందిన రూ.21వేల పెద్ద నోట్లను ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వాసు నిదానంగా నడుస్తూ వచ్చాడు. డిపాజిట్ పత్రం పూరించే తరుణంలో బ్యాంకు సిబ్బందికి నోట్లను చూపించాడు. కొద్దిసేపు సమయం పడుతుందని వారు బదులివ్వడంతో ఆ సొమ్మును జేబులో పెట్టుకున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న 15 ఏళ్లలోపు బాలుడు బాధితుడు వాసు జేబులోని నగదును గుట్టుచప్పుడుకాకుండా చోరీ చేశాడు. ఆ తర్వాత కౌంటర్లో డిపాజిట్ పత్రం అందించే తరుణంలో జేబులో నగుదు చూసుకున్న వాసు అవి కనిపించకపోవడంతో భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ వెంకటేశ్వరరావు బ్యాంకుకు చేరుకుని బాధితడి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేనేజర్ ఎస్.ఎస్.చలపతిరావు సహకరించడంతో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీతమ్మ చెరువులో చోరీ
చింతదిబ్బ (యలమంచిలి) : చింతదిబ్బ పంచాయతీ సీతమ్మచెరువులో సోమవారం అర్ధరాత్రి దొంగలు మూడిళ్ల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. రెండిళ్లలో ఎటువంటి నగదు, బంగారం లేకపోవడంతో మూడో ఇంటిలో ఉన్న నగదు, బంగారం, టీవీలను తస్కరించారు. ఎస్ఐ పాలవలస అప్పారావు కథనం ప్రకారం.. బొంతు శేఖర్ గల్ఫ్‌లో ఉంటాడు. అతని భార్య నిర్మల సోమవారం రాత్రి భోజనం చేసిన తరువాత పక్కనే వాళ్ల బంధువుల ఇంటిలో పడుకుంది. ఆ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లిన దొంగలు ఇంటిలో ఉన్న కాసున్నర బంగారం, రూ. 5వేలు, ఓ ఎల్సీడీ టీవీ దోచుకెళ్లారు. ఆ సమీపంలో ఉన్న మాదాసు మహాలక్ష్మి, తానేటి శ్రీనుల ఇళ్ల తాళాలనూ పగులకొట్టారు. కానీ ఆ ఇళ్లలో ఎటువంటి నగదు, వస్తువులు లేకపోవడంతో చోరీ జరగలేదు. నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో సీతమ్మచెరువులో దొంగతనం జరగడం ఇదే తొలిసారి. -
టేబుల్ టెన్నిస్ పోటీల విజేతలు వీరే..!
తణుకు టౌన్ : ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంతర కళాశాలల టేబుల్ టెన్నిస్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో అనపర్తికి చెందిన జీబీఆర్ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలవగా. గొల్లల మామిడాడకు చెందిన డీఎల్ఆర్ కళాశాల విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. రాజమండ్రి ఎస్‌కేవీటీ కళాశాల విద్యార్థులు తృతీయస్థానం, రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాల విద్యార్థులు నాలుగోస్థానం పొందారు. బాలికల విభాగంలో రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాల విద్యార్థినులు విన్నర్స్‌గా, తణుకు ఎస్‌కేఎస్‌డీ విద్యార్థినులు రన్నర్స్‌గా, రాజమండ్రి ఎస్‌కేవీటీ విద్యార్థినులు తృతీయస్థానం స్థానం పొందినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు, ఏఎంసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జె.చంద్రప్రసాద్, ఆదికవి నన్నయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఎ.సత్యనారాయణ, పీడీలు పాల్గొన్నారు. -
ఉత్కంఠభరితంగా అథ్లెటిక్స్ పోటీలు
వట్లూరు (పెదపాడు) : స్థానిక సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రా యూనివర్సిటీ అథ్లెటిక్ చాంపియన్ షిప్ 2016–17 పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. రెండోరోజు మంగళవారం విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. న200 మీటర్ల రన్నింగ్ విభాగంలో విశాఖపట్నంకు చెందిన పి.సాయి గౌతమ్, 400 మీటర్ల విభాగంలో ఎస్.చంద్రమౌళి (విశాఖపట్నం), 800 మీటర్ల విభాగంలో ఎల్.సాయికుమార్(విశాఖపట్నం), 1500 మీటర్ల విభాగంలో బి.మురళీరాజా (విశాఖపట్నం), 10,000 మీటర్ల విభాగంలో టి.అప్పారావు (విశాఖపట్నం), 110మీ హర్డిల్స్ విభాగంలో పి.సాయిగౌతమ్ (విశాఖపట్నం), షాట్‌పుట్ విభాగంలో ఎం.శివారెడ్డి(విశాఖపట్నం), డిస్కస్ త్రో విభాగంలో బి.వెంకటరావు (విశాఖపట్నం), లాంగ్‌జంప్ విభాగంలో వై.ఓంకార్ (విజయనగరం), ట్రిపుల్ జంప్ విభాగంలో కె.ప్రవీణ్‌కుమార్ (బొబ్బిలి) విజయం సాధించారు. ఇదే విభాగంలో ఏలూరుకు చెందిన బి.పెరునాయుడు తృతీయస్థానంతో సరిపెట్టుకున్నాడు. హాఫ్ మార్తా¯ŒS విభాగంలో జి.చిన్నారావు (విశాఖపట్నం) విజయం సాధించారు. మహిళల పోటీల్లో 200 మీటర్లు విభాగంలో కె.విజయలక్షి్మ(విశాఖపట్నం), 400 మీ విభాగంలో కె.సాగరిక కనకదుర్గ (విశాఖపట్నం), 800 మీటర్ల విభాగంలో సీహెచ్ వాణి(విశాఖపట్నం), 1,500 మీటర్ల విభాగంలో ఎం.మౌనిక విజయనగరం, 100 మీటర్ల హర్డిల్స్‌లో కె.సుశీల(విజయనగరం), షాట్‌పుట్ విభాగంలో సీహెచ్ ఉమ(విజయనగరం), డిస్కస్ త్రో విభాగంలో బి.సంధ్యారాణి( విశాఖపట్నం), లాంగ్ జంప్ విభాగంలో జి.పూజిత(విశాఖపట్నం), ట్రిపుల్ జంప్ విభాగంలో జి.పూజిత(విశాఖపట్నం) విజేతలుగా నిలిచారు. -
ఆటోలో మహిళ వద్ద 13 కాసుల బంగారం చోరీ
తణుకు : ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తులు కాజేసిన ఘటన తణుకులో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరుకు చెందిన దొంగ నాగలక్ష్మి ఇటీవల బంధువుల ఇంటికి పోడూరు మండలం కవిటం వచ్చింది. మంగళవారం తిరుగు ప్రయాణంలో నాగలక్ష్మి కవిటంలో తణుకు వెళ్లే ఆటో ఎక్కింది. బంగారు ఆభరణాలు ధరిస్తే ఎవరైనా దొంగిలిస్తారన్న భయంతో 13 కాసుల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు బ్యాగులో పెట్టుకుంది. తణుకు బస్టాండు వద్ద ఆటో దిగిన ఆమె బ్యాగ్ కత్తిరించి ఉండటంతో అనుమానం వచ్చి తెరిచి చూసింది. బ్యాగులో ఉంచిన బంగారం, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పట్టణ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పవనసుతునికి ప్రణామం
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మ ద్ది ఆంజనేయస్వామి ఆలయం హనుమద్ నామస్మరణతో మార్మోగింది. కార్తీక మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామిని విశేషంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. 40 వేల మందికి అన్నదానం తిరుమలదేవిపేటకు చెందిన వీరబ్రహ్మేంద్రస్వామి బాల భక్త భజన మండలి సభ్యులు ఆంజనేయ భజన, హనుమాన్ చాలీసా పారాయణం చేశా రు. ఆలయానికి ఒక్కరోజు ఆదాయం రూ.5,39,126 లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. చక్రదేవరపల్లి గ్రామస్తులు అందించిన అన్నప్రసాదాన్ని సుమారు 40 వేల మంది స్వీకరించారు. విశాఖజిల్లా అనకాపల్లికి చెందిన బొడ్డు శ్రీమన్నారాయణ, కస్తూరిబాయి దంపతులు భక్తులకు 50 వేల గారెలను పంచిపెట్టారు. ఆర్డీవో ఎస్.లవన్న, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ జెట్టి గురునాథరావు స్వామిని దర్శించుకున్నారు. అటవీశాఖాధికారులు మొక్కలు, కరూ ర్ వైశ్యా బ్యాంకు సిబ్బంది వాటర్ ప్యాకెట్లు అందజేశారు. చైర్మన్ ఇందుకూరి రంగరాజు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
యూనివర్సిటీ క్రికెట్ జట్టు ఎంపిక
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక చింతలపాటి బాపిరాజు స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన వారిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ బాలుర క్రికెట్ జట్టుకు ఎంపిక చేసినట్టు జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ ప్రకటించారు. జట్టుకు ఎంపికైంది వీరే.. ఎన్.వినయ్. బి.సాయి కృష్ణకాంత్, వి.వెంకటేశ్వరారవు(వేగవరం), ఎస్కే సమీర్, ఎస్బీ రోహన్ లక్ష్మణ్(రాజమహేంద్రవరం, ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్,) వీఈఎస్ అఖిల్ వర్మ (డీఎన్ ఆర్, భీమవరం), టి.గోపి( పెనుగొండ), జి.నరేష్(జంగారెడ్డిగూడెం), ఎన్ .విద్యా సాగర్(కొత్తపేట), ఎల్.శ్రీనివాసరావు( గోపన్నపాలెం), ఎఎస్‌ఎస్ ప్రసాద్(అమలాపురం) కె.రోహిత్ కుమార్(కాకినాడ), ఆర్.సత్యనారాయణ( రాజమహేంద్రవరం), వి.జయరాజు(అనపర్తి), టి.నాగసాయి ప్రసాద్( నర్సాపురం), డి.శ్రీను(తుని), స్టాండ్ బైలుగా ఎస్కే జాఫర్(కాకినాడ), ఏడీఎస్స్ సంతోష్(రాజమహేంద్రవరం), ఎ.కిరణ్‌కుమార్( తణుకు), ఎల్.ధనుంజయ(రాజ మహేంద్రవరం)ఎంపిక చేసినట్టు సెలక్షన్ కమిటీ తరపున ఎస్కే సలీమ్ భాషా, బి.బాపిరెడ్డి తెలిపారు. ఈనెల 28న తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించనున్న అంతర యూనిర్సిటీల క్రికెట్ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని చెప్పారు. కార్యక్రమంలో పీడీ లతానియేలు పాల్గొన్నారు. -
హోరాహోరీగా టెన్నిస్ పోటీలు
భీమవరంలో, జాతీయ స్థాయిలో , మంగళవారం భీమవరం : స్థానిక యూత్‌క్లబ్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం హోరాహోరీగా సాగాయి. కాగా మహిళల విభాగం పోటీలు సాయంత్రం వర్షం కారణంగా నిలిచిపోయాయి. అప్పటి వరకూ జరిగిన పోటీల్లోని విజేతల వివరాలను యూత్ క్లబ్ కార్యదర్శి డీఎస్ రాజు తెలిపారు. తెలంగాణాకు చెందిన సామా సాత్విక అదే రాష్ట్రానికి చెందిన దేదీప్య వై.సాయిపై 6–2, 6–0 స్కోరుతో విజయం సాధించగా, తమిళనాడుకు చెందిన బి.నిత్యరాజ్ ఒడిస్సాకు చెందిన షిల్పి ప్రధా న్ దాస్‌పై 6–0, 6–2 తేడాతో, తమిళనాడుకు చెందిన సహజ యమలనపల్లి కర్నాటకకు చెందిన ఎస్.సోహాపై 4–6, 6–4, 6–3 తేడాతో విజయం సాధించగా, కర్నాటకు చెందిన ఎస్బీ అపూర్వ తెలంగాణాకు చెందిన సింధు జంగంపై 6–2, 6–1 తేడాతో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భువన కల్వ ఎ న్.శ్వేతపై 6–1, 6–0 తేడాతో గెలుపొందారు. -
చౌక డిపోలపై విజిలెన్స్‌దాడులు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో రెండు రేషన్ దుకాణాలపై విజిలె న్స్ అధికారులు మంగళవారం దాడులు చేశారు. గ్రామంలోని 21, 22 నంబర్ల రేష న్స్దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు. 21వ నంబర్ దుకాణంలో 1,141 కిలోల బియ్యం, 21 కిలోల పంచదార ఎక్కువగా, 22 నంబర్ దుకాణంలో 11,400 కిలోల బియ్యం, 52 కిలోల పంచదార తక్కువగా ఉన్నాయని విజిలెన్స్ తహసీల్దార్ వి.శైలజ గుర్తించారు. సరుకుల వ్యత్యాసాల కారణంగా షాపులను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. విజిలెన్స్ ఏవో ఎం.శ్రీనివాసకుమార్, ఎస్సైలు రామకృష్ణ, సీతారామ్, జంగారెడ్డిగూడెం సీఎస్‌డీటీ డీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
12న జాతీయ లోక్ అదాలత్
ఏలూరు (సెంట్రల్) : జిల్లాలోని అన్నికోర్టుల వద్ద ఈనెల 12న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారాంజీ ఓ ప్రకటనలో తెలిపారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్, బ్యాంకు రుణాలు, టెలిఫోన్ బకాయిలు, వాహన సంబంధ కేసులు చట్టప్రకారం రాజీ చేసుకోదగిన అన్ని కేసులు పరిష్కరిస్తామని కక్షిదారులు లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు. -
భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తమలపాకులతో పూజలు చేశారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రంలో ఉన్న ఉసిరిచెట్ట కింద దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్త బృందాల భక్తులు ఆలయ ప్రాంగణంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
సొమ్ము కాజేసిన కాంట్రాక్టు ఉద్యోగిపై కేసు
ఏలూరు అర్బన్ : ప్రభుత్వ సొమ్ము కాజేసిన కాంట్రాక్టు ఉద్యోగిపై త్రీటౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. సిరిగిరి వెంకట శివనాగప్రసాద్ జంగారెడ్డిగూడెంలోని ఉద్యానవనశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఎ.దుర్గేష్ బ్యాంకులో శాఖ పేరిట జమ చేయాలని రూ.11,45,251 విలువైన బేరర్ చెక్‌ను వెంకట శివనాగ ప్రసాద్‌కు ఇచ్చారు. ఆ చెక్‌ను మార్చుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగి దాదాపు రూ.రెండు లక్షలు కాజేసి మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేశాడు. దీనిని గుర్తించిన ఏడీ దుర్గేష్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంకట శివనాగ ప్రసాద్‌పై మంగళవారం మోసం కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
దొరసానిపాడు (ద్వారకాతిరుమల) : ఆర్టీసీ బస్సును మోటార్‌సైకిల్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడు శివారులో మంగళవారం మధాహ్నం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెంకు చెందిన ఉయ్యూరి దుర్గా మంగేష్ (20), రొయ్యల ప్రసాద్ స్థానిక మురళీకృష్ణ మెడికల్ ఏజెన్సీలో రిప్రజంటేటీవ్‌లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ద్వారకాతిరుమల పరిసర ప్రాంతాల్లోని మెడికల్ షాపులకు మందులను సరఫరా చేసేందుకు వీరిద్దరూ బైక్‌పై ఈస్టు యడవల్లి మీదుగా ద్వారకాతిరుమలకు వస్తున్నారు. ఈ సమయంలో ద్వారకాతిరుమల నుంచి ఈస్టు యడవల్లి మీదుగా జంగారెడ్డిగూడెం వెళ్తున్న తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగేష్, ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరినీ స్థానికులు హుటాహుటిన 108లో ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగేష్ మృతిచెందాడు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రసాద్‌ను 108 సిబ్బంది జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్వారకాతిరుమల ఎస్సై టి.నాగవెంకటరాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంజనీ పుత్రా.. పవనసుత నామ
జంగారెడ్డిగూడెం రూరల్: కార్తీక మంగళవారం కావడంతో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు తమలపాకులతో ప్రత్యేక పూజలు, భక్తులు అందజేసిన 108 బంగారు తమలపాకులతో స్వామిని అర్చించారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరిచెట్ల కింద మహిళలు దీపారాధన చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. మంత్రి సుజాత పూజలు మద్దిక్షేత్రాన్ని మహిళా శిశు సంక్షేమ, గనులశాఖ మంత్రి పీతల సుజాత సందర్శించారు.చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు ఆమెకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలో దీపారాధన చేసి మంత్రి కార్తీక మాసోత్సవాలు ప్రారంభించారు. చిన్నారులకు పాలు పంపిణీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని, అన్నసమారాధనను ప్రారంభించారు. ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ సభ్యుడు శీలం రామచంద్రరావు, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ నాయకులు ఆమె వెంట ఉన్నారు. ఆదాయం రూ.3.34 లక్షలు ఆలయానికి మంగళవారం ఒక్కరోజు రూ.3,34,666 ఆదాయం లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పూజా టికెట్ల రూపంలో రూ.60,040, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,37,550, స్వామి ఫొటోల విక్రయం ద్వారా రూ.26,200, అన్నదాన విరాళాల రూపంలో రూ.1,10,876 ఆదాయం లభించిందన్నారు. -
ఎక్సైజ్ దాడులు
ఏలూరు అర్బన్ : జిల్లాలో సారా తయారీ, అమ్మకాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ వై.బి.భాస్కర రావు స్పష్టం చేశారు. మంగళవారం పోలవరం, కొవ్వూరు, చింతలపూడి, జ ంగారెడ్డిగూడెం, నరసాపురం ఎకై్సజ్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సారా విక్రేతలపై రెండు కేసులు నమోదు చేసి 10లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీసీ మాట్లాడుతూ జిల్లాలో సారా అమ్మకాలను పూర్తిగా నిరోధించేందుకు నిత్యం దాడులు చేస్తున్నామని చెప్పారు. సారా అమ్మకాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల సీజ్
బుట్టాయగూడెం : మండలంలోని కొవ్వాడ కాలువ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. తహసీల్దార్ ఎ.జి.చిన్నికృష్ణ కథనం ప్రకారం.. కొయ్యలగూడెం మండలానికి చెందిన మూడు ట్రాక్టర్లు బుట్టాయగూడెం మండలం కొవ్వాడ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో వీఆర్ఏ పోతురాజు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మూడు ట్రాక్టర్లను పట్టుకుని వాటిని సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితులు పరారయ్యారు. ట్రాక్టర్ల యజమానులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు. మండలంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
ద్వారకాతిరుమల : శేషాచలకొండ ఘాట్రోడ్డుపైనుంచి దిగుతున్న ఒక కారు బ్రేకులు విఫలమవడంతో ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న భార్యాభర్తలు సీటుబెల్టు పెట్టుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడకు చెందిన దైత మురళీకష్ణ తన భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమలకు మంగళవారం సాయంత్రం కారులో వచ్చారు. తిరిగి వస్తుండగా, ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. విద్యుత్ స్తంభం విరిగింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచింది. -
వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన లారీ
కొవ్వూరు : రాజమహేంద్రవరంలోని రోడ్డు కం రైలు వంతెనపై అప్రోచ్‌రోడ్డు వద్ద అదుపుతప్పిన ఓ లారీ బ్రిడ్జి గోడను ఢీకొని కింద ఉన్న రైల్వేట్రాక్‌పై పడింది. దీంతో రాజమండ్రి వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లారీ నేరుగా రైల్వే విద్యుత్ తీగలపై పడడంతో అవి తెగిపోయాయి. ఫలితంగా రైల్వే లైన్లకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాయగడ్–విజయవాడ పాసింజర్ కొవ్వూరు రైల్వేస్టేçÙన్ సమీపంలో సిగ్నల్ క్రాసింగ్ వద్ద సుమారు నాలుగున్నరగంటలకుపైగా ఆగిపోయింది. తెల్లవారుజామున 5.40 గంటల నుంచి ఉదయం 9.20గంటల వరకు ఇది నిలిచిపోవడంతో పలురైళ్లు ఆలస్యంగా నడిచాయి. వేరొక డీజిల్ ఇంజిన్‌ను తీసుకువచ్చి ఆగి ఉన్న రైలును పక్కకు తీశారు. రోడ్డు కం రైలు వంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోవడంతో మూడోవంతెన(ఆర్చ్వంతెన) మీదుగా గోదావరి స్టేషన్ నుంచి రైళ్లను మళ్లించారు. భీమవరం–రాజమం్రyì పాసింజర్ రైలు సిగ్నల్ లేకపోవడంతో కొవ్వూరు స్టేషన్లో సుమారు రెండుగంటలకుపైగా నిలిచింది. వాస్తవంగా ఈరైలు ఉదయం పది గంటల నుంచి 11గంటల మధ్యలో రాజమహేంద్రవరం చేరుకోవాల్సి ఉండగా, 12.30 గంటల వరకు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు గూడ్సు రైళ్లు కూడా ఆగాయి. రైల్వేశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు విద్యుత్‌లైన్‌కు మరమ్మతులు చేశారు. మధ్యాహ్నం 12.35 గంటలకు నుంచి రైళ్లు యాథావిధిగా నడిచాయి. ముందుగా గూడ్సు రైళ్లను పంపి, అనంతరం ఇతర రైళ్లకు అనుమతిచ్చారు. -
కేసీ కాలువలో మహిళ మృతదేహం
ప్రొద్దుటూరు క్రైం: కేసీ కాలువలో మంగళవారం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని రూరల్ పోలీసులు గుర్తించారు. బొజ్జవారిపల్లె సమీపంలోని పైలాన్ వద్ద మహిళ మృతదేహం ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ జిఎండి.బాషా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెకు 40 ఏళ్లు దాకా ఉంటాయని తెలిపారు. ఈమెకు సంబంధించిన బంధువులు రూరల్ పోలీసులకు సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. -
విరమణ మంగళవారమా!
ఈనెల 25 నుంచి వచ్చేనెల 22 వరకూ సత్యదీక్షలు చివరిరోజు మంగళవారం కావడంపై భక్తుల సందిగ్ధం మరోసారి పండితులతో చర్చిస్తానంటున్న ఈఓ అన్నవరం : రత్నగిరి వాసుడు సత్యదేవుని పేరిట చేపట్టే ‘సత్యదీక్ష’ విరమణ రోజును నవంబర్‌ర్ 22 మంగళవారంగా దేవస్థానం నిర్ణయించడంపై భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం సెంటిమెంట్‌తో దీక్ష విరమించడానికి చాలా మంది అయిష్టత చూపుతున్నారు. అన్నవరం దేవస్థానం అధికారికంగా నిర్వహించే సత్యదీక్షలు స్వామివారి జన్మనక్షత్రం ‘మఖ’ సందర్బంగా ఈనెల 25 నుంచి ప్రారంభమవుతున్నాయి. 27 రోజుల అనంతరం వచ్చే ‘మఖ’ నక్షత్రం నాడు ఈ దీక్ష విరమించడం ఆనవాయితీగా వస్తోంది. అన్నవరం దేవస్థానం పంచాంగం ప్రకారం నవంబర్ నెలలో వచ్చే ‘మఖ’ నక్షత్రం 21 సోమవారం ఉదయం 7.14 గంటల నుంచి 22 మంగళవారం ఉదయం 9.57 గంటల వరకూ ఉంది. అయితే దేవస్థానంలో స్వామివారి ఆలయం తెరిచే సమయానికి ఏ నక్షత్రం, తిథి ఉంటాయో ఆ రోజంతా వాటినే పరిగణనలోకి తీసుకునే ఆచారం ఉంది. దాని ప్రకారం మంగళవారమే స్వామివారి జన్మనక్షత్ర పూజలు నిర్వహిస్తున్నారు. దాంతో బాటు దీక్ష విరమణ కూడా అదే రోజు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రచారం ప్రారంభించింది. అంతే కాదు పెద్ద పెద్ద ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో సత్యదీక్షలు చేపట్టాలనుకునే భక్తులు చాలామంది సందిగ్ధంలో పడ్డారు. నవంబర్ 21 సోమవారం ఉదయం 7.14 గంటల నుంచి మఖ నక్షత్రం వస్తున్నందున అదే రోజు దీక్ష విరమణ తేదీగా నిర్ణయిస్తే భక్తుల మనోభావాలను గౌరవించినట్టు కూడా అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఆరోజు సప్తమి తిథి కూడా మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇది సాధ్యం కాదంటే మరుసటి రోజు బుధవారం దీక్ష విరమించేందుకు అవకాశం ఉంటే ఆ విషయాన్ని అయినా దేవస్థానం పండితులు ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు. కాగా సత్యదీక్ష ల విరమణ నవంబర్ 22న అని దేవస్థానం పండితులు నిర్ణయించారని ఈఓ నాగేశ్వరరావు చెప్పారు. అదే రోజున సత్యదేవునికి జన్మనక్షత్రానికి సంబంధించిన పంచామృతాభిషేకం చేస్తారు కాబట్టి ఆరోజునే దీక్ష విరమించాలన్నది పండితుల నిర్ణయమన్నారు. ఆరోజు మంగళవారం కాబట్టి దీక్ష విరమించకూడదన్న సెంటిమెంట్ ఉంటే దీనిపై మరోసారి పండితులతో చర్చిస్తామన్నారు. భక్తుల అభిప్రాయం ఇలా... సాధారణంగా ఏ దేవుని దీక్ష అయినా ఇతర వారాలతో పాటు మంగళవారం, శుక్రవారం కూడా చేపట్టే అవకాశం ఉన్నా దీక్ష విరమణ మాత్రం ఆ రెండు రోజుల్లో చేయడానికి ఇష్టపడరు. మెడలో మాల ధరించి నియమనిష్టలతో దీక్ష చేస్తారు. మంగళవారం లేదా శుక్రవారం దీక్ష విరమించి ఆ మాల మెడ నుంచి తీయాలంటే సెంటిమెంట్ అడ్డొస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ రోజుల్లో దీక్ష విరమించి మాలను విసర్జించినా తరువాత ఏమన్నా జరిగితే మంగళవారం దీక్ష విరమించడం వలనే ఇలా జరిగిందన్న అభిప్రాయం వెంటాడుతుందంటున్నారు. దానికి తోడు మంగళవారం అష్టమి తిథి కూడా ఉంది. అందువలన చాలామంది విరమణ తేదీపై పునరాలోచించాలని కోరుతున్నారు. -
గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మతి
తిరుపతి క్రైం: శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తు నిమ్తితం తిరుపతికి వచ్చిన కడప ఏఆర్ ఎస్ఐ నాగరాజనాయక్(53) మంగళవారం గుండెపోటుతో మతి చెందాడు. ఈస్ట్ సీఐ రాంకిషోర్ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లెకు చెందిన నాగరాజనాయక్ ఈ నెల 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బందోబస్తు నిమిత్తం తిరుపతికి వచ్చి శ్రీనివాసంలో బస చేస్తున్నారు. ఈయనకు గతంలో రెండు సార్లు గుండెపోటు వచ్చింది. మంగళవారం శ్రీనివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో కిందపడ్డారు. తలకు గాయమైంది. ఆస్పత్రికి తరలించకముందే మతి చెందాడు. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి, మతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. -
సెటాప్ బాక్సులు తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో లోకల్ కేబుల్ ద్వారా ప్రసారాలు వీక్షించే వినియోగదారులంతా డిసెంబరు 31లోగా సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని, సెటాప్ బాక్స్‌లు లేని వారు జనవరి 1 నుంచి టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశం ఏ మాత్రం ఉండబోదని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్లో జిల్లాలోని ఎంఎస్‌వోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు నాణ్యమైన టీవీ ప్రసారాలు అందించే ఉద్దేశంతో టీవీ ప్రసారాలను డిజిటలైజేషన్ చేయడం జరుగుతోందని ప్రజలు సహకరించి ప్రతి ఒక్కరూ సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. 95 శాతం వినియోగదారులు సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకున్నారని డిసెంబర్ 31 నాటికి నూరు శాతం వినియోగదారులు సెటాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకుని టీవీ ప్రసారాలు అంతరాయం లేకుండా వీక్షించాలని కోరారు. సమాచార శాఖ సహాయ సంచాలకులు వి.భాస్కర నరసింహం మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలు లోకల్ కేబుల్ ద్వారా ప్రసారాలు చేయాలని తెలిపారు. సమావేశంలో డెప్యూటీ రేడియో ఇంజనీర్ అప్పారావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ, ఎంఎస్ఓలు రామకృష్ణ, రామచంద్రరావు, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు. -
తేనెటీగల పెంపకం యూనిట్లకు రాయితీలు
జంగారెడ్డిగూడెం : తేనెటీగల పెంపకం కోసం రాయితీ కల్పిస్తున్నట్టు ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అడపా దుర్గేష్ తెలిపారు. మంగళవారం తేనెటీగల పెంపకంపై శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొని మాట్లాడారు. తేనెటీగల పెంపకం కోసం ఒక్కో యూనిట్‌కు 8 బాక్సులు అందజేస్తామని, దీనికి యూనిట్‌కు రూ. 20 వేలు రాయితీ ఇస్తున్నామన్నారు. ఒక్కో బాక్సు నుంచి 40 కేజీల తేనె ఉత్పత్తి అవుతుందని 40 నుంచి 60 రోజుల్లో దిగుబడి వస్తుందన్నారు. తాము అందజేసిన తేనెటీగల పెంపకం బాక్సులు ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలు పూతదశలో ఉండగా ఆ బాక్సులను అక్కడ పెడితే త్వరితగతిన తేనె దిగుబడి వస్తుందన్నారు. పంటలు కూడా ఫలదీకరణ చెంది పంట దిగుబడి పెరుగుతుందన్నారు. తేనెటీగల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చన్నారు. పే ద కుటుంబాలను ఎంపిక చేసి తేనెటీగల పెంపకానికి రాయితీలు ఇస్తున్నట్టు తెలిపారు. విజయరాయి శాస్త్రవేత్త డాక్టర్ రావు, ఉద్యాన శాఖ అధికారి ఆర్.బిందు ప్రవీణ, గిరిజన వికాస సంస్థ ప్రతినిధి మూర్తి పాల్గొన్నారు. -
వరద గోదావరి
కొవ్వూరు : గోదావరి వరద తీవ్రత 3 రోజులుగా నిలకడగా కొనసాగుతోంది. ఎగువ భద్రాచలంలో నీటిమట్టం మంగళవారం మధ్యాహ్నం నుంచి క్రమేణా పెరుగుతోంది. ఉదయం ఆరు గంటలకు 31.30 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం ఆరుగంటలకు 36.90 అడుగులకు పెరిగింది. దీంతో దిగువనున్న పోలవరం, కొవ్వూరు, ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద తీవ్రత బుధవారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 8 అడుగులుగా నమోదైంది. ఆనకట్ట వద్దకి 3,83,210 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 10,400 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. ఆనకట్టకు నాలుగు ఆర్మ్్సలో ఉన్న 175 గేట్లును మీటరు ఎత్తులేపి 3,72,810 క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నుంచి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతంలో నీటిమట్టాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం నుంచి ఇన్‌ఫ్లో మరింత పెరిగే సూచనలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
అన్నపూర్ణేశ్వరి.. ఆదుకోవమ్మా..
అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలో మంగళవారం చేతిలో రసాన్నపాత్రతో కాశీ అన్నపూర్ణేశ్వరి భక్తులకు దర్శనం ఇచ్చింది. దేవీ నవరాత్రుల్లో భాగంగా పలు చోట్ల అమ్మవార్లను అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, ధనలక్షి్మగా వివిధ అలంకారాలు చేశారు. రూపం ఏదైనా అన్నింటికీ ఆధారం ఆ జగన్మాత. లోకాలను చల్లంగా చూసే ఆ లోకమాతను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. -
మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,01,116 విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని జంగారెడ్డిగూడెంకు చెందిన వందనపు స్వరాజ్య లక్ష్మి జ్ఞాపకార్థం భర్త వందనపు వెంకటేశ్వరరావు ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులకు అందజేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పాల్గొన్నారు. -
చిన్న శేషుడిపై శ్రీనివాసుడు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మంగళవారం ఉదయం మలయప్పస్వామివారు బద్రీనారాయణుడి రూపంలో భక్తులను సాక్షాత్కరించారు. బంగారు వాకిలిలో కొలువు, పంచాంగ శ్రవణం అనంతరం మలయప్పకు రంగనాయక మండపంలో విశేష సమర్పణ చేశారు. మంగళవాయిద్యాలతో ఆలయం వెలుపల వాహన మండపంలో స్వామివారు వేంచేపు చేశారు. పట్టుపీతాంబరం, మరకత మాణిక్యాదుల విశేష ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలతో స్వామివారిని అలంకరించారు. ఐదు శిరస్సుల శేషుడి నీడలో బద్రీనారాయుyì రూపాన్ని దాల్చారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు సాగింది. వాహన సేవలో ముందు గజరాజులు, అశ్వాలు, నందులు నడవగా, భజన, కళా బందాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవలో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీటీడీ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
50 దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు
ద్వారకా తిరుమల : రాష్ట్రంలో 50 దేవాలయాల్లో ఆన్లైన్ ద్వారా భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ తెలిపారు. ద్వారకా తిరుమల మాధవకల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీ నిమిత్తం విచ్చేసిన ఆమె వారికి నైపుణ్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ విజయవాడలోని గొల్లపూడిలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులకు మౌలిక వసతులు కల్పించి, పచ్చని పరిశుభ్ర వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. యువతను భక్తివైపు నడిపించేలా ఆలయాలను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
పోరుమామిళ్ల: మండలంలోని గానుగపెంటకు చెందిన గోగు వెంకటమ్మ (65)ను మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గోగు రామ్మూర్తి భార్య వెంకటమ్మ రాత్రి బహిర్భూమికి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు వాహనం ఢీ కొనడంతో రోడ్డుపై పడిపోయింది. తల రాయికి తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 30 ఏళ్లుగా ఆమె గానుగపెంటలో కూతురు దగ్గర ఉంటూ టిఫన్ సెంటర్ నడుపుకుని జీవిస్తున్నట్లు తెలిసింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. -
హిందూ ధర్మాన్ని కాపాడాలి : మంత్రి
ద్వారకా తిరుమల : ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూసిన నాడే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ద్వారకా తిరుమల మాధవ కల్యాణ æమండపంలో నిర్వహిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్ శిక్షణ తరగతుల్లో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం వంటి పలు అంశాలపై శిక్షణనిచ్చారు. వాసుదేవానంద స్వామిజీ, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, సమరసత సేవా ఫౌండేషన్ జనరల్ కార్యదర్శి పి.త్రినాథ్ పాల్గొన్నారు. -
అంతర్జిల్లా దొంగల అరెస్ట్
చింతలపూడి : ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న పది మంది అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు మంగళవారం తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ చింతలపూడి, లింగపాలెం మండలాలతోపాటు , ఖమ్మం జిల్లాలో పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన చింతలపూడికి చెందిన వెంకయ్యల ప్రభాకర్, పూడి రాంబాబు, కోట లక్ష్మణరావు, కొమ్ము నాగరాజు, నాగేంద్రబాబు, పి.వంశీకృష్ణ, పగడం ఏసుబాబు, కె.రంజిత్ కుమార్, ఇ.సంగయ్యలతోపాటు ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న నందిపాం సుబ్బారావును మంగళవారం అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2.40 లక్షల విలువైన సొత్తు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐ జి దాసు, ఎస్ఐ సైదా నాయక్, సిబ్బంది ఉన్నారు. -
వేడుకగా కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం
– మహద్వారం నుంచి గర్భాలయం వరకు శుద్ధి – సుగంధ పరిమళంతో గుభాళిస్తున్న వెంకన్న ఆలయం సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా సాగింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయంలో భక్తిశ్రద్ధలతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. అక్టోబరు 3 నుంచి∙11వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ సేవ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహద్వారం మొదలు, ప్రాకారాలు, గోడలు, పైకప్పు, పూజలకు వినియోగించే రాగి, వెండి, బంగారం.. వస్తువులను వైదికంగా శుద్ధి చేశారు. గర్భాలయంలోని మూలమూర్తిపై దుమ్ము, దూళి పడకుండా మలైగుడారం అనే ప్రత్యేక శ్వేతవర్ణంలోని పట్టు వస్రం కప్పారు. శుద్ధి పూర్తి చేసిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర మిశ్రమ తిరుమంజనాన్ని ఆలయం అంతటా లేపనంగా పూశారు. ఈ సందర్భంగా చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు శ్రీవారికి కొత్త పరదాలు సమర్పించారు. చివరగా అర్చకులు గర్భాలయ మూలమూర్తిపై కప్పిన వస్త్రాన్ని తొలగించి ఆగమయోక్తంగా పూజలు, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఉదయం 11 గంటల నుంచి∙భక్తులను శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాదన ప్రత్యేక వారపు సేవను రద్దు చేశారు. కార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, జి.భానుప్రకాష్‌రెడ్డి, డీపీ అనంత్ పాల్గొన్నారు. -
నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
– ఉదయం 6 నుండి 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని నేటి మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ వైదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేస్తారు. ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు వైదికంగా భక్తిశ్రద్ధలతో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు. -
కుండపోత
తాడేపల్లిగూడెం/రూరల్ : ఒక్కో చినుకు బాకులా భూమిని ఢీకొట్టింది. దీనికి తోడు పిడుగుల శబ్దం హోరెత్తింది. చినుకు నేలను తాకినప్పుడల్లా శబ్దం పుడుతుందా అన్నట్టుగా పిడుగుల శబ్దానికి భూమి దద్దరిల్లింది. మెరుపులు, ఉరుములతో కూడిన వాన గంటసేపు జిల్లాలోని పలు ప్రాంతాలపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. మంగళ వారం మధ్యాహ్నం సుమారు 3.40 గంటలకు ప్రారంభమైన వాన 6 గంటల వరకూ ఏకధాటిగా బాదింది. ఎక్కడి జనం అక్కడ స్తంభించిపోయారు. వరుణుడి దండయాత్ర ఆగిపోయాక ఏది రోడ్డో.. ఏది కాలువో తెలుసుకోలేని అయోమయ స్థితి. జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో అత్యధికంగా వానపడింది. గూడెంలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. -
బొజ్జగణపయ్యా.. బహురూపాయ..
భీమవరం టౌన్ : భీమవరం గునుపూడిలో వేంచేసియున్న విద్యా గణపతిని మంగళవారం గజపుష్పమాలలతో అలంకరించారు. కంఠంశెట్టి దుర్గాప్రసాద్, నూతత గోపాలకృష్ణమూర్తి సహకారంతో ఈ అలంకరణ చేసినట్టు అర్చకుడు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. అలాగే స్థానిక సుంకరపద్దయ్య వీధిలో వేంచేసియున్న వినాయక స్వామివారిని మంగళవారం వివిధ రకాల కాయగూరలతో శాకాంబరీ అలంకారం చేశారు. అర్చకులు బ్రహ్మజ్యోషు్యల మణికంఠశర్మ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద వినాయకుడు అయి భీమవరం (ఆకివీడు) : శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల ఆవరణలో వేద వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రోజూ వేద విద్యార్థులు వినాయకుడి వద్ద నాలుగు వేదాలను వల్లిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ లింగాల సత్యనారాయణమూర్తి తెలిపారు. -
హాకీ జిల్లా జట్లు ఎంపిక
భీమవరం టౌన్ : వచ్చేనెల 7 నుంచి 10వ తేదీ వరకూ నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి గ్రౌండ్స్‌లో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా సబ్ జూనియర్ బాలుర టీమ్‌ను భీమవరం సెయింట్ మేరీస్ హైస్కూల్ గ్రౌండ్లో ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 110 మంది క్రీడాకారులు సెలక్షన్స్‌కు హాజరయ్యారు. అలాగే అనంతపురం జిల్లా ఆర్డీటీ గ్రౌండ్లో ఈ నెల 29 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ జరిగే సబ్ జూనియర్ బాలికల, జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే పశ్చిమ టీమ్‌లను ఎంపిక చేశారు. 80 మంది క్రీడాకారిణులు సెలక్షన్స్‌కు హాజరయ్యారు. సెయింట్ మేరీస్ హెచ్ఎం సిస్టర్ వలసమ్మ జార్జి ఆధ్వర్యంలో జిల్లా టీమ్‌ను జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరేటి ప్రకాష్ ఎంపిక చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు అల్లు అప్పారావు, పి.దుర్గారావు, డీజెఆర్ఎల్ శేఖర్‌బాబు, కె.జేమ్స్, నాయుడు పాల్గొన్నారు. సబ్ జూనియర్బాలుర టీమ్ జి.యశ్వంత్ గణేష్, బి.దుర్గ ప్రసాద్, వి.భరత్‌కుమార్, పి.పవన్ కళ్యాణ్, పి.జేజే సాయి శ్రీకర్, కె.సందీప్, కె.జయరాం విష్ణు, ఎన్.కమల్ యువన్(భీమవరం సెయింట్ మేరీస్), బి.సాయి సత్యం నాయుడు (భీమవరం), డి.రాజేష్ (శృంగవృక్షం జెడ్పీ), జె.సూరిబాబు(కృష్ణయ్యపాలెం జెడ్పీ), డి.విజయ్‌కుమార్ (కాకరపర్రు జెడ్పీ), సీహెచ్ నారాయణ శేషు, జి.శ్యామ్స్టీవ్, కె.జోయల్, ఎండీ అసానుద్దీన్ (సెయింట్ మేరీస్ భీమవరం), పి.సారా మణికంఠ(కాకరపర్రు జెడ్పీ), కె.సందీప్ రాజా(భీమవరం), ఫస్ట్ స్టాండ్‌బై ్రMీ డాకారులుగా ఎన్.ఎడ్వర్డ్, సాయి శ్రీరాం(సెయింట్ మేరీస్ భీమవరం) ఎంపికయ్యారు. సబ్ జూనియర్ బాలికల టీమ్ కె.జయాచౌదరి, కె.సంజన, ఎ.రిషిక లక్ష్మి, పి.చార్మిత, టి.భాను సాయిశ్రీ (సెయింట్ మేరీస్ భీమవరం), ఎన్.నళినాక్షి, బి.అర్జు (బీవీబీ టీపీగూడెం), టి.దుర్గా భవాని(శృంగవృక్షం జెడ్పీ), పి.అశ్రిత (సెయింట్ మేరీస్ భీమవరం), పి.మౌనిక (కాకరపర్రు జెడ్పీ), పి.అంబిక (కృష్ణయ్యపాలెం జెడ్పీ), ఫస్ట్స్టాండ్బైగా కె.వర్ష(సెయింట్ మేరీస్ భీమవరం), పి.దుర్గా భవాని(శృంగవృక్షం జెడ్పీ), పి.చాతుర్య(సెయింట్ మేరీస్ భీమవరం) ఎంపికయ్యారు. జూనియర్ బాలికల టీమ్ ఎ.ధరణి, ఎ.రిషిత, కె.రమ్య నాగలక్ష్మి (నారాయణకాలేజి భీమవరం), కె.శృతి (భీమవరం), కె.భరణి (పెనుగొండ), పి.మౌనిక, కె.శారద (టీపీ గూడెం), ఎ.మాధురి (కృష్ణయ్యపాలెం). -
‘స్కూల్ గేమ్స్ ’ జట్ల ఎంపిక
దేవరపల్లి: అంతర్ జూనియర్ కళాశాలల ఆటల పోటీలు, అండర్–19 స్కూల్ గేమ్స్‌కు మహిళా క్రికెట్, ఫుట్‌బాల్, సపక్‌తక్రా జిల్లా జట్లను మంగళవారం ఎంపిక చేశారు. స్థానిక ఆనంద్ ఎడ్యుకేషనల్ సొసైటీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన జట్ల వివరాలను జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి అద్దంకి ఐజక్ ప్రకటించారు. పోటీలను కళాశాల పీడీ కేవీడీవీ ప్రసాద్, కళాశాల చైర్మన్ డి.సువర్ణరాజు, జిల్లా పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు బీహెచ్ఎస్ఎన్ తిలక్, కార్యదర్శి ఎం.రామారావు పర్యవేక్షించారు. ∙సపక్‌తక్రా బాలుర జట్టు : కె.నాగశివ, జి.చందు, పి.రాజ, ఎంవీవీఎన్. సాయి, కె.హరీష్ ∙మహిళా క్రికెట్ జట్టు : ఆర్.దుర్గాదేవి, ఎస్.హంపీరీచల్, జి.శిరీష, పి.అపర్ణ, జి.సత్యవేణి, టి.ఉమాదేవి, ఎం.లావణ్య, పి.సువర్ణ, ఎం.నీరజ, డి.మాధవి, పి.పద్మజ. ∙ఫుట్‌బాల్ బాలుర జట్టు : జి.సతీష్, పి.పెద్దిరాజు, ఎన్.శేఖర్, కె.శ్రీనివాస్, టి. తరుణ్, పి.వంశీకష్ణ, కె.వెంకటేష్, కె.పవన్‌కుమార్, ఎ.ఉదయ్‌కుమార్, ఎస్.చందు, పి.చంటిబాబు, ఎ.సతీష్‌బాబు, ఎస్.లక్ష్మీనారాయణ, ఇ.శరత్‌రాజు, కె.రాజు, ఎం.నరసింహ ∙ఫుట్‌బాల్ బాలికల జట్టు : పి.పద్మజ, కె.మాధవీలత, ఎం.నీరజ, సీహెచ్ సుభద్ర, పి.ఆర్తి, ఇ.వెంకటలక్ష్మి, పి.చంద్రకళ, జి.నిర్మల, టి.నాగజ్యోతి, ఎం.రేవతి, డీఎన్వీ లక్ష్మి, ఎం.నవ్య, ఎం.స్రవంతి, డి.మాధవి, ఎం.రమ్య, ఎస్.భవాని, పి.పార్వతి, పి.అపర్ణ -
15 నుంచి గో పాల, అందాల పోటీలు
ద్వారకాతిరుమల : గోపాల, అందాల పోటీల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ (ఏపీఎల్డీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీడీ కొండలరావు చెప్పారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల మార్కెట్ యార్డులో ఈనెల 15 నుంచి 17 వరకు జాతి ఆవులకు పాల, అందాల పోటీలను నిర్వహించనున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఒంగోలు, ముర్రా, గిర్, పుంగనూరు జాతి ఆవులకు పాల పోటీలు నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తతీయ బహుమతిగా రూ.20 వేలు అందజేస్తామన్నారు. గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతి ఉంటుందన్నారు. జాతి లక్షణాలు ఆధారంగా ఆవులను, గిత్తలను ఎంపిక చేసి అందాల పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంత వాసులైనా పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పి.గాంధీ, డివిజినల్ సహాయ సంచాలకుడు డాక్టర్ సత్యగోవింద్, జేడీ జ్ఞానేశ్వరరావు, ద్వారకాతిరుమల, పెంటపాడు, నిడదవోలు, భీమవరం మండలాల పశువైద్యులు కిరణ్, మురళీకష్ణ, నాయక్, కుమార్‌రాజా ఉన్నారు. -
కరువు రహిత జిల్లా ధ్యేయం
– కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ – కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్, టోల్‌ఫ్రీ నెంబర్ 08572–240500 ఏర్పాటు చిత్తూరు కలెక్టరేట్ జిల్లాను కరువు రహితంగా మార్చడమే ధ్యేయంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల దష్ట్యా ఎండిపోయిన వేరుశనగ పంటను రెయిన్‌గన్స్ ద్వారా తడులు అందించి కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 1.26లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుందన్నారు. ఈనెల 19వతేది నుంచి ఇప్పటివరకు 18వేల హెక్టార్లలో రెయిన్ గన్స్ ద్వారా వేరుశనగ పంటకు తడులిచ్చామన్నారు. అవసరమైతే రెండవ తడులు కూడా ఇస్తామన్నారు. రాబోయే మూడు రోజుల్లో జిల్లావ్యాప్తంగా వేరుశనగ పంటకు తడులు పూర్తిగా అందిస్తామన్నారు. వేరుశనగను తడిపేందుకు జిల్లాకు 1,426 రెయిన్ గన్స్, 1,426 స్ప్రింకర్లు, 300 ఆయిల్ ఇంజన్లు, 27,600 హెచ్డీఎఫ్సి పైపులు వినియోగిస్తామని, ఇంకా అవసరమైతే పరికరాలు తెప్పిస్తామన్నారు. నీటి వసతి లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. జిల్లా కేంద్రం నుంచి కమాండింగ్ కంట్రోల్ రూమ్‌ను, టోల్‌ఫ్రీ నంబర్ 08572 – 240500 ను ఏర్పాటు చేశామన్నారు. రైతులు తమ పొలాలకు సంబంధించి సమస్యలు ఏవైనా ఉంటే ఈ నంబర్‌కు ఫోన్ చేసి అడిగిన వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకుంటారన్నారు. -
వాన.. వరదలా
ఏలూరులో 80 మిల్లీమీటర్లు, తాడేపల్లిగూడెంలో 70.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉంగుటూరు, భీమవరం, ఉండి ప్రాంతాల్లో వరుణుడు ప్రతాపం చూపాడు. పోలవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, గోపాలపురం తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పాలకొల్లు, దెందులూరు, తణుకు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. -
సీమ రైతాంగాన్ని ఆదుకుంటాం
–మంత్రి నారాయణ పీలేరు: వేరుశనగ పంట నష్టపోతున్న రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా పీలేరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడక పోవడంతో చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేరుశన పంట దెబ్బతింటోందన్నారు. నలుగురు మంత్రులు, 14 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. 24 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరాతోపాటు మూడు షిప్టులలో రెయిన్‌గన్స్, స్రింక్లర్ల ద్వారా వేరుశనగ పటంటకు నీటిని అందిస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాకు మొదటి విడతలో 4 వేల రెయిన్ గన్స్, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజన్లు పంఫిణీ చేశామన్నారు. అదనంగా 1850 రెయిన్‌గన్స్ వచ్చాయని తెలిపారు. బుధవారం ఉదయం లోపు జిల్లాకు మరో 1500 రెయిన్ గన్స్ వస్తాయని చెప్పారు. ఒక్క ఎకరాకూడా వేరుశనగ పొలం ఎండినవ్వమని, అవసరం మేరకు అదనంగా రెయిన్ గన్స్ అందిస్తామని తెలిపారు. నిరంతరాయం విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు. సోమవారం అనంతపురం జిల్లాలో వర్షం పడిదని, అవసరమైతే ఇంకా చిత్తూరు జిల్లాకు అనంతపురం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రెయిన్ గన్స్ తెప్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. -
భూముల సర్వేను అడ్డుకున్న రైతులు
చింతలపూడి : నష్టపరిహారం విషయం తేల్చాకే చింతలపూడి ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభించాలని ప్రగడవరం, వెలగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. చింతలపూడి మండలం ప్రగడవరంలో రెవెన్యూ సిబ్బంది మంగళవారం చేపట్టిన ఎత్తిపోతల పథకం కాలువ పనులను రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇంతవరకు రైతులకు ఇచ్చే నష్టపరిహారం విషయం తేల్చలేదని, పట్టిసీమ తర హా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు చిలుకూరి సత్యనారాయణరెడ్డి, కె.శంకర్‌రెడ్డి, గంగవల్లి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నష్ట పరిహారం తేలకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జరగనివ్వమని చెప్పారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా అధికారులు భూసేకరణకు సర్వే చేయడానికి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ జరపాలనుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న తీరుకు నిరసనగా ధర్నా చేశారు. సర్వే సిబ్బందిని అడ్డుకోవడంతో చింతలపూడి తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్, ఎసై ్స సైదానాయక్ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రైతులను సమావేశపరిచి చర్చలు జరిపారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, సర్వే పనులను జరగనివ్వాలని రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తొలుత తమ భూములకు ఎకరానికి ఎంత నష్టపరిహారం అందిస్తారో వెల్లడించాలని ఆ తరువాతే సర్వే జరగనిస్తామని రైతులు తహసీల్దార్‌కు తెలియచేశారు. ఏటా రెండు, మూడు పంటలు పండే భూములను వదులుకోవాల్సి వస్తుందని వాపోయారు.lజిల్లాలో ఒకచోట ఒకలా రైతులకు నష్టపరిహారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణకు వారం రోజుల ముందు నోటీసులు ఇచ్చి సర్వే పనులు చేపట్టాలని తెలియచేశారు. దీంతో చేసేది లేక అధికారులు వెనక్కువెళ్లారు. -
ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం పోరాడాలి
పోలవరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించడానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని వ్యూపాయింట్ నుంచి పనులను పరిశీలించారు. ప్రాజెక్టు ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబు ఆయనకు ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనాలన్నారు. సంఘ సంయుక్త కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.రమణయ్య, జిల్లా కార్యదర్శి ఆర్ఎస్ హరనాథ్, ఏలూరు పట్టణ అధ్యక్షులు సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వరదెత్తిన పెన్నా
సాక్షి, కడప/చెన్నూరు/ఖాజీపేట: కర్నూలు జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కుందూ, పెన్నా నదులకు వరద పోటెత్తింది. మంగళవారం ఉదయం నీటి ప్రవాహం తక్కువగానే ఉండటంతో ఖాజీపేట మండలం కొమ్మలూరు, చెన్నూరు మండలం కొక్కరాయపల్లెకు చెందిన సుమారు 23 మంది గొర్రెలు, మేకలను, పశువులను కాసేందుకు వాటిని తోలుకుని నదిలోకి వెళ్లారు. అయితే ఒక్కసారిగా ఎగువ నుంచి వరద మొదలైంది. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ప్రవాహాన్ని అంచనా వేసిన కాపరులంతా బయటికి వెళ్లాలని నిర్ణయించుకుని స్పీడుగా నడక ప్రారంభించారు. నది మధ్యలోకి రాగానే గొంతు వరకు నీరు వచ్చి చేరడంతో బెదిరిపోయారు. అడుగు ముందుకేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో గడ్డమీదికి చేరారు. ఐదారు గంటలపాటు నది మధ్యలోనే.. ఒంటి గంట నుంచి సాయంత్రం 5.30 వరకు నది మధ్యలోనే బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీశారు. రెండు చోట్ల బాధితుల కేకల విని జనం అక్కడకు చేరారు. అధికార యంత్రాంగానికి సమాచారమిచ్చారు. కాపాడటానికి జనాలు విశ్వప్రయత్నాలు చేసినా నది మధ్య కావడంతో ఎవరూ ముందడుగు వేయలేదు. వెంటనే స్పదించిన కలెక్టర్, ఎస్పీ నది మధ్యలో ఇరుక్కుపోయిన విషయం తెలియగానే కలెక్టర్ కేవీ సత్యనారాయణతోపాటు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ స్పందించారు. ఎస్పీ పోలీసు సిబ్బందిని పంపి సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా తెప్పలు తెప్పించి బాధితులను బయటికి రప్పించడంతోపాటు గొర్రెలు, మేకలు, లేగదూడలను కూడా పడవ ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఎస్పీ రామకృష్ణ చెన్నూరు బ్రిడ్జి వద్దనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బ్రిడ్జి వద్ద డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, ఆర్డీఓ చిన్నరాముడు, సీఐ సదాశివయ్యతోపాటు ఎస్ఐ హుసేన్‌లు అక్కడికక్కడే ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సంఘటనా స్థలంలో ఎమ్మెల్యేలు చెన్నూరు వద్ద పెన్నా ప్రవాహంలో 13 మంది బాధితులు చిక్కుకున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి నేరుగా బ్రిడ్జి వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అంతకుముందే కలెక్టర్ కేవీ సత్యనారాయణ, ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణలతో రవిరెడ్డి చర్చించారు. సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను కోరారు. నది మధ్యలో ఉన్న బాధితులతో కూడా సెల్ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. బ్రిడ్జి వద్దనే చాలాసేపు ఎమ్మెల్యే గడిపారు. అలాగే సంఘటన ప్రాంతానికి టీడీపీ నాయకులు పుత్తా నరసింహారెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డిలు కూడా చేరుకున్నారు. అలాగే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా కొమ్మలూరు వద్ద నదిలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు కృషిచేశారు. అధికారులను అప్రమత్తం చేశారు. నది మధ్యలోనే పశువులు సుమారు 20కి పైగా పశువులు..వాటి లేగ దూడలను రక్షించడానికి ప్రయత్నించగా కష్టం కావడంతో ప్రస్తుతం నది మధ్యలోనే పశువులు ఉండిపోయాయి. అయితే ప్రస్తుతానికి నీటిమట్టం తగ్గుతోందని, తద్వారా ఉదయానికి పశువులు బయటికి వచ్చే అవకాశం ఉందని కడప అర్బన్ సీఐ సదాశివయ్య ‘సాక్షి’కి తెలియజేశారు. చెన్నూరులోని గాంధీనగర్‌కు చెందిన దేవరాజు పశువులు మాత్రం నదిలో కొట్టుకపోయాయి. భారీగా తరలివచ్చిన జనం నది మధ్యలో బాధితులు ఇరుక్కుపోవడంతో సంబంధిత గ్రామాల ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూశారు. చెన్నూరు బ్రిడ్జి వెంబడి ఇటువైపు నుంచి అటువైపు వరకు మొత్తం జనాలతో రద్దీ ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకపక్క వాహనాలు వెళ్లడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. 21 మందిని రక్షించాం: ఎస్పీ రామకృష్ణ కొమ్మలూరు వద్ద 9 మందిని, చెన్నూరు వద్ద కొక్కరాయపల్లెకు చెందిన 13 మందిని నది నుంచి రక్షించినట్లు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్యశాఖతోపాటు పోలీసుశాఖ సంయుక్త సహకారంతో వారందరినీ సురక్షితంగా బయటికి చేర్చామని తెలియజేశారు. స్పీడు పడవలు పనిచేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెప్పల సాయంతో అందరినీ బయటికి తీసుకొచ్చామని తెలియజేశారు. ప్రత్యేకంగా మత్స్యకారులు, కొందరు పోలీసులు బాగా పనిచేశారని పోలీసుశాఖ తరఫున రివార్డు ఇస్తూనే ప్రభుత్వం తరఫున కూడా రివార్డులు అందించేందుకు కృషిచేస్తామన్నారు. -
వై.కోట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం
వైకోట(ఓబులవారిపల్లె): మండల శివారుగ్రామమైన వై.కోట అటవీ ప్రాంతంలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో చాలా రోజుల క్రితమే మృతి చెందినట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఓబులవారిపల్లె ఎస్ఐ ప్రదీప్‌నాయుడు తమ సిబ్బందితో అటవీ ప్రాంతంలో గాలించి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి నడుముకు ఉన్న మొలతాడు ఆనవాళ్లనుబట్టి యానాది తెగకు చెందినవాడై ఉంటాడని స్థానికులు అంటున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ప్రదీప్‌నాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
సోలార్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జెన్కో సీఈ
గొల్లగూడెం (ఉంగుటూరు) : ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై నిర్మిస్తున్న 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ పనులను మంగళవారం ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ కె.రత్నబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నాటికి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితిలో ఆ తేదీ కల్లా పనులు పూర్తి చేయాలన్నారు. ఇది మోడల్ ప్రాజెక్టు కావటంతో దీని చుట్టుపక్కల దీని పనితీరును బట్టి మరిన్ని కొత్త పథకాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రాజెక్టు పురోగతిపై ఈఈ వీవీఎస్ మూర్తి చీఫ్ ఇంజినీర్‌కు వివరించారు. ఏడీలు కె. కోటేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
అదుపు తప్పిన ఎరువుల లోడు లారీ
తుని రూరల్ : జాతీయ రహదారిపై తుని మండలం చేపూరు సమీపంలో ఎరువుల లోడు లారీ అదుపుతప్పింది. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఈ లారీ రోడ్డు పక్కన దూసుకెళ్లి, మట్టిలో కూరుకుపోయింది. దీంతో మరో లారీలో సరుకును లోడ్ చేసి రాజమహేంద్రవరానికి తరలించారు. ఈ సంఘటనలో డ్రైవర్ సురేష్, క్లీనర్ చైతన్య స్వల్పంగా గాయపడ్డారు. ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
వరంగల్ కేవీలో క్లస్టర్ లెవల్ యోగా పోటీలు
కాజీపేట రూరల్ : హన్మకొండ మండలం కడిపికొండలోని వరంగల్ కేంద్రీయ విద్యాలయ నందు మంగళవారం క్లస్టర్ లñ వల్ యోగా పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం కేవీ విద్యార్ధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కేవీ ప్రిన్సిపాల్ హనుముల సిద్దరాములు పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. భారత ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు యోగాను ప్రవేశపెట్టి నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ఈ పోటీల్లో బాలికల విభాగంలో కేవీ వరంగల్ ప్రథమ, మహబూబాబాద్ ద్వితీయ, కేవీ ఖమ్మం తృతీయ, జూనియర్ బాలుర విభాగంలో ఖమ్మం ప్రథమ, వరంగల్ ద్వితీయ, కేవీ మహబూబాబాద్ తృతీయ, అదేవిధంగా సీనియర్ బాలిక విభాగంలో వరంగల్ ప్రథమ, ఖమ్మం ద్వితీయ స్థానాల్లో నిలిచారు, సీనియర్ బాలుర విభాగంలో వరంగల్ ప్రథమ, కేవీ ఖమ్మం ద్వితీయ స్థానాల్లో గెలుపొందారు. ప్రథమ స్థానాల్లో నిలిచిన విజేతలు రీజినల్ లెవల్ యోగా పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలూరు అర్బన్ : పెదవేగి మండలానికి చెందిన ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాయల మరియమ్మ, మంగయ్య దంపతులు పెదవేగి మండలం ముండూరులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంత కాలంగా మరియమ్మ తనను ఎవరో పిలుస్తున్నారని, తమతో వచ్చేయమని చెవిలో చెబుతున్నారని కుటుంబసభ్యులతో చెబుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఏదో పీడ ఆవరించిందని భావించి తాయిత్తులు, గండాలు కట్టించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరూలేని సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు బాధితురాలి భర్త, తండ్రి త్సవటపల్లి బాలాస్వామికి సమాచారం అందించడంతో వారు బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
కృష్ణా డెల్టా ఆయకట్టును ఆదుకోండి
ఏలూరు (సెంట్రల్): కృష్ణా డెల్టా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం వరి దుబ్బులతో ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో మన జిల్లాకు చెందిన 58 వేల ఎకరాల్లో సాగునీరు ప్రశ్నార్థకంగా మారిందని, జూలై 16లోపు నీరందిస్తామన్న అధికారులు, పాలకులు మాటలు నీటిమూటలుగానే మిగిలాయని విమర్శించారు. మురుగు నీరు, వర్షం నీటితో కొద్ది ఆయకట్టులో నాట్లు వేయగా ప్రస్తుతం నీరందక ఎండిపోతున్నాయన్నారు. పోణంగి పుంత పనులు తక్షణమే పూర్తి చేసి ఏలూరు మండలాల్లోని గ్రామాలకు సాగునీరందించాలని, కృష్ణా ఆయకట్టుకు సాగు నీరందించడంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం నాయకులు మావూరి శ్రీనివాసరావు, పైడిపాటి భాస్కరరావు, పి.పెద్దియ్య పాల్గొన్నారు. -
శ్రీవారి పవిత్రోత్సవాలకు శ్రీకారం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు, పండితులు ఆలయ ఆవరణకు పుట్టమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో వేశారు. తర్వాత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ నవధాన్యాలను పాలికల్లో ఉంచారు. దీంతో అంకురార్పణ కార్యక్రమం ముగిసింది. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. బుధవారం పవిత్రాదివాసం జరుపనున్నట్టు అర్చకులు తెలిపారు. -
2.20 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు లక్ష్యం
ఏలూరు (మెట్రో): జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ఏడాది మార్చినాటికి 2.2 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంపీడీవోలు కష్టపడి పనిచేయాలని కలెక్టర్ కె.భాస్కర్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ఎంపీడీవోల సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యక్రమాల ప్రగతి తీరుపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఉపాధి కూలీలకు ఇస్తున్న సొమ్ముల కంటే సిబ్బందికి ఇచ్చే వేతనాలు పదిరెట్లకు పైగా ఉంటున్నాయని, అలాంటి స్థితిలో అక్కడ ఉపాధి హామీ యూనిట్లు ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. ఆత్మవిమర్శ చేసుకోండి ఈనెల 13న ఆకివీడు మండలంలో ఐదుగురు కూలీలకు కల్పిస్తే ఆచంటలో 21, గణపవరంలో 28, కొయ్యలగూడెంలో 12, జీలుగుమిల్లిలో 43, చాగల్లులో 90, తణుకులో 82, ఉండి, భీమవరంలో ఒక్కరికీ పని కల్పించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉపాధి హామీ పథకం యూనిట్లు రద్దు చేసి పనికావాలని వచ్చే కార్మికులకు రూ.100 చొప్పున ఇవ్వడమే మేలని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 2.20 కోట్ల పనిదినాలు కల్పించాలని నిర్దేశించామనీ దీనివల్ల మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా అత్యధిక నిధులు జిల్లాకు రాబట్టగలుగుతామన్నారు. ప్రతి ఉద్యోగి ఆత్మ విమర్శ చేసుకుని పనిచేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. డ్వామా పీడీ వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరాజు పాల్గొన్నారు. ఐదు అంశాల్లో ఎందుకు వెనుకబాటు 155 అంశాలతో రాష్ట్రానికే ఆదర్శంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఐదు అంశాల్లో మాత్రమే ఎందుకు వెనుకబాటులో ఉందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మంగళవారం ఆయన విజయవాడ నుంచి కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో 160 అంశాల ప్రగతి తీరుపై రేటింగ్ ఇస్తున్నామని, పశ్చిమగోదావరి జిల్లా భూగర్భజలాలు, ఫామ్ పాండ్స్, అంగన్వాడీ భవనాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఉపాధి హామీ కార్మికులకు వేతనాల చెల్లింపు అంశాల్లో 12, 13 స్థానాల్లో ఉందని చెప్పారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేయని సిబ్బంది, అధికారులను గుర్తించి వారిలో మార్పునకు ప్రయత్నిస్తున్నామని, ఈ నెల నుంచి పనితీరు ఆధారంగా ఉద్యోగులకు రేటింగ్ ఇస్తున్నామని చెప్పారు. ఐదు అంశాల్లో పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రగతి తీరులో ప్రతిభ చూపని వారిపై చర్యలు తీసుకుని అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో ఉండేలా చేస్తామన్నారు. -
పాలకొల్లులో ‘దేశం మారిందోయ్’ షూటింగ్
పాలకొల్లు అర్బన్ : పట్టణంలోని కృష్ణాజీ మల్టీఫ్లెక్స్‌లో మంగళవారం ‘దేశం మారిందోయ్’ సినిమా షూటింగ్ జరిగింది. యమలోకంలో పాపులను విచారించే సన్నివేశాలను దర్శకుడు ఈశ్వరప్రసాద్ చిత్రీకరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రధానాంశంగా ఈ చిత్రం కథాంశం ఉంటుందన్నాని, ఆగస్టు 25 నుంచి తదుపరి షెడ్యూలు చిత్రీకరణ జరపనున్నట్టు దర్శకుడు చెప్పారు. ప్రముఖ నటులు నాగేంద్రబాబు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు తెలిపారు. ఇది ఇలా ఉండగా పాలకొల్లులో ఫిల్మ్ అండ్ యాక్టింగ్ స్కూల్‌ను కూడా ప్రారంభించామని ఈశ్వర ప్రసాద్ చెప్పారు. -
ఒక్క మోటార్ ద్వారా పట్టిసీమకు నీటి విడుదల
పోలవరం : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మంగళవారం ఒక మోటార్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నీటి సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. పోలవరం కుడి, ప్రధాన కాలువకు కృష్ణా జిల్లాలో గండిపడటంతో నీటి సరఫరాను నిలిపివేశారు. తిరిగి మంగళవారం ఒక మోటారు ద్వారా నీటిని విడుదల చేశారు. -
ఉరివేసుకుని ఆర్ఎంపీ వైద్యుని ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు పల్లెల్లి శివకుమార్(25) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన శివకుమార్ తన గది లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గదిలో పడుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. మంగళవారం ఎంతసేపటికీ శివకుమార్ తన గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కిటికిలోంచి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. శివకుమార్‌కు ఐదునెలలక్రితమే ఊనగట్లకు చెందిన లక్ష్మీ ప్రియాంకతో వివాహం జరిగింది. ఇంతలోనే అతను మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శివకుమార్ తండ్రి వీరభద్రరరావు గతంలోనే మృతి చెందడంతో శివకుమార్ ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తూ.. తల్లిని, భార్యను పోషిస్తున్నారు. శివకుమార్ మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదని ఎస్ఐ ఆనందరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కొంతకాలంగా శివకుమార్ ను ఎవరో వేధిస్తున్నట్టు తెలిసిందని ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. -
నేడు కలెక్టరేట్ వద్ద కౌలు రైతుల ధర్నా
ఏలూరు(సెంట్రల్) : కౌలు రైతుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్టు కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జుత్తిగ నరసింహమూర్తి, కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పలువురు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్టు చెప్పారు. -
పెరిగిన వేతనాలు అమలు చేయాలి
ఏలూరు (సెంట్రల్) : కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 151 జీవో ప్రకారం జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వర్తింప చేయాలని ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధనాల వెంకటరావు, బి.సోమయ్య డిమాండ్ చేశారు. ప్రస్తుతం అన్ని విభాగాల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నెలకు రూ.11 వేలు మాత్రమే ఇస్తున్నారని, దానిని ప్రస్తుత జీవోను అనుసరించి పారిశుధ్య కార్మికులకు రూ.12 వేలు, ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారికి రూ.15 వేలు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.17,500 పెంచాల్సి ఉందని, మునిసిపాలిటీలో జీవో అమలు కోసం డీఎంఏని కలిసి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతామని వారు తెలిపారు. -
అలరించిన త్యాగయ్య భక్తి సంకీర్తనలు
తిరుపతి కల్చరల్: త్యాగరాజ సంగీతోత్సవాల్లో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసురాలు, కళైమామణి సౌమ్య ఆలపించిన త్యాగయ్య భక్తి సంకీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. త్యాగరాజ మండపంలో మంగళవారం ‘త్యాగరాజు ఒక రోజు దినచర్య’ అనే అంశంపై సంగీతాలాపన చేస్తూ ఆయన రోజూ వారి భక్తి సంకీర్తనల గురించి వివరించారు. త్యాగరాజస్వామి తన ఇంట్లో శ్రీరామ^è ంద్రమూర్తిని పూజించిన విధానం, శ్రీరాముని స్తుతించడానికి చేసిన కీర్తనలను వారు ఆలపించారు. మొదటగా త్యాగయ్య ఉత్సవ సంప్రదాయ కృతులతో ఆయన దిన చర్యను వివరిస్తూ సంకీర్తనలను గానం చేశారు. ఇందులో భాగంగా ఉదయం మేల్కొపు నుంచి పవళింపు సేవ వరకు సుమారు 20 కీర్తనలకుపైగా ఆలపించి ప్రేక్షకులను మైమరపించారు. అనంతరం సౌమ్య బృందం నిర్వహించిన గాత్ర కచేరి శ్రవనానందకరంగా సాగింది. వీరికి వయోలిన్‌ౖపై ఎంబార్ కణ్ణన్, మదంగంపై నైనేలి నారాయణన్ చక్కటి సహకారం అందించి రక్తి కట్టించారు. అనంతరం త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సౌమ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు దొరైరాజ్, సుందరరామిరెడ్డి, కత్తుల సుధాకర్, ప్రభాకర్ పాల్గొన్నారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పెదవేగి రూరల్ : పోలవరం కుడికాలువలో సోమవారం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన నక్కా రాము మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఉదయానికి శవమై కాలువలో తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పెదవేగి ఏఎస్సై పి.సి.హెచ్. రఘురావ్ కథనం ప్రకారం.. ఏలూరు అరుంధతీ పేటకు చెందిన నక్కా దుర్గారావు రెండో కుమారుడు రాము చిన్నతనం నుంచి పెదవేగి మండలం ముండూరులోని అతని మేనమామ బట్టు రాజారావు దగ్గర పెరుగుతున్నాడు. తాపీపని చేస్తున్న అతను సోమవారం ఉదయం 11 గంటల సమయంలో పోలవరం కాలువ గట్టుపై నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. అప్పటి నుంచి విస్తృత గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం రాము మృతదేహాం పోలవరం కాలువలో పైకి తేలింది. మృతదేహాన్ని వెలికితీసి శవపంచనామా నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఏఎస్సై రఘురావ్ చెప్పారు. -
రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
భీమవరం టౌన్ : నాగర్సోల్–నర్సాపురం రైలు ఎస్–5 కోచ్‌లో మంగళవారం ప్రయాణిస్తూ అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. భీమవరం జీఆర్పీ ఎస్సై జి.ప్రభాకర్ కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తిని నర్సాపురం రైల్వే స్టేషన్లో ఉన్న పుష్కర వైద్య శిబిరం బృందం 108 అంబులెన్సులో నర్సాపురం ప్రభుత్వాస్పత్రికి పంపించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చు. ఎత్తు 5.6 అడుగులు, నలుపు రంగులో ఉన్నాడు. ముక్కుపొడి రంగు ఫ్యాంటు, క్రీమ కలర్ చొక్కా ధరించి ఉన్నాడు. -
చిత్తూరు జిల్లాలో ఎక్కడికక్కడ అరెస్టులు
– బంద్ విఫలయత్నానికి సర్కారు కుట్ర – 11 గంటల వరకూ డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు – స్వచ్ఛందంగా బంద్ పాటించిన ప్రై వేట్ స్కూళ్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ మంగళవారం తలపెట్టిన బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఆందోళన చేస్తోన్న వైఎస్ఆర్సీపీ, వామపక్ష పార్టీల నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయించింది. సాయంత్రం 5 గంటల వరకూ నేతలను పోలీస్ స్టేషన్లలోనే నిర్భందించారు. తిరుపతిలో ఆందోళన చేస్తోన్న వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో అడ్డు తగిలిన మహిళా నాయకులు, కార్యకర్తలపై నిర్దయగా వ్యవహరించారు. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా మహిళల చీరలు చిరిగాయి. కొంతమంది చేతులకు గాయాలయ్యాయి. శాంతారెడ్డి అనే మహిళ మంగళసూత్రం తెగి కింద పడింది. ఇకపోతే వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడంలోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుపతిలో కరుణాకర్‌రెడ్డితో పాటు జిల్లాపార్టీ అధ్యక్షుడు, గంగాధరనెల్టూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో ఎక్కించి రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో బంద్‌కు నేతత్వం వహిస్తోన్న ఎంపీ మి«థున్‌రెడ్డి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవిలను పోలీసులు అరెస్టు చేశారు. పీలేరు, మదనపల్లిల్లో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డిలను కూడా బలవంతంగా అరెస్టు చేశారు. పుంగనూరులో బంద్ నిర్వహిస్తోన్న తంబళ్లపల్లి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డిని, తిరుపతి యూనివర్సిటీలో బంద్‌కు నేతృత్వం వహించిన విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు మద్దతు పలికి ప్రతక్షంగా బంద్‌కు సహకరిస్తోన్న సీపీఐ, సీపీఎం నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డిలను కూడా అరెస్టు చేసి ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా అంతటా పోలీసులు 1000 మందికి పైగా అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేసినట్లు సమాచారం. పైవేటు స్కూళ్లు, కళాశాలలు బంద్.. జిల్లా వ్యాప్తంగా ప్రై వేట్స్కూళ్లు, కళాశాలలు స్వచ్చందంగా బంద్ పాటించాయి. తిరుపతిలోని ఎస్వీ, మహిళా, వేదిక్, విద్యాపీఠం, వెటర్నరీ, వ్యవసాయ యూనివర్సిటీలు కూడా బంద్ పాటించాయి. జిల్లా అంతటా ఉదయం 11 గంటల వరకూ ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీనివల్ల చిత్తూరు రీజియన్ మంగళవారం రూ.1 కోటి నష్టపోయినట్లు ఆర్ఎం నాగశివుడు పేర్కొన్నారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సులు మాత్రమే నడిచాయి. అన్ని పట్టణాల్లోనూ మధ్యాహ్నం 12 గంటల వరకూ కిరాణా,ఫ్యాన్సీ, రెడీమేడ్ దుస్తుల షాపులు మూతపడ్డాయి. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
బుట్టాయగూడెం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంట ర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని నాగులగూడెంకు చెందిన కొవ్వాసి బుచ్చిరాజు, చోడెం నరసింహరాజు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి రామారావుపేట సెంటర్ వైపు వస్తున్నారు. అలాగే జైనవారిగూడెంకు చెందిన కోర్సా రాంబాబు కూడా ద్విచక్రవాహనంపై రామారావు పేట సెంటర్ వైపు వస్తుండగా, ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు. వీరిలో చోడెం నరసింహరాజు, కోర్సా రాంబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
పుష్కర సిబ్బంది అవస్థలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాలపై ప్రత్యేక హోదా బంద్ ప్రభావం పడింది. ఉదయం నుంచి బస్సులు తిరగకపోవడంతో దూర ప్రాంత భక్తులు పుష్కర స్నానాలకు రాలేకపోయారు. పుష్కర çసమీపంలోని భక్తులు మాత్రమే రావడంతో ఘాట్లన్నీ బోసిపోయాయి.అంత్య పుష్కరాల్లో మూడో రోజైన మంగళవారం అమావాస్య కావడం కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఘాట్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వారు ఇబ్బం దులు పడుతున్నారు. కనీసం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలకు గురవుతున్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో గోదావరి మాతకు సంధ్యాహారతి ఇచ్చారు. పుష్కరాలు పూర్తయ్యే వరకూ ప్రతిరోజూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. -
ప్రణవ స్వరూపా.. లక్ష్మీనరసింహా
ఐఎస్ జగన్నాథపురం (ద్వారకాతిరుమల): శ్రీకరుడు.. శుభకరుడు.. ప్రణవ స్వరూపాడైన లక్ష్మీనరసింహస్వామిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు జరిగాయి. అమావాస్య కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామికి పానకాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ప్రతి అమావాస్య రోజూ భక్తుల తాకిడి ఉంటుందని అర్చకులు తెలిపారు. -
చినుకు చిందేసింది
జిల్లాలో పలుచోట్ల వర్షం సాయంత్రం వరకు చిరుజల్లులు ఇళ్లకు వెళ్లేందుకూ ఇబ్బందిపడ్డ విద్యార్థులు వేడివేడి తినుబండారాలకు పెరిగిన గిరాకీ సాక్షి, రాజమహేంద్రవరం : పక్షం రోజులుగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు మళ్లీ ప్రభావం చూపిస్తున్నాయి. సోమవారం రాత్రి జిల్లాలో పలుచోట్ల వర్షం పడగా మంగళవారం మధ్యాహ్నం చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చిరుజల్లులు పడ్డాయి. ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. రాజమహేంద్రవరం, కాకినాడ, రంగంపేటలలో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండపేట, రాజానగరం, పెదపూడి, రాజోలు, రామచంద్రాపురంలలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. కొత్తపేట, పెద్దాపురం, పిఠాపురం, పి.గన్నవరంలలో చిరుజల్లులు పడ్డాయి. రాజమహేంద్రవరంలో మధ్యాహ్నం ఓ గంటపాటు భారీ వర్షం పడింది. సాయంత్రం ఐదు గంటల వరకు ఆగకుండా చిరు జల్లులు పడ్డాయి. దీంతో జనజీవనం స్తంభించింది. దుకాణాలు వ్యాపారాలు లేక వెలవెలబోయాయి. పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది వర్షంలో తడుస్తూనే తమ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. వాతావరణం చల్లబడడంతో మొక్కజొన్న పొత్తులు, వేడివేడి పకోడీలకు గిరాకీ పెరిగింది. రోడ్లవెంబడి ఉన్న పలహార బళ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చిరుజల్లులు పడతుండగానే రాజమహేంద్రవరం నగరంలో పారిశుధ్య కార్మికులు మురుగునీరు వెళ్లేందుకు కాలువల్లో చెత్తను తొలగించారు. వర్షానికి రోడ్లపైకి వచ్చిన చెత్తను తొలగించారు. రైల్వే స్టేషన్ ఎదురు రోడ్డులో వర్షం నీరు నిలబడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. -
పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాల ఉత్పత్తిదారుల అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 50 నుంచి 100 గేదెలతో ఒక్కో యూనిట్‌ను స్థాపించి పెద్ద ఎత్తున పాల ఉత్పత్తికి ఒక ప్రణాళిక సిద్ధం చేశామని, బ్యాంకర్లు కూడా ఈ యూనిట్లకు రుణ సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. రైతులు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా గేదెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ చెప్పారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, పాల ఉత్పత్తిదారుల అభివృద్ధి కమిటీ చైర్మన్ గంటా నాగేశ్వరరావు, ఏపీ డెయిరీ జనరల్ మేనేజర్ పీవీ రావు, డైరెక్టర్లు ఎంఎస్సి చౌదరి, టి.రాజేంద్రప్రసాద్, జేవీ భాస్కరరావు, ఏపీ డైయిరీ ఉపసంచాలకులు సలీం పాల్గొన్నారు. గంటలో గ్యాస్ కనెక్షన్ జిల్లాలో ఇంటింటా వంట గ్యాస్ ఉండాలనే లక్ష్యంతో అడిగిన వారందరికీ గంటలో వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఇండియన్ ఆయిల్ కంపెనీ ఫీల్ట్ అధికారి లోహితాక్షన్ కలెక్టర్‌ను కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దీపం పథకం ద్వారా అడిగిన వారందరికీ వంట గ్యాస్ అందించాలనే లక్ష్యంతో రెండు లక్షల కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో వచ్చే డిసెంబర్ నాటికి ప్రతి పేద కుటుంబం విధిగా వంట గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. దీనిపై స్పందించిన లోహితాక్షన్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా సరే వంటగ్యాస్ కనెక్షన్ కావాలంటే గంటలో ఇవ్వడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో శివశంకరరెడ్డి, గ్యాస్ డీలర్లు సాయిబాబా ఉన్నారు. -
హత్యకేసులో ఆరుగురి అరెస్ట్
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలం మర్లగూడెం సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన గిరిజనుడు పొట్టం సింగరాజు (టైలర్ రాజు) దారుణ హత్యకేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పోలీస్‌స్టేçÙన్లో మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న రాత్రి పొట్టం సింగరాజును జంగారెడ్డిగూడేనికి చెందిన సుంకర పవన్‌కుమార్ అలియాస్ చిన్న అలియాస్ ఎస్కే సలీం, ముక్కు శ్రీను, అంబటి అజయ్, షేక్ బాషా, తగరం అజయ్‌కుమార్, ఉసిరిక బాలాజీ తీవ్రంగా కొట్టి హత్యచేశారు. వీరు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మద్యం మత్తులో మట్టుపెట్టారు స్థానిక జేపీ సెంటర్ బ్రాందీ షాపు సమీపంలోని ఖాళీ ప్రాంతంలో ఈ నెల 16న రాత్రి టైలర్ రాజు మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో తగరం అజయ్‌కుమార్‌కు చెందిన ఆటోలో సుంకర పవన్‌కుమార్, ముక్కు శ్రీను, అంబటి అజయ్, షేక్ బాషా, తగరం అజయ్‌కుమార్, ఉసిరిక బాలాజీ మద్యం సేవించేందుకు ఇక్కడకు వచ్చారు. ఆ సమయంలో టైలర్ రాజుకు వీరికీ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన నిందితులు టైలర్ రాజును తీవ్రంగా కొట్టి ఆటోలో ఎక్కించుకుని మర్లగూడెం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ చెట్ల కొమ్మలతో టైలర్ రాజును గాయపర్చారు. దీంతో టైలర్ రాజు మృతిచెందాడు. నిందితులు వినియోగించిన ఆటో, ఒక కత్తి, ఐరన్‌రాడ్డు, కర్రలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు . హతుడిని గుర్తించింది ఇలా.. హతుడు రాజు తల లేని మొండాన్ని పాతే సమయంలో నిందితులు అతని సెల్‌ఫోన్‌ను రాయితో చితక్కొట్టి మృతదేహంతో పాటు పాతిపెట్టారు. పోలీసులు ఆ సెల్ఫోన్లో ఉన్న సిమ్‌కార్డులు, మెమరీకార్డులను పరిశీలించారు. మెమరీకార్డులో హతుడి ఫొటో ఆధారంగా గుర్తించారు. సీసీ పుటేజ్, ఫోన్ సమాచారంతో.. స్థానిక జేపీ సెంటర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఉన్న సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు. దీనికితోడు ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఘటన పూర్తిగా వెలుగులోకి వచ్చింది. పవన్‌కుమార్ అంతర్ జిల్లా నేరస్తుడు నిందితుల్లో ఒకడైన సుంకర పవన్‌కుమార్ అంతర్జిల్లా నేరస్తుడని డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. అతనిపై తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయన్నారు. ఇటీవల హనుమాన్ జంక్షన్లో ఒక కేసులో బెయిల్‌పై వచ్చాడని చెప్పారు. సుంకర పవన్‌కుమార్, ముక్కు శీనుపై జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీట్ ఉందన్నారు. పోలీసులకు దొరక్కూడదని.. హత్యానంతరం మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సుంకర పవన్‌కుమార్ తన ఇంటికి వెళ్లి కూరగాయలు కోసే చాకు, చిన్న చేతి గునపం (టెంట్లు వేసేందుకు వాడే రాడ్డు) తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ పవన్‌కుమార్, బాషా హతుడు టైలర్ రాజు గొంతును, అతని కాళ్లను కోసేశారు. ఈలోగా మిగిలిన వారు మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు గొయ్యితవ్వారు. అనంతరం తల లేని మొండెం మృతదేహాన్ని, కోసిన కాళ్లను వెనక్కి విరిచి గోతిలో భూమిక సమాంతరంగా పాతిపెట్టారు. పైన చెట్ల కొమ్మలు వేశారు. తలను ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టి తిరిగి ఆటోలో వస్తూ మార్గమధ్యలో ఓ ఇస్త్రీ బండి వద్ద ఉన్న చీరను తీసుకుని తలను దానితో కట్టి రాయిని జతచేసి జంగారెడ్డిగూడెం రజక చెరువలో పడేశారు. హతుని కుటుంబానికి సహాయం టైలర్ రాజు కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి రూ.7.50 లక్షల సహాయం అందుతుందని డీఎస్పీ చెప్పారు. రాజు భార్యకు వితంతు పింఛన్ పొందే అవకాశం ఉందని, అతని ఇద్దరు పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలో చదువు చెప్పిస్తామని అన్నారు. నిందితులపై హత్య కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు కూడా నమోదు చేశామని చెప్పారు. పోలీసులకు రివార్డులు అతి తక్కువ సమయంలోనే టైలర్ రాజు హత్య కేసు చేధించిన పోలీసు అధికారులను, సిబ్బంది ఎస్పీ భాస్కర్‌భూషణ్ అభినందించినట్టు డీఎస్పీ వెంకటరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎస్సై జి.శ్రీనివాస్‌యాదవ్, బుట్టాయగూడెం ఎస్సై డి.రవికుమార్ , ఐడీ పార్టీ సిబ్బంది ఎన్వీ సంపత్‌కుమార్, ఎన్.రాజేంద్రప్రసాద్, కె.కిరణ్, బి.రాజశేఖర్‌ను ఆయన అభినందించి వీరికి రివార్డు కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు. -
పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీరు
నిడదవోలు : విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు మూడు రోజులుగా 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 6,500 క్యూసెక్కులకు మరో 500 క్యూసెక్కులు పెంచి వదులుతున్నారు. గోదావరి పరివాహాక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరిలో వరద నీరు అధికంగా చేరుతుంది. దీంతో కాటన్ బ్యారేజీల నుంచి మంగళవారం 1,94,720 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. డెల్టా పరధిలో ఏలూరు కాలువకు 1,147 క్యూసెక్కులు, నరసాపురం కాలువకు 2,056 క్యూసెక్కులు, అత్తిలి కాలువకు 601 క్యూసెక్కులు, తణుకు కాలువకు 898 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,914 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
శ్రీవారి ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి (చినవెంకన్న) ఆలయంలో మంగళవారం డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. ఆలయ భద్రత దృష్ట్యా తనిఖీలు నిర్వహించామని ఏఆర్ ఎసై నాగేశ్వరులు అన్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆలయ పరిసరాలు, ప్రధాన, తూర్పు రాజగోపుర ప్రాంతాలు, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాలలు, పలు విభాగాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. క్షేత్రానికి వచ్చిన భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులను పరిశీలించాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో తనిఖీలు జరుపుతున్నట్టు తనిఖీ సిబ్బంది తెలిపారు. డాగ్ హ్యాండ్లర్ డీడీ ప్రసాద్, విజయ, రంగారావు, డాగ్ లిజీ పాల్గొన్నారు. -
నగరంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ : పురానీ హవేలీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా పలు బస్తీలలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని చార్మినార్ సీబీడీ ఏడీఈ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురానీ హవేలీ, చెత్తబజార్, జహెరా నగర్, మీరాల మండి, పత్తర్‌గట్టీ, మదీనా, దివాన్ దేవుడి, పటేల్ మార్కెట్, రికాబ్‌గంజ్, నయాపూల్, బహదూర్‌పురా, కిషన్ బాగ్, షరీఫ్ నగర్, ఎంవో కాలనీ, అత్తాపూర్, గోల్కొండ ఫంక్షన్ హాల్, వీకర్ సెక్షన్‌కాలనీ, వాసుదేవరెడ్డి నగర్, హైదర్‌గూడ, తేజస్వినీ నగర్ కాలనీ, భరత్ నగర్, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, నాగుల చింత, రాజీవ్‌నగర్, జమాల్ కాలనీ, హఫీజ్‌బాబా నగర్, చాంద్రాయణగుట్ట, ఉమర్ కాలనీ, రక్షాపురం, అరుంధతి నగర్, జహనుమా, నవాబ్ సాహెబ్ కుంట, బిర్యానీ షా టేకరీ, సాలేహీన్ కాలనీ, తీగల కుంట, ముస్తఫానగర్, ఎంసీహెచ్ కాలనీ, అచ్ఛిరెడ్డినగర్ తదితర బస్తీలలో ఈ అంతరాయం కొనసాగుతుందన్నారు. అదేవిధంగా జనప్రియ అపార్ట్మెంట్స్, లక్ష్మీనగర్, కేశవ నగర్, అత్తాపూర్, హైదర్‌గూడ, ఏజీ కాలనీ, షా గంజ్, మూసాబౌలి, తగారీ కా నాక, చౌక్, బండికా అడ్డా, చేలాపురా తదితర బస్తీలలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. -
నమాజ్ వేళలు, మంగళవారం 5, ఏప్రిల్ 2016
ఫజర్ : 4.55 జొహర్ : 12.19 అస్ : 4.44 మగ్రిబ్ : 6.30 ఇషా : 7.43 -
గ్రహం అనుగ్రహం, మంగళవారం 5, ఏప్రిల్ 2016
శ్రీమన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణమాసం, తిథి బ.త్రయోదశి రా.9.54 వరకు, నక్షత్రం శతభిషం ఉ.8.02 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం ప.2.03 నుంచి 3.33 వరకు, దుర్ముహూర్తం ఉ.8.21 నుంచి 9.11 వరకు, తదుపరి రా.10.52 నుంచి 11.44 వరకు, అమృతఘడియలు రా.11.06 నుంచి 12.37 వరకు భవిష్యం మేషం: ధన, వస్తు లాభాలు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు,ఉద్యోగాలు ఆశాజనకం. మిథునం: పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం. సింహం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. భూవివాదాలు పరిష్కారం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కన్య: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. తుల: ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. వృశ్చికం: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహన యోగం. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. మకరం: కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. కుంభం: పరపతి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు కలిసిరావు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. - సింహంభట్ల సుబ్బారావు సూర్యోదయం : 5.56 సూర్యాస్తమయం : 6.10 రాహుకాలం: ప 3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు -
ఎక్కడిరేట్లు అక్కడే!
రేపు ఆర్బీఐ పాలసీ సమీక్ష పెరుగుతున్న ఆహార ధరలతో రేట్ల తగ్గింపునకు చాన్స్ లేనట్టే బ్యాంకర్లు, విశ్లేషకుల అభిప్రాయం... న్యూఢిల్లీ: ఎగబాకుతున్న ఆహారోత్పత్తుల ధరలు.. వడ్డీరేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఆర్బీఐ రేపు(మంగళ వారం) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని బ్యాంకర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని పలు చోట్ల ఇటీవలి అకాల వర్షాల కారణంగా ఆహార ధరలకు రెక్కలొస్తుండటమే దీనికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ధరల తగ్గుముఖ ధోరణి కనబడితేనే మళ్లీ ఆర్బీఐ భవిష్యత్తు రేట్ల కోత సంకేతాలిస్తుందనేది వారి వాదన. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గత రెండు సార్లు కూడా(జనవరి 15న, మార్చి 4న) పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా రెపో రేటును పావు శాతం చొప్పున తగ్గించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే, బ్యాంకులు మాత్రం ఈ తగ్గింపు ప్రయోజనాన్ని ఇంకా రుణ గ్రహీతలకు బదలాయించడానికి తటపటాయిస్తున్నాయి. ప్రస్తుతం రెపో రేటు 7.5 శాతం, రివర్స్ రెపో 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం చొప్పున కొనసాగుతున్నాయి. సీఆర్ఆర్ తగ్గిస్తే మంచిది..: అరుంధతీ భట్టాచార్య ఆర్బీఐ సమీక్షలో సీఆర్ఆర్ను తగ్గించాలని కోరుకుంటున్నట్లు దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. దీనివల్ల బ్యాంకులకు నిధులపై వ్యయం తగ్గుముఖం పట్టి.. ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు(రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు) అవకాశం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల ఆర్బీఐ రేపో రేటు తగ్గింపు చర్యలను బ్యాంకులు కూడా అనుసరించేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుత ధరల స్థితిని చూస్తుంటే... మంగళవారంనాటి సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని యూనియన్ బ్యాంక్ సీఎండీ అరుణ్ తివారి పేర్కొన్నారు. సీఆర్ఆర్ను తగ్గిస్తే.. బ్యాంకుల రుణ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతుందని ఇండియన్ బ్యాంక్ సీఎండీ టీఎం భాసిన్ చెప్పారు. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. రుణ వితరణ చాలా మందకొడిగా ఉందని.. 2015-16 తొలి త్రైమాసికంలో కూడా ఇలాగే కొనసాగవచ్చని భాసిన్ పేర్కొన్నారు. మార్చి 20తో ముగిసిన పక్షం రోజులకు బ్యాంకుల రుణ వృద్ధి 9.5 శాతానికే పరిమితమైంది. రెండు దశాబ్దాల కాలంలో ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. ఆర్థిక వేత్తలు ఏమంటున్నారంటే... అకాల వర్షాల ప్రభావంతో రబీ సీజన్‌లోని గోధుమలు, నూనె గింజలు, పప్పులు తదితర పంటల దిగుబడులు 25-30% దెబ్బతినొచ్చని అసోచామ్ అంచనా వేస్తోంది. ఈ ప్రతికూల ప్రభావం కారణంగా ఆహారోత్పత్తుల ధరలు మరింత ఎగబాకే ప్రమాదం పొంచి ఉండటంతో ఆర్బీఐ వేచిచూసే ధోరణి అవలంభిస్తుందని.. రేపటి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచొచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త జ్యోతిందర్ కౌర్ అభిప్రాయపడ్డారు. అయితే, మరో పావు శాతం రెపో రేటు కోత గనుక ఈసారి సమీక్షలో ఉండకపోతే.. ఏప్రిల్‌లోనే పాలసీ సమీక్షతో సంబంధం లేకుండా రాజన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. మార్చి నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడులైన తర్వాత ఈ చర్యలకు ఆస్కారం ఉందన్నారు. తయారీకి ఊతమివ్వలేదు: ఫిక్కీ సర్వే ఆర్బీఐ తాజా రేట్ల కోతలతో తయారీ రంగంలో పెట్టుబడులకు ఎలాంటి ఊతం లభించలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫిక్కీ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రేట్ల కోత కారణంగా తమ కంపెనీల పెట్టుబడులు భారీగా పెరిగిన దాఖలాలేవీ లేవని సర్వేలో పాల్గొన్నవారిలో 69 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. తయారీ రంగ సంస్థలు ప్రస్తుతం బ్యాంకులకు 9.5-14.75 శాతం స్థాయిలో వడ్డీరేట్లను చెల్లిస్తున్నాయి. ఆర్బీఐ రేట్లు తగ్గించినా.. బ్యాంకులు ఇంకా ఆ ప్రయోజనాన్ని బదలాయించని విషయం విదితమే. కాగా, ప్రస్తుతం తమకు సగటున 12 శాతం పైబడిన వడ్డీ రేటుకే రుణాలు లభిస్తున్నాయని 58 శాతం మంది తెలిపారు. వచ్చే మూడు నెలల కాలానికి తాము ఎలాంటి అదనపు నియామకాలూ చేపట్టలేదని 80 శాతం ప్రతినిధులు వెల్లడించారు. భూసేకరణ, నియంత్రణపరమైన ఇబ్బందులు, అధిక వడ్డీరేట్లు, అనుమతుల్లో జాప్యం వంటివి తయారీ రంగంలో విస్తరణ ప్రణాళికలకు ప్రధాన అడ్డంకులని సర్వే తెలిపింది. -
రేపిస్ట్‌కు రేపే ఉరి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లోని ముల్తాన్ సెంట్రల్ జైల్లో ఒక రేపిస్ట్లు సహా మరొకరిని మంగళవారం ఉరితీయ బోతున్నారు. ఒక బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో ఝాఫర్ ఇక్బాల్ నూ, , దొంగతనంచేసి ఒక వ్యక్తి హత్య చేసిన కేసులో వాకర్ నజీర్లకు ఉరి శిక్ష విధించింది కోర్టు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జైలు అధికారులు తెలిపారు. ఈ నేరస్థుల ఇద్దరి కుటుంబ సభ్యులతో చివరి సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. ఈ రోజు రాత్రి పదిన్నర గంటల వరకు అసెంబ్లీ కొనసాగింది. విద్యుత్ సమస్యలు, రైతుల ఆత్మహత్యలపై సభలో చర్చించారు. -
రేపు బీజేపీ జాబితా
చెన్నై, సాక్షి ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ బుధవారం లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేం దుకు సిద్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ద్వారా జాబితాను ప్రకటింపజేసేందుకు ఆయనను ఆహ్వానించారు. మరో రెండు మోడీ సభలు నిర్వహించాలని నిర్ణయిం చారు. జాబితా ప్రకటనను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసుకున్న బీజేపీ ఈనెల 19న తప్పనిసరిగా ప్రకటిస్తామని సోమవారం ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ తరపున పోటీచేసే 8 మంది పేర్లు సిద్ధమయ్యూరుు. అయితే తిరుపూ రు అభ్యర్థి మాత్రం మారే అవకాశం ఉన్నారుు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అన్నాడీఎంకే, డీఎంకేలు లేకుండా బీజేపీ బలమైన కూటమిని ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధం గా పార్టీ సైతం బలపడింది. ప్రతిష్టాత్మకమైన ఈ కూటమి నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లను రాజ్‌నాథ్ సింగ్ ద్వారా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు భావించారు. సోమవారం హోలీ పండు గ కావడంతో మంగళవారం ఆయన పర్యటనను ఖరారు చేసుకుంటారు. 19న చెన్నై టీనగర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాబితా ను విడుదల చేస్తామని చెప్పారు. మరోసారి మోడీ: రాష్ట్రంలో బీజేపీ కూటమిద్వారా పెద్ద సంఖ్యలో పార్లమెంటు స్థానాలను ఆశిస్తున్న నేతలు మరో రెండు చోట్ల నరేంద్రమోడీ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. తొలుత తిరుచ్చిలోనూ, ఆ తరువాత చెన్నై శివార్లు వండలూరులోనూ మోడీ సభలు జరిగాయి. కొత్తగా నిర్ణయించిన రెండు సభల ను ఉత్తర, పడమర చెన్నైలో నిర్వహించాలని భావిస్తున్నారు. మోడీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా నే తేదీలు, ప్రాంతాల వారీగా ప్రకటిస్తారు. ముసలం: బీజేపీలో స్థానాల పంపకాలు పూర్తరుు, నేడో రేపో అంటూ కాలయూపన చేస్తున్నారు. నియోజకవర్గాల కేటాయింపులో డీఎండీకే, పీఎంకేల మధ్య బీజేపీ నలిగిపోతోంది. ఒకరి స్థానాలు మరొకరు కోరడం, ఒకే స్థానంపై పలువురు పట్టుబట్టడం వంటి కారణాలతో కూటమిలో ముసలం నెలకొంది. కూటమి నిర్ణయంతో సంబంధం లేకుండానే పీఎంకే అధినేత అన్బుమణి రాందాస్ తాను ఎన్నుకున్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి బీజేపీ పక్కలో బాంబు పేల్చారు. పదిరోజులుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న డీఎండీకే అధినేత విజయకాంత్ ఎట్టకేలకూ సర్దుకున్నారు. ప్రాంతీయ పార్టీల్లో భిన్నధృవాలైన డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేల అధినేతలు విజయకాంత్, వైగో, రాందాస్‌లను మోడీ వేదికపై ఒకే సారి కూర్చోబెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఎడముఖం పెడముఖంగా ఉండే ముగ్గురు నేతలూ కూటమి ధర్మానికి కట్టుబడి కలిసివస్తారో లేదోనని బీజేపీ ఆందోళన చెందుతోంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరరావు సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, స్థానాల కేటాయింపులో ఎటువంటి కలతలు లేవని, 95.5 శాతం పూర్తయిందని తెలిపారు. 19వ తేదీన జాబితా విడుదల ఖాయమని పేర్కొన్నారు. -
విభజనాగ్ని
విభజనాగ్ని సాక్షి, కాకినాడ : రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ బిల్లును ఆమోదించడంపై మంగళవారం జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాలలు పెల్లుబికాయి. రాస్తారోకోలు..ధర్నాలు..దిష్టిబొమ్మల దహనాలతో జిల్లా ప్రజలు మళ్లీ రోడ్డెక్కి తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతల తీరు వల్లే ఈ దుర్గతి పట్టిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడునెలలుగా ఉవ్వెత్తున సాగిన విభజనాగ్ని ఉద్యమం సమైక్యద్రోహుల వల్ల నీరు గారిందంటూ జిల్లా ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జూలై-30న సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది మొదలు నేటి వరకు సాగిన సమైక్య ఉద్యమంలో జిల్లావాసులు ఆగ్రభాగన నిలిచారు. రెండునెలలపాటు జిల్లా మొత్తం ధర్నాలు, ఆందోళనలు, బంద్‌లతో స్తంభించిపోయింది. ఏపీఎన్జీఒలకు ప్రభుత్వశాఖలన్నీ అండగా నిలిచి సమ్మెబాట పట్టాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు వినూత్న ఆందోళనలతో కదం తొక్కాయి. జీర్ణించుకోలేకపోతున్న జనం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మూజువాణి ఓటుతో మంగళవారం లోక్‌సభ ఆమోదముద్ర వేయడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరు దశాబ్దాలుగా కలిసి ఉన్న తెలుగుజాతిని సీట్లు-ఓట్ల కోసం కాంగ్రెస్-బీజేపీ-టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలతో ముక్కలు చేశాయని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సమైక్యద్రోహులుగా మారిన ఈ పార్టీల ప్రజాప్రతినిధుల తీరు వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి విధుల్లోకి ఎన్జీవోలు విభజన బిల్లు అసెంబ్లీకి పంపడాన్ని నిరసిస్తూ ఈ నెల ఆరవ తేదీ నుంచి ఏపీఎన్జీఒలు మళ్లీ నిరవధిక సమ్మె బాటపట్టారు. గత 13 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్న ఏపీఎన్జీఒలు వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తాము సమ్మెను విరమించి గురువారం నుంచి విధులకు హాజరవుతామని ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం తెలిపారు. ఆగ్రహ జ్వాలలు జిల్లా కేంద్రమైన కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓలు సోనియా, దిగ్విజయ్, షిండే, జై రామ్ రమేష్, సుష్మాస్వరాజ్‌లతో రూపొందించిన ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదు సెంటర్లో సమైక్యవాదులు టైర్లకు నిప్పుపెట్టి సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నిరసన రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో రాజ్‌కుమార్‌తోపాటు జక్కంపూడి రాజా, ఆదిరెడ్డి వాసు, రాష్ర్ట ఎస్సీ సెల్ సభ్యుడు మాసా రామజోగ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ సెంటర్లో రాస్తారోకో చేశారు. బీజేపీ జెండాలను దహనం చేసి ఆందోళనకు దిగారు. దీంతో విజయలక్ష్మితో సహా పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుకొండ మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం గుండుగీయించుకొని నిరసన తెలిపారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీజేపీ స్థూపం ధ్వంసం చేసి రాహుల్ గాంధీ ఫ్లెక్సీలకు నిప్పుపెట్టారు. జేఏసీ కోనసీమ చైర్మన్ విఎస్ దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహనరావు వైఎస్సార్సీపీ నాయకులు మిండగుదిటి మోహన్‌తో పాటు జేఏసీ, పార్టీ నాయకులు రాస్తారోకో చేశారు. మామిడికుదురులో వైఎస్సార్సీపీ రాష్ర్టరైతు విభాగం కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ తదితరుల ఆధ్వర్యంలో 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏలేశ్వరం బాలాజీచౌక్ సెంటర్లో వైఎస్సార్సీపీ నాయకులు అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయం ఎదుట సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సఖినేటిపల్లి మండలం శృంగవరపుపాడులో స్థానికులు రాస్తారోకో చేయగా, రాజోలులో రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అరకు పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొత్తపల్లి గీత యువసేన కార్యకర్తలు రంపచోడవరంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనపర్తి దేవీచౌక్ సెంటర్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కిర్లంపూడిలో ఎంపీడీఒ ప్రసాద్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు.