అదుపు తప్పిన ఎరువుల లోడు లారీ
తుని రూరల్ :
జాతీయ రహదారిపై తుని మండలం చేపూరు సమీపంలో ఎరువుల లోడు లారీ అదుపుతప్పింది. మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఈ లారీ రోడ్డు పక్కన దూసుకెళ్లి, మట్టిలో కూరుకుపోయింది. దీంతో మరో లారీలో సరుకును లోడ్ చేసి రాజమహేంద్రవరానికి తరలించారు. ఈ సంఘటనలో డ్రైవర్ సురేష్, క్లీనర్ చైతన్య స్వల్పంగా గాయపడ్డారు. ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.