మావుళ్లమ్మ హుండీ ఆదాయం రూ.18,50,426
భీమవరం (ప్రకాశం చౌక్) : మావుళ్లమ్మ ఆలయ హుండీలను మంగళవారం లెక్కించగా రూ.18,50,426 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 21–02–2017 నుంచి 21–03–2017 వరకూ ఈ ఆదాయం లభించిందన్నారు. హుండీలో బంగారం 71.3 గ్రాములు, వెండి 70 గ్రాములు, పాత రూ.1,000 నోట్లు రెండు, పాత రూ.500 నోట్లు ఐదు వచ్చినట్టు చక్రధరరావు తెలిపారు. పర్యవేక్షణాధికారి కర్రి శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కార్మూరి సత్యనారాయణమూర్తి, ధర్మకర్తలు పాల్గొన్నారు.