కుమారదేవంలో సినీ సందడి
కొవ్వూరు రూరల్ : కుమారదేవంలో మంగళవారం ఓ సినిమా యూనిట్ సందడి చేసింది. అంజిరెడ్డి ప్రొడక్ష న్ నంబర్– 2 బ్యానర్‌పై టీవీ నటుడు, కథా రచయిత హర్షవర్ధ న్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం షూటింగ్ గ్రామంలోని సినిమా చెట్టు, గోదావరి లంకల్లో జరుగుతోంది. మల్లెపువ్వు ఫ్రేమ్, చిత్ర హీరో మురళీకృష్ణ, బుల్లితెర యాంకర్, హీరోయి న్ శ్రీముఖిలపై మంగళవారం పాట చిత్రీకరణ జరిగింది. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నట్టు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్కీ న్‌ప్లే, దర్శకత్వం హర్షవర్థ న్ కాగా, కెమెరా రగుతు సురేష్, కో–డైరెక్టర్ రాజ్‌కుమార్, ఆర్ట్ ఆనంద్.